9, జనవరి 2021, శనివారం

సమస్య - 3599

 10-1-2021 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పుస్తకమ్ములు ఖర భూషణములు”

(లేదా…)

“పుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్”

http://kandishankaraiah.blogspot.com

40 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    జాస్తిగ రూకలన్ గొనగ జంబము మీరగ వేలమందునన్
    పస్తును బెట్టగా తనరి పాపము నొల్లక చైలధావుడే
    చస్తును బ్రత్కుచున్ విసిగి చాకలి గాడిద మోయుచుండగా
    పుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్..

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    నేస్తుల తోడ బాలకుడు నిండుగనాడి పరీక్ష రాగనున్
    మస్తుగ తిండి మేయుచును మంచిగ త్రాగుచు మెండు మజ్జిగన్
    కాస్తయు ప్రీతినిన్ గనక గాడిద చాకిరి యంచు నెంచగా
    పుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్...

    రిప్లయితొలగించండి
  3. ఆటవెలది
    నేర్చినట్టి విద్య కూర్చ సద్యశముల
    నుచిత గ్రంథ పఠనముత్తమమ్ముఁ
    బనికి మాలినట్టి పాఠకులన బూతు
    పుస్తకమ్ములు ఖర భూషణములు

    ఉత్పలమాల
    మస్తకమందవిజ్ఞతల మాపెడువంచన గ్రంథరాజముల్
    నిస్తులముల్ గొనంగఁదగు నేర్వఁగ నేర్పఁగమంచినెల్లెడన్
    దుస్తరమై నిరర్థకము దుష్పరిణామపు బూతు నేర్పెడున్
    బుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి
  4. పనికి రాని వగుచు పఠియించ రానట్టి
    చెత్త వ్రాత లగుచు చెడును బెంచు
    వక్ర బుద్ధి నిచ్చు వస్తువు కలిగిన
    పుస్తకమ్ము లు ఖర భూషణములు

    రిప్లయితొలగించండి
  5. పుస్తకమ్ములు కర భూషణ మని చెప్పె
    నుక్తలేఖనమ్ము నొజ్జ యొకడు
    పాలసుండొకండు వ్రాసెనీ రీతిగా
    పుస్తకమ్ములు ఖర భూషణములు

    రిప్లయితొలగించండి
  6. నెట్టునీకునుండనేరమేకాదుగా
    గూగులమ్మకనగకూర్మితోడ
    మెదడుమేతకోఱకుమేధావివెదుకగా
    పుస్తకమ్ములుఖరభూషణములు

    రిప్లయితొలగించండి
  7. హస్తమునందుపుస్తుకపుహంగునుచూపకసెల్లుపట్టెగా
    విస్తునుబోయిబ్రహ్మయునువింతగఁజూచెనుమాటలమ్మనున్
    మస్తుగవేదమున్నదిగనాలుగుమూలలవార్తలున్నవే
    పుస్తుకముల్గనన్ఖరభూషణముల్గదయెంచిచూడగన్

    రిప్లయితొలగించండి


  8. హస్త వాసి గల మహాకవివరుడత
    డయ్యె! వ్రాయగా పరాకుగా హ
    యారె అచ్చు తప్పు గా క ఖ గామారె
    "పుస్తకమ్ములు ఖర భూషణములు"



    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. సీత రాముల కథ చెప్పరు, ఘజనీలు

    గోరిలు కధ చెవుల ఘోషవెట్టు

    రా , మెకాలె చదువు ప్రతిబింబమగు పాడు

    పుస్తకమ్ములు ; ఖర భూషణములు

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  10. పుస్తకముల్ గనన్ కర విభూషణముల్ గద యంచు పల్లిలో
    శాస్తయె యుక్తలేఖనము ఛాత్రుల కోసము చెప్పగా నటన్
    నాస్తిక వాదియైన శివనందుడనే శిశువిట్లు వ్రాసెనే
    పుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి
  11. నేటి చదువు చూడ నేస్తమా!భయమౌను బరువు సంచి,యూనిఫారము, గన నోటు బుక్కు లన్ని నూత్న వినూత్న ముల్
    పుస్తకమ్ములు ఖర భూషణములు

    రిప్లయితొలగించండి
  12. బస్తిని కార్పొరేటులని భారిగఫీజులదండు స్కూళ్ళలో
    ఆస్తులనమ్మి తండ్రి నను హాజరుపర్చగ గొప్పకోసమై
    చస్తిని మోయలేకనిటు! సంచికినిండుగ కుక్కియున్నవౌ
    పుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచిచూసినన్

    రిప్లయితొలగించండి
  13. మస్తుగచెత్తబోసిమనమందునరావణకాష్ఠమోయనన్
    విస్తృతనింద్యహేయమయవింతవిచారమువేషభాషణల్
    ప్రస్తుతిజేసినాస్తికతవాదమువేదమటంచునేర్పెడా
    *“పుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్”*

    రిప్లయితొలగించండి
  14. మస్తకమందుచిచ్చుమిసిమాన్యులదూరిచిరాకుపెంచియున్
    విస్తృతమైనప్రాచ్యవిధివేషముభూషలువింతపోకడల్
    పుస్తకమందువ్రాసిఘనమూర్ఖులుమెచ్చెడుమూర్తిమత్వపున్
    *“పుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్”*

    రిప్లయితొలగించండి
  15. గురువు జెప్పిన సూక్తుల గౌరవించి
    వ్రాసె,శిశ్యుడొకడు రయముగాను
    తప్పునెరుగక యక్షర మొక్కటేను
    పుస్తకమ్ములు ఖర భూషణములు!!

    రిప్లయితొలగించండి
  16. సమస్య :
    పుస్తకముల్ గనన్ ఖరవి
    భూషణముల్ గద యెంచి చూడగన్

    ( సద్గ్రంథం కరభూషణం - దుర్గ్రంథం ఖరభూషణం )

    పుస్తక మెప్పుడైన మన
    పొంతనె యుండెడి మిత్రుడే సుమా !
    మస్తకమంత బాగుపడు ;
    మంచికి మార్గము లుద్భవిల్లెడిన్ ;
    నిస్తులహస్తభూషణము ;
    నేరపు దూష్యపు గామభావపుం
    బుస్తకముల్ గనన్ ఖరవి
    భూషణముల్ గద యెంచి చూడగన్ .

    రిప్లయితొలగించండి
  17. ఆవె.
    మోత బరువదేల ముయ్యీడు నందున
    కేలు బట్టి నడచు బాలకునకు?
    బుద్ధి పెరుగుటేమొ, మొద్దుబారు తనువు
    పుస్తకమ్ములు ఖర భూషణములు.

    ఉ.
    ఆస్తులు లేకయున్నను సమంచిత రీతిన కన్నబిడ్డలన్
    ప్రస్తుత పాఠశాలలకు పంపగ నెంచెడి భార్యభర్తలున్
    పుస్తెలహారమమ్మి యిక పుస్తక భారము తోడ బాలునిన్,
    పుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి
  18. బుద్ధి పెరుగదాయె బుక్కులు మోసిన
    మోతవలనతెలివి మొద్దు బారు
    గురువులేలనింక గూగులు చాలును
    పుస్తకమ్ములు ఖర భూషణములు

    రిప్లయితొలగించండి
  19. కొత్త పదములున్న నొత్తి పలుకుచుండు
    బాలకునికి నవ్య వాక్యమొకటి
    వ్రాసి చదువుమనగ వాచించె నిట్టుల
    “పుస్తకమ్ములు ఖర భూషణములు”

    రిప్లయితొలగించండి
  20. వత్తులు మరవకని యొత్తిచెప్పగ, విని

    టీ వి యమ్మడు బహు ఠీవిగాను

    కరమునొత్తి చదవగ నుడి మార్చి పలికె

    పుస్తకమ్ములు ఖర భూషణములు

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  21. పండితోత్తములకుపద్యము మెచ్చెడిన్
    పూర్తిజేయ నవియుభూషణములు
    విలువలేని మోయు విద్యను నేర్పించు
    పుస్తకమ్ములు ఖర భూషణములు

    రిప్లయితొలగించండి
  22. ఆ.వె//
    కామితార్ధమొసగు గాయత్రిమాయమ్మ
    పద్మయోనితోటి పయనమగుచు l
    వేదవిద్య నొసగు వేదమాతకెపుడు
    పుస్తకమ్ములు ఖర భూషణములు ll

    రిప్లయితొలగించండి
  23. ఆస్తులు మెండుగా గలిగి యంగజమెక్కి విదేశమేగగన్
    కాస్త తెలుంగు గుర్తెరుగ గాకర గీకర గా వచించగన్
    వాస్తవ మిద్దియేనుమరి వానికి యిచ్చిన యాంధ్ర భాషలో
    పుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి
  24. నిన్నటి పూరణ

    కర్మ మవశ్యభోజ్యమని కాద! సుధీవచనమ్ము నయ్యదే
    ధర్మము నా యెడన్ దనరె, దాష్టికవర్తనతోడఁ బుట్టితే!
    దుర్మతివై, కటా! జనులుఁ దూలగఁ బొమ్మన లేను పుత్ర! దు
    ష్కర్మము నీదు రూపమున కన్నుల ముందఱ నిల్చె నొప్పుగన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  25. ప్రస్తుతకాలమిట్లగుట భావ్యమె పోకిరిమూకఁజేరి
    యా
    నేస్తుల సాహచర్యమున నీచవిగర్హితజాతిభ్రష్టులై
    నిస్తులమత్తునన్ మునిగి నేర్పు గడించని ఛాత్రులందు నీ
    పుస్తకముల్ గనన్ ఖరవిభూషణముల్ గద యెంచి చూడఁగన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  26. ఉ:

    వాస్తవమెంచి నేడు నలవాటు నొనర్చిరి జ్ఞాన యంత్రమున్
    నేస్తముకన్న మిన్న యని నిక్కము వీడరు తోడు నెవ్విధిన్
    స్వస్తి ఘటింప చక్కనగు సాధనమై చదువంగ పొత్తమున్
    పుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడగన్

    జ్ఞాన యంత్రము =Computer

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  27. నేటి విద్య తోడ నిస్సత్తువ సెలఁగు
    విద్య మాట నింక వేలు పెఱుఁగుఁ
    బిల్ల లైరి మోసి వీపున ఖరములు
    పుస్తకమ్ములు ఖర భూషణములు


    దుస్తులు వస్తు జాలములు తోరము కా గృహ మందు దాఁచగం
    బుస్తక సంచయమ్మునకు బొక్కస మెక్కడ నుండు తల్చఁగన్
    విస్తృతమై బయల్పడ భువిన్ వలలోఁగలి పాఠకాలికిం
    బుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్

    [ఖరము = వేడిమి; వలలోఁగలి = అంతర్జాలము]

    రిప్లయితొలగించండి
  28. అడ్డగాడిదలకు హస్తభూషణములు
    పుస్తకమ్ములు,ఖరభూషణములు
    బరువుకలుగుపెద్ద బస్తాలనికరము
    ఖరముమేలుసేయు కరముమనకు

    రిప్లయితొలగించండి
  29. మస్తకములపైన పుస్తకములసంచి
    నడుములొంగిపోవ నడుచుకొనుచు
    బడికివెళ్ళు బాలబాలికా మణులకు
    పుస్తకమ్ములు ఖర భూషణములు

    రిప్లయితొలగించండి
  30. విస్తృతమైన జ్ఞానమును విశ్వము నెల్లెడ పంచుచున్ సదా
    పుస్తకముల్ వెలుంగవలె స్ఫూర్తిని గూర్చుచు మానవాళికిన్
    మస్తకమందు జ్ఞాన మణు మాత్రము నింపని వ్యర్ధమైనవౌ
    పుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి
  31. మస్తుగ వచ్చునాకురమ! మత్తునుగూడిన నిద్దురెప్పుడున్
    పుస్తకమున్ గనన్,ఖరవిభూషణముల్గదయెంచిచూడగన్
    దుస్తరమైనమూటతతిదొంతరవోలెనునుండుబట్టలున్
    విస్తునుగల్గజేయుచునువింతగనుండెనుజూచువారికిఐ

    రిప్లయితొలగించండి
  32. నిత్య సత్య మయెడి నిర్మల ౙ్ఞానంబు
    నీయ వలయు గ్రంథ మిలను, మనుజ
    కోటిని నడుపంగ కొఱవడియెడి భంగి,
    పుస్తకమ్ములు - ఖర భూషణములు!

    రిప్లయితొలగించండి
  33. నిస్తులమైన మానసము నిత్యము నిల్పి పఠించుచున్ ధృతిన్
    మస్తుగ ధారణన్ సలిప మాన్యుల కావ్యములన్ని యిచ్చతో
    వాస్తవమైన సంతసము ప్రాప్తమగున్ సతమ్ము లేనిచో
    పుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి
  34. అజ్ఞతలను బాపి విజ్ఞాన మునొసగు
    పుస్తకమ్ములు ఖరభూషణములు
    ననెడి వారెవరన నజ్ఞ్నానులె యనుట
    వాస్తవమగు మాట వసుధయందు

    రిప్లయితొలగించండి