18, జనవరి 2021, సోమవారం

సమస్య - 3608

19-1-2021 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రాయను నను వీడి పోకురా యను రాయా”

(లేదా…)

“రాయను నన్ను వీడకుమురా యను రాయ పరాయణోక్తులన్”

72 కామెంట్‌లు:



  1. పోయెద ననవలదయ్యా
    నా యయ్యరువీవు! సామి! నా గేస్తువిరా!
    నీ యాన ! పద్యముల నే
    రాయను! నను వీడి పోకు, రాయను రాయా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యాలతో మరీ అంతగా బాధపెడుతున్నారా పాపం! బాగుంది మీ పూరణ. అభినందనలు.
      నిజానికి 'వ్రాయు' అన్నది సాధురూపం.

      తొలగించండి
  2. వీయగచల్లనిగాలులు
    పూయగగంధముమనసుకుభూరిగశోభన్
    హాయనుమాటలనేమని
    కాయను? ననువీడిపోకురాయనురాయా

    రిప్లయితొలగించండి
  3. వేయని వేషము లేదే
    మాయలు పన్నుచు గడిపితి మమతలు పంచన్
    ప్రాయము మీరగ మనసుకు
    రా యను నను వీడి పోకురా యను రాయా!

    రిప్లయితొలగించండి
  4. మాయ పడితి కావగ రా

    రా, యను నను వీడి పోకు, రాయను రాయా
    రాయా భజించెద తెలుపు

    మాయా మోహములు దాటు మధురపు త్రోవల్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  5. దేవకీదేవి ఉవాచ:

    ఆ యమ్మకు జూపితివట
    నీయాస్యమునందు నాడు నిఖిల జగంబుల్,
    "నీ యనురాగము గోరుదు
    రా" యను నను వీడి పోకు, రా యను, రాయా!

    రిప్లయితొలగించండి
  6. ఓయన లేను రాను మరులూయెల లూగగ లేను బేలరా
    యూ యనలేను ఛీయనగ నుల్లము నొప్పదు గుండె రాయయెన్
    దాయగ లేను మాయయని దాయక పో కభయంబు నీయ *రా*
    *“రా!యను నన్ను వీడకుమురా యను రాయ పరాయణోక్తులన్”*

    రిప్లయితొలగించండి
  7. చేయను దూషణ పరులను
    ఛీ యని యనిపించు కొనను చెడు కవితలతో
    పాయక గొల్తును గావుము
    రా ' యను నను వీడి పోకురా యను రాయా

    రిప్లయితొలగించండి
  8. న్యాయమ్మా నేస్తం నే
    చేయదగని పనులనేమి జేసితినయ్యా
    పోయెద ననకోయ్ అత్తరు
    రాయను నను వీడి పోకు రాయను రాయా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నేస్తం" అనడం వ్యావహారికం. "నేస్తమ!" అనండి.

      తొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నీ యశమును కాపాడుచు
    నోయారమునౌ విధమున నుపచారములం
    జేయుచు నుండు సఖుని నను
    రా! యను, నను వీడిపోకురా యను! రాయా!

    రిప్లయితొలగించండి
  10. మేయరు వైన నీకతడు మిత్రుడు, నాహృదయమ్మునుండెనా
    లాయరు, నన్ను కాదని చిరాకుగ మాటలనాడు చుండెనే
    సాయము జేయుమా! యతని సన్నిధి కేగి, యభీష్ట యైన తా
    రా యను నన్ను వీడకుమురా యను, రాయ పరాయణోక్తులన్.

    రిప్లయితొలగించండి
  11. శ్రేయోభిలాషి వనుచును
    ప్రోయాలే పలికె, నీదు బోడిక యౌ యా
    లాయరు తో చెప్పుడు, తా
    రా యను నను వీడి పోకురా యను, రాయా

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నీ యశమున్ ప్రసిద్ధమగు నీ ప్రతిపత్తిని లోకమంతటన్
    సోయగమైన పద్థతిని సూటిగ వ్యాపనమొందజేయుచున్
    హాయిగ నిచ్చలున్ కదలు నాప్త సఖుండను నన్ను ప్రేమతో
    రా!యను,నన్నువీడకుమురా!యను, రాయ! పరాయణోక్తులన్.

    రిప్లయితొలగించండి
  13. సమస్య :
    రాయను ననువీడి పోకురా యను రాయా

    ( నిద్రలో కాలు తగిలిందని కోపించి రావటం మానిన శ్రీకృష్ణదేవరాయల వద్దకు చిన్నాదేవి పంపిన చెలికత్తె వచ్చి అంటున్నది . )

    కందము
    ...............

    మా యనుగుం జెలి చిన్నయె
    యా యపరాధం బొనరిచె ; నయినన్ సతమున్
    " గాయము నిదురన్ జేసితి ;
    రా ! " యను ; " నను వీడి పోకురా ! " యను; రాయా!

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. కె.వి.యస్. లక్ష్మి:

    మాయా మానుష రూపుడ!
    నీ యతులితమౌ నెనరుల నెంచుచు రాధే
    తీయగ పాడుచు కృష్ణా!
    రా! యను, నను వీడిపోకురా యను! రాయా!

    రిప్లయితొలగించండి
  16. హేయ మదేల యౌను తెగ యింతుల మానధ నంబునీవ కా
    త్యాయని పూజ సల్పితిని యాదవ భూషణ నిన్ను చేరగా
    మాయలు మానుమయ్య యిక మన్మథ బాధల నేగలేనురా
    రా! యను నన్ను వీడకుము రా యను రాయ పరాయణోక్తులన్.

    రిప్లయితొలగించండి


  17. టపటప పద్యములను దెప
    గుప రాయను! నన్ను వీడకుము! రాయను రా
    య పరాయణోక్తులన్, వల
    దు పత్ని పైకినుకయు వలదు వలదు వలదోయ్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. ఏయుగమందైననునే
    నీయనువర్తిని మురహర నీరజనాభా
    బాయక దరిచేరగరా
    రాయను ననువీడిపోకురాయనురాయా

    రిప్లయితొలగించండి
  19. మాయలు చేయకు కృష్ణా
    రేయీ పగలనకవివిధ రీతులయందున్
    తోయజనేత్రా పిలిచితి
    రాయని ననువీడిపోకురాయనురాయా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "రేయియు.. రీతులతోడన్.." అనండి.

      తొలగించండి
  20. (నాయికా విరహవేదనను నాయకునితో చెప్పుచున్న చెలికత్తె)...

    నీ యతులానురాగ తరుణీమణి ముగ్ధ వియోగమగ్న "యౌ
    రా" యను, "గన్నులారఁ గనరా" యను, "లోకులు విన్న నవ్విపో
    రా" యను, "జాగు సేయకుమురా" యను, "నీవొకసారి వచ్చి పో
    రా" యను, "నన్ను వీడకుమురా" యను రాయ! పరాయణోక్తులన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కంది శంకరయ్య
      చాలా బాగుందండీ.
      “రా” ను వదలక పదే పదే మీ నాయకి , చెలికత్తెతో పలికించిన విధానము అద్భుతమండీ

      తొలగించండి

  21. నిన్నటి పూరణ.

    పొందునుఁ గోరి వెంటఁ బడఁ బోకిరిమూక
    నిజాము సైనికుల్
    కొందరు రజ్వి కాశిములు,... కుందుచు నీ తెలగాణశౌర్యసు
    స్పందితసుందరీమణులు చయ్యన వారల శీలభంజనా
    నందనులన్ దహించిరఁట నాఁటి పురంధ్రులు శీలరక్షకై.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  22. ప్రేయసి రాసే లేఖ గా నా ప్రయత్నము:

    ఉ:
    దాయగ లేను నీ విరహ తాపము నోర్వగ లేనటంచు తా
    వ్రాయుచు పేమలేఖ మయి భారము మోయగ తల్లడిల్లుచున్
    తీయుచు కూనిరాగములు తీరుగ బల్కెను మాటిమాటికిన్
    రా యను నన్ను వీడకుమురా యను రాయ పరాయణోక్తులన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  23. ప్రేయసి ప్రియముగ ప్రియునితొ
    రా యను, నను వీడి పోకు, రా, యను, రాయా,
    నేయముగ నిన్ను కోరా
    ప్రాయము నీకే యను తను ప్రాధేయముగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రియునితొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.
      'నిన్ను కోరా' ?

      తొలగించండి
  24. రామ వియోగమున దశరథుని స్థితి

    పాయని ప్రేమబంధమున బాధను కుందుచు భూమి పైబడున్
    హా!యను, పాతకుండ! మునిహత్యను జేసిన శాపమే
    యనున్
    ఛీ! యను, కాముకుండనయి చేసితి ద్రోహము నీకు రామ యౌ
    రా!యను, నన్నువీడకుమురా! యను రాయ పరాయణోక్తులన్

    రిప్లయితొలగించండి
  25. కాయమున నిలువు నీవు, హ
    రా, యను నను వీడి పోకు, రా యను, రాయా
    ఆయువు నీకే, శరణము
    నీయు మను, వదలకము నను, నీవను మనసా

    రిప్లయితొలగించండి
  26. ఆ యమ నిన్నే వలచెను
    నీ యెడబాటునకు నిక్కి నిష్ఠురమాడెన్
    వాయపు మాటల నిక నే
    వ్రాయను నను వీడి పోకురా యను రాయా

    రిప్లయితొలగించండి
  27. మూయగలేరు మూతులను,ముందుగనాపగ బూతు మాటలన్
    వ్రాయగలేరు కావ్యములు,రాపిడినివ్వని వస్తుసంవిధిన్
    సాయముగానురారికను,సర్వము నాపగ రోగవిస్తృతిన్
    రాయనునన్నువీడకుమురాయనురాయపరాయణోక్తులన్
    +++++++++++++++++++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  28. విరహంతో తల్లడిల్లే శకుంతలను జూచి చెలికత్తెలు ఎంతకూ రాని రాజు దుష్యంతుని తలచుకొంటూ ...

    కందం
    సోయఁగమందిసుతునొసఁగ
    నీ యనురాగానురతిని నిద్దురనైనన్
    రోయు శకుంతల కావగ
    రా! యను నను వీడిపోకురా! యను రాయా!

    ఉత్పలమాల
    కోయిలకూజితమ్ములె శకుంతల పెండ్లికి మేళతాళముల్
    సోయఁగమంది సంతుఁగని సూడఁగ రావని కల్వరింతలన్
    నీ యనురాగమున్ గొనఁగ నిద్దురనైనను భామ "కావగా
    రా! " యను "నన్ను వీడకుము రా! "యను రాయ! పరాయణోక్తులన్

    రిప్లయితొలగించండి
  29. తోయజ నేత్రను గాంచుమ
    నీ యెదఁ జోటిమ్ము నాకు నెమ్మిని జాఁ గే
    లా యివ్విధమ్ముగా రా
    రా యను నను వీడి పోకురా యను రాయా


    రాయఁడ నిన్ను గాంచి వర రాజకుమారి మృగేంద్ర మధ్యయే
    వే యనురాగ మూని మది వింతగ నొక్క త్రుటిం జెలంగి తా
    సోయగ మందు గర్వమున సుందర గాత్ర సమేత యౌవన
    ప్రాయను నన్ను వీడకుమురా యను రాయ! పరాయణోక్తులన్

    [రాయ = రాయ బిరుదు కలవాఁడా]

    రిప్లయితొలగించండి
  30. ఓ యదునందన శౌరీ
    నీయడుగుల సడియె వినగ నిలచితి నోయీ
    మాయల మానసచోరా
    రా యను నను వీడిపోకురా యను రాయా!!!

    రిప్లయితొలగించండి
  31. రేయియె నవ్వె మాధవుడ లేతగ తాకెను పూలతావులే
    మాయలు చాలు, గోపికల మధ్యన యుంటివొ మర్చిరాధికన్
    గాయము లయ్యె నామదికి గమ్మున తీయగ వేణువూదుచున్
    రా, యను నన్ను వీడకుమురా యను రాయ పరాయణోక్తులన్!!!

    రిప్లయితొలగించండి
  32. మాయలమారివికృష్ణా!
    రాయనుననువీడీపోకు,రాయనురాయా!
    నీయానతికొఱకైయిట
    రాయిగనేనుంటిగదర రహిచెడికనుమా

    రిప్లయితొలగించండి
  33. నీ యనురాగ ప్రేమమయ నిర్మల రాగసుధాబ్ధి చంద్రికా
    శ్రీ యిసుమంతయైన యెద జేరిన బుద్ధి ప్రభాకరుండు స
    న్నాయిని మీటు చిత్తమను నట్టువ నాట్యము సల్పు వచ్చి పో
    *“రా!యను నన్ను వీడకుమురా యను రాయ పరాయణోక్తులన్”*

    రిప్లయితొలగించండి
  34. రాయనునన్నువీడకుమురాయనురాయపరాయణోక్తులన్
    నాయపరాధముల్గనక నన్నునుజూడుముదయామయుండవై
    నీయడుగుల్ శిరంబునను నిల్పుచుసేవలుసేయువాడనే
    పాయకయుండుమాయికను భద్రగీరీశుడ!రామ!నామదిన్

    రిప్లయితొలగించండి
  35. రాయనిగాంచగనె వలపు
    రాయని సుమశరములఝరి రాయిడివెట్టన్
    కాయము గాయము బాపుము
    రా! యను నను వీడి పోకురా యను రాయా!

    రిప్లయితొలగించండి