30-5-2021 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే”(లేదా...)“రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై”
సమస్య :రోహిణి వచ్చినంత గని రోసె శశాంకుడు భీతచిత్తుడై (తారాశశాంకము - రోహిణి ఆగమనము )ఊహకు నందనట్లు హృది యూగుచునుండగ నాశ్రమమ్ములో దేహము విస్మరించి ; తన దివ్యపు జన్మను నెంచకుండగన్ మోహపు బుద్ధి దారకయి మున్గుచు దేలుచు నున్నవేళలో రోహిణి వచ్చినంత ; గని ;రోసె శశాంకుడు భీతచిత్తుడై .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పాహియని జనులు రోసిరి రోహిణి వచ్చుటను గాంచి , రోసెను శశియేదేహములు కమిలిన జనులహాహాకారములను విని హరుని శిరముపై...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆహా! బృహస్పతి సతియెమోహముతో చెంతజేరు బుక్కమునందున్ వాహనముపైన నటుగారోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే.
సాహసమేగాచూడగగ్రాహముగాగనుతనువునుగ్రమ్మెనుమబ్బుల్ఏహ్యమునయ్యెనుబతుకేరోహిణివచ్చుటనుగాంచిరోసెనుశశియే
దాహము పెరిగెను జనులకు తాహతు గల వారి కైన తాపము హెచ్చె న్ పాహి యనె జీవ తతియును రోహిణి వచ్ఛు టను గాంచి రోసెను శశి యే !
కందంమోహ వివశుడై తారనుదాహమ్మున పొంద బుధుఁడుఁ దనయుండాయెన్యూహల వారలు నిండఁగరోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే!ఉత్పలమాలమోహమె? సప్తవింశతిగ మోదము గూర్చెడు భార్యలుండినన్!దాహము తీరలేదనుచు తారను సద్గురు పత్నిఁగూడెనేయూహల దేలు వేళ మది నుంపుడు గత్తె, బుధాను లుండఁగన్రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.'ఆయెన్+ఊహల' అన్నపుడు యడాగమం రాదు.
🙏 ధన్యోస్మి గురుదేవా🙏సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన;కందంమోహ వివశుడై తారనుదాహమ్మునఁ గూడ బుధుఁడొదవె! మధురమ్మౌయూహల వారలు నిండఁగరోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే!
సవరణతో...ఉత్పలమాలమోహమె? సప్తవింశతిగ మోదము గూర్చెడు భార్యలుండినన్!దాహము దీరినన్ గతము తారనుఁ గూడియు సంతు గొన్నవౌయూహల దేలు వేళ మది నుంపుడు గత్తె, బుధాను లుండఁగన్రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
దాహము తోడ నోట తడి తగ్గగ దప్పిక తీరకుండచున్,దేహము స్వేదమున్ గలిగి తీగలువారగ పూతిగంథితోన్మోహమువీడుచు జనులు ముద్దియలన్ దరి చేర్చ కుండగన్దోహద మివ్వగన్ రవి,ఉదూ ఖలమున్ పగులంగ చేయు నారోహిణి వచ్చినంత గని రోసె శశాంకుడు భీత చిత్తుడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'తీరకుండచున్'?
దేహహొరంగుగాంచి గురు దీదిచి గేహిని చంచలాక్షియేమోహము తోడ జేరె నట ముద్దుల నాడు నెపమ్ము నత్తరిన్ వాహమునెక్కి పారుషుని వాసము జేరగ దండ్రితో వడిన్ రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుడు భీతచిత్తుడై.
రోహిణి కర్తరి గాడ్పునమోహముతో పతినిగూడి ముచ్చటలాడన్యూహల దేలుచు వడిగారోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ఆడన్+ఊహల' అన్నపుడు యడాగమం రాదు.
రోహిణి మరదలు "శశి"యేవాహనమెక్కిచనుదెంచ,వదిననుజూచెన్దేహమునంతటకారమురోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే.
ఆహా! రోహిణి గాంచెనుసాహో! అని తారతోటి సరసములాడన్ద్రోహీ! చంద్రా! నిలువనిరోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే.
ఆహా! నాభాగ్యమనియెరోహిణి వచ్చుటను గాంచి; రోసెను శశియేసాహసమున వెంట బడెడురాహువు గని పూర్ణమాసి రాతిరి వేళన్ మోహము నాపలేక తనముద్దుల భార్యను గౌగలించెనేరోహిణి వచ్చినంత గని; రోసె శశాంకుడు భీతచిత్తుడైఈహను దీర్చలేదనుచు నింతులు మోపగ నేరమొక్కటైస్నేహమువీడి దక్షుడు విచింతన లేకయె శాపమీయగా
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తుహిన మనంబుతోడ గడుదోరపు సుందర దివ్య తారతోవిహితపు ప్రేమ వాక్యములువెన్నెల రేడొనరించుచుండగామహిత శుభాంగి ప్రేమమయి మాన్యులు మెచ్చిన ధర్మపత్ని యారోహిని వచ్చినంత గని రోసెశశాంకుడు భీతచిత్తుడై.
సమస్యాపాదం ఉత్పలమాల అయితే మీరు చంపకమాల వ్రాసారు.
రోహిణికార్తి యెండలకు లోకములెల్లను తల్లడిల్లికోలాహలమొందువేళ వలరాజు శరంబులు కాక బెట్టగన్మోహము తాళజాలక విమోహితయై తన భర్త చెంతకున్రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై
సమస్య:*రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై.*ప్రయత్నం:ఉ.ఆ హిముఁ, డత్రినందనుడునై, యుచితానుచితంబువీడి, యుద్వాహము నయ్యియుండి, గురుదారను తారను సంశ్రయించుచున్రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై,మోహము గూడదయ్య! మరి బుద్ధి మెలంగిన మచ్చరాదుగా!హిముడు-చంద్రుడుఉద్వాహము-పెళ్లిసంశ్రయించు-ఆశ్రయించు
ఇరువది యేడుగురు భార్యలలో రోహిణి రూపవతి. చంద్రుడు ఆమె యందు ఆసక్తుడై యుండేవాడని, మిగిలిన వారు కోపముతో తండ్రి దక్షప్రజాపతికి తెలిపినపుడు అతడు క్షయ రోగము కలుగునని శపిస్తాడు. ఆసమయంలో రోహిణి పేరు వినగానే భయపడుతాడనే భావనగా నా ప్రయత్నము;ఉ: మోహము మీర ప్రేమగొని ముద్దుల రోహిణి యంచు గూడగన్ద్రోహము జేతువా యనుచు తోడగు భార్యలు తండ్రి జేరగన్దేహము యక్ష్మమై నిలుచు తీరగు శాపము బొంద ఖిన్నుడైరోహిణి వచ్చినంత గని రోసె శశాంకుడు భీతచిత్తుడైయక్ష్మము =క్షయ వై. చంద్రశేఖర్
ధన్యవాదములు
ఊహల దేలుచున్ ముదము వూయల లూగగ పుష్పగుఛ్ఛసందోహము లున్ సువాసనలు తూరపుబట్టగ రంగుపొంగగామోహము పెంచులేమనవ మోహిని రోహిణి వచ్చె ; క్షీణుడై(రోగియై)రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వూహల' అనడం సాధువు కాదు.
మోహమతిశయించగ ప్రియరోహిణితో సంచరించి రోజులు గడిపెన్ఆహా! శాపము తదుపరిరోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే
లోహము వాడి మానవుడు లోకము జూడ యుపగ్రహమ్ములన్వాహనముల్గొనర్చెగద, వాయువె త్రక్కువ వాటి ధీటికిన్రాహువు వచ్చెనా మరల రక్కసుడై యని బ్రాంతి నొందుచున్రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు."...జూడ నుపగ్రహమ్ములన్" అనండి. 'గొనర్చె, త్రక్కువ, ధీటికిన్'?
లోహము వాడి మానవుడు లోకము జూచు, నుపగ్రహమ్ములేవాహనముల్, జగత్తునవి వైనము గాగని చుట్టి వచ్చుగా ,రాహువు వచ్చెనా మరల రక్కసుడై యని బ్రాంతి నొందుచున్రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅శంకరాభరణం వారి సమస్య : “రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే”రోహిణి కానక చంద్రుడు రాహిత్యమున రమణియగు రంభను జేరన్ లోహిత నయనమ్ములతో “రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే”- రాంబాబు కైప 28-05-2021🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
ఆహా! యీదినమున నాతాహతు మించిన సమస్య దయజే సితిరేమోహప డక నే ల యిటులరోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే
సమస్యాపూరణలలో ఇదీ ఒక పద్ధతే... బాగుంది. అభినందనలు.
నిన్నటి పూరణనుడివిన గాని జోస్యులు వినోదము చూతమటంచు పూని యాఘడియల తిందురట్లు ఘనకార్యమొ! వద్దని చెప్పు వాటినిన్తడయక జేతు రట్లయిన తద్వ్యతిరిక్తఫలప్రదమ్మునన్కడు హిత మబ్బులే గ్రహణకాలమునన్ భుజియించువానికిన్.కంజర్ల రామాచార్య.
ఆహా ! యీ సందియములుఐహికమేయని తలచితి నహరహ మందున్రోహిత సూర్యుని వద్దకురోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే
రోహిణి రంజిలిన రోజున బుట్టి యదూద్వహుండు వ్యామోహితుడైన మామ యగు మూర్ఖుని జంపె, దహించు కార్తెయైరోహిణి మండు టెండ నిడి రోలను ముక్కలు జేసె నంచు దారోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడైకంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మొదటి పాదంలో టైపు దోషం వల్ల గణభంగం. సవరించండి.
అవునండీరోహిణి తార రంజిలినఅని ఉండాలి టైపు మరపు.
కె.వి.యస్. లక్ష్మి: ఊహల తేలెను చంద్రుడు రోహిణి వచ్చుటను గాంచి; రోసెను శశియే ఊహాతీతపు వేడికి రోహిణి తాపార్భటమున రోళ్ళే పగలన్.
మోహితుడై నిరతము దారోహిణితో గడుపుననుచు రోసిన సవతుల్బాహాటముగా దెగడగరోహిణి వచ్చుటను గాంచి, రోసెను శశియేమోహితుడై నిరతము దారోహిణితో గడుపుననుచు రోసిరె సవతుల్ఊహాగానమె గానెటరోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే
ఊహలలోన చేరి పతి యూయల లూగుచు చెంగలింప, సందేహముతోడ భర్త పనితీరును భార్యలు గాంచు చుండ సమ్మోహముతోడ తార గని మోదము నొందుచు మించ, దాపుకున్రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై
మోహము మీర సంతతము ముద్దుల రాణివటంచు మెచ్చినన్దోహదమౌ గదా జగతి ద్యోతము హెచ్చగ సూర్యు జెంతకున్రోహిణి వచ్చినంతఁ, గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడైదేహము క్షీణమాయెనరుదెంచనమావస దాగె వేగమున్
ఆహా! యేమని జెప్పుదునూహకు నందకను వచ్చె నుస్సురు గొలుపన్ బాహాటమ్ముగ వెంటనెరోహిణి వచ్చుటను గాంచిరోసెను శశియే
ఆహా విరహము తొలఁగఁగ నీ హాయి లభింప భాగ్యమే కద యనుచున్ మోహముతో విరి దండను రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే [రోయు = వెదకు]దోహద ముండ సంతతము తోరము రోహిణి పైన నన్యులన్ గేహము లందుఁ గాంచఁ డని కిట్టఁగ నశ్విని చంద్రు నంతటన్ స్నేహము మీఱ డెందమున జ్యేష్ఠ వరాశ్విని చెంత నుండఁగా రోహిణి వచ్చి నంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై
రోహిణినా బరంగినిట రోతజనించు విధంబు నుండగాదేహమునందు వెంట్రుకలు తీగెలవోలెను నల్లుకుంటతోగేహమునందుహ్లాదమున గీతము బాడెడు చంద్రుడంతటన్ రోహిణి వచ్చినంతగని రోసె శశాంకుడు భీతచిత్తుడై
మిత్రులందఱకు నమస్సులు!దాహము తీరదాయె; ఘనతాపము హెచ్చుచునుండె; భాస్కరుండీహముతోడ మండుచును నీ భువి యందలి లోకులందఱన్బాహిర మందకుండఁగను బాదుచునుండు కతంపు కార్తెయౌరోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై!
మోహనముగ నవ్వె విధుడురోహిణి వచ్చుటను గాంచి, రోసెను శశియే హాహాకారము చేయుచుస్నేహముతో చెంతరాగచింతించిమదిన్
సమస్య :
రిప్లయితొలగించండిరోహిణి వచ్చినంత గని
రోసె శశాంకుడు భీతచిత్తుడై
(తారాశశాంకము - రోహిణి ఆగమనము )
ఊహకు నందనట్లు హృది
యూగుచునుండగ నాశ్రమమ్ములో
దేహము విస్మరించి ; తన
దివ్యపు జన్మను నెంచకుండగన్
మోహపు బుద్ధి దారకయి
మున్గుచు దేలుచు నున్నవేళలో
రోహిణి వచ్చినంత ; గని ;
రోసె శశాంకుడు భీతచిత్తుడై .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపాహియని జనులు రోసిరి
రిప్లయితొలగించండిరోహిణి వచ్చుటను గాంచి , రోసెను శశియే
దేహములు కమిలిన జనుల
హాహాకారములను విని హరుని శిరముపై
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆహా! బృహస్పతి సతియె
మోహముతో చెంతజేరు బుక్కమునందున్
వాహనముపైన నటుగా
రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసాహసమేగాచూడగ
రిప్లయితొలగించండిగ్రాహముగాగనుతనువునుగ్రమ్మెనుమబ్బుల్
ఏహ్యమునయ్యెనుబతుకే
రోహిణివచ్చుటనుగాంచిరోసెనుశశియే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదాహము పెరిగెను జనులకు
రిప్లయితొలగించండితాహతు గల వారి కైన తాపము హెచ్చె న్
పాహి యనె జీవ తతియును
రోహిణి వచ్ఛు టను గాంచి రోసెను శశి యే !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిమోహ వివశుడై తారను
దాహమ్మున పొంద బుధుఁడుఁ దనయుండాయెన్
యూహల వారలు నిండఁగ
రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే!
ఉత్పలమాల
మోహమె? సప్తవింశతిగ మోదము గూర్చెడు భార్యలుండినన్!
దాహము తీరలేదనుచు తారను సద్గురు పత్నిఁగూడెనే
యూహల దేలు వేళ మది నుంపుడు గత్తె, బుధాను లుండఁగన్
రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'ఆయెన్+ఊహల' అన్నపుడు యడాగమం రాదు.
🙏 ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిసవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన;
కందం
మోహ వివశుడై తారను
దాహమ్మునఁ గూడ బుధుఁడొదవె! మధురమ్మౌ
యూహల వారలు నిండఁగ
రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే!
సవరణతో...
తొలగించండిఉత్పలమాల
మోహమె? సప్తవింశతిగ మోదము గూర్చెడు భార్యలుండినన్!
దాహము దీరినన్ గతము తారనుఁ గూడియు సంతు గొన్నవౌ
యూహల దేలు వేళ మది నుంపుడు గత్తె, బుధాను లుండఁగన్
రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదాహము తోడ నోట తడి తగ్గగ దప్పిక తీరకుండచున్,
రిప్లయితొలగించండిదేహము స్వేదమున్ గలిగి తీగలువారగ పూతిగంథితోన్
మోహమువీడుచు జనులు ముద్దియలన్ దరి చేర్చ కుండగన్
దోహద మివ్వగన్ రవి,ఉదూ ఖలమున్ పగులంగ చేయు నా
రోహిణి వచ్చినంత గని రోసె శశాంకుడు భీత చిత్తుడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తీరకుండచున్'?
రిప్లయితొలగించండిదేహహొరంగుగాంచి గురు దీదిచి గేహిని చంచలాక్షియే
మోహము తోడ జేరె నట ముద్దుల నాడు నెపమ్ము నత్తరిన్
వాహమునెక్కి పారుషుని వాసము జేరగ దండ్రితో వడిన్
రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుడు భీతచిత్తుడై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరోహిణి కర్తరి గాడ్పున
రిప్లయితొలగించండిమోహముతో పతినిగూడి ముచ్చటలాడన్
యూహల దేలుచు వడిగా
రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఆడన్+ఊహల' అన్నపుడు యడాగమం రాదు.
రోహిణి మరదలు "శశి"యే
రిప్లయితొలగించండివాహనమెక్కిచనుదెంచ,వదిననుజూచెన్
దేహమునంతటకారము
రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆహా! రోహిణి గాంచెను
రిప్లయితొలగించండిసాహో! అని తారతోటి సరసములాడన్
ద్రోహీ! చంద్రా! నిలువని
రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆహా! నాభాగ్యమనియె
రిప్లయితొలగించండిరోహిణి వచ్చుటను గాంచి; రోసెను శశియే
సాహసమున వెంట బడెడు
రాహువు గని పూర్ణమాసి రాతిరి వేళన్
మోహము నాపలేక తనముద్దుల భార్యను గౌగలించెనే
రోహిణి వచ్చినంత గని; రోసె శశాంకుడు భీతచిత్తుడై
ఈహను దీర్చలేదనుచు నింతులు మోపగ నేరమొక్కటై
స్నేహమువీడి దక్షుడు విచింతన లేకయె శాపమీయగా
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండితుహిన మనంబుతోడ గడు
రిప్లయితొలగించండిదోరపు సుందర దివ్య తారతో
విహితపు ప్రేమ వాక్యములు
వెన్నెల రేడొనరించుచుండగా
మహిత శుభాంగి ప్రేమమయి మా
న్యులు మెచ్చిన ధర్మపత్ని యా
రోహిని వచ్చినంత గని రోసె
శశాంకుడు భీతచిత్తుడై.
సమస్యాపాదం ఉత్పలమాల అయితే మీరు చంపకమాల వ్రాసారు.
తొలగించండిరోహిణికార్తి యెండలకు లోకములెల్లను తల్లడిల్లికో
రిప్లయితొలగించండిలాహలమొందువేళ వలరాజు శరంబులు కాక బెట్టగన్
మోహము తాళజాలక విమోహితయై తన భర్త చెంతకున్
రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య:
రిప్లయితొలగించండి*రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై.*
ప్రయత్నం:
ఉ.
ఆ హిముఁ, డత్రినందనుడునై, యుచితానుచితంబువీడి, యు
ద్వాహము నయ్యియుండి, గురుదారను తారను సంశ్రయించుచున్
రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై,
మోహము గూడదయ్య! మరి బుద్ధి మెలంగిన మచ్చరాదుగా!
హిముడు-చంద్రుడు
ఉద్వాహము-పెళ్లి
సంశ్రయించు-ఆశ్రయించు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇరువది యేడుగురు భార్యలలో రోహిణి రూపవతి. చంద్రుడు ఆమె యందు ఆసక్తుడై యుండేవాడని, మిగిలిన వారు కోపముతో తండ్రి దక్షప్రజాపతికి తెలిపినపుడు అతడు క్షయ రోగము కలుగునని శపిస్తాడు. ఆసమయంలో రోహిణి పేరు వినగానే భయపడుతాడనే భావనగా నా ప్రయత్నము;
రిప్లయితొలగించండిఉ:
మోహము మీర ప్రేమగొని ముద్దుల రోహిణి యంచు గూడగన్
ద్రోహము జేతువా యనుచు తోడగు భార్యలు తండ్రి జేరగన్
దేహము యక్ష్మమై నిలుచు తీరగు శాపము బొంద ఖిన్నుడై
రోహిణి వచ్చినంత గని రోసె శశాంకుడు భీతచిత్తుడై
యక్ష్మము =క్షయ
వై. చంద్రశేఖర్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిఊహల దేలుచున్ ముదము వూయల లూగగ పుష్పగుఛ్ఛసం
రిప్లయితొలగించండిదోహము లున్ సువాసనలు తూరపుబట్టగ రంగుపొంగగా
మోహము పెంచులేమనవ మోహిని రోహిణి వచ్చె ; క్షీణుడై(రోగియై)
రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వూహల' అనడం సాధువు కాదు.
మోహమతిశయించగ ప్రియ
రిప్లయితొలగించండిరోహిణితో సంచరించి రోజులు గడిపెన్
ఆహా! శాపము తదుపరి
రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలోహము వాడి మానవుడు లోకము జూడ యుపగ్రహమ్ములన్
రిప్లయితొలగించండివాహనముల్గొనర్చెగద, వాయువె త్రక్కువ వాటి ధీటికిన్
రాహువు వచ్చెనా మరల రక్కసుడై యని బ్రాంతి నొందుచున్
రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...జూడ నుపగ్రహమ్ములన్" అనండి. 'గొనర్చె, త్రక్కువ, ధీటికిన్'?
లోహము వాడి మానవుడు లోకము జూచు, నుపగ్రహమ్ములే
తొలగించండివాహనముల్, జగత్తునవి వైనము గాగని చుట్టి వచ్చుగా ,
రాహువు వచ్చెనా మరల రక్కసుడై యని బ్రాంతి నొందుచున్
రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
రిప్లయితొలగించండిశంకరాభరణం వారి సమస్య : “రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే”
రోహిణి కానక చంద్రుడు
రాహిత్యమున రమణియగు రంభను జేరన్
లోహిత నయనమ్ములతో
“రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే”
- రాంబాబు కైప
28-05-2021
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆహా! యీదినమున నా
రిప్లయితొలగించండితాహతు మించిన సమస్య దయజే సితిరే
మోహప డక నే ల యిటుల
రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే
సమస్యాపూరణలలో ఇదీ ఒక పద్ధతే... బాగుంది. అభినందనలు.
తొలగించండినిన్నటి పూరణ
రిప్లయితొలగించండినుడివిన గాని జోస్యులు వినోదము చూతమటంచు పూని యా
ఘడియల తిందురట్లు ఘనకార్యమొ! వద్దని చెప్పు వాటినిన్
తడయక జేతు రట్లయిన తద్వ్యతిరిక్తఫలప్రదమ్మునన్
కడు హిత మబ్బులే గ్రహణకాలమునన్ భుజియించువానికిన్.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆహా ! యీ సందియములు
రిప్లయితొలగించండిఐహికమేయని తలచితి నహరహ మందున్
రోహిత సూర్యుని వద్దకు
రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరోహిణి రంజిలిన రోజున బుట్టి యదూద్వహుండు వ్యా
రిప్లయితొలగించండిమోహితుడైన మామ యగు మూర్ఖుని జంపె, దహించు కార్తెయై
రోహిణి మండు టెండ నిడి రోలను ముక్కలు జేసె నంచు దా
రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై
కంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో టైపు దోషం వల్ల గణభంగం. సవరించండి.
అవునండీ
తొలగించండిరోహిణి తార రంజిలిన
అని ఉండాలి టైపు మరపు.
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిఊహల తేలెను చంద్రుడు
రోహిణి వచ్చుటను గాంచి; రోసెను శశియే
ఊహాతీతపు వేడికి
రోహిణి తాపార్భటమున రోళ్ళే పగలన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమోహితుడై నిరతము దా
రిప్లయితొలగించండిరోహిణితో గడుపుననుచు రోసిన సవతుల్
బాహాటముగా దెగడగ
రోహిణి వచ్చుటను గాంచి, రోసెను శశియే
మోహితుడై నిరతము దా
రోహిణితో గడుపుననుచు రోసిరె సవతుల్
ఊహాగానమె గానెట
రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఊహలలోన చేరి పతి యూయల లూగుచు చెంగలింప, సం
రిప్లయితొలగించండిదేహముతోడ భర్త పనితీరును భార్యలు గాంచు చుండ స
మ్మోహముతోడ తార గని మోదము నొందుచు మించ, దాపుకున్
రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమోహము మీర సంతతము ముద్దుల రాణివటంచు మెచ్చినన్
రిప్లయితొలగించండిదోహదమౌ గదా జగతి ద్యోతము హెచ్చగ సూర్యు జెంతకున్
రోహిణి వచ్చినంతఁ, గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై
దేహము క్షీణమాయెనరుదెంచనమావస దాగె వేగమున్
ఆహా! యేమని జెప్పుదు
రిప్లయితొలగించండినూహకు నందకను వచ్చె నుస్సురు గొలుపన్
బాహాటమ్ముగ వెంటనె
రోహిణి వచ్చుటను గాంచిరోసెను శశియే
ఆహా విరహము తొలఁగఁగ
రిప్లయితొలగించండినీ హాయి లభింప భాగ్యమే కద యనుచున్
మోహముతో విరి దండను
రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే
[రోయు = వెదకు]
దోహద ముండ సంతతము తోరము రోహిణి పైన నన్యులన్
గేహము లందుఁ గాంచఁ డని కిట్టఁగ నశ్విని చంద్రు నంతటన్
స్నేహము మీఱ డెందమున జ్యేష్ఠ వరాశ్విని చెంత నుండఁగా
రోహిణి వచ్చి నంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై
రోహిణినా బరంగినిట రోతజనించు విధంబు నుండగా
రిప్లయితొలగించండిదేహమునందు వెంట్రుకలు తీగెలవోలెను నల్లుకుంటతో
గేహమునందుహ్లాదమున గీతము బాడెడు చంద్రుడంతటన్
రోహిణి వచ్చినంతగని రోసె శశాంకుడు భీతచిత్తుడై
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిదాహము తీరదాయె; ఘనతాపము హెచ్చుచునుండె; భాస్కరుం
డీహముతోడ మండుచును నీ భువి యందలి లోకులందఱన్
బాహిర మందకుండఁగను బాదుచునుండు కతంపు కార్తెయౌ
రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై!
మోహనముగ నవ్వె విధుడు
రిప్లయితొలగించండిరోహిణి వచ్చుటను గాంచి, రోసెను శశియే
హాహాకారము చేయుచు
స్నేహముతో చెంతరాగచింతించిమదిన్