19, సెప్టెంబర్ 2012, బుధవారం

సమస్యాపూరణం - 826 (విఘ్నపతికి మ్రొక్క)

కవిమిత్రులారా,
వినాయక చవితి శుభాకాంక్షలు!

ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
విఘ్నపతికి మ్రొక్క విఘ్నము లిడు.

26 కామెంట్‌లు:

  1. అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.
    విఘ్నపతికి మ్రొక్క విఘ్నములిడుఁ దొల్త
    మలి విడతల తారు మారు జేసి
    కార్య సిద్ది జయముఁ గలిగించెదవు స్వామి
    నీదు మహిమ లెన్న నాదు తరమె!

    రిప్లయితొలగించండి
  2. విఘ్నపతికి మ్రొక్క విఘ్నములిడు నట్టి
    సకల కారణముల సమయజేయు
    సర్వ సిద్ధులనిడు సౌభాగ్యములు కూర్చు
    వారణాననునకు వందనములు

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వినాయక చవితి పర్వ శుభాకాంక్షలు.

    ప్రతిదినము మరువక ప్రవిమల మనమున
    విఘ్నపతికి మ్రొక్క ; విఘ్నము లిడు
    యతడు తొలగ జేయు నన్ని విఘ్నములను ;
    మ్రొక్కెద గణపతికి మక్కువగను !

    రిప్లయితొలగించండి
  4. పూలు పత్రి యుదక మోదకంబుల నిడి
    విఘ్నపతికి మ్రొక్క ; విఘ్నము లిడు
    నతడు సంతసించుచు తొలగ ద్రోయును
    విఘ్నములను ; శరణు విఘ్నరాజ !

    రిప్లయితొలగించండి
  5. మొదటి పూరణకు చిన్న సవరణతో : 


    ప్రతిదినంబు మనము ప్రాతస్సమయమున 
    విఘ్నపతికి మ్రొక్క ; విఘ్నము లిడు
    నతడు తొలగ జేయు నన్ని విఘ్నములను ; 
    మ్రొక్కెద గణపతికి మక్కువగను !

    రిప్లయితొలగించండి
  6. భాద్రపదమునందు భద్రేభవక్త్ర యో
    వరద గావు మంచు భక్తి తోడ
    విఘ్నపతికి మ్రొక్క విఘ్నము లిడుమలు
    దొలగ జేయు మేలు కలుగ జేయు.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ గురువులకు, పెద్దలకు
    ప్రణామములు!

    నిఘ్నమతులు భక్తిదఘ్నాంతరంగులు
    నఘ్నసేవకులును గోఘ్నద్విడాప్తులు
    జఘ్నుదూరగు లకృతఘ్నభావు లిడిన
    విఘ్నపతికి మ్రొ క్కవిఘ్నము లిడు.

    (నిఘ్నమతులు = భగవదర్పితచిత్తులు; భక్తిదఘ్నాంతరంగులు = భగవద్భక్తియే పరమావధిగా గలవారు; అఘ్నసేవకులును = గోవును మాతగా ఆరాధించువారు; గోఘ్న = యజ్ఞధ్వంసకులగు రాక్షసులకు, ద్విట్ = వైరియగు స్వామికి, ఆప్తులు = దగ్గఱి భక్తులైనవారు; జఘ్నుదూరగులు = త్రికరణములందును హింస చేయనివారు; అకృతఘ్నభావులు = నిత్యకృతజ్ఞచిత్తులు అయినవారు; విఘ్నపతికిన్ = విఘ్నేశ్వరునకు; ఇడిన = సమర్పించిన; మ్రొక్కు = ప్రణామము; అవిఘ్నములు+ఇడున్ = నిరపాయములను ప్రసాదించెడిని గాక!)

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  8. చి. డా. ఏల్చూరి మురళీధర్ గారికి శుభాశీస్సులు.
    మీ పద్యము మంచి పదబంధముతో అలరారుచున్నది. అభినందనలు. 2వ పాదములో 5 సూర్య గణములు మాత్రమే వేయాలి. సరిచూసుకొనండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ గురువులకు సకృతజ్ఞ ధన్యవాదములు!

    నిఘ్నమతులు భక్తిదఘ్నాంతరంగులు
    నఘ్నసేవకులును గోఘ్నరిపులు
    జఘ్నుదూరగు లకృతఘ్నభావు లిడిన
    విఘ్నపతికి మ్రొ క్కవిఘ్నము లిడు.

    భవద్విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  10. గౌరి తనయుఁడాతడు కోరి కదలి వచ్చె,
    భువిని జనులను రక్షింప బూని; గరిక
    పత్రి గొని దీవనలనిచ్చు; భక్తి తోడ
    పూజ జేయంగ రారండు బుద్ధి గలిగి

    గురువు గారు,
    ఒక వారము ఊరికి వెళ్ళి వచ్చాను. అందువల్ల పూరణలు చేయలేదు.
    ఇక ... సినిమా వారి గురించైతే నేను ఉద్దేశ్యపూర్వకంగానే చేయటం మానుకుంటున్నానండి. మన్నించ గలరు.
    నైరృతి గురించి నాకేమీ తెలియదు. వచ్చిన పూరణల ద్వారా కొంత తెలుసుకున్నాను.

    శూర్పణఖ " సాధ్వి లోకైక సుందరాంగి"
    ననుచు రాఘవు చెంతజేరంగ నంత
    నగ్రజుని యాజ్ఞ గైకొని యనుజుడపుడు
    ముక్కు చెవులను గోసె నా ముదితకంద్రు.

    ఇందులో రెండవ పాదములో జేరంగ లో అ ఉందని, అనుచు లో అ కు యతి వేసినాననుకున్నాను. తప్పంటారా? తెలియజేయగలరు.

    రిప్లయితొలగించండి
  11. విఘ్నపతికి మ్రొక్క విఘ్నములిడు నట్టి
    యెల్ల యిడుముల తొలగించుచుండు.
    తీపి కుడుములిచ్చి దేవుని గొలువంగ
    రండు మిత్రులార, గుడికి రండు రండు.

    ఇందులో కూడా యె కు, గించు లో యి కి యతి సరిపోతుందా లేదా అని సందేహము.

    రిప్లయితొలగించండి
  12. నేను వ్రాసిన పూరణ వంటిదే మరి యొకటి ఉండడం గమనించలేదు. అందుకే మరొక పూరణ.

    సర్వ విఘ్నములను చక్కగ తొలగించు
    విఘ్నపతికి మ్రొక్క విఘ్నములిడు
    ననుట తప్పు కాదె? యాది దంపతులకు
    పుత్రుడతడె, యాది పూజలందు.

    రిప్లయితొలగించండి
  13. గురువులందరి కారోగ్య వరములొసగి

    బ్లాగు మిత్రులెల్లరకును బాగునిచ్చి

    శంకరాభరణంబిట్లు సాగునట్లు

    వేడెద శివశంకర సుతుఁ విఘ్న నాధుఁ!

    0..0..0..**-**..0..0..0

    భక్తిభావముంచి పార్వతీ సుతుడైన

    విఘ్నపతికి మ్రొక్క , విఘ్నములిడు

    వార లెంద రెంత వారైన పారరె?

    పరశు,పాశములకు దొరక కుండ!

    రిప్లయితొలగించండి
  14. చూడ నేడు చెప్పు "స్టూడెంట్లు" కొందరు
    శ్రీపతికిని మ్రొక్క శ్రీమతి నిడు
    పశుపతికిని మ్రొక్క పశువుల నే యిచ్చు
    విఘ్నపతికి మ్రొక్క విఘ్నములిడు

    రిప్లయితొలగించండి


  15. విఘ్న పతికి మ్రొక్క విఘ్నము లిడు నట

    వినెడు వారి కది య వింత గాదె ?

    విఘ్న పతికి మ్రొక్క విఘ్నములె దొలగు

    వినతు లందు కొనుము విఘ్న రాజ !

    రిప్లయితొలగించండి

  16. నిండు మనము తోడ నేకాదశ చ్ఖద
    పుష్ప ఫల యుతముగఁ బూజ సేసి,
    పంచ భక్ష్య యుక్త పరమాన్నముల నిడి,
    విఘ్నపతికి మ్రొ క్కవిఘ్నము లిడు!

    రిప్లయితొలగించండి
  17. నిండు మనము తోడ నేకాదశ చ్ఛద
    పుష్ప ఫల యుతముగఁ బూజ సేసి,
    పంచ భక్ష్య యుక్త పరమాన్నముల నిడి,
    విఘ్నపతికి మ్రొ క్కవిఘ్నము లిడు!

    రిప్లయితొలగించండి
  18. శ్రీ మిస్సన్న గారూ! ఆలకించండి:

    లెస్సగ కవనోత్సవ తే
    జస్సు గలుగునట్టి సుకవి చంద్రుండగు శ్రీ
    మిస్సన్న గార్కి నే నా
    శీస్సులిడుదు చెలగుమనుచు సిరులరారన్

    రిప్లయితొలగించండి
  19. గణముల కధిపతిని గణుతించ లేకున్న
    విఘ్న పతికి మ్రొక్క విఘ్నము లిడు
    ముదము గాను కొలిచి మోదకమ్మిడి నంత
    విఘ్న ములను బాపు వేలు పతడు !
    --------------------------------------
    గౌరి తనయు డితడు గణ నాయకుడె గాని
    విఘ్న పతికి మ్రొక్క విఘ్నము లిడు
    పలుక వలదు నరులు పాప మటన్నను
    భక్తి గాను కొలువ భాగ్య మిడును

    రిప్లయితొలగించండి
  20. నేమాని పండితార్యా ధన్యవాదములు. ధన్యుడను.
    మీ ఆశీర్వచనా కటాక్షములు మాపై నెప్పుడూ ప్రసరిస్తూ ఉండాలని మా ఆకాంక్ష.

    రిప్లయితొలగించండి
  21. వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
    నేటి సమస్యకు వైవిధ్యంగా చక్కని పూరణలు పంపిన
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారికి,
    పండిత నేమాని వారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    మిస్సన్న గారికి,
    ఏల్చూరి మురళీధర రావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సహదేవుడు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ‘శూర్పణఖ సాధ్వి ...’ పూరణలో మీ ప్రయోగం సరైనదే. లోతుగా ఆలోచించకుండా దోషారోపణ చేసాను. మన్నించండి.
    ఈనాటి పూరణలో ఇంచుగామం వల్ల యతి విషయంలో సందేహమే లేదు. కాకుంటే చివరి పాదంలో గణదోషం. ‘గుడికి రండు రండు’ను ‘రండు గుడికి’ అంటే సరి.
    *
    సహదేవుడు గారి పద్యంలో ‘శివశంకర’ అని పునరుక్తి ఉంది. ‘వేడెదను శంకరుని సుతు విఘ్ననాథు’ అంటే సరి.

    రిప్లయితొలగించండి
  22. గండూరి లక్ష్మినారాయణగురువారం, సెప్టెంబర్ 20, 2012 10:01:00 PM


    భక్తి తోడ నీవు ప్రతిరోజు ప్రేమతో
    విఘ్న పతికి మ్రొక్క విఘ్నములిడు
    శత్రు వొకడు కూడ మిత్రమా! కలుగుడు
    నమ్ము బుధుల మాట నెమ్మనమున.

    రిప్లయితొలగించండి
  23. లక్ష్మి నారాయణ గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి