8-5-2021 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్”(లేదా...)“ముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి నిచ్చలున్”
మిత్రులందఱకు నమస్సులు!భక్తికి మూలకారణము భవ్య మనమ్మున దైవ ప్రేమమే;రక్తికి మూలకారణము రమ్య సఖి ప్రియ సంగమేచ్ఛయే;శక్తికి మూలకారణము సౌమ్యమనోద్గత కాంక్షయే; వ్రతోన్ముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి, నిచ్చలున్!
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారు!
రక్తిన్ గోపికలును , హరిభక్తిన్ ప్రహ్లాదుడసుర బాలుండందెన్యుక్తిన్ హరి పాదములన్ముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రక్తిగపరమముకోఱకాసక్తిగనేకాంతముననుసంగుడుకాగన్శక్తియుకూడునుజీవునిముక్తికిమాలకారణమువిషయభుక్తియతలపన్
కందంఉక్తుల 'వేంకట విభు' నాసక్తిని దినచర్యఁ గూర్చి సత్కీర్తనలన్వ్యక్త పరుచ నన్నమయకుముక్తికిఁ గారణము 'విషయభుక్తి' యె తలఁపన్ఉత్పలమాలఉక్తుల వేంకటేశ్వరుని నుజ్వల మూర్తిఁ దదాత్మ్యమంది నాసక్తిని 'దేవదేవు దినచర్యల' వెన్కొని కీర్తనాళితోవ్యక్తము జేయ నన్నమయ నార్తిని భక్తిని, స్వామి సన్నిధిన్ముక్తికి మూలకారణము పో 'విషయాదుల భుక్తి' నిచ్చలున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏 ధన్యోస్మి గురుదేవా🙏
భక్తినిఁబూనిసంగమముభావనక్రుష్ణునిగోపికల్మదిన్రక్తినిగూడియారమణురాగమునందుచుపారమంటిరేసక్తతజీవుడట్టులనుసాధననాత్మనుశాంతినందగాముక్తికిమూలకారణముపోవిషయాదులభుక్తినిచ్చలున్
శక్తి కొలంది గ గొల్చుచు నా సక్తి గ భక్తుల కథలను శ్రవణము వలనన్ భక్తి గ నామ స్మరణ మె ముక్తికి కారణము విషయ భుక్తి యె తలపన్
మొదటి పాదం లో శక్తి కొలది గ కొలిచి యా అని సవరణ చేయడమైనది
తప్పులు చేస్తూ బయట పడితే రక్షణ ఉండదని తెలిసీ, అదే ఆనందము అనుకొనే కంటే, అన్నీ విషయాలు కడుపులో దాచుకొని యుక్తిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పే ఈ నా ప్రయత్నము: ఉ: శక్తికి మించి వేశములు, సాకులు చెప్పుచు, మోసగించుచున్,రక్తి యటంచు సంబరము రక్షణ గూర్చదు యెంత మాత్రమున్యుక్తిగ కార్యనిర్వహణ యోగము నన్నిట భవ్య మంత్రమైముక్తికి మూలకారణముపో, విషయాదుల భుక్తి నిచ్చలున్వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వేషములు' టైపాటు. 'కూర్చదు+ఎంత' అన్నపుడు యడాగమం రాదు. "...గూర్చ దదెంత మాత్రమున్" అనవచ్చు.
ధన్యవాదములు; సవరిస్తాను
రక్తుండై సఖిపై యనురక్తియె గల వేమన యొక రసికుండు నిరాసక్తుండై యోగి యగుటముక్తికి గారణము విషయ భుక్తియె తలపన్ భక్తియె లేని కాముకుడు భామను పొందుట లోనెగాదె యాసక్తిని జూపి సంపదల జవ్వని కిచ్చిననేమి తా నిరాసక్తత తోడ యోగియయె సత్పురు షుండగు వేమనన్ గనన్ ముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి నిచ్చలున్.
భక్తుడు దైవధ్యానముభుక్తికొరకుగాక జన్మ ముక్తికి సలుపన్ రక్తి విదూరుడు కావలెముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్
సమస్య :ముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి నిచ్చలున్ ( చింతామణీసమాసక్తుడై సర్వం మరచిన బిల్వమంగళుడు చివరకు హరిభక్తుడై ముక్తుడైనాడు )సక్తిని జూపలేదు తన జన్మకు కారకు లైనవారికై ;రక్తిని జూపె నెల్లపుడు రమ్యవిలాసిని పొందుకోసమై ;భక్తిని బిల్వమంగళుడు ప్రాణదు గొల్చుచు మోక్షమందెగా ;ముక్తికి మూలకారణము పో ! విషయాదుల భుక్తి నిచ్చలున్ .( ప్రాణదుడు - విష్ణువు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామిగాని వాడు మోక్షగామి గాడుసూక్తుల జెప్పు సాధువట జొక్కపురీతిని బోధసేయగాముక్తిని బొందుమార్గమన మోహము శోకములన్జయించుటన్యుక్తిని బల్కెనొక్కడట యోషల పొందున ఙ్ఞానివైతివేముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తినిచ్చలున్
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
ముక్తి పదంబు జేరుటకుమోహము నాదిగ నారు దస్యులన్భక్తులు గెల్వగా వలెను, బంధనముల్ విడనాడి, నిల్పగన్సక్తము దైవమందెపుడుసాధ్యము జేరగ ముక్తి ధామమున్ముక్తికి మూలకారణముపోవిషయాదుల భుక్తి నిచ్చలున్
ఉత్పలమాల:------------ఉక్తిచమత్కృతుల్ గలిగి,నూహలపల్లకినందు నూపుచున్శక్తికిమించికోరికల, సాధ్యముజేతుమటంచు బల్కుచున్భక్తిగకానుకల్ నడుగు,బాహిరమైనటువంటి బాలిశుల్ముక్తికి మూలకారణముపో, విషయాదులభుక్తినిచ్చలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."..గలిగి యూహల.. కాన్క లిమ్మనెడి..." అనండి.
వక్తలు చెప్పినటుల ననురక్తిని పెంచుకొన, నీకు లక్ష్యము పయి నాసక్తి గలుగ , నను మాన విముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్భుక్తి = అనుభవము
చక్కని పూరణ. అభినందనలు.
శక్తిని నమ్మి దశముఖుడురక్తిని బ్రతికెను చివరకు రాముని చేరన్ (చేతన్)యుక్త మరణమున్ బొందెన్ముక్తికి గారణము విషయ భుక్తియె తెలుపన్వ్యక్తము జేసె వేమ కవి, అమ్మను మించిన అన్న భార్యకున్భక్తిని మ్రొక్కి జక్కనగు ప్రాయపు కోర్కెల సన్యసించి, ధీశక్తిని, సంఘ వర్తనను చాటువు లందున ఉత్తమంబుగాముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి నిచ్చలున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
శక్తివిశేషసంపదగశాస్త్రమునందునశోధనంబునైభుక్తముగావలెన్గదబూర్వపుమూర్తులగావ్యసంపదల్వ్యక్తముజేయగాదగునువస్తువునంతయుభావదీప్తమైముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి నిచ్చలున్ కొరుప్రోలురాధాకృష్ణరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రెండవ పాదంలో గణభంగం. సవరించండి.
శక్తి విహీనము జేయునురక్తమున షుగరను వ్యాధి, లక్షల వ్యాధుల్భుక్తివలెనెగద, దేహవిముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్
శక్తి విహీనము జేయునురక్తమున షుగరను వ్యాధి, లక్షల వ్యాధుల్వ్యక్తుల కువచ్చు, దేహ విముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్
శ్రీ గురుభ్యోనమఃవ్యక్తికి సాధ్యమే పరమ భాగ్యమునందుటధ్యాస నుంచి తానుక్తిగ నాకళింపునను యున్నతమైన విధానమందునన్భక్తిగ వేంకటేశ్వరుని పాదము లందున దృష్టి యుంచుటేముక్తికి మూలకారణము, పో విషయాదుల భుక్తి నిచ్చలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'ఆకళింపునను+ఉన్నతమైన' అన్నపుడు యడాగమం రాదు. "ఆకళింపు గని యున్నత..." అనండి.
శక్తిసమన్వితోర్జిత విశాల భుజోన్నతి తోడ నేర్వ వేదోక్త ప్రయుక్త దీపిత సమున్నతమౌ ధనురస్త్రశస్త్ర సంయుక్త ప్రచండ విద్య; విజయోన్నతి గూర్చుచు నుండు కార్ముకాముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి నిచ్చలున్ఆముక్తి = ధరించుట/కలిగియుండుట
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
భక్తిని నిల్పి శ్రీకరుని పాదపయోజయుగమ్ము నందు నాసక్తుడు నైన చో సతము సంగతమౌను కదా!కరస్థమౌమోక్షము, సర్వసౌఖ్యములఁ పొందు గడించినమోక్షలాభనిర్ముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి నిచ్చలున్.కంజర్ల రామాచార్య.
శక్తియె నిత్యమున్వెలుగుసాధన జీవ మనంత విశ్వమున్వ్యక్తము జేయ జీవన ప్రభావ వికాసము నందు తేజ మాసక్తిని ధర్మమార్గమను సంపదగోరి చరించు జీవికన్ముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి నిచ్చలున్!
భక్తిని బూజించుటయేముక్తికి కారణము,విషయభుక్తియె తలపన్శక్తిని నశింప జేయునురక్తిని బూజింప మేలు రాముని పదముల్
మీ పూరణ బాగున్నది. అబినందనలు.
భక్తిని నెల్లవేళలను భవ్యునిబూజనుజేయుచుండుచోముక్తికి మూలకారణముపో,విషయాదుల భుక్తినిచ్చలున్శక్తివిహీనుజేయునిల సర్వమునాశనమొందజేయుటన్ రక్తిని మానకుండగను రాముని ధ్యానము జేయగావలెన్
భక్తి యగుఁ గారణం బిల ముక్తిఁ బడయ మానవులకుఁ బుణ్యాత్ములకున్ సూక్తిఁ బలికితి శరీరపు ముక్తికిఁ గారణము విషయ భుక్తియె తలఁపన్ ఉక్తము ముక్త సంగు లిల నొందుట యుత్తమ విష్ణు ధామమున్ రిక్తము కాదు భక్తి సుపరిశ్రమ ముండగ నిత్య కామ సంసక్త మనో వికార గత మానవు లిద్ధర దూర మౌటకున్ ముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి నిచ్చలున్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
భక్తుల తత్త్వము వీడకశక్తి కొలది గాను సతము శౌరినిమదిలోయుక్తిగ కొలిచిన నదియేముక్తికికారణము విషయభుక్తియె తెలుపన్
భక్త సులభునర్చించుటెముక్తికిఁ గారణము; విషయభుక్తియె తలఁపన్రిక్తమొనర్చు వివేకమసక్తుల గావించు మోక్షసాధనమందున్
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిభక్తికి మూలకారణము భవ్య మనమ్మున దైవ ప్రేమమే;
రక్తికి మూలకారణము రమ్య సఖి ప్రియ సంగమేచ్ఛయే;
శక్తికి మూలకారణము సౌమ్యమనోద్గత కాంక్షయే; వ్రతో
న్ముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి, నిచ్చలున్!
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్యగారు!
తొలగించండిరక్తిన్ గోపికలును , హరి
రిప్లయితొలగించండిభక్తిన్ ప్రహ్లాదుడసుర బాలుండందెన్
యుక్తిన్ హరి పాదములన్
ముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరక్తిగపరమముకోఱకా
రిప్లయితొలగించండిసక్తిగనేకాంతముననుసంగుడుకాగన్
శక్తియుకూడునుజీవుని
ముక్తికిమాలకారణమువిషయభుక్తియతలపన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిఉక్తుల 'వేంకట విభు' నా
సక్తిని దినచర్యఁ గూర్చి సత్కీర్తనలన్
వ్యక్త పరుచ నన్నమయకు
ముక్తికిఁ గారణము 'విషయభుక్తి' యె తలఁపన్
ఉత్పలమాల
ఉక్తుల వేంకటేశ్వరుని నుజ్వల మూర్తిఁ దదాత్మ్యమంది నా
సక్తిని 'దేవదేవు దినచర్యల' వెన్కొని కీర్తనాళితో
వ్యక్తము జేయ నన్నమయ నార్తిని భక్తిని, స్వామి సన్నిధిన్
ముక్తికి మూలకారణము పో 'విషయాదుల భుక్తి' నిచ్చలున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏 ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిభక్తినిఁబూనిసంగమముభావనక్రుష్ణునిగోపికల్మదిన్
రిప్లయితొలగించండిరక్తినిగూడియారమణురాగమునందుచుపారమంటిరే
సక్తతజీవుడట్టులనుసాధననాత్మనుశాంతినందగా
ముక్తికిమూలకారణముపోవిషయాదులభుక్తినిచ్చలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశక్తి కొలంది గ గొల్చుచు నా
రిప్లయితొలగించండిసక్తి గ భక్తుల కథలను శ్రవణము వలనన్
భక్తి గ నామ స్మరణ మె
ముక్తికి కారణము విషయ భుక్తి యె తలపన్
మొదటి పాదం లో శక్తి కొలది గ కొలిచి యా అని సవరణ చేయడమైనది
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితప్పులు చేస్తూ బయట పడితే రక్షణ ఉండదని తెలిసీ, అదే ఆనందము అనుకొనే కంటే, అన్నీ విషయాలు కడుపులో దాచుకొని యుక్తిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పే ఈ నా ప్రయత్నము:
రిప్లయితొలగించండిఉ:
శక్తికి మించి వేశములు, సాకులు చెప్పుచు, మోసగించుచున్,
రక్తి యటంచు సంబరము రక్షణ గూర్చదు యెంత మాత్రమున్
యుక్తిగ కార్యనిర్వహణ యోగము నన్నిట భవ్య మంత్రమై
ముక్తికి మూలకారణముపో, విషయాదుల భుక్తి నిచ్చలున్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వేషములు' టైపాటు. 'కూర్చదు+ఎంత' అన్నపుడు యడాగమం రాదు. "...గూర్చ దదెంత మాత్రమున్" అనవచ్చు.
ధన్యవాదములు; సవరిస్తాను
తొలగించండి
రిప్లయితొలగించండిరక్తుండై సఖిపై యను
రక్తియె గల వేమన యొక రసికుండు నిరా
సక్తుండై యోగి యగుట
ముక్తికి గారణము విషయ భుక్తియె తలపన్
భక్తియె లేని కాముకుడు భామను పొందుట లోనెగాదె యా
సక్తిని జూపి సంపదల జవ్వని కిచ్చిననేమి తా నిరా
సక్తత తోడ యోగియయె సత్పురు షుండగు వేమనన్ గనన్
ముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి నిచ్చలున్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిభక్తుడు దైవధ్యానము
రిప్లయితొలగించండిభుక్తికొరకుగాక జన్మ ముక్తికి సలుపన్
రక్తి విదూరుడు కావలె
ముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిముక్తికి మూలకారణము
పో విషయాదుల భుక్తి నిచ్చలున్
( చింతామణీసమాసక్తుడై సర్వం మరచిన బిల్వమంగళుడు చివరకు హరిభక్తుడై ముక్తుడైనాడు )
సక్తిని జూపలేదు తన
జన్మకు కారకు లైనవారికై ;
రక్తిని జూపె నెల్లపుడు
రమ్యవిలాసిని పొందుకోసమై ;
భక్తిని బిల్వమంగళుడు
ప్రాణదు గొల్చుచు మోక్షమందెగా ;
ముక్తికి మూలకారణము
పో ! విషయాదుల భుక్తి నిచ్చలున్ .
( ప్రాణదుడు - విష్ణువు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికామిగాని వాడు మోక్షగామి గాడు
రిప్లయితొలగించండిసూక్తుల జెప్పు సాధువట జొక్కపురీతిని బోధసేయగా
ముక్తిని బొందుమార్గమన మోహము శోకములన్
జయించుటన్
యుక్తిని బల్కెనొక్కడట యోషల పొందున ఙ్ఞానివైతివే
ముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తినిచ్చలున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండిముక్తి పదంబు జేరుటకుమోహము నాదిగ నారు దస్యులన్
రిప్లయితొలగించండిభక్తులు గెల్వగా వలెను, బంధనముల్ విడనాడి, నిల్పగన్
సక్తము దైవమందెపుడుసాధ్యము జేరగ ముక్తి ధామమున్
ముక్తికి మూలకారణముపోవిషయాదుల భుక్తి నిచ్చలున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండి------------
ఉక్తిచమత్కృతుల్ గలిగి,నూహలపల్లకినందు నూపుచున్
శక్తికిమించికోరికల, సాధ్యముజేతుమటంచు బల్కుచున్
భక్తిగకానుకల్ నడుగు,బాహిరమైనటువంటి బాలిశుల్
ముక్తికి మూలకారణముపో, విషయాదులభుక్తినిచ్చలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"..గలిగి యూహల.. కాన్క లిమ్మనెడి..." అనండి.
వక్తలు చెప్పినటుల నను
రిప్లయితొలగించండిరక్తిని పెంచుకొన, నీకు లక్ష్యము పయి నా
సక్తి గలుగ , నను మాన వి
ముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్
భుక్తి = అనుభవము
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశక్తిని నమ్మి దశముఖుడు
రిప్లయితొలగించండిరక్తిని బ్రతికెను చివరకు రాముని చేరన్ (చేతన్)
యుక్త మరణమున్ బొందెన్
ముక్తికి గారణము విషయ భుక్తియె తెలుపన్
వ్యక్తము జేసె వేమ కవి, అమ్మను మించిన అన్న భార్యకున్
భక్తిని మ్రొక్కి జక్కనగు ప్రాయపు కోర్కెల సన్యసించి, ధీ
శక్తిని, సంఘ వర్తనను చాటువు లందున ఉత్తమంబుగా
ముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి నిచ్చలున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిశక్తివిశేషసంపదగశాస్త్రమునందునశోధనంబునై
రిప్లయితొలగించండిభుక్తముగావలెన్గదబూర్వపుమూర్తులగావ్యసంపదల్
వ్యక్తముజేయగాదగునువస్తువునంతయుభావదీప్తమై
ముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి నిచ్చలున్
కొరుప్రోలురాధాకృష్ణరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో గణభంగం. సవరించండి.
శక్తి విహీనము జేయును
రిప్లయితొలగించండిరక్తమున షుగరను వ్యాధి, లక్షల వ్యాధుల్
భుక్తివలెనెగద, దేహవి
ముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్
శక్తి విహీనము జేయును
తొలగించండిరక్తమున షుగరను వ్యాధి, లక్షల వ్యాధుల్
వ్యక్తుల కువచ్చు, దేహ వి
ముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశ్రీ గురుభ్యోనమః
రిప్లయితొలగించండివ్యక్తికి సాధ్యమే పరమ భాగ్యమునందుట
ధ్యాస నుంచి తా
నుక్తిగ నాకళింపునను యున్నతమైన విధానమందునన్
భక్తిగ వేంకటేశ్వరుని పాదము లందున దృష్టి యుంచుటే
ముక్తికి మూలకారణము, పో విషయాదుల భుక్తి నిచ్చలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఆకళింపునను+ఉన్నతమైన' అన్నపుడు యడాగమం రాదు. "ఆకళింపు గని యున్నత..." అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశక్తిసమన్వితోర్జిత విశాల భుజోన్నతి తోడ నేర్వ వే
రిప్లయితొలగించండిదోక్త ప్రయుక్త దీపిత సమున్నతమౌ ధనురస్త్రశస్త్ర సం
యుక్త ప్రచండ విద్య; విజయోన్నతి గూర్చుచు నుండు కార్ముకా
ముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి నిచ్చలున్
ఆముక్తి = ధరించుట/కలిగియుండుట
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిభక్తిని నిల్పి శ్రీకరుని పాదపయోజయుగమ్ము నందు నా
రిప్లయితొలగించండిసక్తుడు నైన చో సతము సంగతమౌను కదా!కరస్థమౌ
మోక్షము, సర్వసౌఖ్యములఁ పొందు గడించిన
మోక్షలాభని
ర్ముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి నిచ్చలున్.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశక్తియె నిత్యమున్వెలుగు
రిప్లయితొలగించండిసాధన జీవ మనంత విశ్వమున్
వ్యక్తము జేయ జీవన ప్ర
భావ వికాసము నందు తేజ మా
సక్తిని ధర్మమార్గమను
సంపదగోరి చరించు జీవికన్
ముక్తికి మూలకారణము
పో విషయాదుల భుక్తి నిచ్చలున్!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభక్తిని బూజించుటయే
రిప్లయితొలగించండిముక్తికి కారణము,విషయభుక్తియె తలపన్
శక్తిని నశింప జేయును
రక్తిని బూజింప మేలు రాముని పదముల్
మీ పూరణ బాగున్నది. అబినందనలు.
తొలగించండిభక్తిని నెల్లవేళలను భవ్యునిబూజనుజేయుచుండుచో
రిప్లయితొలగించండిముక్తికి మూలకారణముపో,విషయాదుల భుక్తినిచ్చలున్
శక్తివిహీనుజేయునిల సర్వమునాశనమొందజేయుటన్
రక్తిని మానకుండగను రాముని ధ్యానము జేయగావలెన్
మీ పూరణ బాగున్నది. అబినందనలు.
తొలగించండిభక్తి యగుఁ గారణం బిల
రిప్లయితొలగించండిముక్తిఁ బడయ మానవులకుఁ బుణ్యాత్ములకున్
సూక్తిఁ బలికితి శరీరపు
ముక్తికిఁ గారణము విషయ భుక్తియె తలఁపన్
ఉక్తము ముక్త సంగు లిల నొందుట యుత్తమ విష్ణు ధామమున్
రిక్తము కాదు భక్తి సుపరిశ్రమ ముండగ నిత్య కామ సం
సక్త మనో వికార గత మానవు లిద్ధర దూర మౌటకున్
ముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి నిచ్చలున్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిభక్తుల తత్త్వము వీడక
శక్తి కొలది గాను సతము శౌరినిమదిలో
యుక్తిగ కొలిచిన నదియే
ముక్తికికారణము విషయభుక్తియె తెలుపన్
మీ పూరణ బాగున్నది. అబినందనలు.
తొలగించండిభక్త సులభునర్చించుటె
రిప్లయితొలగించండిముక్తికిఁ గారణము; విషయభుక్తియె తలఁపన్
రిక్తమొనర్చు వివేకమ
సక్తుల గావించు మోక్షసాధనమందున్
మీ పూరణ బాగున్నది. అబినందనలు.
తొలగించండి