కామేశ్వర రావు గారూ, సూత్రంలోనే ‘ఒకానొకచో’ అని పరిమితిని నిర్దేశించారు కదా! ప్రాసస్థానంలో తప్పని పరిస్థితుల్లో ఈ సూత్రాన్ని అన్వయించుకోవాలి. సర్వత్రా కాదు. గాంధారిం జూడఁగ వ చ్చెం ధృతరాష్ట్రుఁడు.... (ఇలాంటి సందర్భాలలో...)
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ వివరణ తో సందేహ నివృత్తియయినది. ధన్యవాదములు. “గాంధారిం జూడఁగ” ఆదేశ సరళము కాబట్టి పూర్ణ బిందువు విభాషగా రావచ్చనుకుంటాను.
సూర్యనారాయణ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. మొదటి పూరణ చివరి పాదంలో యతి తప్పింది. మన సుబ్బారావు గారు ఇలాంటి సందర్భాలలో ‘నిర్మల వినుమా/ నీరజ వినుమా’ అని గట్టెక్కుతూ ఉంటారు.
నిజమట కలియుగ వింతలు
రిప్లయితొలగించండిగజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
సుజనుడు పలికెను వింతగ
యజమట బలిజేసెడి తరి హాహా పలికెన్
అక్కయ్యా,
తొలగించండిపూరణ బాగున్నది. చివరిపాదం అర్థం కాలేదు.
రజకుడు గొనెనొక గాడిద
రిప్లయితొలగించండిగజమని పేరిడెను కొంత కాలము పిదపన్
నిజ ఫాల్గుణ మాసమ్మున
గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్.
శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రజలెల్లరు మెచ్చగఁ దను
రిప్లయితొలగించండివిజయుండాయెను జనకుడె! వెనుకాడు సుతున్
స్వజనమ్మే తగడన, ది
గ్గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్.
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఋజు వర్తన గతి దప్పిన
రిప్లయితొలగించండినజుని రచన విధము దప్పు నది యెట్లన్నన్
నిజముగ నొకపరి నిటులగు
గజమునకు ఖరమ్ము బుట్టి గంతులు వేసెన్!
శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. నిన్నటి పూరణలో "వర్గయుక్సరళములు పరములగునపు డొకానొకచో ద్రుతమునకుఁ బూర్ణబిందువును గానంబడియెడి". అన్న సూత్రమాధారముగా “శూరుం జగ త్త్రాతం భర్తగఁ” యని వ్రాసితిని. తప్పయినచో సవరించ గలను. సందేహ నివృత్తి చేయ గోర్తాను.
రిప్లయితొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిసూత్రంలోనే ‘ఒకానొకచో’ అని పరిమితిని నిర్దేశించారు కదా! ప్రాసస్థానంలో తప్పని పరిస్థితుల్లో ఈ సూత్రాన్ని అన్వయించుకోవాలి. సర్వత్రా కాదు.
గాంధారిం జూడఁగ వ
చ్చెం ధృతరాష్ట్రుఁడు.... (ఇలాంటి సందర్భాలలో...)
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ వివరణ తో సందేహ నివృత్తియయినది. ధన్యవాదములు.
తొలగించండి“గాంధారిం జూడఁగ” ఆదేశ సరళము కాబట్టి పూర్ణ బిందువు విభాషగా రావచ్చనుకుంటాను.
విజయ దశమియె జననమట
రిప్లయితొలగించండిగజమునకు-ఖరమ్ముపుట్టి గంతులువేసెన్
రజకుని యింటన్నవమిని
నిజమిది మాయూరి వార్త సుజనుడ వినుమా!
నిజమయి బ్రహ్మము పలుకులు
గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
విజయనగరంపు వాడను
సుజనుడవినుమా కలియుగ చోద్యములెన్నో!
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి.
మొదటి పూరణ చివరి పాదంలో యతి తప్పింది. మన సుబ్బారావు గారు ఇలాంటి సందర్భాలలో ‘నిర్మల వినుమా/ నీరజ వినుమా’ అని గట్టెక్కుతూ ఉంటారు.
మీ సూచనకు కృతజ్ఞతలు.
తొలగించండిసృజియించిరట త్వచములం
రిప్లయితొలగించండిదు జిగురు కరగింప దానిఁ దోరముగ ఘనో
ష్ణజ సుద్రవమ్ము వారి య
గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
[అగజము= జిగురు; ఖరము=వేడి]
భజన పరులు తనుఁ బొగడగ
తొలగించండిసుజనులు పాండు తనయులఁ గసుగు నిత్యంబుం
గుజనుండట కౌరవది
గ్గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా మొదటి పూరణ విలక్షణంగా ఉండి ఔత్సిహిక కవులకు మార్గదర్శకంగా ఉంది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండివిజనారణ్యమునందున
రిప్లయితొలగించండిభజనను చేయుచునునిటుపరుగులు దీయన్
రుజయొక్కటిమొదలై
గజమునకుఖరమ్ముపుట్టి గంతులు వేసెన్.
ఖరము=వేడిమి
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
రెండవ, మూడవ పాదాలలో గణదోషం. ‘భజనను చేయుచును నిటుల పరుగులు దీయన్| రుజ యొక్కటి మొదలై త| ద్గజమునకు...’ అనండి.
నిజమా యిది సామీ యిట
రిప్లయితొలగించండిగజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
గజమునకు ఖరము పుట్టుట
నిజముగ గని కట్టు సుమ్ము నెఱి పరికింపన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిజధారను సంజ్ఞను రవి
రిప్లయితొలగించండిత్యజియించని వేడితోడ తను కూడగనే
ప్రజననమున కాక తగుల
గ, జమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్.
సంజ్ఞ, సూర్యుల పుత్రిక య(జ)మున/య(జ)ముడు అనే గాథ ఆధరంగా..
రిప్లయితొలగించండిరాకుమార గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రజకున కుండిన నాలుగు
రిప్లయితొలగించండిగజమజ హయ కేసరులను గార్దభములలో
గజమీనగ జనులనిరిల
గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మధ్యాక్కర
రిప్లయితొలగించండిగజమునకు ఖరమ్ముపుట్టి గంతులు వేసెన్ ననుటకు
నిజమని నిర్ధార కమిటి నిర్ణయ మందున దెలుప|
ప్రజలకు నమ్మక మౌన?రైతింటఎద్దీనినదన?
ఋజువులు నడుగనివారు|నెక్కువగా గనపడగ|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
‘నిర్ధారణ కమిటి’ అనాలనుకుంటాను.
. నిజమని నమ్మకు యెప్పుడు
రిప్లయితొలగించండిగజమునకు ఖరమ్ముపుట్టి గంతులు వేసెన్
ఋజువెక్కడ?మాటలు యే
సుజనుడు నూహించ లేడు శోధనజేయన్.
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది.
‘నమ్మకు మెప్పుడు.... మాటల నే సుజనుడు...’ అనండి.
సుజనాళి కాదు, నేతల
రిప్లయితొలగించండిభజన సమూహమని యెఱిగి బన్నము పడగన్!
విజయము చేసిన కవి ది
గ్గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
యజములఁజరచుచు సతతము
రిప్లయితొలగించండిప్రజల రుధిర పలలములను పలహారముగా
రజనిఁజరించు యసుర ది
గ్గజమునకు ఖరమ్ముపుట్టి గంతులు వేసెన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్యప్రారంభంలో అజములా? యజములా?
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[పరమశ్రోత్రియుఁడగు యజ్ఞదత్తునకు గుణనిధి జన్మించుట, గజమునకు ఖరము జన్మించుటయే గదా]
ద్విజవంశాఖ్యకలశసిం
ధుజముఖఘనయజ్ఞదీక్షితోద్గుణనిధియే
బజగెడి గుణనిధిఁ గనెఁ! గన,
గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్!!
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅజుడమృతమునకు బదులుగ
రిప్లయితొలగించండినిజమగు కాదంబరిగొని నిరవధికముగా
సృజియించగ కలియుగమున
గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుమూర్తి ఆచారి గారి పూరణలు...
రిప్లయితొలగించండిశీతా౦శున్ గని కామవా౦ఛ గొని నీ శీలమ్ము కోల్పోవుచున్
ఖ్యాతు౦డైన యతిన్ బృహస్పతిని ఖేదా౦బోనిధిన్ ద్రోసి యీ
రీతిన్ నీతి విహీన వైఖరిc బ్రవర్తి౦పన్ హిత౦బౌనె? యో
సీ! తారా! ముని కోగు జేయ దగునే? చి౦తి౦ప నిల్లాలివై.
రె౦డవ పూరణము
పాతివ్రత్యము బూది గల్పుచు పతిన్ వాచస్పతిన్ వీడ నీ
చేత౦ బేగతి నొప్పె ? పుత్రసముడౌ శీతా౦శుని౦ గా౦చి యే
రీతిన్ గూడితివో ! కళ౦కితమయెన్ స్త్రీజాతి నీ చేత ని
స్సీ! తారా! ముని కోగు జేయ దగునే చి౦తి౦ప నిల్లాలివై.
ఆచారి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి గారి పూరణ....
రిప్లయితొలగించండి( ఒక చాకలి " కట్టిన " గాడిదను మడుగు జలములో చక్కగా స్నానము చేయి౦చెను . అ౦త నది , గ జ ము దూరమునకు నడువగా ఈనినది. అపుడు గాడిద పిల్ల పుట్టి గ౦తులు వేసెను )
రజకుడు " కట్టిన " ఖరమును
మజనము చేయి౦చె నొక్క మడుగు జలమునన్ |
మజరే ! యది నడువగ నొక
గజమునకు , ఖరమ్ము పుట్టి గ౦తులు వేసెన్
{ మజనము = స్నానము ; మజరే = అరెరే !
అది నడువగ నొక గజమునకు = ఆ గాడిద ఒక గజము దూరమునకు నడువగా ;
ఖరమ్ము పుట్టి = గాడిదపిల్లపుట్టి }
ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కుజనులు మెచ్చగ పలికెను:👇
రిప్లయితొలగించండి"గజగజ లాడింతు నిన్ను కనుమా మోడీ!"
నిజమిది వినుడీ కాంగ్రెసు
గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్