12, నవంబర్ 2026, గురువారం

సమస్య - 5649

13-11-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పూతవాక్సౌరభపు తోట బూతుపాట”

(లేదా...)

“సరసవచోవిలాససుమసౌరభమొప్పును బూతుపాటలన్”

16 కామెంట్‌లు:

  1. తేటగీతి
    మాతృభాషలో పాడిన మధురమనవె?
    భావమెరుగ కున్నను బూతు పాటయగునె?
    ప్రతి పదార్థ వివరముల గతులవినుము
    పూతవాక్సౌరభపు తోట బూతుపాట!

    చంపకమాల
    నిరతము నాంగ్లమాధ్యమము నేర్పిన పశ్చిమ గీత మ్రోతలన్
    గురిసిన వాగుడున్ వినుటె కూరిమి నీకన, మాతృభాషలో
    మెరిసిన పాట బూతుయని మెచ్చవె? యర్థములెంచి గ్రోలుచో
    సరసవచోవిలాససుమసౌరభమొప్పును బూతుపాటలన్!

    రిప్లయితొలగించండి
  2. తే.గీ.
    సరస శృంగార వర్ణనా భరితమైన
    నాటి కవికృషీవలునిది మేటిదైన
    పూతవాక్సౌరభపు తోట, బూతుపాట
    నేటి కుహనా కవీంద్రుని నోటి తీట

    రిప్లయితొలగించండి
  3. చలన చిత్రము చిత్రింప దలచి యొకడు
    పాటలను రచి యింపు మని కోరి వాంఛ దిలిపె
    రచయిత ను గోర నాతడు రచన చేసె
    పూత వా క్సౌ ర భ పు తోట బూతు పాట

    రిప్లయితొలగించండి
  4. కవివరేణ్యులు రచియించు కవనములిడు
    పూత వాక్సౌరభపు తోట ; బూతుపాట
    యగును మూర్ఖులు జెప్పెడి యత్యయములు
    అంతరమెరిగి వాటిని యాదరించు

    రిప్లయితొలగించండి

  5. మధుర గాత్రమ్ము నందున సుధలు గురియు
    బావ మరదళ్ళ సరసపు వాక్యములవి
    శైలి బద్ధము పాడెడి శ్రామికుండ్ర
    పూతవాక్సౌరభపు తోట బూతుపాట.


    మెరకలలో శ్రమించు తరి మెల్తుక లెల్లరు పల్లె ప్రేమికుల్
    సరసము లాడు మాటలనె శ్రావ్యపు పాటగ నాల పించ చూ
    పరుల మనస్సు దోచినను భావము గాంచుచు విస్తు పోవరే
    సరసవచోవిలాససుమసౌరభమొప్పును బూతుపాటలన్.

    రిప్లయితొలగించండి

  6. మధుర గాత్రమ్ము నందున సుధలు గురియు
    బావ మరదళ్ళ సరసపు వాక్యములవి
    శైలి బద్ధము పాడెడి శ్రామికుండ్ర
    పూతవాక్సౌరభపు తోట బూతుపాట.


    మెరకలలో శ్రమించు తరి మెల్తుక లెల్లరు పల్లె ప్రేమికుల్
    సరసము లాడు మాటలనె శ్రావ్యపు పాటగ నాల పించ చూ
    పరుల మనస్సు దోచినను భావము గాంచుచు విస్తు పోవరే
    సరసవచోవిలాససుమసౌరభమొప్పును బూతుపాటలన్.

    రిప్లయితొలగించండి
  7. సరస సత్సార రచితమై సురుచిరముగ
    స్థిరముగ నిలిచి యున్నది తెలుగు పాట
    పూతవాక్సౌరభపు తోట; బూతుపాట
    పూత రేకని భావింత్రు శ్రోతలిచట

    స్థిరముగ నిల్చియున్నవిట తియ్యని పాటలు తేటతెల్గులో
    సరసులు కూర్చినట్టివగు చక్కని కమ్మని పాటలందునన్
    సరసవచోవిలాససుమసౌరభమొప్పును; బూతుపాటలన్
    సురసపు పూతరేకులని శ్రోతలు మిక్కిలి పల్కుచుందురే

    రిప్లయితొలగించండి
  8. తే.గీ; బూతు లెల్లరు రాజును పొగడు చుండ
    బద్యముల తోడ నొక బూతు పాట పాడె
    ప్రభువు దానినే మెచ్చుచు బలికె నిట్లు
    "పూతవాక్సౌరభపు తోట బూతుపాట"
    (బూతు అంటే వందిమాగధుడు అనే అర్థం ఉంది.భట్రాజులు మొదలైన వారు. అలా వందిమాగధు లంతా పద్యాల తో పొగుడుతుంటే ఒల వందిమాగధుడు పాట తో పొగిడాడు. రాజు దాన్నే మెచ్చుకున్నడు.)






    రిప్లయితొలగించండి
  9. చం:బరబర చిత్రగీతముల వ్రాయకు మచ్చ తెనుంగు లోన నో
    సరసకవీంద్ర! చేగొనుము సంస్కృత శబ్దము, లవ్వి యుండినన్
    గరము రుచించు ,బండితులు ఖండన జేయక నుంద్రు,తీయనౌ
    సరసవచోవిలాససుమసౌరభమొప్పును బూతుపాటలన్”
    (నువ్వు బూతు పాటలు రాయి కానీ అచ్చ తెనుగు బదులు సంస్కృత శబ్దాలు వాడితే సరసం అంటారు అని సినిమా కవికి సూచించినట్లు.)



    రిప్లయితొలగించండి
  10. చంపకమాల:
    అరయగ సత్కవీంద్రుల సమంచితమౌ కవనమ్ములందునన్
    సరసవచోవిలాససుమసౌరభమొప్పును, బూతుపాటలన్
    సరసము దారితప్పి విరసమ్ముగ రూపము దాల్చుచుండునా
    విరసపు తిక్తమెందులకు పెంపుగ దూఁకొను కావ్య మాధురుల్

    రిప్లయితొలగించండి
  11. ఒక చిత్ర నిర్మాత తన గీత రచయితతో చెప్పుట

    తే॥ నేఁటి ప్రేక్షకుల నరయ నెమ్మి నొసఁగెఁ
    గాద శ్లేషార్థమున నొప్పఁగఁ బదములటు
    వర్తకమున లాభముఁ గను వారికిపుడు
    పూతవాక్సౌరభుపు తోట బూతు పాట

    చం॥ నరమును నొక్కి ప్రేక్షకుల నాడినిఁ బట్టుమ నేఁడు చూడఁగన్
    విరిసిన శ్లేష ముఖ్యమయ విత్తము నాదయ లాభమెందుటే
    వరమగు నాకు నెల్లరికి వర్తక మిద్దియుఁ గాంచు వారికిన్
    సరస వచోవిలాస సుమసౌరభమొప్పును బూతు పాటలన్

    రిప్లయితొలగించండి
  12. నెమ్మి నొసఁగు నపాత్ర దానమ్ము భంగి
    దాన కర్ణుం డనిన లోభిఁ దగని పగిది
    వీత ధర్మానురక్తి యౌ నేత కౌను
    బూత వాక్సౌరభపుఁ దోట బూతుపాట


    పరవశ మందరే నరులు వారిఁ బొగడ్తల మించి ముంపఁగా
    సురుచిర వాక్సుమాంబునిధి సుందర వర్ణన నైపుణమ్మునన్
    ధరణిపు లెల్ల మెత్తురు వదాన్యత నిత్తురు విత్త మింపుగా
    సరస వచోవిలాస సుమ సౌరభ మొప్పును బూతు పాటలన్

    [బూతు = బట్టువాఁడు]

    రిప్లయితొలగించండి
  13. మరులను ముంచ మన్మథుడు మార్గుణముల్ విడి క్రొత్తజంటపై
    విరహముతోడ క్రాలుచును విష్ణుకుమారుని తూలనాడు నా
    వరసతి చెంత చేరి ప్రియవల్లభుడల్ల విరాళితోడ నా
    సరసవచోవిలాససుమసౌరభమొప్పును బూతుపాటలన్
    (ఇంచుక బూతాడక రతి రంజిల్లదు)

    రిప్లయితొలగించండి
  14. సరికొత్త బ్లాగ్ అగ్రిగేటర్ :)

    https://blogmanjari.pages.dev/

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    నాటి చిత్రాల పాటలు మేటిగాను
    పూత వాక్సౌరభపు తోట; బూతు పాట
    చిత్రములు కొన్ని ప్రేక్షక చిత్తమలర
    నాదరణను పొందుచు నుండె నచ్చెరువుగ.

    రిప్లయితొలగించండి