28-5-2021 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా”(లేదా...)“భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్”
రోగమ్ముల పాలగురాభోగాసక్తుండె ; మోక్షమునుఁ బొందుఁ గదా”సాగర పుత్రి పతినెపుడు రాగమ్మున భజన సేయు రాజుల్ పేదల్...భారతీనాథ్ చెన్నంశెట్టి...
తాఁగనెభోగముననమయశ్రీగిరియందునకనగనుసిరిసంపదలన్ఆగనిపాటలరాగముభోగాసక్తుండెమోక్షమునుఁబోందుఁగదా
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅శంకరాభరణం వారి సమస్య : “భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా”భోగమతిశయము కాగా భోగికి భోగము వెగటును బుట్టును నిజమౌ వేగమె విరసము పొందగ “భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా”- రాంబాబు కైప 27-05-2021🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
కందంమూగెడు నాలోచనలన్సాగక మది శ్వాస మీద శ్రద్ధనిడఁగ ధ్యానాగమనమ్మునఁ దనరెడుభోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదాశార్దూలవిక్రీడితముమూగన్ శ్రాంతము లేని యోచనలు నిర్మోహుండునై వానితోసాగన్జాలక శ్వాసపై మివుల ధ్యాసన్ గూర్చి ధ్యానంబునన్రాగమ్మేర్పడ విశ్వశక్తిని సహస్రారమ్మునన్ బొందెడున్భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్
రాగము బంధము నిచ్చునుభోగము బాధన్వరించి పోరామి నిడున్యోగాభ్యాసంబున నిర్భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా!
సమస్య :భోగాసక్తుడు రాగబద్ధుడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్ ( మోహావేశంతో మునిశాపం మరచి తనవెంట బడుతున్న పాండురాజుతో మాద్రీదేవి )శార్దూలవిక్రీడితము ...........................ఆగుండాగుడు ; వెంటనంటకుడు ; వే గాలోల ! ప్రాణేశ్వరా !మూగేనయ్య ! మహాభయంకరములౌ మ్రోతల్ ద్వదీయంబునౌ జేగీయాంచలజీవితాన ; నను స్పర్శింపంగ రాబోకుమా !భోగాసక్తుడు - రాగబద్ధుడు - గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్ .
కె.వి.యస్. లక్ష్మి: భోగమ్ములు పెంచుకొనిన రాగ ద్వేషములు పెరుగు రయముగ నెపుడున్ యోగాభ్యాసము నందున భోగాసక్తుండె మోక్షమును బొందు గదా!
రాగాలాపనఁజేసెగానతఁడుదారాన్రుత్యసమ్మేళనన్కాగాభావముక్రుష్ణుపాటగనునాకాళిందిమ్రోతన్గనన్వాగర్ధంబులధారగావరలెసంప్రాప్త్యంబుపారంబునైభోగాసక్తుడురాగబద్ధుడుగనున్మోక్షమ్మువేగమ్మునన్జయదేవుడు, పద్మావతిచరణచారణచక్రవర్తియైమోక్షమునందుట
భోగేచ్ఛను విడనాడుచురాగద్వేషాల విడి నిరాకారుని యభ్యాగతము పొంద సతమాభోగాసక్తుండె మోక్షమును బొందుగదా! (ఆభోగము ...ప్రయత్నము)(అభ్యాగతము సన్నిధి చేరువ)త్యాగంబున్నత ధర్మమంచెఱగి సత్యంబెప్పుడున్ వీడకన్ భోగమ్మన్నను రోసి నిర్గుణుడు సంపూజ్యుండనే కొల్వగన్ రాగద్వేషము లెల్ల వీడుచునహో రాత్రమ్ము సంసిద్ధి యాభోగాసక్తుడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్మునన్.
త్యాగ ధనుండై పరులకు రాగల కష్టముల యందు రక్షకు డగుచున్ నాగా భరణుని సేవా భోగా సక్తు o డె మోక్షమును బొందుఁ గదా
త్యాగానందము బంచువాడు సతమున్ ధర్మాత్ముడై మాన్యుడైతా గర్వాంధుడుగాక దీనజనులన్ దాక్షిణ్య భావంబుతోరాగ ద్వేషము వీడి మానవులపై ప్రత్యేక చిత్తాత్మతోభోగాసక్తుడు రాగబద్దుడు గనున్ మోక్షమ్ము వేగమ్మునన్
మల్లెల.నాగరాజరాగాతీత మనంబు నాగమ వచో గ్రాహ్యత్వ సంచారుడైత్యాగోద్దీప ప్రవర్తనా నిరతుడై హ్లాదంపు సౌహృద్యుడైప్రాగారమ్ముగ నిల్చి సత్యముకు విభ్రాజిల్లు శ్రేష్ఠుండు సద్భోగాసక్తుడు, రాగబద్ధుడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్!
త్యాగముజేసి విషయములనాగతి నీవెయని గొప్ప నమ్మికతోడన్నాగాభరణుని జేరెడుభోగాసక్తుండె మోక్షమును బొందుకదారాగద్వేషములన్ ద్యజించి మదిలో లక్ష్మీపతిన్ దల్చుచున్యోగాభ్యాసము ధ్యానధారణలచే నోడించి చిత్తమ్మునన్త్యాగంబే నిజమార్గమంచు పరమాత్మజ్ఞాన సంపాద్య సద్భోగాసక్తుడు రాగబద్ధుడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్
రోగాన్వితుడౌ తథ్యముభోగాసక్తుండె; మోక్షమును బొందుకదారాగమ్మును మరలించిననాగాభరణుని కెలంకు నమ్మికతోడన్
రాగద్వేషములనియెడురోగమ్ములబారినపడి రోజుచు కడకున్రాగము త్యజియించు విగతభోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా
యోగానందము పొంద భక్తులకిలన్ యుక్తమ్ము నారాధనేయాగమ్మే నిలసేయ యన్యవిధముల్, యందేను సూక్ష్మమ్ముగాశ్రీగర్భుండు హరే తనూ, హరిని తా సేవించు యా దైవసంభోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్
ప్రతికూల ధోరణిలో , మోక్షము గనుట అంటే తప్పు తెలుసు కొనుట అనే అర్థం గా ఈ ప్రయత్నము: శా: పోగాలమ్మది దాపురించ నకటా ముప్పొద్దులన్ ద్రాగుచున్డేగల్లాగున వాలుచున్ మగువలన్ ఢీకొట్టి వేధించగన్లాగించంగను గుట్టు రక్షక భటుల్ లాఠీల నాడింపగన్భోగాసక్తుడు రాగ బద్ధుడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్ వై. చంద్రశేఖర్
నాగేంద్రున్ గాచిన యవ్వాగీశుని తండ్రి నెపుడు భావము నందున్రాగముతోడన్ సద... యనుభోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా.నాగేంద్రుడు-గజరాజుఅనుభోగము-ప్రత్యక్షజ్ఞానము (ఆంధ్రభారతి)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅శంకరాభరణం వారి సమస్య : “భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్”శార్ధూల విక్రీడితము : భోగంబే, ప్రియరాగమై సలుపుచూ, భోగార్థియై నుండగా వేగంబే, వెగటంచు వాడటు , మదిన్ విశ్వేశ్వరున్ కొల్వగా రాగంబే యనురాగమై తలచుచూ ప్రార్థించి ముక్తిన్ బడన్ “భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్”- రాంబాబు కైప 27-05-2021🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
భోగపు లాలస వీడినవేగిరమే మార్పు గలుగు వీక్షింపంగాయోగిగ మారినయట్టి నిర్భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅శంకరాభరణం వారి సమస్య : “భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా”భోగము అన్న, పూరీలో సమర్పించు నైవేద్యము అన్న భావనతో భోగమొసంగుచనుదినము భోగము మెచ్చునటువంటి పూరీ హరికిన్ బాగుగ పూజలు జేసిన “భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా”- రాంబాబు కైప 28-05-2021🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅శంకరాభరణం వారి సమస్య : “భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా”భోగమతిశయము కాగా భోగికి భోగము వెగటును బుట్టును నిజమౌ వేగమె విరసము పొందగ “భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా”- రాంబాబు కైప 27-05-2021🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅శంకరాభరణం వారి సమస్య : “భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా”భోగుడు "ఓషో రజనీశ్ "భోగులకొక యాశ్రమమును , పుణెలో కట్టెన్ భోగుల కోరి తెలిపెనిటు “భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా”- రాంబాబు కైప 27-05-2021🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
భోగమ్ముల్యవి యేల శంకరుకు ప్రేమోత్సాహి శత్రుండుకున్, నాగమ్మున్మెడనుండు శంభుకును, నానా క్లేశ సంహారుకున్; రాగమ్మున్కడలేంద్రు పుత్రి పతినిన్ లక్ష్యంబు కొల్వంగనాభోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
రాగద్వేషవిలోలచిత్తదమనప్రావీణ్యతన్ నిచ్చలున్భోగాకాంక్షల వీడియుండు నల నిర్మోహుండు చింతాపరిత్యాగుండున్ వరధర్మకార్యరతుడున్ దైత్యారిపాదార్చనాభోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్.అర్చనా + ఆభోగ + ఆసక్తుడుకంజర్ల రామాచార్య.
శ్రీగోదాపదఁబాశురంబులవిరాశీభూతధర్మంబునైశ్రీగాయత్రిసుమంత్రమేఁదనదుసంక్షేమంబునర్థంబునైశ్రీగాత్రంబునధర్మమర్థములుసుశ్శీలంపుఁగామంబునౌభోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్కొరుప్రోలు రాధాకృష్ణ రావు
ఆగని జన్మ పరంపరవీగని బంధనములందు వేదననొందన్వేగమె కైవల్యంబువభోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా
రోగప్రావృతుడౌను సౌఖ్య ముడుగున్ రోయున్ స్వధర్మంబులన్వాగీశాదిసమస్తనిర్జరకృపన్ బాయున్ మహోగ్రాఘియైసాగున్ శాశ్వతహర్షదాయకములౌ చందంబు లన్నింటికిన్భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్
రాగమ్మున్ హరి పైన నిల్పి ధృతితో ప్రార్థించుచున్ భక్తితోసాగంద్రోలుచు స్వార్థ చింతన సదా సౌహార్ద చిత్తమ్ముతోత్యాగమ్ముల్ కడు బీదవారి కొరకై యాసక్తితో చేయు నిర్భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్
వేగును కామాగ్ని నెపుడుభోగాసక్తుండె; మోక్షమునుఁ బొందుఁ గదారాగద్వేషములను విడియోగాభ్యాసమున మది నియుక్తంబైనన్
రోగాల బారి పడునటభోగాసక్తుండె,మోక్షమును బొందుగదాభోగంబులు విడనాడుచునంగజహరు సేవనమున నార్తింగల్గన్
రాగద్వేషములుజ్జగించి పరదారాసౌఖ్యమున్గోరకన్యోగాభ్యాసముసల్పి మానసము సంయోగించి యేకాగ్రతన్నాగాలంకృతుడీశుకున్ సలుప ధ్యానంబున్ గతంబందునన్భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్మోక్షమ్ము వేగమ్ముగన్
వేగమ పూర్వ మజామిళుఁడేఁగెను బాపక్షయమున నింపుగ దివికిం బోఁగాలమున హరిఁ దలఁప భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా నాగేంద్రాస్తర చిద్విలాసుని హరిన్ నాగేంద్ర సంకీర్తితున్ నాగేంద్రాభరణాప్తుఁ గొల్వ నెడఁదన్ నాగేంద్ర ధారిన్ ధరన్ వాగౌన్నత్యము వెల్గుచుండ హరిసేవా నామ తత్కీర్తనాభోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్ [ హరిసేవానామ భోగాసక్తుఁడు, తత్కీర్తనా రాగబద్ధుఁడు]
భోగమ్ముల్ రుచిఁ జూచి, పొంది సుతులన్, బూర్ణాత్ముఁడై వాంఛలన్,రాగమ్ముల్ ద్యజియించి, యింద్రియములన్ లక్షించి సర్వేశు, లోసాగంజాలిన నా తురీయము దెసన్ చాలింక నా ముక్తి సంభోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్.
భోగా సక్తుడు రాగబద్ధుడు గనున్ మోక్షమ్ము వేగమ్మునన్ భోగాసక్తుడు బోవు రౌరవము దాభోగమ్ములన్ మున్గుటన్రాగాసక్తుడు దాగనున్ దివి హృదిన్ రాగమ్ము నాలాపనన్వేగంసంతస మొంది దేవతఋలొగిన్ వేదీవనల్ నీయుటన్
నాగేంద్రశయాను గొలిచిరాగాతీతహరిపదనిరతభక్తుండైవేగమె కైవల్యోచితభోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా!కంజర్ల రామాచార్య.
రాగముతోడను గడుపుచు భోగమ్ములననుభవించి పుడమిన తుదకున్ భోగముపై యాశ విడిన భోగా సక్తుండె మోక్షమును పొందుగదా
ఆ గర్వోన్నతుడా హిరణ్యకశిపుండందెన్ శమంబొంటమిన్ఆ గర్హ్యుండగు రావణాసురుడు మోక్షంబందె రామారియైసాగించెన్ శిశుపాలుడీసడము మోక్షంబందె వాచాలుడైభోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్
మాగాణుల్ దున్నుచు పుడమిన్నూగారెడు ధాన్యమున్ జనుల యాకలినిన్పోగార్చగ పండించెడుభోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా
తప్పు ఇలాగ సవరించాను దయతో గ్రహించగలరు.మాగాణుల్ దున్ని సదానూగారెడు ధాన్యమున్ జనుల యాకలినిన్పోగార్చగ పండించెడుభోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా
రోగమ్ముల పాలగురా
రిప్లయితొలగించండిభోగాసక్తుండె ; మోక్షమునుఁ బొందుఁ గదా”
సాగర పుత్రి పతినెపుడు
రాగమ్మున భజన సేయు రాజుల్ పేదల్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
తాఁగనెభోగముననమయ
రిప్లయితొలగించండిశ్రీగిరియందునకనగనుసిరిసంపదలన్
ఆగనిపాటలరాగము
భోగాసక్తుండెమోక్షమునుఁబోందుఁగదా
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
రిప్లయితొలగించండిశంకరాభరణం వారి సమస్య : “భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా”
భోగమతిశయము కాగా
భోగికి భోగము వెగటును బుట్టును నిజమౌ
వేగమె విరసము పొందగ
“భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా”
- రాంబాబు కైప
27-05-2021
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
కందం
రిప్లయితొలగించండిమూగెడు నాలోచనలన్
సాగక మది శ్వాస మీద శ్రద్ధనిడఁగ ధ్యా
నాగమనమ్మునఁ దనరెడు
భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా
శార్దూలవిక్రీడితము
మూగన్ శ్రాంతము లేని యోచనలు నిర్మోహుండునై వానితో
సాగన్జాలక శ్వాసపై మివుల ధ్యాసన్ గూర్చి ధ్యానంబునన్
రాగమ్మేర్పడ విశ్వశక్తిని సహస్రారమ్మునన్ బొందెడున్
భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్
రాగము బంధము నిచ్చును
రిప్లయితొలగించండిభోగము బాధన్వరించి పోరామి నిడున్
యోగాభ్యాసంబున ని
ర్భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా!
సమస్య :
రిప్లయితొలగించండిభోగాసక్తుడు రాగబద్ధుడు గనున్
మోక్షమ్ము వేగమ్ముగన్
( మోహావేశంతో మునిశాపం మరచి తనవెంట బడుతున్న పాండురాజుతో మాద్రీదేవి )
శార్దూలవిక్రీడితము
...........................
ఆగుండాగుడు ; వెంటనంటకుడు ; వే
గాలోల ! ప్రాణేశ్వరా !
మూగేనయ్య ! మహాభయంకరములౌ
మ్రోతల్ ద్వదీయంబునౌ
జేగీయాంచలజీవితాన ; నను స్ప
ర్శింపంగ రాబోకుమా !
భోగాసక్తుడు - రాగబద్ధుడు - గనున్
మోక్షమ్ము వేగమ్ముగన్ .
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిభోగమ్ములు పెంచుకొనిన
రాగ ద్వేషములు పెరుగు రయముగ నెపుడున్
యోగాభ్యాసము నందున
భోగాసక్తుండె మోక్షమును బొందు గదా!
రాగాలాపనఁజేసెగానతఁడుదారాన్రుత్యసమ్మేళనన్
రిప్లయితొలగించండికాగాభావముక్రుష్ణుపాటగనునాకాళిందిమ్రోతన్గనన్
వాగర్ధంబులధారగావరలెసంప్రాప్త్యంబుపారంబునై
భోగాసక్తుడురాగబద్ధుడుగనున్మోక్షమ్మువేగమ్మునన్
జయదేవుడు, పద్మావతిచరణచారణచక్రవర్తియైమోక్షమునందుట
భోగేచ్ఛను విడనాడుచు
రిప్లయితొలగించండిరాగద్వేషాల విడి నిరాకారుని య
భ్యాగతము పొంద సతమా
భోగాసక్తుండె మోక్షమును బొందుగదా!
(ఆభోగము ...ప్రయత్నము)(అభ్యాగతము సన్నిధి చేరువ)
త్యాగంబున్నత ధర్మమంచెఱగి సత్యంబెప్పుడున్ వీడకన్
భోగమ్మన్నను రోసి నిర్గుణుడు సంపూజ్యుండనే కొల్వగన్
రాగద్వేషము లెల్ల వీడుచునహో రాత్రమ్ము సంసిద్ధి యా
భోగాసక్తుడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్మునన్.
త్యాగ ధనుండై పరులకు
రిప్లయితొలగించండిరాగల కష్టముల యందు రక్షకు డగుచున్
నాగా భరణుని సేవా
భోగా సక్తు o డె మోక్షమును బొందుఁ గదా
త్యాగానందము బంచువాడు స
రిప్లయితొలగించండితమున్ ధర్మాత్ముడై మాన్యుడై
తా గర్వాంధుడుగాక దీనజను
లన్ దాక్షిణ్య భావంబుతో
రాగ ద్వేషము వీడి మాన
వులపై ప్రత్యేక చిత్తాత్మతో
భోగాసక్తుడు రాగబద్దుడు గ
నున్ మోక్షమ్ము వేగమ్మునన్
మల్లెల.నాగరాజ
రిప్లయితొలగించండిరాగాతీత మనంబు నాగమ వచో గ్రాహ్యత్వ సంచారుడై
త్యాగోద్దీప ప్రవర్తనా నిరతుడై హ్లాదంపు సౌహృద్యుడై
ప్రాగారమ్ముగ నిల్చి సత్యముకు విభ్రాజిల్లు శ్రేష్ఠుండు స
ద్భోగాసక్తుడు, రాగబద్ధుడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్!
త్యాగముజేసి విషయముల
రిప్లయితొలగించండినాగతి నీవెయని గొప్ప నమ్మికతోడన్
నాగాభరణుని జేరెడు
భోగాసక్తుండె మోక్షమును బొందుకదా
రాగద్వేషములన్ ద్యజించి మదిలో లక్ష్మీపతిన్ దల్చుచున్
యోగాభ్యాసము ధ్యానధారణలచే నోడించి చిత్తమ్మునన్
త్యాగంబే నిజమార్గమంచు పరమాత్మజ్ఞాన సంపాద్య స
ద్భోగాసక్తుడు రాగబద్ధుడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్
రోగాన్వితుడౌ తథ్యము
తొలగించండిభోగాసక్తుండె; మోక్షమును బొందుకదా
రాగమ్మును మరలించిన
నాగాభరణుని కెలంకు నమ్మికతోడన్
రాగద్వేషములనియెడు
రిప్లయితొలగించండిరోగమ్ములబారినపడి రోజుచు కడకున్
రాగము త్యజియించు విగత
భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా
యోగానందము పొంద భక్తులకిలన్ యుక్తమ్ము నారాధనే
రిప్లయితొలగించండియాగమ్మే నిలసేయ యన్యవిధముల్, యందేను సూక్ష్మమ్ముగా
శ్రీగర్భుండు హరే తనూ, హరిని తా సేవించు యా దైవసం
భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్
ప్రతికూల ధోరణిలో , మోక్షము గనుట అంటే తప్పు తెలుసు కొనుట అనే అర్థం గా ఈ ప్రయత్నము:
రిప్లయితొలగించండిశా:
పోగాలమ్మది దాపురించ నకటా ముప్పొద్దులన్ ద్రాగుచున్
డేగల్లాగున వాలుచున్ మగువలన్ ఢీకొట్టి వేధించగన్
లాగించంగను గుట్టు రక్షక భటుల్ లాఠీల నాడింపగన్
భోగాసక్తుడు రాగ బద్ధుడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్
వై. చంద్రశేఖర్
నాగేంద్రున్ గాచిన య
రిప్లయితొలగించండివ్వాగీశుని తండ్రి నెపుడు భావము నందున్
రాగముతోడన్ సద... యను
భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా.
నాగేంద్రుడు-గజరాజు
అనుభోగము-ప్రత్యక్షజ్ఞానము (ఆంధ్రభారతి)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
రిప్లయితొలగించండిశంకరాభరణం వారి సమస్య : “భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్”
శార్ధూల విక్రీడితము :
భోగంబే, ప్రియరాగమై సలుపుచూ, భోగార్థియై నుండగా
వేగంబే, వెగటంచు వాడటు , మదిన్ విశ్వేశ్వరున్ కొల్వగా
రాగంబే యనురాగమై తలచుచూ ప్రార్థించి ముక్తిన్ బడన్
“భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్”
- రాంబాబు కైప
27-05-2021
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
భోగపు లాలస వీడిన
రిప్లయితొలగించండివేగిరమే మార్పు గలుగు వీక్షింపంగా
యోగిగ మారినయట్టి ని
ర్భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
రిప్లయితొలగించండిశంకరాభరణం వారి సమస్య : “భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా”
భోగము అన్న, పూరీలో సమర్పించు నైవేద్యము అన్న భావనతో
భోగమొసంగుచనుదినము
భోగము మెచ్చునటువంటి పూరీ హరికిన్
బాగుగ పూజలు జేసిన
“భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా”
- రాంబాబు కైప
28-05-2021
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
రిప్లయితొలగించండిశంకరాభరణం వారి సమస్య : “భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా”
భోగమతిశయము కాగా
భోగికి భోగము వెగటును బుట్టును నిజమౌ
వేగమె విరసము పొందగ
“భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా”
- రాంబాబు కైప
27-05-2021
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
శంకరాభరణం వారి సమస్య : “భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా”
భోగుడు "ఓషో రజనీశ్ "
భోగులకొక యాశ్రమమును , పుణెలో కట్టెన్
భోగుల కోరి తెలిపెనిటు
“భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా”
- రాంబాబు కైప
27-05-2021
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
భోగమ్ముల్యవి యేల శంకరుకు ప్రేమోత్సాహి శత్రుండుకున్,
రిప్లయితొలగించండినాగమ్మున్మెడనుండు శంభుకును, నానా క్లేశ సంహారుకున్;
రాగమ్మున్కడలేంద్రు పుత్రి పతినిన్ లక్ష్యంబు కొల్వంగనా
భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
రాగద్వేషవిలోలచిత్తదమనప్రావీణ్యతన్ నిచ్చలున్
రిప్లయితొలగించండిభోగాకాంక్షల వీడియుండు నల నిర్మోహుండు చింతాపరి
త్యాగుండున్ వరధర్మకార్యరతుడున్
దైత్యారిపాదార్చనా
భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్.
అర్చనా + ఆభోగ + ఆసక్తుడు
కంజర్ల రామాచార్య.
శ్రీగోదాపదఁబాశురంబులవిరాశీభూతధర్మంబునై
రిప్లయితొలగించండిశ్రీగాయత్రిసుమంత్రమేఁదనదుసంక్షేమంబునర్థంబునై
శ్రీగాత్రంబునధర్మమర్థములుసుశ్శీలంపుఁగామంబునౌ
భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
ఆగని జన్మ పరంపర
రిప్లయితొలగించండివీగని బంధనములందు వేదననొందన్
వేగమె కైవల్యంబువ
భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా
రోగప్రావృతుడౌను సౌఖ్య ముడుగున్ రోయున్ స్వధర్మంబులన్
రిప్లయితొలగించండివాగీశాదిసమస్తనిర్జరకృపన్ బాయున్ మహోగ్రాఘియై
సాగున్ శాశ్వతహర్షదాయకములౌ చందంబు లన్నింటికిన్
భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్
రాగమ్మున్ హరి పైన నిల్పి ధృతితో ప్రార్థించుచున్ భక్తితో
రిప్లయితొలగించండిసాగంద్రోలుచు స్వార్థ చింతన సదా సౌహార్ద చిత్తమ్ముతో
త్యాగమ్ముల్ కడు బీదవారి కొరకై యాసక్తితో చేయు ని
ర్భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివేగును కామాగ్ని నెపుడు
రిప్లయితొలగించండిభోగాసక్తుండె; మోక్షమునుఁ బొందుఁ గదా
రాగద్వేషములను విడి
యోగాభ్యాసమున మది నియుక్తంబైనన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరోగాల బారి పడునట
రిప్లయితొలగించండిభోగాసక్తుండె,మోక్షమును బొందుగదా
భోగంబులు విడనాడుచు
నంగజహరు సేవనమున నార్తింగల్గన్
రాగద్వేషములుజ్జగించి పరదారాసౌఖ్యమున్గోరకన్
రిప్లయితొలగించండియోగాభ్యాసముసల్పి మానసము సంయోగించి యేకాగ్రతన్
నాగాలంకృతుడీశుకున్ సలుప ధ్యానంబున్ గతంబందునన్
భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్మోక్షమ్ము వేగమ్ముగన్
వేగమ పూర్వ మజామిళుఁ
రిప్లయితొలగించండిడేఁగెను బాపక్షయమున నింపుగ దివికిం
బోఁగాలమున హరిఁ దలఁప
భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా
నాగేంద్రాస్తర చిద్విలాసుని హరిన్ నాగేంద్ర సంకీర్తితున్
నాగేంద్రాభరణాప్తుఁ గొల్వ నెడఁదన్ నాగేంద్ర ధారిన్ ధరన్
వాగౌన్నత్యము వెల్గుచుండ హరిసేవా నామ తత్కీర్తనా
భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్
[ హరిసేవానామ భోగాసక్తుఁడు, తత్కీర్తనా రాగబద్ధుఁడు]
భోగమ్ముల్ రుచిఁ జూచి, పొంది సుతులన్, బూర్ణాత్ముఁడై వాంఛలన్,
రిప్లయితొలగించండిరాగమ్ముల్ ద్యజియించి, యింద్రియములన్ లక్షించి సర్వేశు, లో
సాగంజాలిన నా తురీయము దెసన్ చాలింక నా ముక్తి సం
భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్.
భోగా సక్తుడు రాగబద్ధుడు గనున్ మోక్షమ్ము వేగమ్మునన్
రిప్లయితొలగించండిభోగాసక్తుడు బోవు రౌరవము దాభోగమ్ములన్ మున్గుటన్
రాగాసక్తుడు దాగనున్ దివి హృదిన్ రాగమ్ము నాలాపనన్
వేగంసంతస మొంది దేవతఋలొగిన్ వేదీవనల్ నీయుటన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినాగేంద్రశయాను గొలిచి
రిప్లయితొలగించండిరాగాతీతహరిపదనిరతభక్తుండై
వేగమె కైవల్యోచిత
భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా!
కంజర్ల రామాచార్య.
రాగముతోడను గడుపుచు
రిప్లయితొలగించండిభోగమ్ములననుభవించి పుడమిన తుదకున్
భోగముపై యాశ విడిన
భోగా సక్తుండె మోక్షమును పొందుగదా
ఆ గర్వోన్నతుడా హిరణ్యకశిపుండందెన్ శమంబొంటమిన్
రిప్లయితొలగించండిఆ గర్హ్యుండగు రావణాసురుడు మోక్షంబందె రామారియై
సాగించెన్ శిశుపాలుడీసడము మోక్షంబందె వాచాలుడై
భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమాగాణుల్ దున్నుచు పుడమిన్
రిప్లయితొలగించండినూగారెడు ధాన్యమున్ జనుల యాకలినిన్
పోగార్చగ పండించెడు
భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా
తప్పు ఇలాగ సవరించాను దయతో గ్రహించగలరు.
రిప్లయితొలగించండిమాగాణుల్ దున్ని సదా
నూగారెడు ధాన్యమున్ జనుల యాకలినిన్
పోగార్చగ పండించెడు
భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా