19, సెప్టెంబర్ 2026, శనివారం

సమస్య - 5595

20-9-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తలకాయల చారుఁ గాఁచఁ దర్షము నిండెన్”

(లేదా...)

“తలకాయల్ గొని చారుఁ గాఁచిరి జనుల్ దర్షంబు నిండారఁగన్”

(ఐతగోని వెంకటేశ్వర్లు గారి శతావధానంలో ముద్దు రాజయ్య గారి సమస్య)

5 కామెంట్‌లు:


  1. కలతను విడు మామిడి కా
    యలు కలవని వాటితోడ నటగల యాహూ
    తుల మెప్పింతునని శకుం
    తల, కాయల చారుఁ గాఁచఁ దర్షము నిండెన్.


    పలు శాకంబులు జేయనేల రుచిగా వండింతు నేనంచు తా
    పిలిచెన్ వంటను చేయమంచు నటకున్ బెండ్లామునే యట్టి గా
    దిలియే గాంచె నృపప్రియమ్ము లట నుద్వేలమ్ము నుండన్ శకుం
    తల, కాయల్ గొని చారుఁ గాఁచిరి జనుల్ దర్షంబు నిండారఁగన్.

    రిప్లయితొలగించండి
  2. పులుపే కద రుచ్యమనుచు
    కలవా మంచివగు చింత కాయలనుచుఁ జూ
    చి లభించె ననుచు ముచ్చిం
    తల కాయల చారుఁ గాఁచఁ దర్షము నిండెన్

    పులుపే రుచ్యముగాదె జిహ్వకనుచున్ మోదంబు తీండ్రించగా
    పలుచోట్లన్ బరికించి కన్గొనిరహో వారాంత మీగ్రామ సం
    తలలో చొప్పడు చింత కాయలనుచున్ దామచ్చటన్ రెంట చిం
    తల కాయల్ గొని చారుఁ గాఁచిరి జనుల్ దర్షంబు నిండారఁగన్

    [ ముచ్చింతల, రెంటచింతల అనేవి ఊరు పేర్లు ]

    రిప్లయితొలగించండి
  3. -
    కిలకిల నవ్వుల పక్కిం
    టి లలామ ముదముగ బిలిచి టెక్కుల గరిటం
    చుల రుచుల జువ్వి చెప్పి క
    తల, కాయల చారుఁ గాఁచఁ దర్షము నిండెన్!

    :)

    జిలేబి పరార్ :)


    రిప్లయితొలగించండి
  4. కందం
    వెలితియని పచ్చిమాంసముఁ
    దలఁచిన నా కుంభకర్ణుఁ దనియఁగఁ జేయన్
    వలసిన జంతువులన్ గొని
    తలకాయల చారుఁ గాఁచఁ దర్షము నిండెన్

    మత్తేభవిక్రీడితము
    వెలయన్ జేసియు వేదిపై మురియుచున్ విఘ్నేశ్వరున్ భక్తితోఁ
    బలుకార్యక్రమముల్ ఘటింప మిగులన్ బర్వమ్ము సంరంభమై
    దలచన్ విందొనరింపగా రుచులఁ, బెద్దల్ మెచ్చి వారూపగన్
    దలకాయల్, గొని చారుఁ గాఁచిరి జనుల్ దర్షంబు నిండారఁగన్

    రిప్లయితొలగించండి
  5. పలుమారు లెల్లరు దలఁచి
    తలంచి తగ నిర్ణయించి తప్పక యిఁక నా
    వలఁ గాంచి పండఁగాఁ జిం
    తల కాయల చారుఁ గాఁచఁ దర్షము నిండెన్

    [చింతల కాయలు = చింత చెట్ల కాయలు]


    కలకాలమ్మును గుర్తునం దనర సత్కార్యంబు నా నెంచుచుం
    దలకాయల్ తగ పండి యుండఁ దెలివిన్ దర్పంబె యేపారఁగా
    నలవోకం జని వండు వా రులవ చే నందుండఁగా నెత్తిపోఁ
    తల కాయల్ గొని చారుఁ గాఁచిరి జనుల్ దర్షంబు నిండారఁగన్

    రిప్లయితొలగించండి