28-1-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వందే మాతర మనుట కువాక్యము సుకవీ”
(లేదా…)
“వందే భారతమాతర మ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ”
(26-1-2021 నాడు పట్వర్ధన్ గారి అష్టావధానంలో నేనిచ్చిన సమస్య…)
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:వందల్ వేలుగ భక్తులన్ గొనుచు వే బంధమ్ములన్ త్రెంచుచున్గందర్గోళము జాస్తిగా జరుపకే కంగారునున్ వీడుచున్సందేహమ్మిక లేక మాస్కు జనుచున్ జంబంపు సద్భక్తినిన్ వందే భారతమాతర మ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ...
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సరదా పూరణ అన్నారు కనుక 'గందర్గోళము' అనే అసాధు ప్రయోగం ఉపేక్షితం.
🙏
సందేహించకుమయ్యావందే మాతర మనుటకు ; వాక్యము ,సుకవీ, పొందిక పలుకు నలు దిశలనందున దేశపు ప్రతిభ ఘనంబౌ రీతిన్...భారతీనాథ్ చెన్నంశెట్టి...
విలక్షణమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. పద్యం ఎత్తుగడ 'సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను...' లవకుశ సినిమా పాటను గుర్తుకు తెచ్చింది.
విందులుసేయుటఘనమైచిందులనాడిరికుజనులుఛీయనవిజ్ఞుల్వందితదేశంబాయిదివందేమాతరమనుటకువాక్యముసుకవీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
27.01.2021అందరికీ నమస్సులు 🙏నా పూరణ ప్రయత్నం..*కం||*బందులు జేయుచు నిరతముమందును విడువంగ నెపుడు మనసే రాకన్చిందులు వేసెడి మనుజులు*“వందే మాతర మనుట కువాక్యము సుకవీ”**కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*🙏
పొందుగ పౌరులకు దగును వందే మాతర మనుట : కు వాక్యము సుకవీ నిందలు జేయుచు పలుకుట కందువ గాదది య నండ్రు గర్వము తోడన్
సమస్య :వందే భారతమాతర మ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ శార్దూలవిక్రీడితము ............................సందేశంబును " లోకమాన్యు" డిడెనే సద్వాక్యసంశోభతో ;డెందంబందున దేశభక్తి తొణుకన్ ;ఠేవల్ పిసాళింపగా ;సందేహంబుల పుట్టవంటి చపలుల్ షండాత్ములౌ వారికిన్ " వందే భారతమాతర " మ్మనుట దు ర్వాక్యంబగున్ సత్కవీ !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
నిందింపకు నాభూమిని సుందర వనములు ధరములు సూనలు గలనా సుందరభారతి బొగుడుచు వందే మాతరమనుట కువాక్యము? సుకవీ.
ఎందేఁజూచిననాంగ్లవాక్యములెవేర్వేరుల్పదాల్లేవులేఖాదీదుస్తులుగావులేమనిషియున్కాలుష్యపీతాంబరేపోందేలేనివిమాటలున్జనులుభావోద్వేగశోకంబుతోవందేభారతమాతరమ్మనుటదుర్వాక్యంబగున్సత్కవీ
ధన్యవాదాలండి
శార్దూలవిక్రీడితముఅందాలొల్కుచు మాయజేసి సతియే యానందమున్ జూపుచున్విందున్ గూర్చఁగఁ దల్లిఁదండ్రిఁగొనుచున్ వృద్ధాశ్రమాలందునన్గుందన్ద్రోసియు గొప్పవాడననుచున్ గొంతెత్తి సంఘంబునన్వందే భారతమాతరమ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంఅందమ్మగు సతిమాటలువిందొనరఁగఁ దల్లిదండ్రి వృద్ధాశ్రమమన్బందిగమునఁ గుందనునిచివందే మాతర మనుట కువాక్యము సుకవీ!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అందరు ప్రీతిగ నుండిరి వందే మాతర మనుటకు, వాక్యము- సుకవీడెందము నందున నుండగ వందల పద్యములు వచ్చి వరదగ పారెన్
కె.వి.యస్. లక్ష్మి: వందేమాతర మనుచును బందూకుల కెదురు నిలచి ప్రాణములొడ్డెన్నెందరొ, నాంగ్లేయులకున్వందేమాతరమనుట కువాక్యము సుకవీ!
శా:బందీ జేయుట నిశ్చయమ్ము లపనం బాహాట మీరీతినిన్చిందుల్ వేయ విదేశమందు, నతిగా చెన్నొందు నిచ్చోటగన్సందేహమ్మదియేల, నిట్లు బలుకన్ స్వాతంత్ర్య దేశమ్ము నన్వందే భారత మాతరమ్మనుట దుర్వాక్యంబగున్, సత్కవీ !లపనము = మాట్లాడుటవై. చంద్రశేఖర్
ధన్యవాదములు
నిందారోపణ యగునిదివందేమాతర మనుట కువాక్యము సుకవీ!నందనులకు పండుగ యగువందేమాతర మనుటకు వాక్యము సుకవీ!
ధన్యవాదములు గురుదేవా!నమస్సులు!🙏🙏🙏
అందరి బాధ్యత యంటిరివందే మాతర మనుట ; కువాక్యము సుకవీకొందరి భావన మందున,ఎందులకో యీయరమర యెరుక పరచుడీ
నిందారోపణలేల సేసెదవు నిన్నెవ్వండు పృచ్ఛించెనో ముందామాటలు మానకున్న నకృతాత్ముండంచు భావించుచున్ సందేహింతురు తీవ్రవాదివనుచున్ చాలించు ప్రేలాపనల్ వందే భారతమాతర మ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ?
సందేహించరు నీతిధర్మమను విశ్వాసమ్ముఁ జూపించ రేవిందో విత్తమొ సుందరీసుఖమునో బేరమ్ములం జేసి యాపందుల్ మాతృధరారహస్యములనున్ పంపించి"పాక్భూమినీంవందే" మా తరమ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ!కంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. సమస్యలో 'భారత' టైపు చేయడం మరచారు.
ధన్యవాదములు శంకరయ్యగారికిసవరణతోభారత్ అనే కవితో బుద్దిమంతుడొకడుసందేహించరు నీతిధర్మమను విశ్వాసమ్ముఁ జూపించ రేవిందో విత్తమొ సుందరీసుఖమునో బేరమ్ములం జేసి యాపందుల్ మాతృధరారహస్యములనున్ పంపించి"పాఙ్మాతరంవందే" భారత! మా తరమ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ!కంజర్ల రామాచార్య.
వందేహం భరతాంబికే భగవతీ ప్రజ్ఞాప్రశంసాత్మికేవందేమాతరనాదమోదజననీభావాంబరాకారిణీనందానందవిహారధాత్రియనుచున్న్యాయంబునమ్మేయుచో*“వందే భారతమాతర మ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ”*
బందూకందునబంధువందుననుసంబంధంబుదేశంబుపైనిందారోపణశత్రురాజ్యజయమైనీయంతరంగంబులోనందంబెందుకుబెట్టుసేసెదవుబుణ్యాత్మాప్రపంచానికై*“వందే భారతమాతర మ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ”*
సందేహించకమాతృదేశమున గోసల్వెట్టిగో సంపదన్,పందేరమ్ముగశక్తిసంపదనుదుర్వ్యాపారమార్గంబునన్చిందుల్ద్రొక్కుచుసోయిదప్పుచునుశ్రీచిత్తంబునేమార్చుచున్వందే భారతమాతర మ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీకొరుప్రోలు రాధాకృష్ణరావు
సందేహమేల కుజనులువిందు వినోదముల సొక్కి వెటకారముగాసందడిజేయుచు మత్తునవందే మాతర మనుట కువాక్యము సుకవీ
కందము నపద్య పాదములందున యారవ గణముగ, రాదగు నల, జ, ల్యందుచె పద మధ్యంబునవందే మాతర మనుట కువాక్యము సుకవీ
మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు. "...లందున నారవ.." అని ఉండాలి. 'జల్+అందు' అన్నపుడు యడాగమం రాదు. 'అందుచె' అని చే ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.
"హిందువులకె చెందును గదవందే మాతర మ"నుట కువాక్యము సుకవీఅందలి భావమెరుంగుముఅందరికిని తల్లి దేశ మదె సూనృతమౌ
బృందా!భయమా! యేలకొ?వందేమాతరమనుటకు,వాక్యముసుకవీ!డెందంబుహత్తువిధముగనందంబుగవ్రాయునెడల హర్షంబొదవున్
అందము చిందించును మాకందము భంగి నిల దెనుఁగు గారవ మొప్పన్ వందనము లిమ్ము తెనుఁగున వందే మాతర మనుటకు వాక్యము సుకవీ సందేహం బది యేల నిత్యము మహా శక్తిం బ్రదర్శింప దిక్సందోహమ్ము చలింపఁ జాగె నట యక్కాలమ్ము దౌర్భాగ్య కేళిం దుష్ట వ్రజ రాజ సంచయపు టాంగ్లే యాధిపత్యంబునన్ వందే భారతమాతర మ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
బృందా!తప్పనియంటివేగదయదిన్ భావ్యంబుగాదోచెనేవందేభారతమాతర,మ్మనుటదుర్వాక్యంబగున్ సత్కవీ!నిందారోపణజేయుచున్దఱచుదానేగొప్పవాడంచుటన్వందేమాతరమంచుబల్కుడికయాభవ్యంపుమాతన్రహిన్
ఎందరు జెప్పిన వినరేమందున మునుగుచు మనుదురు మారక యుండన్విందుల చిందులు వేయుచువందే మాతర మనుట కువాక్యము సుకవీ!!
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
వందల్ వేలుగ భక్తులన్ గొనుచు వే బంధమ్ములన్ త్రెంచుచున్
గందర్గోళము జాస్తిగా జరుపకే కంగారునున్ వీడుచున్
సందేహమ్మిక లేక మాస్కు జనుచున్ జంబంపు సద్భక్తినిన్
వందే భారతమాతర మ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసరదా పూరణ అన్నారు కనుక 'గందర్గోళము' అనే అసాధు ప్రయోగం ఉపేక్షితం.
🙏
తొలగించండిసందేహించకుమయ్యా
రిప్లయితొలగించండివందే మాతర మనుటకు ; వాక్యము ,సుకవీ,
పొందిక పలుకు నలు దిశల
నందున దేశపు ప్రతిభ ఘనంబౌ రీతిన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
విలక్షణమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపద్యం ఎత్తుగడ 'సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను...' లవకుశ సినిమా పాటను గుర్తుకు తెచ్చింది.
విందులుసేయుటఘనమై
రిప్లయితొలగించండిచిందులనాడిరికుజనులుఛీయనవిజ్ఞుల్
వందితదేశంబాయిది
వందేమాతరమనుటకువాక్యముసుకవీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి27.01.2021
రిప్లయితొలగించండిఅందరికీ నమస్సులు 🙏
నా పూరణ ప్రయత్నం..
*కం||*
బందులు జేయుచు నిరతము
మందును విడువంగ నెపుడు మనసే రాకన్
చిందులు వేసెడి మనుజులు
*“వందే మాతర మనుట కువాక్యము సుకవీ”*
*కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపొందుగ పౌరులకు దగును
రిప్లయితొలగించండివందే మాతర మనుట : కు వాక్యము సుకవీ
నిందలు జేయుచు పలుకుట
కందువ గాదది య నండ్రు గర్వము తోడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండివందే భారతమాతర మ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ
శార్దూలవిక్రీడితము
............................
సందేశంబును " లోకమాన్యు" డిడెనే
సద్వాక్యసంశోభతో ;
డెందంబందున దేశభక్తి తొణుకన్ ;
ఠేవల్ పిసాళింపగా ;
సందేహంబుల పుట్టవంటి చపలుల్
షండాత్ములౌ వారికిన్
" వందే భారతమాతర " మ్మనుట దు
ర్వాక్యంబగున్ సత్కవీ !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినిందింపకు నాభూమిని
రిప్లయితొలగించండిసుందర వనములు ధరములు సూనలు గలనా
సుందరభారతి బొగుడుచు
వందే మాతరమనుట కువాక్యము? సుకవీ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎందేఁజూచిననాంగ్లవాక్యములెవేర్వేరుల్పదాల్లేవులే
రిప్లయితొలగించండిఖాదీదుస్తులుగావులేమనిషియున్కాలుష్యపీతాంబరే
పోందేలేనివిమాటలున్జనులుభావోద్వేగశోకంబుతో
వందేభారతమాతరమ్మనుటదుర్వాక్యంబగున్సత్కవీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండి
తొలగించండిశార్దూలవిక్రీడితము
రిప్లయితొలగించండిఅందాలొల్కుచు మాయజేసి సతియే యానందమున్ జూపుచున్
విందున్ గూర్చఁగఁ దల్లిఁదండ్రిఁగొనుచున్ వృద్ధాశ్రమాలందునన్
గుందన్ద్రోసియు గొప్పవాడననుచున్ గొంతెత్తి సంఘంబునన్
వందే భారతమాతరమ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికందం
తొలగించండిఅందమ్మగు సతిమాటలు
విందొనరఁగఁ దల్లిదండ్రి వృద్ధాశ్రమమన్
బందిగమునఁ గుందనునిచి
వందే మాతర మనుట కువాక్యము సుకవీ!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఅందరు ప్రీతిగ నుండిరి
రిప్లయితొలగించండివందే మాతర మనుటకు, వాక్యము- సుకవీ
డెందము నందున నుండగ
వందల పద్యములు వచ్చి వరదగ పారెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండివందేమాతర మనుచును
బందూకుల కెదురు నిలచి ప్రాణములొడ్డె
న్నెందరొ, నాంగ్లేయులకున్
వందేమాతరమనుట కువాక్యము సుకవీ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశా:
రిప్లయితొలగించండిబందీ జేయుట నిశ్చయమ్ము లపనం బాహాట మీరీతినిన్
చిందుల్ వేయ విదేశమందు, నతిగా చెన్నొందు నిచ్చోటగన్
సందేహమ్మదియేల, నిట్లు బలుకన్ స్వాతంత్ర్య దేశమ్ము నన్
వందే భారత మాతరమ్మనుట దుర్వాక్యంబగున్, సత్కవీ !
లపనము = మాట్లాడుట
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండినిందారోపణ యగునిది
రిప్లయితొలగించండివందేమాతర మనుట కువాక్యము సుకవీ!
నందనులకు పండుగ యగు
వందేమాతర మనుటకు వాక్యము సుకవీ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా!నమస్సులు!🙏🙏🙏
తొలగించండిఅందరి బాధ్యత యంటిరి
రిప్లయితొలగించండివందే మాతర మనుట ; కువాక్యము సుకవీ
కొందరి భావన మందున,
ఎందులకో యీయరమర యెరుక పరచుడీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిందారోపణలేల సేసెదవు నిన్నెవ్వండు పృచ్ఛించెనో
రిప్లయితొలగించండిముందామాటలు మానకున్న నకృతాత్ముండంచు భావించుచున్
సందేహింతురు తీవ్రవాదివనుచున్ చాలించు ప్రేలాపనల్
వందే భారతమాతర మ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసందేహించరు నీతిధర్మమను విశ్వాసమ్ముఁ జూపించ రే
రిప్లయితొలగించండివిందో విత్తమొ సుందరీసుఖమునో బేరమ్ములం జేసి యా
పందుల్ మాతృధరారహస్యములనున్ పంపించి"పాక్భూమినీం
వందే" మా తరమ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ!
కంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసమస్యలో 'భారత' టైపు చేయడం మరచారు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిధన్యవాదములు శంకరయ్యగారికి
తొలగించండిసవరణతో
భారత్ అనే కవితో బుద్దిమంతుడొకడు
సందేహించరు నీతిధర్మమను విశ్వాసమ్ముఁ జూపించ రే
విందో విత్తమొ సుందరీసుఖమునో బేరమ్ములం జేసి యా
పందుల్ మాతృధరారహస్యములనున్ పంపించి"పాఙ్మాతరం
వందే" భారత! మా తరమ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ!
కంజర్ల రామాచార్య.
వందేహం భరతాంబికే భగవతీ ప్రజ్ఞాప్రశంసాత్మికే
రిప్లయితొలగించండివందేమాతరనాదమోదజననీభావాంబరాకారిణీ
నందానందవిహారధాత్రియనుచున్న్యాయంబునమ్మేయుచో
*“వందే భారతమాతర మ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ”*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిబందూకందునబంధువందుననుసంబంధంబుదేశంబుపై
రిప్లయితొలగించండినిందారోపణశత్రురాజ్యజయమైనీయంతరంగంబులో
నందంబెందుకుబెట్టుసేసెదవుబుణ్యాత్మాప్రపంచానికై
*“వందే భారతమాతర మ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ”*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసందేహించకమాతృదేశమున గోసల్వెట్టిగో సంపదన్,
రిప్లయితొలగించండిపందేరమ్ముగశక్తిసంపదనుదుర్వ్యాపారమార్గంబునన్
చిందుల్ద్రొక్కుచుసోయిదప్పుచునుశ్రీచిత్తంబునేమార్చుచున్
వందే భారతమాతర మ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ
కొరుప్రోలు రాధాకృష్ణరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసందేహమేల కుజనులు
రిప్లయితొలగించండివిందు వినోదముల సొక్కి వెటకారముగా
సందడిజేయుచు మత్తున
వందే మాతర మనుట కువాక్యము సుకవీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందము నపద్య పాదము
రిప్లయితొలగించండిలందున యారవ గణముగ, రాదగు నల, జ, ల్
యందుచె పద మధ్యంబున
వందే మాతర మనుట కువాక్యము సుకవీ
మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి"...లందున నారవ.." అని ఉండాలి. 'జల్+అందు' అన్నపుడు యడాగమం రాదు. 'అందుచె' అని చే ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.
"హిందువులకె చెందును గద
రిప్లయితొలగించండివందే మాతర మ"నుట కువాక్యము సుకవీ
అందలి భావమెరుంగుము
అందరికిని తల్లి దేశ మదె సూనృతమౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబృందా!భయమా! యేలకొ?
రిప్లయితొలగించండివందేమాతరమనుటకు,వాక్యముసుకవీ!
డెందంబుహత్తువిధముగ
నందంబుగవ్రాయునెడల హర్షంబొదవున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందము చిందించును మా
రిప్లయితొలగించండికందము భంగి నిల దెనుఁగు గారవ మొప్పన్
వందనము లిమ్ము తెనుఁగున
వందే మాతర మనుటకు వాక్యము సుకవీ
సందేహం బది యేల నిత్యము మహా శక్తిం బ్రదర్శింప ది
క్సందోహమ్ము చలింపఁ జాగె నట యక్కాలమ్ము దౌర్భాగ్య కే
ళిం దుష్ట వ్రజ రాజ సంచయపు టాంగ్లే యాధిపత్యంబునన్
వందే భారతమాతర మ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిబృందా!తప్పనియంటివేగదయదిన్ భావ్యంబుగాదోచెనే
రిప్లయితొలగించండివందేభారతమాతర,మ్మనుటదుర్వాక్యంబగున్ సత్కవీ!
నిందారోపణజేయుచున్దఱచుదానేగొప్పవాడంచుటన్
వందేమాతరమంచుబల్కుడికయాభవ్యంపుమాతన్రహిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎందరు జెప్పిన వినరే
రిప్లయితొలగించండిమందున మునుగుచు మనుదురు మారక యుండన్
విందుల చిందులు వేయుచు
వందే మాతర మనుట కువాక్యము సుకవీ!!