పద్మావతీ శ్రీనివాసము (ద్విపదకావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర
రావు
ప్రధమాశ్వాసము
శ్రీకైవల్యానుగ్రహ
లోక సురక్షక సుధా విలోకన
రమణా
శోక దురితౌఘ దళనా
కాకుత్స్థ కులాభిరామ
కారుణ్య నిధీ 1
శ్రీనివాస చరణ సేవానురక్తి
మానుగ నిత్యము మనమందు
నిల్పి 2
కలియుగ దైవమై కరమను
రక్తి
వెలసిన కథ నుడివెద
ముదమార 3
అంజనాద్రి ఘన శేషాద్రి
వృషాద్రి
మంజుల వృషభాద్రి మరి
గరుడాద్రి 4
నారాయణాద్రి యనగ వేంకటాద్రి
నారంజిలెడు సప్త నగరాజ
విభుని 5
మానసంబున నిల్పి మాధుర్యముగను
వీనుల విందుగ వివరంబు
గాను 6
పద్మావతీశ్రీనివాస
మనంగ
పద్మదళాక్షు భవ్యచరిత్ర
నెల్ల 7
శ్రీయుతమై ముని సేవితమై
ఘ
నాయతమై జగదభి రామమైన 8
నైమిశారణ్యమ్ము నందనో
పమము
హేమాది ధాతు సంహితములు
గిరులు 9
సాల తాల తమాల చంపక
కుంద
మాలతీ కరవీర మల్లికాషండ 10
చూత నీప వకుళాశోక మధూక
కేతక మాధవీ కింశుక
తినిశ 11
కురవక పాటలా కోవిదా
రాది
తరువులు విలసిల్లు
ధరణీ తలమ్ము 12
రమణీయ ఖగములు రంజిల్లు
నచట
కమనీయ కుట్టార కందరా
వృతము 13
హరిణ చమూరు శివాజగర
హరి
శరభ శార్దూల కేసరి
గజాది మృగ 14
సంచరితమ్ము కాసార సాధుజల
సంచయమ్ము తనర షట్పద
రవము 15
కలహంస బక శరా కారండ
వాది
జల విహంగోత్కర సంసేవి
తమ్ము 16
పుణ్యపు నైమిశమ్మున
తపోధనుల
గణ్య సంఖ్యులు ప్రముఖ
ధరణి సురులు 17
సంతత నిశ్చల జపతప కామి
తాంతరంగులు జ్వలితాంగులు
ఘనులు 18
సకలోర్వి జనులకు సౌఖ్యంబు
నెంచి
యకళంక చరితులు యమివరు
లెల్ల 19
యజ్ఞరాజ మొకటి యాచరించు
తరి
సుజ్ఞాన సంపన్న సురమునీంద్రుండు 20
(మిగిలిన పద్యములు రేపు...)
ద్విపద కావ్యము జక్కగ వెలువరించి
రిప్లయితొలగించండికవి వరేణ్యుల మనసులు కైవసమ్ము
జేసి కొనుటకు యత్నించు జ్యేష్ఠ సోద
రా !శు భములు గ లుగుగాక రహిని నిలను
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రణీతమైన శ్రీ రమాపరిణయము ద్విపదకావ్యం చదివాను. ఇప్పుడుమీ ద్విపదను చవుచున్నాను. ఏదుకొండలను చక్కగా వర్ణిస్తూ అక్కడ గల పాదప, జంతు మరియు పక్షిజాతులగురించి వ్రాసిన వివరములు ఆనందాన్ని కలిగించాయి. చక్కని ద్విపద కావ్యాన్ని వ్రాసిన కవివర్యులు కామేశ్వర రావు గారికి ప్రచురించిన గురువర్యులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండి