6-5-2021 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్”(లేదా...)“నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే”
రగిలెను కోపమ్మున పన్నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్సగము శరీరమునొసగెనునగరాజ సుతకు రమణికి నారీ మణికిన్...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నగరాట్పుత్రిని గొనగాచిగురాకువిలుధరుఁడేయ జిరు బాణమునే,భుగభుగ జ్వాలల నా పన్నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'విలుధరుడు' సాధు ప్రయోగం కాదనుకుంటాను.
మిత్రులందఱకు నమస్సులు!నగజం గూర్పఁగ నింద్రు పన్పున వెసం గంతుండు త్ర్యక్షోత్తపోన్నగసాన్నిధ్యముఁ జేరి, పంచశరముల్ నాటంగ శ్రీకంఠు హృన్నగమందున్, వెనువెంటనే ధర నభోంతఃప్రాంతముల్ మ్రోఁగ, పన్నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి, పిదపన్ నాతిం గృపం బ్రోచెలే!
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
పొగరున నెదిరింపగ ప న్నగ ధారి యనంగు ద్రుంచి నాతిని బ్రోచెన్ తెగిన తలకు బదులుగ ను నొ సగె గజ మస్తక మతని కి చక్కగ కుదురన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కాని... మన్మథునికి గజమస్తకాన్నివ్వడం ?
సవరించిన పూరణ --నగజను జేర్చతలచ ప న్నగ ధారి aయనంగు ద్రుంచి నాతిని బ్రోచెన్ తగునా యని రతి వేడగ మగని యసువుల నొసంగెమాన్యు o డ య్యెన్
చివరి పాదంలో యసువుల నొసఁగంగ అని సవరణ చేయడమైనది
పగయా! పరిహాసమ బోనగధారియనంగు ద్రుంచి నాతిని బ్రోచెన్వగచియు రతి వేడగ పన్నగధారి పతినిజూపి నాయముజేసెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.చివరి పాదంలో గణభంగం. సవరించండి.
అగపడనిబాణమేయుచుతెగపడిశంభునితపమునుచెరుపగరాగావిగళితుఁజేసెనుగాపన్నగధారియనంగుఁద్రుంచినాతినిఁబ్రోచెన్
చిగురు విలుకాని కాల్చినభగుని రతీదేవి వేడ బ్రతికించె గదా! మగువతెలిపె నిట్టుల పన్నగధారి యనుంగు ద్రుంచి, నాతిని బ్లోచెన్.
అగజయు వద్దన వినకనునగధారియనంగు ద్రుంచి నాతిని బ్రోచెన్సగమేనొసంగి, రతికోరగ పతి నిచ్చెను, జగతిని రాగము పొడమెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు."అగజ వలదెనె వినక పన్నగధారి..." అనండి.
నగజాతాయెనపర్ణమానసముపూనంగన్శివుడయ్యెడన్పగవాడాయెనుమన్మధుండచటనాభారంబులోగ్రుంగెగాచిగురుల్పూవులబాణముల్వడిగతాజేర్చంగనప్పట్టుపన్నగరాధ్ధారియనంగుఁద్రుంచిపిదపన్నాతిన్గ్రుపన్బ్రోచెలే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'నగజాతాయె'?
నగజాతమ్మునపర్ణమానసముసవరణతో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నగజాత పార్వతీసతిదగ శంకరు గూర్చ శరము తపనుడు వేయన్వెగడుపడగ జగములు పన్నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్
జగతికి గీతను జెప్పెనునగపుత్రికి పతియునయ్యె నటరాజపుడున్ఒగి రాముడు శిలలోగలనగధారి, యనంగు ద్రుంచి, నాతిని బ్రోచెన్.
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు గురువుగారు!
నగరాట్సుత సేవలతోబిగిసడలని యోగివరుడు వివశత్వమునన్దగులగ పూబాణము పన్నగధారి యనంగుద్రుంచి నాతిని బ్రోచెన్
సగమౌరాత్రిని వేణునాదమున నాశాతంబు బూరించుచున్బిగువౌ ప్రేమను రాధదేవినట సంప్రీతిన్ సమావేశమైవగపేలేకయె రాసలీలలను దివ్యానందమున్ దేలగానగరాడ్ధారి యనంగు ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'రాధాదేవి' అనడం సాధువు. "రాధ నచ్చటను" అనవచ్చు. కాని కృష్ణుడు అనంగుని ద్రుంచడం ?
ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను.రాధాకృష్ణుల ప్రేమ మానుషీయమైనది కాక దివ్యమైనది కనుక మన్మథుని ద్రుంచి అనే భావన చేశాను.🙏🙏🙏🙏
సవరణతోసగమౌరాత్రిని వేణునాదమున నాశాతంబు బూరించుచున్బిగువౌ ప్రేమను రాధనచ్చటను సంప్రీతిన్ సమావేశమైవగపేలేకయె రాసలీలలను దివ్యానందమున్ దేలగానగరాడ్ధారి యనంగు ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కాని 'నగరడ్ధారి యనంగుని ద్రుంచడం'?
సమస్య :నగరాడ్ధారి యనంగు ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే ( శివతపోభంగం - మన్మథదహనం - పునర్జీవనం)మత్తేభవిక్రీడితము ...........................నగరాణ్మేనల ముద్దుకూతురు ; మరు న్నారీశిరోరత్నమౌ యగజన్ శంకరు గూర్ప భస్మమవగా నల్లాడు నిల్లాలికిన్ మగనిన్ జీవునిగా నొనర్చిరతికిన్మాంగల్య మీయంగ బ న్నగరాడ్ధారి ; యనంగు ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే .( నగరాణ్మేనలు - హిమవంతుడు , మేనాదేవి ; అగజ- పార్వతి ; పన్నగరాడ్ధారి - సర్పహారి ; అనంగుడు - మన్మథుడు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.'మరున్నారి'?
భగము నొనరించు నా ప న్నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్నగజాత కరము జేకొనిసగముగ జేసుకొ నుచు దన స్కంధము నందున్భగము = వైరాగ్యము
నగవైరికి గర్వమణచెనగధారి; యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్నగచాపుడు; దగదు గదాపగటుదనము గనబఱచుట పరమాత్మ కడన్
నగరాజాత్మజ చంద్రశేఖరునితో నాతంబునుం గోరుచున్సిగలో మల్లెలు దాల్చి చెంతనిలువన్ సేవాధికృత్యంబునన్జగముల్ మెచ్చగ కంతుడేను శరముల్ సంధింప కోపించి పన్నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే
పగతో పోరిడు రుక్మికితగురీతిగ బుద్ది చెప్పె దామోదరుడున్మగువ దన సొంత మవగన్:నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్
యనంగు=మహారాజు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'అనంగ' శబ్దానికి మహారాజు అన్న అర్థం అంత ప్రసిద్ధం కాదు. అయినా రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో కృష్ణుడు ఏ మహారాజునూ చంపలేదు కదా!
రుక్మికి జరిగిన అవమానము క్షత్రీయులకి మృత్యువు తోసమానము గద
అగజన్ జేకొని దుష్టనాశనము చేయంగల్గు సంతానమున్ జగతిన్ గావగ బొందు శంకరుడు విశ్వవ్యాప్తు డంచున్ సురల్తగ గాంక్షించుచు మన్మథున్ బనుపగా దానిన్ సమర్ధించ నానగరాడ్ధారి, యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే”
శ్రీ గురుభ్యోనమఃకం.నగజాతను జత గూడగనెగదోయుచు మరుని శరములెడదను దాకన్భగభగ మండుచు నా పన్నగధారి యనంగు ద్రుంచి నాతిని బ్రోచెన్
నగరాట్పుత్రిక యీప్సితమ్ము గనియా నాకేశుడే పంపగన్ సిగలో గంగను దాల్చువాని తపమున్ ఛేదింప కాముండజిహ్మగమున్ వేసినయంత నుగ్రుడయి యార్యానాథు డైనట్టి పన్నగరాడ్దారి యనుంగుఁ ద్రుంచి పిదపన్, నాతిన్ గృపన్ బ్రోచెలే.
నగజాతను బెండిలి యాడఁగ వలెఁ గావున సుర కపటమ్మున వృషభేంద్ర గమనుఁడు నిత్య కీర్తిత నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్ [నిత్య కీర్తిత నగధారి = నిత్యము కీర్తింపఁ బడిన నగధారి యైన విష్ణువును గలవాఁడు, శివుఁడు] పగలే యుండవు దేవదేవునకుఁ గోపంబున్న శాంతించుగాఁదగ నేకైక క్షణమ్ము నందు ఘనుఁడౌ దాక్షిణ్య భావమ్మునన్ వగవన్ మిక్కిలి భర్తృ వేదనను భాస్వన్మేరు సంజ్ఞా మహానగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే [నగరాడ్ధారి = మేరు పర్వతమును విల్లుగా ధరించిన శివుఁడు]
కందంమగనిగ నపర్ణ కోరఁగసగమౌచును హైమవతికిఁ జంపిన మరునిన్వగ వీడ రతికొసఁగ పన్నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్మత్తేభవిక్రీడితమునగరాట్సూన నపర్ణ పార్వతినిఁ దానై బట్టి, సూనాస్త్రునిన్బగతో భస్మముఁ జేసియున్ రతికినై ప్రాణేశు నందించుచున్వగపున్ బాపుచు నందరిన్ వసుధపై పాలించు ముక్కంటి పన్నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే
చిగురువి లుకాని రిపు,పన్నగధారి యనుంగుద్రుంచి నాతిని బ్రోచెన్ మగువర తీదే విమొఱను సుగతులు బ్రాప్తించు నటుల సూ,వర మిచ్చెన్
నగరాజేంద్రుని కన్య భర్త తపమున్ నాగంబుపై జేయ నానగజాతాజ్ఞను మన్మథుం డజుని బన్నంబున్ సుమాస్త్రంబుచే నతిభంగంబొనరించె , గ్రోధియయిసంకల్పాక్షి పాలాక్షితోనగరాడ్ధారి యనంగు దృంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే .
నగజాతన్ తుహినాద్రి పుత్రికను విన్నాణంబుగా శూలికిన్తగ కళ్యాణము సల్ప దేవతల సంత్రాణార్థమై సంభవింపగ షడ్వక్త్రుడు కంతుడేయ శరముల్ బామంబు పెంపార పన్నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే
ఖగమే వాహనమైనయా యజుడువిఖ్యాతుండు లోకోద్ధరౌనగరాడ్ధారి యనుంగుద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలేనగజారాతుని సంహరించుటను నానారీతి దుఃఖించియానగజానాధుని బ్రాణభిక్షమిడ విన్నాణంబుగావించెగా
నగజన్ శంకరు చేర్చగా తలచుచున్ నాళీకజన్ముండు తెల్పగ బృందారక నారదాదులు మరున్ రప్పించి పూబాణముల్తగ వేయించగ వెక్కసమ్ముగను, కాతాళమ్ముతో నుగ్రుడైనగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి, పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలేమగనిన్ పొందగ జేసి ప్రార్థనల సమ్మానించి శీఘ్రమ్ముగా
మ:తగునా సోముని బ్రహ్మచర్య మనుచున్ తాడించ పూబాణముల్చిగురించంగను క్రొత్త యాశలు మదిన్ చింతించ నా పార్వతిన్దిగులుంజెంది విశేష దృష్టిగని క్రోధించంగ నావేశమున్నగరాడ్ధారి యనంగు ద్రుంచి పిదపన్ నాతిన్కృపన్బ్రోచెలేవై. చంద్రశేఖర్
రగిలెను కోపమ్మున ప
రిప్లయితొలగించండిన్నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్
సగము శరీరమునొసగెను
నగరాజ సుతకు రమణికి నారీ మణికిన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినగరాట్పుత్రిని గొనగా
రిప్లయితొలగించండిచిగురాకువిలుధరుఁడేయ జిరు బాణమునే,
భుగభుగ జ్వాలల నా ప
న్నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'విలుధరుడు' సాధు ప్రయోగం కాదనుకుంటాను.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండినగజం గూర్పఁగ నింద్రు పన్పున వెసం గంతుండు త్ర్యక్షోత్తపో
న్నగసాన్నిధ్యముఁ జేరి, పంచశరముల్ నాటంగ శ్రీకంఠు హృ
న్నగమందున్, వెనువెంటనే ధర నభోంతఃప్రాంతముల్ మ్రోఁగ, ప
న్నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి, పిదపన్ నాతిం గృపం బ్రోచెలే!
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండిపొగరున నెదిరింపగ ప
రిప్లయితొలగించండిన్నగ ధారి యనంగు ద్రుంచి నాతిని బ్రోచెన్
తెగిన తలకు బదులుగ ను నొ
సగె గజ మస్తక మతని కి చక్కగ కుదురన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాని... మన్మథునికి గజమస్తకాన్నివ్వడం ?
సవరించిన పూరణ --
తొలగించండినగజను జేర్చతలచ ప
న్నగ ధారి aయనంగు ద్రుంచి నాతిని బ్రోచెన్
తగునా యని రతి వేడగ
మగని యసువుల నొసంగెమాన్యు o డ య్యెన్
చివరి పాదంలో యసువుల నొసఁగంగ అని సవరణ చేయడమైనది
తొలగించండిపగయా! పరిహాసమ బో
రిప్లయితొలగించండినగధారియనంగు ద్రుంచి నాతిని బ్రోచెన్
వగచియు రతి వేడగ ప
న్నగధారి పతినిజూపి నాయముజేసెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచివరి పాదంలో గణభంగం. సవరించండి.
అగపడనిబాణమేయుచు
రిప్లయితొలగించండితెగపడిశంభునితపమునుచెరుపగరాగా
విగళితుఁజేసెనుగాప
న్నగధారియనంగుఁద్రుంచినాతినిఁబ్రోచెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిచిగురు విలుకాని కాల్చిన
భగుని రతీదేవి వేడ బ్రతికించె గదా!
మగువతెలిపె నిట్టుల ప
న్నగధారి యనుంగు ద్రుంచి, నాతిని బ్లోచెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅగజయు వద్దన వినకను
రిప్లయితొలగించండినగధారియనంగు ద్రుంచి నాతిని బ్రోచెన్
సగమేనొసంగి, రతికో
రగ పతి నిచ్చెను, జగతిని రాగము పొడమెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"అగజ వలదెనె వినక పన్నగధారి..." అనండి.
నగజాతాయెనపర్ణమానసముపూనంగన్శివుడయ్యెడన్
రిప్లయితొలగించండిపగవాడాయెనుమన్మధుండచటనాభారంబులోగ్రుంగెగా
చిగురుల్పూవులబాణముల్వడిగతాజేర్చంగనప్పట్టుప
న్నగరాధ్ధారియనంగుఁద్రుంచిపిదపన్నాతిన్గ్రుపన్బ్రోచెలే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నగజాతాయె'?
నగజాతమ్మునపర్ణమానసము
తొలగించండిసవరణతో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినగజాత పార్వతీసతి
రిప్లయితొలగించండిదగ శంకరు గూర్చ శరము తపనుడు వేయన్
వెగడుపడగ జగములు ప
న్నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజగతికి గీతను జెప్పెను
రిప్లయితొలగించండినగపుత్రికి పతియునయ్యె నటరాజపుడున్
ఒగి రాముడు శిలలోగల
నగధారి, యనంగు ద్రుంచి, నాతిని బ్రోచెన్.
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురువుగారు!
తొలగించండినగరాట్సుత సేవలతో
రిప్లయితొలగించండిబిగిసడలని యోగివరుడు వివశత్వమునన్
దగులగ పూబాణము ప
న్నగధారి యనంగుద్రుంచి నాతిని బ్రోచెన్
సగమౌరాత్రిని వేణునాదమున నాశాతంబు
తొలగించండిబూరించుచున్
బిగువౌ ప్రేమను రాధదేవినట సంప్రీతిన్ సమావేశమై
వగపేలేకయె రాసలీలలను దివ్యానందమున్ దేలగా
నగరాడ్ధారి యనంగు ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'రాధాదేవి' అనడం సాధువు. "రాధ నచ్చటను" అనవచ్చు. కాని కృష్ణుడు అనంగుని ద్రుంచడం ?
ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను.
తొలగించండిరాధాకృష్ణుల ప్రేమ మానుషీయమైనది కాక దివ్యమైనది కనుక మన్మథుని ద్రుంచి అనే భావన చేశాను.🙏🙏🙏🙏
సవరణతో
తొలగించండిసగమౌరాత్రిని వేణునాదమున నాశాతంబు
బూరించుచున్
బిగువౌ ప్రేమను రాధనచ్చటను సంప్రీతిన్ సమావేశమై
వగపేలేకయె రాసలీలలను దివ్యానందమున్ దేలగా
నగరాడ్ధారి యనంగు ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాని 'నగరడ్ధారి యనంగుని ద్రుంచడం'?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండినగరాడ్ధారి యనంగు ద్రుంచి పిదపన్
నాతిన్ గృపన్ బ్రోచెలే
( శివతపోభంగం - మన్మథదహనం - పునర్జీవనం)
మత్తేభవిక్రీడితము
...........................
నగరాణ్మేనల ముద్దుకూతురు ; మరు
న్నారీశిరోరత్నమౌ
యగజన్ శంకరు గూర్ప భస్మమవగా
నల్లాడు నిల్లాలికిన్
మగనిన్ జీవునిగా నొనర్చిరతికిన్
మాంగల్య మీయంగ బ
న్నగరాడ్ధారి ; యనంగు ద్రుంచి పిదపన్
నాతిన్ గృపన్ బ్రోచెలే .
( నగరాణ్మేనలు - హిమవంతుడు , మేనాదేవి ; అగజ- పార్వతి ; పన్నగరాడ్ధారి - సర్పహారి ; అనంగుడు - మన్మథుడు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'మరున్నారి'?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభగము నొనరించు నా ప
రిప్లయితొలగించండిన్నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్
నగజాత కరము జేకొని
సగముగ జేసుకొ నుచు దన స్కంధము నందున్
భగము = వైరాగ్యము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినగవైరికి గర్వమణచె
రిప్లయితొలగించండినగధారి; యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్
నగచాపుడు; దగదు గదా
పగటుదనము గనబఱచుట పరమాత్మ కడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినగరాజాత్మజ చంద్రశేఖరునితో నాతంబునుం గోరుచున్
రిప్లయితొలగించండిసిగలో మల్లెలు దాల్చి చెంతనిలువన్ సేవాధికృత్యంబునన్
జగముల్ మెచ్చగ కంతుడేను శరముల్ సంధింప కోపించి ప
న్నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపగతో పోరిడు రుక్మికి
రిప్లయితొలగించండితగురీతిగ బుద్ది చెప్పె దామోదరుడున్
మగువ దన సొంత మవగన్:
నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్
యనంగు=మహారాజు
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అనంగ' శబ్దానికి మహారాజు అన్న అర్థం అంత ప్రసిద్ధం కాదు. అయినా రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో కృష్ణుడు ఏ మహారాజునూ చంపలేదు కదా!
రుక్మికి జరిగిన అవమానము క్షత్రీయులకి మృత్యువు తోసమానము గద
తొలగించండిఅగజన్ జేకొని దుష్టనాశనము చేయంగల్గు సంతానమున్
రిప్లయితొలగించండిజగతిన్ గావగ బొందు శంకరుడు విశ్వవ్యాప్తు డంచున్ సురల్
తగ గాంక్షించుచు మన్మథున్ బనుపగా దానిన్ సమర్ధించ నా
నగరాడ్ధారి, యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రీ గురుభ్యోనమః
రిప్లయితొలగించండికం.
నగజాతను జత గూడగ
నెగదోయుచు మరుని శరములెడదను దాకన్
భగభగ మండుచు నా ప
న్నగధారి యనంగు ద్రుంచి నాతిని బ్రోచెన్
రిప్లయితొలగించండినగరాట్పుత్రిక యీప్సితమ్ము గనియా నాకేశుడే పంపగన్
సిగలో గంగను దాల్చువాని తపమున్ ఛేదింప కాముండజి
హ్మగమున్ వేసినయంత నుగ్రుడయి యార్యానాథు డైనట్టి ప
న్నగరాడ్దారి యనుంగుఁ ద్రుంచి పిదపన్, నాతిన్ గృపన్ బ్రోచెలే.
నగజాతను బెండిలి యా
రిప్లయితొలగించండిడఁగ వలెఁ గావున సుర కపటమ్మున వృషభేం
ద్ర గమనుఁడు నిత్య కీర్తిత
నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్
[నిత్య కీర్తిత నగధారి = నిత్యము కీర్తింపఁ బడిన నగధారి యైన విష్ణువును గలవాఁడు, శివుఁడు]
పగలే యుండవు దేవదేవునకుఁ గోపంబున్న శాంతించుగాఁ
దగ నేకైక క్షణమ్ము నందు ఘనుఁడౌ దాక్షిణ్య భావమ్మునన్
వగవన్ మిక్కిలి భర్తృ వేదనను భాస్వన్మేరు సంజ్ఞా మహా
నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే
[నగరాడ్ధారి = మేరు పర్వతమును విల్లుగా ధరించిన శివుఁడు]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండిమగనిగ నపర్ణ కోరఁగ
సగమౌచును హైమవతికిఁ జంపిన మరునిన్
వగ వీడ రతికొసఁగ ప
న్నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్
మత్తేభవిక్రీడితము
నగరాట్సూన నపర్ణ పార్వతినిఁ దానై బట్టి, సూనాస్త్రునిన్
బగతో భస్మముఁ జేసియున్ రతికినై ప్రాణేశు నందించుచున్
వగపున్ బాపుచు నందరిన్ వసుధపై పాలించు ముక్కంటి ప
న్నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే
చిగురువి లుకాని రిపు,ప
రిప్లయితొలగించండిన్నగధారి యనుంగుద్రుంచి నాతిని బ్రోచెన్
మగువర తీదే విమొఱను
సుగతులు బ్రాప్తించు నటుల సూ,వర మిచ్చెన్
నగరాజేంద్రుని కన్య భర్త తప
రిప్లయితొలగించండిమున్ నాగంబుపై జేయ నా
నగజాతాజ్ఞను మన్మథుం డజుని
బన్నంబున్ సుమాస్త్రంబుచే నతి
భంగంబొనరించె , గ్రోధియయి
సంకల్పాక్షి పాలాక్షితో
నగరాడ్ధారి యనంగు దృంచి పిద
పన్ నాతిన్ గృపన్ బ్రోచెలే .
నగజాతన్ తుహినాద్రి పుత్రికను విన్నాణంబుగా శూలికిన్
రిప్లయితొలగించండితగ కళ్యాణము సల్ప దేవతల సంత్రాణార్థమై సంభవిం
పగ షడ్వక్త్రుడు కంతుడేయ శరముల్ బామంబు పెంపార ప
న్నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే
ఖగమే వాహనమైనయా యజుడువిఖ్యాతుండు లోకోద్ధరౌ
రిప్లయితొలగించండినగరాడ్ధారి యనుంగుద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే
నగజారాతుని సంహరించుటను నానారీతి దుఃఖించియా
నగజానాధుని బ్రాణభిక్షమిడ విన్నాణంబుగావించెగా
నగజన్ శంకరు చేర్చగా తలచుచున్ నాళీకజన్ముండు తె
రిప్లయితొలగించండిల్పగ బృందారక నారదాదులు మరున్ రప్పించి పూబాణముల్
తగ వేయించగ వెక్కసమ్ముగను, కాతాళమ్ముతో నుగ్రుడై
నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి, పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే
మగనిన్ పొందగ జేసి ప్రార్థనల సమ్మానించి శీఘ్రమ్ముగా
మ:
రిప్లయితొలగించండితగునా సోముని బ్రహ్మచర్య మనుచున్ తాడించ పూబాణముల్
చిగురించంగను క్రొత్త యాశలు మదిన్ చింతించ నా పార్వతిన్
దిగులుంజెంది విశేష దృష్టిగని క్రోధించంగ నావేశమున్
నగరాడ్ధారి యనంగు ద్రుంచి పిదపన్ నాతిన్కృపన్బ్రోచెలే
వై. చంద్రశేఖర్