తే.గీ; బూతు లెల్లరు రాజును పొగడు చుండ బద్యముల తోడ నొక బూతు పాట పాడె ప్రభువు దానినే మెచ్చుచు బలికె నిట్లు "పూతవాక్సౌరభపు తోట బూతుపాట" (బూతు అంటే వందిమాగధుడు అనే అర్థం ఉంది.భట్రాజులు మొదలైన వారు. అలా వందిమాగధు లంతా పద్యాల తో పొగుడుతుంటే ఒల వందిమాగధుడు పాట తో పొగిడాడు. రాజు దాన్నే మెచ్చుకున్నడు.)
తేటగీతి
రిప్లయితొలగించండిమాతృభాషలో పాడిన మధురమనవె?
భావమెరుగ కున్నను బూతు పాటయగునె?
ప్రతి పదార్థ వివరముల గతులవినుము
పూతవాక్సౌరభపు తోట బూతుపాట!
చంపకమాల
నిరతము నాంగ్లమాధ్యమము నేర్పిన పశ్చిమ గీత మ్రోతలన్
గురిసిన వాగుడున్ వినుటె కూరిమి నీకన, మాతృభాషలో
మెరిసిన పాట బూతుయని మెచ్చవె? యర్థములెంచి గ్రోలుచో
సరసవచోవిలాససుమసౌరభమొప్పును బూతుపాటలన్!
తే.గీ.
రిప్లయితొలగించండిసరస శృంగార వర్ణనా భరితమైన
నాటి కవికృషీవలునిది మేటిదైన
పూతవాక్సౌరభపు తోట, బూతుపాట
నేటి కుహనా కవీంద్రుని నోటి తీట
చలన చిత్రము చిత్రింప దలచి యొకడు
రిప్లయితొలగించండిపాటలను రచి యింపు మని కోరి వాంఛ దిలిపె
రచయిత ను గోర నాతడు రచన చేసె
పూత వా క్సౌ ర భ పు తోట బూతు పాట
కవివరేణ్యులు రచియించు కవనములిడు
రిప్లయితొలగించండిపూత వాక్సౌరభపు తోట ; బూతుపాట
యగును మూర్ఖులు జెప్పెడి యత్యయములు
అంతరమెరిగి వాటిని యాదరించు
రిప్లయితొలగించండిమధుర గాత్రమ్ము నందున సుధలు గురియు
బావ మరదళ్ళ సరసపు వాక్యములవి
శైలి బద్ధము పాడెడి శ్రామికుండ్ర
పూతవాక్సౌరభపు తోట బూతుపాట.
మెరకలలో శ్రమించు తరి మెల్తుక లెల్లరు పల్లె ప్రేమికుల్
సరసము లాడు మాటలనె శ్రావ్యపు పాటగ నాల పించ చూ
పరుల మనస్సు దోచినను భావము గాంచుచు విస్తు పోవరే
సరసవచోవిలాససుమసౌరభమొప్పును బూతుపాటలన్.
రిప్లయితొలగించండిమధుర గాత్రమ్ము నందున సుధలు గురియు
బావ మరదళ్ళ సరసపు వాక్యములవి
శైలి బద్ధము పాడెడి శ్రామికుండ్ర
పూతవాక్సౌరభపు తోట బూతుపాట.
మెరకలలో శ్రమించు తరి మెల్తుక లెల్లరు పల్లె ప్రేమికుల్
సరసము లాడు మాటలనె శ్రావ్యపు పాటగ నాల పించ చూ
పరుల మనస్సు దోచినను భావము గాంచుచు విస్తు పోవరే
సరసవచోవిలాససుమసౌరభమొప్పును బూతుపాటలన్.
సరస సత్సార రచితమై సురుచిరముగ
రిప్లయితొలగించండిస్థిరముగ నిలిచి యున్నది తెలుగు పాట
పూతవాక్సౌరభపు తోట; బూతుపాట
పూత రేకని భావింత్రు శ్రోతలిచట
స్థిరముగ నిల్చియున్నవిట తియ్యని పాటలు తేటతెల్గులో
సరసులు కూర్చినట్టివగు చక్కని కమ్మని పాటలందునన్
సరసవచోవిలాససుమసౌరభమొప్పును; బూతుపాటలన్
సురసపు పూతరేకులని శ్రోతలు మిక్కిలి పల్కుచుందురే
తే.గీ; బూతు లెల్లరు రాజును పొగడు చుండ
రిప్లయితొలగించండిబద్యముల తోడ నొక బూతు పాట పాడె
ప్రభువు దానినే మెచ్చుచు బలికె నిట్లు
"పూతవాక్సౌరభపు తోట బూతుపాట"
(బూతు అంటే వందిమాగధుడు అనే అర్థం ఉంది.భట్రాజులు మొదలైన వారు. అలా వందిమాగధు లంతా పద్యాల తో పొగుడుతుంటే ఒల వందిమాగధుడు పాట తో పొగిడాడు. రాజు దాన్నే మెచ్చుకున్నడు.)
చం:బరబర చిత్రగీతముల వ్రాయకు మచ్చ తెనుంగు లోన నో
రిప్లయితొలగించండిసరసకవీంద్ర! చేగొనుము సంస్కృత శబ్దము, లవ్వి యుండినన్
గరము రుచించు ,బండితులు ఖండన జేయక నుంద్రు,తీయనౌ
సరసవచోవిలాససుమసౌరభమొప్పును బూతుపాటలన్”
(నువ్వు బూతు పాటలు రాయి కానీ అచ్చ తెనుగు బదులు సంస్కృత శబ్దాలు వాడితే సరసం అంటారు అని సినిమా కవికి సూచించినట్లు.)
చంపకమాల:
రిప్లయితొలగించండిఅరయగ సత్కవీంద్రుల సమంచితమౌ కవనమ్ములందునన్
సరసవచోవిలాససుమసౌరభమొప్పును, బూతుపాటలన్
సరసము దారితప్పి విరసమ్ముగ రూపము దాల్చుచుండునా
విరసపు తిక్తమెందులకు పెంపుగ దూఁకొను కావ్య మాధురుల్
ఒక చిత్ర నిర్మాత తన గీత రచయితతో చెప్పుట
రిప్లయితొలగించండితే॥ నేఁటి ప్రేక్షకుల నరయ నెమ్మి నొసఁగెఁ
గాద శ్లేషార్థమున నొప్పఁగఁ బదములటు
వర్తకమున లాభముఁ గను వారికిపుడు
పూతవాక్సౌరభుపు తోట బూతు పాట
చం॥ నరమును నొక్కి ప్రేక్షకుల నాడినిఁ బట్టుమ నేఁడు చూడఁగన్
విరిసిన శ్లేష ముఖ్యమయ విత్తము నాదయ లాభమెందుటే
వరమగు నాకు నెల్లరికి వర్తక మిద్దియుఁ గాంచు వారికిన్
సరస వచోవిలాస సుమసౌరభమొప్పును బూతు పాటలన్
నెమ్మి నొసఁగు నపాత్ర దానమ్ము భంగి
రిప్లయితొలగించండిదాన కర్ణుం డనిన లోభిఁ దగని పగిది
వీత ధర్మానురక్తి యౌ నేత కౌను
బూత వాక్సౌరభపుఁ దోట బూతుపాట
పరవశ మందరే నరులు వారిఁ బొగడ్తల మించి ముంపఁగా
సురుచిర వాక్సుమాంబునిధి సుందర వర్ణన నైపుణమ్మునన్
ధరణిపు లెల్ల మెత్తురు వదాన్యత నిత్తురు విత్త మింపుగా
సరస వచోవిలాస సుమ సౌరభ మొప్పును బూతు పాటలన్
[బూతు = బట్టువాఁడు]
మరులను ముంచ మన్మథుడు మార్గుణముల్ విడి క్రొత్తజంటపై
రిప్లయితొలగించండివిరహముతోడ క్రాలుచును విష్ణుకుమారుని తూలనాడు నా
వరసతి చెంత చేరి ప్రియవల్లభుడల్ల విరాళితోడ నా
సరసవచోవిలాససుమసౌరభమొప్పును బూతుపాటలన్
(ఇంచుక బూతాడక రతి రంజిల్లదు)
మార్గణముల్ టైపో
రిప్లయితొలగించండిసరికొత్త బ్లాగ్ అగ్రిగేటర్ :)
రిప్లయితొలగించండిhttps://blogmanjari.pages.dev/
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
నాటి చిత్రాల పాటలు మేటిగాను
పూత వాక్సౌరభపు తోట; బూతు పాట
చిత్రములు కొన్ని ప్రేక్షక చిత్తమలర
నాదరణను పొందుచు నుండె నచ్చెరువుగ.