17-5-2021 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“జనకుఁ జంపినవానికి జనుల నతులు”(లేదా...)“జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్”
మిత్రులందఱకు నమస్సులు!వినయవిధేయతల్ గలిగి, వేగమఁ దాటకిఁ గూల్చి, సన్మునివరు యాగముం దడవి, పోయి శిలన్ గొమగా నొనర్చి, త్ర్యక్షుని విలుఁ ద్రుంచి, జానకినిఁ గోరియుఁ జేకొని,యట్లె యింద్రజిజ్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్!
మొదటి పాదంలో చిన్నపదం తొలగిపోయింది. దానిని చేర్చి తిరిగి ప్రకటిస్తున్నాను...వినయవిధేయతల్ గలిగి, వేగమఁ దాటకిఁ గూల్చి, చేరి సన్మునివరు యాగముం దడవి, పోయి శిలన్ గొమగా నొనర్చి, త్ర్యక్షుని విలుఁ ద్రుంచి, జానకినిఁ గోరియుఁ జేకొని,యట్లె యింద్రజిజ్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్!
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
అనవరతము విడువక శ్రీ హరియె రక్షకుడని వచియించు చుండగ కోప మందునాత్మజుండె తనకు శత్రువనిదలచినజనకుఁ జంపిన వానికి జనుల నుతులు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జనకుని చంపించాడే కాని తాను స్వయంగా చంపలేదు కదా!
ఆత్మజుని తన శత్రువుగ తలచిన జనకుని .....ప్రహ్లాదుని శత్రువుగా భావించిన ఆ తండ్రిని అనికదా!
ఘనముగ వధించ నా పంక్తి గళుణి రామ చంద్రుడు సమరమును చేసి, యింద్ర జిత్తుజనకు జంపిన వానికి జనుల నతులునిడుచు హారతు లొసగెను పుడమి పైన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భక్తకోటికినాదర్శబాలకుండువిష్ణుభక్తుడుజగతికివెలుగుదివ్వెనిర్వికారుండునెమ్మదినేర్పువలనజనకుఁజంపినవానికిజనులనుతులు
రాఘవునికి, దనుజవైరి, రాఘవేంద్రునికి, కమలనేత్రునికి రామునికివిజయముయినకులతిలకునికి, నిల ఇంద్రజిత్తుజనకుఁ జంపినవానికి, జనుల నుతులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'విజయము+ఇనకుల' అన్నపుడు యడాగమం రాదు.
ఇందుగలను సందేహమదేలననుచుకంబమును చీల్చి చీల్చె రాక్షసుని కడుపులచ్చిమి పతిని కొలుచు ప్రహ్లాద కుమరు జనకుఁ జంపినవానికి జనుల నతులు”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'లచ్చిమగనిని' అనండి.
చెల్లి కడుపున బుట్టెడు చిన్నవాడుచంపబోవును నన్నను శంకతోడచెడ్డబుద్ధిని కంసుడు చెఱనుబెట్టజనకు, జంపిన వానికి జనుల నుతులుదనుజుడు కాముకత్వమున దల్లిని సీతను దొంగలింపగాహనుమసహాయ మందుకొని యద్భుతరీతిని దాటివారిధిన్ ఘనమగు యుద్ధనైపుణిని గర్వమడంచుచు నీచుడింద్రజిజ్జనకుని జంపినట్టి గుణశాలికి మ్రొక్కెదరెల్ల సజ్జనుల్
ఈశ్వరుని బిల్వకే గొప్ప యిష్టిజేయపుట్టినింటికి వచ్చిన పుత్రికగనిచుల్కనగజూడ మితిలేని యల్కను సతిజనకు జంపిన వానికి జనుల నుతులు
మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యాస్మి గూరువర్యా! నమోనమః!🙏🙏🙏
ఘన విధుడిచ్చినట్టి వర గర్వము పొందిన మానుషాదుడే తనయుడు వీడకుండె హరి ధ్యానమటంచు నమర్ష మందితాననురతి వీడి చంపమని యానతి నిచ్చిన దుష్టశీలుడౌ జనకుని జంపినట్తి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్.
అనయమువంశమబ్ధినినయంబునపోంగగఁజేయుచంద్రుడైమనుటకువిష్ణుపాదములమానకగోల్చినబాలుడాయెడన్పనిగోనివైరమూనుచుతపంబునుఁజేసినతండ్రిముక్తికైజనకునిఁజంపినట్టిగుణశాలికిమ్రోక్కెదరెల్లవారలున్
తేటగీతిరామ సతినుంచి లంకలో రావణుండువినక యాలిని తమ్ముని వెఱవ కున్ననెగసి కూల్చంగ రాముండు, నింద్రజిత్తుజనకుఁ జంపినవానికి జనుల నతులుచంపకమాలతనదొక స్వర్ణలంక యని త్ర్యక్షుని దీవెన గల్గు మేటి భావనలకు దూరమై పరమ పావని సీతను బంధి జేయుచున్బెనఁకువ గోరి రాఘవుని వేటుకు జిక్కిన మోహి యింద్రజిజ్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏సవరించిన చంపకం:చంపకమాలతనదొక స్వర్ణలంక యని తానొక పాలకుఁడన్న మేటి భావనలకు దూరమై పరమ పావని సీతనుఁ బొందు లాలసన్బెనఁకువ గోరి రాఘవుని వేటుకు జిక్కిన ద్రోహి నింద్రజిజ్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్
వినయము తోడ దైవకృపవిస్మయ రీతిని నొంది భావమందనిశము శ్రీహరిన్ దలచి యాతన వెట్టిన తండ్రి కోరికన్దనర నృసింహరూపమునుదక్షత తోడుత జూపి వేగమేజనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు గురువు గారూ
కోతిమూక తోడుత సీత కొరకు రాముడధిగమించి సాగరమును, ఆలమందుమించి రావణు జంపెను, మేఘనాథు"జనకు, జంపినవానికి జనుల నతులు"
~~~~~~~~~~~~~~~~~~జనకుని పుత్రి జానకిని జంగమవేషపు ధారణార్థియైయనుపమ సాధ్వి రాముని మహాప్రియ పత్ని దశాన నాఢ్యుడాదనుజుడు వెంట జేకొనియు ధైర్యముతో జనె ,యుద్దమంధునన్ఘను భుజశాలి పుత్రుడగు గౌరవ వీరుడు యింద్రజిత్తుకున్జనకుని జంపినట్టి గుణ శాలికిమ్రొక్కెదరెల్ల సజ్జనుల్~~~~~~~~~~~~~~~~~~
కదనరంగమునందున కపులగూడిదుష్టరక్కసిమూకల దురితమణచిమిక్కుటమగు శౌర్యముజూపి మేఘనాథుజనకుఁ జంపినవానికి జనుల నతులు
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅శంకరాభరణం వారి సమస్య : "జనకుఁ జంపిన వానికి జనుల నుతులు"ఎందుకో కందం కదం దొక్కి దూకింది.. రెండు పాదాలు బిరబిరా వచ్చాయి. అదృష్టమేమిటంటె ప్రాస, గణాలు సరిపోవడం .. తనువుయు నరసింహము వలె తన నఖముల తోడ చీల్చె దానవ పొట్టన్ | చిన ప్రహ్లాదు "జనకుఁ జంపిన వానికి జనుల నుతులు" పెట్టిరి కనరే || - రాంబాబు కైప 17-05-2021🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'తనువుయు' అనడం సాధువు కాదు. "తనువే/తనువది...దానవు కుక్షిన్" అనండి. (దానవపొట్ట.. దుష్టసమాసం)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సతుల శీలము దోయుచు చంపు దుష్టయువకుని నెలవు కనుగొనె యువతి సృజనవాడిని తునిమి నభటుడు వాసు,ఆ సృ"జనకు, జంపినవానికి జనుల నతులు"
మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు."దోచుచు..వానిని తునిమి" అనండి.
దనుజుఁడు శంభరాసురుఁడు తాను జయింప జనించు మృత్యువున్కనుగొని సంద్రమందు జని గ్రక్కున ముంచగ మ్రింగు చేపకుంబనుగొను వాని జాలరులు భద్రముగా నిడ పెంచినట్టియాజనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్
జనకుడు తీవ్రవాదిమరిజన్మనొసంగిన తల్లిపెంచగాతనయుడు గొప్పశిక్షణనుతానొక చక్కని ఐపిఎస్ గ నైతనపని లోనిభాగముగతండ్రిని కాల్పుల జంపెకానలో“జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్”
వనమునలక్కయింటమునుబ్రాణమునిల్పినసోదరుండుదారణముననర్థభాగముగరాజగువానినిజీల్చివేయగా,ఘనుడగురాజరాజునునుగాయముజేయగనెంచిలక్ష్మణాజనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్”కొరుప్రోలు రాధాకృష్ణరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'రాజరాజునునుగాయము' అర్థం కాలేదు. 'లక్ష్మణ జనకుని' అనడం సాధువు.
వనమున నున్నజానకిని వంచనతో గొని పోవ లంకకున్కనుకొని సీతజాడ దశకంఠుని రాజ్యము నందు తోటలోవనటనొసంగి నట్టి కడుఁ బాపి నిశాచరుడైన యింద్రజిత్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్
జనకుని పుత్రి రామసతి జానకి సద్గుణ శీలి బంధిసేసిన మనుజాశనుండు శశి శేఖర భక్తుడు పంక్తి కంఠునిన్ దునుమదలంచి వానరులతో తిమి దాటి సమిత్తు నింద్రజి జ్జనకుని జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్
కె.వి.యస్. లక్ష్మి: జనకు నాహ్వానమే లేక చనెను పుత్రి యిష్టి గాంచగ పుట్టింటి యిచ్ఛ తోను ఈస డించగ నంతనె ఈశు సతికిజనకు జంపిన వానికి జనుల నుతులు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు."పుట్టింటి కిచ్ఛతోను"
మునిజనసజ్జనాదులకు ముప్పు ఘటించుచు హింసకుండునైవనరుహనాభదుష్టపరిపంథియునౌ నరకాసురాధమున్కనలుచు, పత్ని సత్య సహకారము లొప్పగ ధూర్తధీతమోజనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్.కంజర్ల రామాచార్య.
ఇనకుల వార్ధి చంద్రుడతడేలిన కాలము రామరాజ్యమైదనరెను విశ్వమందు ఘనతన్ వహియించిన పుణ్యమూర్తికిన్మునిజనవంద్యుకున్ విమలమూర్తికి రాముకు మేఘనాధునిన్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వంద్యునకున్, రామునకు' అనడం సాధువులు.
కాంచఁ గలికాలమున నిట్టి ఘనులు కలరుకేవల ధనార్తు లధములు కేలి లీలనవ్వ యాస్తికై నిర్దయ నెవ్వ రిత్త్రు జనకుఁ జంపినవానికి జనుల నతులు ఇనకుల వంశ వర్ధనున కిద్ధ చరిత్రున కేక సత్య వాగ్ఘనునకు సత్య శౌర్య గుణ గణ్యున కిద్ధర సీత భర్త కా యనయుని లోకరావణు దశానను భండన మందు నింద్రజిజ్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
మరణ శిక్షను విధియింత్రు దొరలు సుమ్ముజనకు జంపిన వానికి,జనుల నతులుశాశ్వ తంబుగ నుండును సజ్జనులకువారి మంచియే వారిని బ్రస్తుతించు
జనకుని జంపినట్టి గుణశాలికీ మ్రొక్కెదరెల్ల సజ్జనుల్కనుమరు గాయెనే భువిని గావగ దండ్రిని ధైర్య శాలురల్జనకుని జంపు వాని గుణశాలిగ బల్కుట చిత్రమే గదావినగను రోత పుట్టె నిది పేలగ మారెను లోకమే సుమా
ధన బల గర్వితుండతడధర్మ పరాయణుడై చరించుచున్జనులను బాధ పెట్టు పలు చట్టములన్ విధియించి క్రూరతన్పెనగుచు వారి యాస్తులను వేచు దురాత్ముని వావి యెంచకన్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్
ధర్మరక్షణ చేయంగ ధరణి యందునవతరించె త్రేతాయుగమందుహరియుఇలజనపహరించినవాడు యింద్రజిత్తుజనకు జంపిన వానికి జనుల నతులు.
తాను చేసిన మోసము తెలుపకుండఎదుటివారిని ప్రశ్నించి నేమిచేయుప్రజలమోదముపొందిన ఫలమునొందుజనకు జంపిన వానికి జనులనుతులు
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండివినయవిధేయతల్ గలిగి, వేగమఁ దాటకిఁ గూల్చి, స
న్మునివరు యాగముం దడవి, పోయి శిలన్ గొమగా నొనర్చి, త్ర్య
క్షుని విలుఁ ద్రుంచి, జానకినిఁ గోరియుఁ జేకొని,యట్లె యింద్రజి
జ్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్!
మొదటి పాదంలో చిన్నపదం తొలగిపోయింది. దానిని చేర్చి తిరిగి ప్రకటిస్తున్నాను...
తొలగించండివినయవిధేయతల్ గలిగి, వేగమఁ దాటకిఁ గూల్చి, చేరి స
న్మునివరు యాగముం దడవి, పోయి శిలన్ గొమగా నొనర్చి, త్ర్య
క్షుని విలుఁ ద్రుంచి, జానకినిఁ గోరియుఁ జేకొని,యట్లె యింద్రజి
జ్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్!
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండి
రిప్లయితొలగించండిఅనవరతము విడువక శ్రీ హరియె రక్ష
కుడని వచియించు చుండగ కోప మందు
నాత్మజుండె తనకు శత్రువనిదలచిన
జనకుఁ జంపిన వానికి జనుల నుతులు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజనకుని చంపించాడే కాని తాను స్వయంగా చంపలేదు కదా!
ఆత్మజుని తన శత్రువుగ తలచిన జనకుని .....ప్రహ్లాదుని శత్రువుగా భావించిన ఆ తండ్రిని అనికదా!
తొలగించండిఘనముగ వధించ నా పంక్తి గళుణి రామ
రిప్లయితొలగించండిచంద్రుడు సమరమును చేసి, యింద్ర జిత్తు
జనకు జంపిన వానికి జనుల నతులు
నిడుచు హారతు లొసగెను పుడమి పైన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభక్తకోటికినాదర్శబాలకుండు
రిప్లయితొలగించండివిష్ణుభక్తుడుజగతికివెలుగుదివ్వె
నిర్వికారుండునెమ్మదినేర్పువలన
జనకుఁజంపినవానికిజనులనుతులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాఘవునికి, దనుజవైరి, రాఘవేంద్రు
రిప్లయితొలగించండినికి, కమలనేత్రునికి రామునికివిజయము
యినకులతిలకునికి, నిల ఇంద్రజిత్తు
జనకుఁ జంపినవానికి, జనుల నుతులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'విజయము+ఇనకుల' అన్నపుడు యడాగమం రాదు.
ఇందుగలను సందేహమదేలననుచు
రిప్లయితొలగించండికంబమును చీల్చి చీల్చె రాక్షసుని కడుపు
లచ్చిమి పతిని కొలుచు ప్రహ్లాద కుమరు
జనకుఁ జంపినవానికి జనుల నతులు”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'లచ్చిమగనిని' అనండి.
చెల్లి కడుపున బుట్టెడు చిన్నవాడు
రిప్లయితొలగించండిచంపబోవును నన్నను శంకతోడ
చెడ్డబుద్ధిని కంసుడు చెఱనుబెట్ట
జనకు, జంపిన వానికి జనుల నుతులు
దనుజుడు కాముకత్వమున దల్లిని సీతను దొంగలింపగా
హనుమసహాయ మందుకొని యద్భుతరీతిని దాటివారిధిన్
ఘనమగు యుద్ధనైపుణిని గర్వమడంచుచు నీచుడింద్రజి
జ్జనకుని జంపినట్టి గుణశాలికి మ్రొక్కెదరెల్ల సజ్జనుల్
తొలగించండిఈశ్వరుని బిల్వకే గొప్ప యిష్టిజేయ
పుట్టినింటికి వచ్చిన పుత్రికగని
చుల్కనగజూడ మితిలేని యల్కను సతి
జనకు జంపిన వానికి జనుల నుతులు
మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యాస్మి గూరువర్యా! నమోనమః!🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఘన విధుడిచ్చినట్టి వర గర్వము పొందిన మానుషాదుడే
తనయుడు వీడకుండె హరి ధ్యానమటంచు నమర్ష మందితా
ననురతి వీడి చంపమని యానతి నిచ్చిన దుష్టశీలుడౌ
జనకుని జంపినట్తి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅనయమువంశమబ్ధినినయంబునపోంగగఁజేయుచంద్రుడై
రిప్లయితొలగించండిమనుటకువిష్ణుపాదములమానకగోల్చినబాలుడాయెడన్
పనిగోనివైరమూనుచుతపంబునుఁజేసినతండ్రిముక్తికై
జనకునిఁజంపినట్టిగుణశాలికిమ్రోక్కెదరెల్లవారలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిరామ సతినుంచి లంకలో రావణుండు
వినక యాలిని తమ్ముని వెఱవ కున్న
నెగసి కూల్చంగ రాముండు, నింద్రజిత్తు
జనకుఁ జంపినవానికి జనుల నతులు
చంపకమాల
తనదొక స్వర్ణలంక యని త్ర్యక్షుని దీవెన గల్గు మేటి భా
వనలకు దూరమై పరమ పావని సీతను బంధి జేయుచున్
బెనఁకువ గోరి రాఘవుని వేటుకు జిక్కిన మోహి యింద్రజి
జ్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిసవరించిన చంపకం:
చంపకమాల
తనదొక స్వర్ణలంక యని తానొక పాలకుఁడన్న మేటి భా
వనలకు దూరమై పరమ పావని సీతనుఁ బొందు లాలసన్
బెనఁకువ గోరి రాఘవుని వేటుకు జిక్కిన ద్రోహి నింద్రజి
జ్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్
వినయము తోడ దైవకృప
రిప్లయితొలగించండివిస్మయ రీతిని నొంది భావమం
దనిశము శ్రీహరిన్ దలచి
యాతన వెట్టిన తండ్రి కోరికన్
దనర నృసింహరూపమును
దక్షత తోడుత జూపి వేగమే
జనకునిఁ జంపినట్టి గుణ
శాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురువు గారూ
తొలగించండికోతిమూక తోడుత సీత కొరకు రాము
రిప్లయితొలగించండిడధిగమించి సాగరమును, ఆలమందు
మించి రావణు జంపెను, మేఘనాథు
"జనకు, జంపినవానికి జనుల నతులు"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి~~~~~~~~~~~~~~~~~~
రిప్లయితొలగించండిజనకుని పుత్రి జానకిని జంగమ
వేషపు ధారణార్థియై
యనుపమ సాధ్వి రాముని మహా
ప్రియ పత్ని దశాన నాఢ్యుడా
దనుజుడు వెంట జేకొనియు
ధైర్యముతో జనె ,యుద్దమంధునన్
ఘను భుజశాలి పుత్రుడగు గౌరవ
వీరుడు యింద్రజిత్తుకున్
జనకుని జంపినట్టి గుణ శాలికి
మ్రొక్కెదరెల్ల సజ్జనుల్
~~~~~~~~~~~~~~~~~~
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికదనరంగమునందున కపులగూడి
రిప్లయితొలగించండిదుష్టరక్కసిమూకల దురితమణచి
మిక్కుటమగు శౌర్యముజూపి మేఘనాథు
జనకుఁ జంపినవానికి జనుల నతులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
రిప్లయితొలగించండిశంకరాభరణం వారి సమస్య : "జనకుఁ జంపిన వానికి జనుల నుతులు"
ఎందుకో కందం కదం దొక్కి దూకింది.. రెండు పాదాలు బిరబిరా వచ్చాయి.
అదృష్టమేమిటంటె ప్రాస, గణాలు సరిపోవడం ..
తనువుయు నరసింహము వలె
తన నఖముల తోడ చీల్చె దానవ పొట్టన్ |
చిన ప్రహ్లాదు "జనకుఁ జం
పిన వానికి జనుల నుతులు" పెట్టిరి కనరే ||
- రాంబాబు కైప
17-05-2021
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తనువుయు' అనడం సాధువు కాదు. "తనువే/తనువది...దానవు కుక్షిన్" అనండి. (దానవపొట్ట.. దుష్టసమాసం)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసతుల శీలము దోయుచు చంపు దుష్ట
రిప్లయితొలగించండియువకుని నెలవు కనుగొనె యువతి సృజన
వాడిని తునిమి నభటుడు వాసు,ఆ సృ
"జనకు, జంపినవానికి జనుల నతులు"
మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి"దోచుచు..వానిని తునిమి" అనండి.
దనుజుఁడు శంభరాసురుఁడు తాను జయింప జనించు మృత్యువున్
రిప్లయితొలగించండికనుగొని సంద్రమందు జని గ్రక్కున ముంచగ మ్రింగు చేపకుం
బనుగొను వాని జాలరులు భద్రముగా నిడ పెంచినట్టియా
జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజనకుడు తీవ్రవాదిమరిజన్మనొసంగిన తల్లిపెంచగా
రిప్లయితొలగించండితనయుడు గొప్పశిక్షణనుతానొక చక్కని ఐపిఎస్ గ నై
తనపని లోనిభాగముగతండ్రిని కాల్పుల జంపెకానలో
“జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివనమునలక్కయింటమునుబ్రాణమునిల్పినసోదరుండుదా
రిప్లయితొలగించండిరణముననర్థభాగముగరాజగువానినిజీల్చివేయగా,
ఘనుడగురాజరాజునునుగాయముజేయగనెంచిలక్ష్మణా
జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్”
కొరుప్రోలు రాధాకృష్ణరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రాజరాజునునుగాయము' అర్థం కాలేదు. 'లక్ష్మణ జనకుని' అనడం సాధువు.
వనమున నున్నజానకిని వంచనతో గొని పోవ లంకకున్
రిప్లయితొలగించండికనుకొని సీతజాడ దశకంఠుని రాజ్యము నందు తోటలో
వనటనొసంగి నట్టి కడుఁ బాపి నిశాచరుడైన యింద్రజిత్
జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిజనకుని పుత్రి రామసతి జానకి సద్గుణ శీలి బంధిసే
సిన మనుజాశనుండు శశి శేఖర భక్తుడు పంక్తి కంఠునిన్
దునుమదలంచి వానరులతో తిమి దాటి సమిత్తు నింద్రజి
జ్జనకుని జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిజనకు నాహ్వానమే లేక చనెను పుత్రి
యిష్టి గాంచగ పుట్టింటి యిచ్ఛ తోను
ఈస డించగ నంతనె ఈశు సతికి
జనకు జంపిన వానికి జనుల నుతులు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పుట్టింటి కిచ్ఛతోను"
మునిజనసజ్జనాదులకు ముప్పు ఘటించుచు హింసకుండునై
రిప్లయితొలగించండివనరుహనాభదుష్టపరిపంథియునౌ నరకాసురాధమున్
కనలుచు, పత్ని సత్య సహకారము లొప్పగ ధూర్తధీతమో
జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇనకుల వార్ధి చంద్రుడతడేలిన కాలము రామరాజ్యమై
రిప్లయితొలగించండిదనరెను విశ్వమందు ఘనతన్ వహియించిన పుణ్యమూర్తికిన్
మునిజనవంద్యుకున్ విమలమూర్తికి రాముకు మేఘనాధునిన్
జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వంద్యునకున్, రామునకు' అనడం సాధువులు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికాంచఁ గలికాలమున నిట్టి ఘనులు కలరు
తొలగించండికేవల ధనార్తు లధములు కేలి లీల
నవ్వ యాస్తికై నిర్దయ నెవ్వ రిత్త్రు
జనకుఁ జంపినవానికి జనుల నతులు
ఇనకుల వంశ వర్ధనున కిద్ధ చరిత్రున కేక సత్య వా
గ్ఘనునకు సత్య శౌర్య గుణ గణ్యున కిద్ధర సీత భర్త కా
యనయుని లోకరావణు దశానను భండన మందు నింద్రజి
జ్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమరణ శిక్షను విధియింత్రు దొరలు సుమ్ము
రిప్లయితొలగించండిజనకు జంపిన వానికి,జనుల నతులు
శాశ్వ తంబుగ నుండును సజ్జనులకు
వారి మంచియే వారిని బ్రస్తుతించు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజనకుని జంపినట్టి గుణశాలికీ మ్రొక్కెదరెల్ల సజ్జనుల్
రిప్లయితొలగించండికనుమరు గాయెనే భువిని గావగ దండ్రిని ధైర్య శాలురల్
జనకుని జంపు వాని గుణశాలిగ బల్కుట చిత్రమే గదా
వినగను రోత పుట్టె నిది పేలగ మారెను లోకమే సుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన బల గర్వితుండతడధర్మ పరాయణుడై చరించుచున్
రిప్లయితొలగించండిజనులను బాధ పెట్టు పలు చట్టములన్ విధియించి క్రూరతన్
పెనగుచు వారి యాస్తులను వేచు దురాత్ముని వావి యెంచకన్
జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్
ధర్మరక్షణ చేయంగ ధరణి యందు
రిప్లయితొలగించండినవతరించె త్రేతాయుగమందుహరియు
ఇలజనపహరించినవాడు యింద్రజిత్తు
జనకు జంపిన వానికి జనుల నతులు.
తాను చేసిన మోసము తెలుపకుండ
రిప్లయితొలగించండిఎదుటివారిని ప్రశ్నించి నేమిచేయు
ప్రజలమోదముపొందిన ఫలమునొందు
జనకు జంపిన వానికి జనులనుతులు