రాముని వంశ పెద్ద రఘు రాజుకు తాతకు తాత తాతకున్ కామము తీర్చగన్భువికి కారుచు ధారగ హోరు హోరుగ న్సోముని చెంత చేరి, తలనొప్పుచు గంగమ భక్తి మొక్కగన్ కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్”
నాట్యమాడుటకు తప్పని సరిగా కాలికి మువ్వలు ధరిస్తారు. పెండ్లికి ముందు తాను నాట్యకళాకారిణి గా కొనసాగుటకు పట్టుబట్టి ఒప్పుకొన జేసి, భర్తకు ఆమె మువ్వలే శ్రేష్ఠము అని చెప్పే ఈ ప్రయత్నము:
ఉ:
భామిని నాట్య శాస్త్రమును భక్తి ప్రపత్తుల కోర్చి నేర్చుచున్ నీమము మేర నృత్యములు నిష్ఠగ జేయుచు వృద్ధి నొందగన్ మామను పెండ్లియాడె తన మాటకు సమ్మతి వెల్లడించగన్ కామిని నూపురంబలరె కాంతునకున్ తల మానికంబుగన్
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
ధీమతి జూడగన్ పడక దిండున నెత్తిడు భర్తగారినిన్
గోముగ రాగ దగ్గరకు కోరిక తీరగ ప్రేమజూపగన్
చీమను జూచి చిందులిడి చెన్నుగ తన్నగ భర్తనెత్తినిన్
కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్...
తొలగించండి* చూడగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భర్త శీర్షమున్' అంటే బాగుంటుందేమో?
🙏
తొలగించండిభామినిసత్యగచూడగ
రిప్లయితొలగించండిఆమనికోకిలగళముననాదరమోప్పన్
కామితభూదేవతగను
కామినినూపురమలరెనుకాంతునితలపై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభామిని రుక్మిణి కిచ్చెను
రిప్లయితొలగించండిసామియె పారిజమటంచు సంజ్వరమున యా
భామయె కృష్ణుని తన్నగ
కామిని నూపురమలరెను కాంతుని తలపై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సంజ్వరమున నా భామయె...'
రాముని వంశపు పెద్దలు
రిప్లయితొలగించండిసామము గంగను పిలవగ చక చక ధారై
సోముని సరసన నిలవగ
కామిని నూపుర మలరెను కాంతుని తలపై”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభామిని యలుకను మాన్పగ
రిప్లయితొలగించండికామితముగ కృష్ణు డపుడు కాళ్ళను దాకన్
కామాక్షి తన్నె నయ్యెడ
కామిని నూపుర మలరెను కాంతుని తలపై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏమనిణజెప్పగావలయునేర్పునబ్రహ్మయునింతిఁజెక్కెగా
రిప్లయితొలగించండిభామినిభావ్యసంపదనుపావనియయ్యెనుబిడ్డనిచ్చుచున్
వామకురెండుకత్తులునువాసిగవ్రుత్తియువంటవార్పునున్
కామినినూపురంబలరెగాంతునకున్దలమానికంబునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి1వపాదంలోణతప్పుగాఅచ్చైనది
రిప్లయితొలగించండిఏమనువాఁడ? దారకుని నేయఁగ దుర్గయె కాళికాంబయై
రిప్లయితొలగించండిభీమ పరాక్రమం బెసఁగ భీషణ రూపున సంచరించుచున్
స్వామిని శంకరున్ గనక చప్పునఁ ద్రొక్కిన వేళఁ జూడఁగన్
కామిని నూపురంబలరె కాంతునకున్ తలమానికంబుగన్.
మనోహరమైనపూరణ, ప్రణామములుగురువుగారు
తొలగించండిచక్కని పూరణండీ🙏🏻
తొలగించండిపారిజాతాపహరణము వృత్తాంత పరంగా ........
రిప్లయితొలగించండికోపంగా ఉన్న సత్యభామను అనునయించబోతున్న శ్రీకృష్ణునికి సత్యభామయొక్క పాదము తగిలిన సన్నివేశము...........
ప్రేమమనోహరీ ప్రణయ వీచికలన్ గణియింపవేల నౌ
రా! మరి నన్ను గాంచవు పరాకుగ నుండెదవేల నేడు నీ
మోమది వాడెనేల యని ముద్దుగ బల్కెడు కృష్ణుఁ దన్నగా
కామిని నూపురంబలరె కాంతునకున్ తలమానికంబుగా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరాముని వంశ పెద్ద రఘు రాజుకు తాతకు తాత తాతకున్
రిప్లయితొలగించండికామము తీర్చగన్భువికి కారుచు ధారగ హోరు హోరుగ
న్సోముని చెంత చేరి, తలనొప్పుచు గంగమ భక్తి మొక్కగన్
కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
( రఘువుకు తాత, తాత, తాత .. భగీరధుడు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగ్రామము లోన నాటకము రమ్యముగా కొనసాగుచుండగన్
రిప్లయితొలగించండిభామగ వేసినట్టి యొక పాటల గంధి మగండు కృష్ణునిన్
దామసమంది దుఃఖమున తన్నెడు పాళమునందు జారి యా
కామిని నూపురం బలరె గాంతునకున్ దలమానికంబుగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభామిని కిన్కజూపు ముఖభంగిమ వేడ్కను గూర్చగావడిన్
రిప్లయితొలగించండిప్రేముడిమీరగా గదిసి " ప్రేయసి నీపద దాసుడన్ గదా
మోమది కందెనే "యనుచు ముద్దిడబోవగ పాదమున్ భళా
కామిని నూపురంబలరె కాంతునికిన్ తలమానికంబుగన్
క్షేమము నెంచి నాథునికి శీర్షమునందున హెల్మెటేర్పడన్
తొలగించండిప్రేమగ పుట్టినింటిదగు పెన్నిధి లోనివి కాలిపట్టెలన్
సీమ దుకాణమందునను సేలును జేయుచు సొమ్ముగూర్చగన్
కామిని నూపురంబలరె కాంతునికిన్ తలమానికంబుగన్
లేమను గూడుచు శారద
తొలగించండియామిని బృందావనమున హాసముతోడన్
స్వామియె ముద్దిడ పాదము
కామిని నూపుర మలరెను కాంతుని తలపై
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికాముని పున్నమి రాతిరి
రిప్లయితొలగించండిభామిని పతితో సరసము బరపుచునుండన్
కామప్రేరేపణమున
కామిని నూపుర మలరెను కాంతుని తలపై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిభామిని యలకలఁ జెలఁగగ
యామినిలో కృష్ణమూర్తి యనునయమునకున్
గోముగ కదలాడంగన్
కామిని నూపుర మలరెను కాంతుని తలపై!
ఉత్పలమాల
ఆ ముని నారదుండు హరి యాయమ రుక్మిణి సత్యభామలున్
శేముషిఁ దిమ్మనార్యుల విశేష కథాగమనంపు పాత్రలై
ధీమతి కృష్ణరాయల విధేయతఁ దీర్చిన కావ్యసీమలో
కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండినాట్యమాడుటకు తప్పని సరిగా కాలికి మువ్వలు ధరిస్తారు. పెండ్లికి ముందు తాను నాట్యకళాకారిణి గా కొనసాగుటకు పట్టుబట్టి ఒప్పుకొన జేసి, భర్తకు ఆమె మువ్వలే శ్రేష్ఠము అని చెప్పే ఈ ప్రయత్నము:
రిప్లయితొలగించండిఉ:
భామిని నాట్య శాస్త్రమును భక్తి ప్రపత్తుల కోర్చి నేర్చుచున్
నీమము మేర నృత్యములు నిష్ఠగ జేయుచు వృద్ధి నొందగన్
మామను పెండ్లియాడె తన మాటకు సమ్మతి వెల్లడించగన్
కామిని నూపురంబలరె కాంతునకున్ తల మానికంబుగన్
తలమానికము= శ్రేష్ఠము
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండికామిని నూపురం బలరె
గాంతునకున్ దలమానికంబుగన్
( గగనగంగ అవతరణాన్ని గౌరీదేవికి వివరిస్తున్న నారదుడు )
ఉత్పలమాల
....................
ఏమని విన్నవింతు పర
మేశ్వరు రాణివి నీకు నిప్పుడున్ ?
గోమలి ! దేవగంగ ప్రభు
గోరిక దీర్పగ చండవేగియై
భూమికి దూకుచున్నయది ;
ముచ్చట గొల్పుచు తళ్కులీను నా
కామిని నూపురం బలరె
గాంతునకున్ దలమానికంబుగన్ .
( ప్రభు గోరిక - భగీరథుని కోరిక )
అద్భుతమైనసహజమైనపూరణ, ప్రణామములుగురువుగారు
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిస్వాములవారి నమ్ముకుని సంతతికోసమె సంప్రదించగా
రిప్లయితొలగించండిపాముపడంగవిప్పినటు,పాపమునామెను చేరరమ్మనెన్
కోమలి కోపతాపమున,కొంగుబిగించుచు జుట్టుబట్ట నా
కామునినూపురంబలరె,కాంతునికిన్ తలమాణికంబుగన్
+++++++++++++++++
రావెల పురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిభామా విలాప మదిగో
కామిని నూపుర మలరెను; కాంతుని తలపై
నీమము తప్పక భారము
శ్యామల రాయా పడెను! ప్రశాంతత పోయెన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిచేతి చమురు వదిలె :)
అలకల పాన్పదియె! గలగ
లల కామిని నూపురం బలరెఁ; గాంతునకున్
దలమానికంబుగన్ రొం
పి, లావు గా క్రెడిటు కార్డు బిల్లు జిలేబీ :)
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రీమాహేశ్వరి సేవగ
రిప్లయితొలగించండిఆ మాతకు ముడుపు మోసె యానందముగన్
నామము లనుచు కదల, శివ
కామిని నూపుర మలరెను కాంతుని తలపై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభామినితోడ కూడి కడు పచ్చగ నిల్చిన జొన్నచేనులో
రిప్లయితొలగించండికాముని కేళిలో మునిగి కాంచుచు నుండగ మోదమత్తరిన్
గోముగ కన్నుగీటుచును కొమ్మయు పొర్లుచు రెచ్చగొట్టగా
కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్
అసనారె
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభామయె దుర్గయై మగడు భవ్య మనస్కుడు శంకరుండునై
రిప్లయితొలగించండిక్షేమముగోరగానెపుడుజిందులువేసెడుదారదారకున్
జీమగనెంచిసారగొనిచెంతకుజేరియుగాళియైనయా
*“కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్”*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసోముడు రోహిణీవిభుడు జూడడటంచును దక్షుజేరెనా
రిప్లయితొలగించండిస్వామిని నన్నుజేర్చుమని ప్రార్థన జేయగ పుత్రికోసమే
సోము శపించె క్షీణువయి స్రుక్కగ శంభు శిరంబు నెక్కెమా
*“కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్”*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాముకుడైన వల్లభుడు గాంతను జెంతకు చేరదీసి యో
రిప్లయితొలగించండిభామిని త్రాగుబోతునని పల్కకు దూరకు మంచు ప్రేమతో
దామరకంటిగంటి ముగుదా! ముదమందగ భూషతొడ్గగా
*“కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్”*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికోమలమైన పాదమని కోరికతో సఖి పాదపద్మమున్
రిప్లయితొలగించండిప్రేమను ముద్దుపెట్టుకొన ప్రేయసి యుల్లముపొంగి వాంఛలన్
గోముగ పాదమున్ కదుప గుల్ఫము నాథు తలందు త్రాకనా
*“కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిస్వామిశిరోవిభూషణశశాంకకళాకమనీయభాగమో
యేమొ! యనన్?, మనోజ్ఞపరమేశకపర్ధవిరాజమానమై,
వ్యోమధునీపదాంబుజవిభూషితఘల్ఘలరావరమ్యమై
కామిని నూపురం బలరెఁ, గాంతునకున్ దలమానికంబుగన్.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభామ పదములూనె నఖము
రిప్లయితొలగించండికాముని కేళితమకమున కామిత రీతిన్
లేమ ముడువ కాలు నపుడు
కామిని నూపుర మలరెను కాంతుని తలపై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏమనిజెప్పుదునారద!
రిప్లయితొలగించండికామినినూపురమలరెను కాంతునితలపై
కామినియనగనునెఱుగుమ
యామెయెయాసత్యభామ యాపనిజేసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏ మగువ సైప నోపును
రిప్లయితొలగించండిగాముకుఁడౌ స్వీయ భర్తఁ గన నివ్విధి నా
భామకుఁ గలిగెను రోతయె
కామిని నూపుర మలరెను కాంతుని తలపై
[కామిని: ఇక్కడ వేశ్య]
ప్రేమ గలట్టి చోటునను వింతయె నిందలు గూడ నొప్పులౌ
క్షేమము గూర్తు రింపుగను జింత వహింపక వారి కెప్పుడున్
భామిని సత్యభామ పతి వామ పదమ్మునఁ దన్నఁ గిన్కమై
కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఏమా లాస్య విలాసము
రిప్లయితొలగించండిప్రేమామృత రాగ ధార వీక్షిత హేలా
రామపు నాట్యం బందున
కామిని నూపుర మలరెను కాంతుని తలపై!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభామినిసత్యభామకసిబాదమునెత్తుచుదన్నగాదలన్
రిప్లయితొలగించండిగామినినూపురంబలరె గాంతునకున్దలమానికంబుగన్
గోమునబల్కెనప్పుడటకోపముపోయెనె?చెప్పుమావడిన్
బ్రేమముమీరదెత్తుసుమవృక్షముచూడుమ యీక్షణంబునన్
ప్రేమము మీర దంపతులు వెన్నెల రేయి సమాగమంబునన్
రిప్లయితొలగించండికాముని ప్రేరణంబు నభిగాముకులై చరలాడు వేళలో
హేమ విభూషణం బపసరిల్లి పయిన్ బడ జూడ నత్తరిన్
కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్
ప్రేమలకుడిచిన భామిని
రిప్లయితొలగించండిక్షేమం బరసిన ప్రియుడట కేలునుమోడ్చెన్
కోమల విలసిత చేష్టల
కామిని నూపుర మలరెను కాంతుని తలపై!!
శ్రీమాతంగియె గిరిపై
రిప్లయితొలగించండిప్రేమముతో నాట్యమాడ పెనిమిటి తోడన్
కోమల భంగిమ లందున
కామిని నూపురమలరెను కాంతుని తలపై!!!
ఆముని పారిజమొసగగ
రిప్లయితొలగించండితాముడువగరుక్మిణియును తపనయు హెచ్చన్
భామయు కినుకను బూనగ
కామిని నూపుర మలరెను కాంతుని తలపై