2-8-2021 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది..."ఎవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే"
(లేదా...)"ఎవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో"
పవలున్ఱేయినియిలలోఅవసరమెంచుచుమసలుచునగపడడెపుడున్కువకువలాడగమనసునుఎవడేయెవ్వడెయెవాడెయెవ్వఁడెయెవడే
మీ పూరణ బాగున్నది. అభినందనలు."పవలున్ రేయిని నిలలో" అనండి.
తప్పుదిద్దుకుంటాను
క్రొవ్విడి వెంకట రాజారావు: సవురుగ వేణువు నూదుచు పవిదిగ నీపయి ననురతి ప్రకటించెడునౌ యువనాయక శృంగారుడుఎవడే యెవ్వడె యెవాడె యెవ్వఁడె యెవడే?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కనుము యశోదమ్మ,కన్నయ్య వెన్నను దొంగిలించె ననుచు,దుడుకుతనముతోడ నన్నతనిని చూడమనుచుతెచ్చితివిగ నీయింటికి తినుచు నున్నబాలురలో యేడి ,వేలును నాకెడి వీడా ,ముఖమును తిప్పి తిను వాడ,వెన్నను కుక్కుచు నున్నట్టి వీడా భయమును బడయుచు కంబము వెనుకనదాగిన బాలుడా,కన బడకుండెనేనీ గీమున ,యెచట నీకుకన పడెను,యెవడే,యెవ్వ డె, యెవాడె,యెవ్వడె, యెవడే, కనపడడే? యింత మందిగోప బాలకులందు నా పాపడు, పదజూపె దను నా గృహమున శిశువును, కట్టి వేసితి నతనిన్ రోటికి, పిల్ల వాని,పైన నిందేల నని తల్లి పలికె నపుడు
మనోహరమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.'గీమున నెచట..' అనండి.
విరించి.ఉవిదయె రమ్మని పైటనుసవరించుచు పిలిచినంత సరసుండగు వాడెవఁడే రానని చెప్పునదెవఁడే యెవ్వఁడె యెవాడె యెవ్వఁడె యెవఁడే.
వివరంబెక్కడ? కానగాబడఁడుతావేదీకనంజాలమేపవరంబెంతయుఁజాలదేకనగనాభావంబులోనారయన్కవిగాఁజెప్పగావర్ణనన్కుదరదేకాయంబునల్పంబునైఎవడేయెవ్వడెయెవ్వడేయెవడెతానెవ్వాడెయెవ్వండోకో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములండిగురువుగారు
భవ బంధంబుల బాపుచు భువిలో నిడుములను బాపి మోక్ష పథంబున్ సువిధమ్ముగ నివ్వ గలుగునెవడే యెవ్వ డె యెవా డె యెవ్వడె యెవ డే?
శ్రీవేంకటేశ్వరుని చూచినది మొదలు పరధ్యానంలో నున్న పద్మావతితో చెలికత్తెలు...కందంఅవనీనాథుని వలె వనియువకుండై మనముదోచి యూపిరిమఱువన్నవలా!పద్మా! చేసినదెవఁడే? యెవ్వఁడె? యెవాఁడె? యెవ్వఁడె? యెవఁడే?మత్తేభవిక్రీడితముఅవనీనాథునిఁ బోలు తేజమును నాడా తోఁపులో గాంచితే!పవలున్ రేయియు నల్లనయ్య తలపుల్ పద్మావతీ! వీడవే?నవలా! నాయకి! నిన్నుదోచి మదిలో నర్తించు పద్మాక్షుడుండెవఁడే? యెవ్వఁడె? యెవ్వఁడే? యెవఁడె? తా నెవ్వాఁడె? యెవ్వండొకో?
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. "మదిలో నర్తించె పద్మాక్షుడై యెవడే..." అనండి. (పద్మాక్షుడుండు.. సాధువు కాదు)
🙏ధన్యోస్మి గురుదేవా!🙏సవరించిన పూరణ:మత్తేభవిక్రీడితముఅవనీనాథునిఁ బోలు తేజమును నాడా తోఁపులో గాంచితే!పవలున్ రేయియు నల్లనయ్య తలపుల్ పద్మావతీ! వీడవే?నవలా! నాయకి! నిన్నుదోచి మదిలో నర్తించు పద్మాక్షుడైయెవఁడే? యెవ్వఁడె? యెవ్వఁడే? యెవఁడె? తా నెవ్వాఁడె? యెవ్వండొకో?
స్తవనీయుడు కంసారియెజవనుల మనసెరిగి మోక్ష జాగృతినొసగెన్అవసరమునకాదుకొనగ"నెవఁడే యెవ్వడె యెవాఁడె యెవ్వడె యెవడే"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అవలీలన్ ఘనరాక్షసాళి దునిమెన్నాబాల్య చేష్టాళిగన్చవులూరించెడు వేణువున్ జనుల వశ్యంబౌనటుల్యూదుచున్నవనీతంబును పాలనున్ గొనెడు కన్నయ్యంచు బిల్వంగ వాడేవడే యెవ్వడె యవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండకో
అవతారంబుల దాల్చుచునవనీతలమందు ప్రజల ఆయాసంబుల్అవలీలగ దొలగించగనెవడే యెవ్వడె యెవాడె యెవ్వడె యెవడే
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. 'ఔనటుల్+ఊదుచున్' అన్నపుడు యడాగమం రాదు.
ధన్యవాదములాచార్యా! సవరించెదను.🙏🙏🙏
సవరణతోఅవలీలన్ ఘనరాక్షసాళి దునిమెన్నాబాల్య చేష్టాళిగన్చవులూరించెడు వేణువున్ జనుల వశ్యంబవ్వబూరించుచున్నవనీతంబును పాలనున్ గొనెడు కన్నయ్యంచు బిల్వంగ వాడేవడే యెవ్వడె యవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండకో
పవలే యందరు చూచుచుండగను నీ వంకన్ దదే కార్తితోఅవనీ! చూచుచు నుండె వాడునుడు నీ కాతండు గుర్తే కదా ?వివరంగా విని పించు నాకిపుడుసంప్రీతిన్ నిజంబంతయున్ఎవడే యెవ్వడె యెవ్వడే యెవడు తానెవ్వాడె యెవ్వండొకో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.'నుడు'?
మ:ధవలాక్షీ ఎరుపెక్కె నీదు ముఖమే తప్పించుకోలేవికన్చెవులన్ మోపుచునాలకించితినహో శృంగార వ్యాఖ్యానముల్లవలేశమ్ము నెఱుంగ నైతి కనగా లంఘించు నవ్వాడినున్యెవడే యెవ్వడె యెవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండొకోవై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'అవ్వాడినున్'? దాని తర్వాత యడాగమం రాదు.
సవరణ పూరణ: మ:ధవలాక్షీ ఎరుపెక్కె నీదు ముఖమే తప్పించుకోలేవికన్చెవులన్ మోపుచునాలకించితినహో శృంగార వ్యాఖ్యానముల్లవలేశమ్ము నెఱుంగ నైతి కనగా లంఘించు వారెవ్వరోయెవడే యెవ్వడె యెవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండొకోవై. చంద్రశేఖర్
విరించి.(అభిమన్యు వీరమరణవార్త విన్న కిరీటి శోకముతో చెంతనున్నవారితో పలికిన పలుకులు)పవిరమ్మందున శత్రుమూకలను తా బాలార్చ పంచాస్యమై హవణింపంగను తమ్మిమొగ్గరముఁ సంహారమ్ము కచ్చోట పాటవికుండొక్కడు హేతువయ్యెనట దుష్టాత్ముండెవాడంటి? వాడెవఁడే యెవ్వఁడె యెవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండొకో?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'పవిరమ్ము, తా బాలార్చ'?
పవరము టైపాటు.....తా పాలార్చ
సమస్య : ఎవడే యెవ్వడె యెవ్వడే యెవడె తా నెవ్వాడె యెవ్వండొకో ( ఆకాశరాజు భార్య ధారిణీదేవి తోటలో శ్రీనివాసుని తిలకించి పులకించి తదేకధ్యానంలో మైమరచి ఆహారం తినని పద్మావతితో అంటున్నది )చవిగా లేవటె తల్లి ! వంటకము లెం చన్ పాచకుల్ లెస్సగా నవముల్ లేతలు కూరగాయల నహా !నాణ్యంబుగా వండిరే !ధవునిన్ గూర్చిన యూహలా ? దెలిసె నీ తాదాత్మ్యమున్ జూడగా ;నెవడే? యెవ్వడె? యెవ్వడే? యెవడె తా నెవ్వాడె ? యెవ్వండొకో ??
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ఎవఁడే వెన్నను దొంగిలెనెవఁడే కన్నెల వలువలనెత్తుకపోయెన్యెవఁడే గిరినెత్తినవాడెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'పోయెన్+ఎవడే' అన్నపుడు యడాగమం రాదు.
కె.వి.యస్. లక్ష్మి: నవమోహన రాగముతో ఉవిదా! నీపై నెనరును యుత్సాహముతో వివరించెడునౌ యువకుడు ఎవడే యెవ్వడె యెవాడె యెవ్వఁడె యెవడే?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'నెనరును నుత్సాహముతో' అనండి.
ఎవడే సృష్టికి మూలముఎవడే రక్షణ జగతికినేకైకవిభుండెవడే మోక్షకుడెవ్వడుఎవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే
నవవధు వావిడ, వరుడునుజవస త్త్వములేని కడుముసలి చీకు, సడిన్చెవితో విని సతిని యడిగెనెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'సతిని నడిగె' అనండి.
కవితల సమీక్షలో నీరవను గని శంకరాభరణమందున నీస్తవమును సలిపిన దెవరో !యెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే
ఎవరుగలరంతటవెలసిఎవరేలుదురీభువనము? ఎవరే? వారిన్ఎవరువెతకిగనగలరే?ఎవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే?
ఎవడీ జగతికి మూలము యెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడేయెవడటివిగా ! అతడేభవుడు భవుండే భవుండు భవుడే గాదే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'మూలము+ఎవడే' అన్నపుడు యడాగమం రాదు. "మూలం బెవడే..మూల మ్మెవడే" అనండి.
🙏🏽
భువిలో, జితేంద్రియుడితడెభవభయహరుడె,శివసుతుడె పవనతనయుడేగోవర్దనగిధరతపుడెఎవడే యెవ్వడె యెవాడె యెవ్వడె యవడే .. .తోకల...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మూడవ పాదం చివర అర్థం కాలేదు.
కృతజ్ఞతలు పూజ్య శ్రీగోవర్దనగిరిధర తపసిఅనవచ్చా
వివరంబెంచక నిష్థతో నిరతమున్ ప్రీతిన్ సుపూజ్యంబుగాస్తవనీయంబగు నోంకృతిన్ భృకుటిలో చంచత్ విధానోక్తమైయవలీలన్ గనువాడు-ముక్తి పథ సద్యస్స్పూర్తి శోభిల్లగన్-ఎవడే యెవ్వడె యెవ్వడే యెవడె తా నెవ్వ.అడె యెవ్వండొకో?
ధన్యవాదములు
ఎవరో బ్రాహ్మణపుత్రుడంట మునితో నేతించి దుర్భేద్యమౌశివబాణాసనమున్ సుదుర్వహనవైశిష్ట్యప్రశస్తమ్ముఁ దానవలీలన్ కనదార్భటిన్ విరిచె స్వర్గాధీశుడో? శ్రీశుడో?యెవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో!కంజర్ల రామాచార్య.
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు. 'క్షత్రియ పుత్రుడంట' అని ఉండాలనుకుంటాను.
ఆహార్యాల వల్ల ఊహించారని భావం
అయినా మార్చానండి.ఎవరో సుందరరూపుడంట మునితో నేతించి దుర్భేద్యమౌశివబాణాసనమున్ సదుద్వహనవైశిష్ట్యప్రశస్తమ్ముఁ దానవలీలన్ కనదార్భటిన్ విరిచె స్వర్గాధీశుడో? శ్రీశుడో?యెవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో!కంజర్ల రామాచార్య.
ఎవఁడే వెన్నను మ్రుచ్చిలించినది తానెవ్వండె గోవర్ధనంబవలీలన్ కొనగోటిపై నిలిపినా డాశ్చర్యమొప్పారగన్యెవడే కాళియుపైన నర్తిలినవా డెవ్వండె దీనావనుండెవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. "... మొప్పారగా నెవడే" అనండి.
హిరణ్య కశిపుని ఆంతరంగం:దివిజానీకము నందరన్ గెలిచి యుత్సేకంబడంగించితే!భువనాలన్నియు జూచితే వెదకి సంపూర్ణంబుగా విష్ణుకై,స్తవనీయుండని బల్కనిందరును విశ్వాసమ్ము సేకూఱదే!ఎవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో.
శివుడో విష్ణువొ బ్రహ్మయో కవియొ సుశ్రీకార సంరంభియోభవుడో కృష్ణుడొ సృష్టికర్తయునొ శ్రీపాండిత్య భూషుండునోరవియో రాముడొ జన్నిగట్టుయునొ కార్యారంభ దత్తుండునోఎవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకోకొరుప్రోలు రాధాకృష్ణ రావు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. "జన్నిగట్టొ మఱి కార్యారంభ..." అనండి.
రవ మాడ్కిన్ గడు దీమసమ్ముఁ జను నిన్ రంజిల్లగా జేసి తానవలీలన్ చెలి! ప్రేమలోమునుగగానత్యంత సంసక్తితోతివిరెన్, గైకొని నీ యనుజ్ఞ వెస నుద్దీపించి నీయిచ్ఛ వాడెవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో
నవనీత చోరుడాతడు;భవుడై రక్షించువాడు; పద్మాక్షుండున్;పవనసుతుడు; భావజుడును;ఎవఁడే - యెవ్వఁడె - యెవాఁడె - యెవ్వఁడె - యెవఁడే?!(శ్రీ కృష్ణుడు, శివుడు, విష్ణువు, హనుమంతుడు, మన్మథుడు)ఎవరే లీలగ నూద నా మురళి నేడింపారె బృందావనిన్స్తవనీయంబయి గోపికా హృదయ విస్తార ప్రకామ స్థితిన్నవ రాగోక్తుల లాస్య మాడె నటు విన్నారే! యశోదేయుడే?!ఎవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో!
(అభిమన్యు వీరమరణవార్త విన్న కిరీటి శోకముతో చెంతనున్నవారితో పలికిన పలుకులు)పవరమ్మందున శత్రుమూకలను తా పాలార్చ పంచాస్యమై హవణింపంగను తమ్మిమొగ్గరముఁ సంహారమ్ము కచ్చోట పాటవికుండొక్కడు హేతువయ్యెనట దుష్టాత్ముండెవాడంటి? వాడెవఁడే యెవ్వఁడె యెవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండొకో?
నవమోహనుడా రాముడుసవినయముగ ముని వెనుకను జనుచుండనటన్యువతులు గుసగుసలాడిరియెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే
కవనము జెప్పెద వినుడీభవితను గుఱిచియు నికగతిఫలముల గూర్చిన్వివరముగ నని పలుకువాడెవడే యెవ్వడె యెవాడె యెవ్వడెయెవడే
అవనత వదనులు పర దర్ప వినాశకు లగ్ని నిభులు వన మేఁగఁగఁ బాండవ పంచ కౌఘమున నరుఁ డెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే భువి రాజిల్లిన శక్ర సన్నిభ మహా పుణ్యాత్ములే సద్యశశ్ఛవి మద్గాత్రులు ధర్మ తత్పరు లిలన్ షట్చక్రవర్త్యావలిప్రవరల్ సెప్పుమ సారసాక్షి కని చిత్రం బింపుగా నెచ్చెలీయెవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో
జవరాండ్రందఱి కోకలన్ గవిసి వశ్యంబొందగావించువాడెవడే యెవ్వడె యెవ్వడేయెవడెతానెవ్వాడె యెవ్వండొకోయవనీనాధుడు కాడొకో దలచస్వర్గాధీశుడోగృష్ణుడోవివరం బొప్పగ దెల్పుమా కమల! వేవేలంగ బ్రార్ధించెదన్
పవలున్ఱేయినియిలలో
రిప్లయితొలగించండిఅవసరమెంచుచుమసలుచునగపడడెపుడున్
కువకువలాడగమనసును
ఎవడేయెవ్వడెయెవాడెయెవ్వఁడెయెవడే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పవలున్ రేయిని నిలలో" అనండి.
తప్పుదిద్దుకుంటాను
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిసవురుగ వేణువు నూదుచు
పవిదిగ నీపయి ననురతి ప్రకటించెడునౌ
యువనాయక శృంగారుడు
ఎవడే యెవ్వడె యెవాడె యెవ్వఁడె యెవడే?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికనుము యశోదమ్మ,కన్నయ్య వెన్నను
రిప్లయితొలగించండిదొంగిలించె ననుచు,దుడుకు
తనము
తోడ నన్నతనిని చూడమనుచు
తెచ్చి
తివిగ నీయింటికి తినుచు నున్న
బాలురలో యేడి ,వేలును నాకెడి
వీడా ,ముఖమును తిప్పి తిను
వాడ,
వెన్నను కుక్కుచు నున్నట్టి
వీడా భ
యమును బడయుచు కంబము వెనుకన
దాగిన బాలుడా,కన బడ
కుండెనే
నీ గీమున ,యెచట నీకు
కన ప
డెను,యెవడే,యెవ్వ డె, యెవాడె,యెవ్వడె,
యెవడే, కనపడడే? యింత మంది
గోప బాలకులందు నా పాపడు, పద
జూపె దను నా గృహమున శిశువును, కట్టి
వేసితి నతనిన్ రోటికి, పిల్ల వాని,
పైన నిందేల నని తల్లి పలికె నపుడు
మనోహరమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.
తొలగించండి'గీమున నెచట..' అనండి.
రిప్లయితొలగించండివిరించి.
ఉవిదయె రమ్మని పైటను
సవరించుచు పిలిచినంత సరసుండగు వా
డెవఁడే రానని చెప్పున
దెవఁడే యెవ్వఁడె యెవాడె యెవ్వఁడె యెవఁడే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివివరంబెక్కడ? కానగాబడఁడుతావేదీకనంజాలమే
రిప్లయితొలగించండిపవరంబెంతయుఁజాలదేకనగనాభావంబులోనారయన్
కవిగాఁజెప్పగావర్ణనన్కుదరదేకాయంబునల్పంబునై
ఎవడేయెవ్వడెయెవ్వడేయెవడెతానెవ్వాడెయెవ్వండోకో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండిగురువుగారు
తొలగించండిభవ బంధంబుల బాపుచు
రిప్లయితొలగించండిభువిలో నిడుములను బాపి మోక్ష పథంబున్
సువిధమ్ముగ నివ్వ గలుగు
నెవడే యెవ్వ డె యెవా డె యెవ్వడె యెవ డే?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రీవేంకటేశ్వరుని చూచినది మొదలు పరధ్యానంలో నున్న పద్మావతితో చెలికత్తెలు...
రిప్లయితొలగించండికందం
అవనీనాథుని వలె వని
యువకుండై మనముదోచి యూపిరిమఱువన్
నవలా!పద్మా! చేసిన
దెవఁడే? యెవ్వఁడె? యెవాఁడె? యెవ్వఁడె? యెవఁడే?
మత్తేభవిక్రీడితము
అవనీనాథునిఁ బోలు తేజమును నాడా తోఁపులో గాంచితే!
పవలున్ రేయియు నల్లనయ్య తలపుల్ పద్మావతీ! వీడవే?
నవలా! నాయకి! నిన్నుదోచి మదిలో నర్తించు పద్మాక్షుడుం
డెవఁడే? యెవ్వఁడె? యెవ్వఁడే? యెవఁడె? తా నెవ్వాఁడె? యెవ్వండొకో?
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి"మదిలో నర్తించె పద్మాక్షుడై యెవడే..." అనండి. (పద్మాక్షుడుండు.. సాధువు కాదు)
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిసవరించిన పూరణ:
మత్తేభవిక్రీడితము
అవనీనాథునిఁ బోలు తేజమును నాడా తోఁపులో గాంచితే!
పవలున్ రేయియు నల్లనయ్య తలపుల్ పద్మావతీ! వీడవే?
నవలా! నాయకి! నిన్నుదోచి మదిలో నర్తించు పద్మాక్షుడై
యెవఁడే? యెవ్వఁడె? యెవ్వఁడే? యెవఁడె? తా నెవ్వాఁడె? యెవ్వండొకో?
స్తవనీయుడు కంసారియె
రిప్లయితొలగించండిజవనుల మనసెరిగి మోక్ష జాగృతినొసగెన్
అవసరమునకాదుకొనగ
"నెవఁడే యెవ్వడె యెవాఁడె యెవ్వడె యెవడే"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅవలీలన్ ఘనరాక్షసాళి దునిమెన్నాబాల్య చేష్టాళిగన్
తొలగించండిచవులూరించెడు వేణువున్ జనుల వశ్యంబౌనటుల్
యూదుచున్
నవనీతంబును పాలనున్ గొనెడు కన్నయ్యంచు బిల్వంగ వా
డేవడే యెవ్వడె యవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండకో
అవతారంబుల దాల్చుచు
తొలగించండినవనీతలమందు ప్రజల ఆయాసంబుల్
అవలీలగ దొలగించగ
నెవడే యెవ్వడె యెవాడె యెవ్వడె యెవడే
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి'ఔనటుల్+ఊదుచున్' అన్నపుడు యడాగమం రాదు.
ధన్యవాదములాచార్యా! సవరించెదను.🙏🙏🙏
తొలగించండిసవరణతో
తొలగించండిఅవలీలన్ ఘనరాక్షసాళి దునిమెన్నాబాల్య చేష్టాళిగన్
చవులూరించెడు వేణువున్ జనుల వశ్యంబవ్వ
బూరించుచున్
నవనీతంబును పాలనున్ గొనెడు కన్నయ్యంచు బిల్వంగ వా
డేవడే యెవ్వడె యవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండకో
పవలే యందరు చూచుచుండగ
రిప్లయితొలగించండిను నీ వంకన్ దదే కార్తితో
అవనీ! చూచుచు నుండె వాడు
నుడు నీ కాతండు గుర్తే కదా ?
వివరంగా విని పించు నాకిపుడు
సంప్రీతిన్ నిజంబంతయున్
ఎవడే యెవ్వడె యెవ్వడే యెవ
డు తానెవ్వాడె యెవ్వండొకో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'నుడు'?
మ:
రిప్లయితొలగించండిధవలాక్షీ ఎరుపెక్కె నీదు ముఖమే తప్పించుకోలేవికన్
చెవులన్ మోపుచునాలకించితినహో శృంగార వ్యాఖ్యానముల్
లవలేశమ్ము నెఱుంగ నైతి కనగా లంఘించు నవ్వాడినున్
యెవడే యెవ్వడె యెవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండొకో
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అవ్వాడినున్'? దాని తర్వాత యడాగమం రాదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిసవరణ పూరణ:
తొలగించండిమ:
ధవలాక్షీ ఎరుపెక్కె నీదు ముఖమే తప్పించుకోలేవికన్
చెవులన్ మోపుచునాలకించితినహో శృంగార వ్యాఖ్యానముల్
లవలేశమ్ము నెఱుంగ నైతి కనగా లంఘించు వారెవ్వరో
యెవడే యెవ్వడె యెవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండొకో
వై. చంద్రశేఖర్
రిప్లయితొలగించండివిరించి.
(అభిమన్యు వీరమరణవార్త విన్న కిరీటి శోకముతో చెంతనున్నవారితో పలికిన పలుకులు)
పవిరమ్మందున శత్రుమూకలను తా బాలార్చ పంచాస్యమై
హవణింపంగను తమ్మిమొగ్గరముఁ సంహారమ్ము కచ్చోట పా
టవికుండొక్కడు హేతువయ్యెనట దుష్టాత్ముండెవాడంటి? వా
డెవఁడే యెవ్వఁడె యెవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండొకో?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పవిరమ్ము, తా బాలార్చ'?
పవరము టైపాటు.....తా పాలార్చ
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిఎవడే యెవ్వడె యెవ్వడే యెవడె తా
నెవ్వాడె యెవ్వండొకో
( ఆకాశరాజు భార్య ధారిణీదేవి తోటలో శ్రీనివాసుని తిలకించి పులకించి తదేకధ్యానంలో మైమరచి ఆహారం తినని పద్మావతితో అంటున్నది )
చవిగా లేవటె తల్లి ! వంటకము లెం
చన్ పాచకుల్ లెస్సగా
నవముల్ లేతలు కూరగాయల నహా !
నాణ్యంబుగా వండిరే !
ధవునిన్ గూర్చిన యూహలా ? దెలిసె నీ
తాదాత్మ్యమున్ జూడగా ;
నెవడే? యెవ్వడె? యెవ్వడే? యెవడె తా
నెవ్వాడె ? యెవ్వండొకో ??
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఎవఁడే వెన్నను దొంగిలె
రిప్లయితొలగించండినెవఁడే కన్నెల వలువలనెత్తుకపోయెన్
యెవఁడే గిరినెత్తినవా
డెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పోయెన్+ఎవడే' అన్నపుడు యడాగమం రాదు.
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండినవమోహన రాగముతో
ఉవిదా! నీపై నెనరును యుత్సాహముతో
వివరించెడునౌ యువకుడు
ఎవడే యెవ్వడె యెవాడె యెవ్వఁడె యెవడే?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నెనరును నుత్సాహముతో' అనండి.
ఎవడే సృష్టికి మూలము
రిప్లయితొలగించండిఎవడే రక్షణ జగతికినేకైకవిభుం
డెవడే మోక్షకుడెవ్వడు
ఎవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినవవధు వావిడ, వరుడును
రిప్లయితొలగించండిజవస త్త్వములేని కడుముసలి చీకు, సడిన్
చెవితో విని సతిని యడిగె
నెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సతిని నడిగె' అనండి.
కవితల సమీక్షలో నీ
రిప్లయితొలగించండిరవను గని శంకరాభరణమందున నీ
స్తవమును సలిపిన దెవరో !
యెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎవరుగలరంతటవెలసి
రిప్లయితొలగించండిఎవరేలుదురీభువనము? ఎవరే? వారిన్
ఎవరువెతకిగనగలరే?
ఎవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎవడీ జగతికి మూలము
రిప్లయితొలగించండియెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే
యెవడటివిగా ! అతడే
భవుడు భవుండే భవుండు భవుడే గాదే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మూలము+ఎవడే' అన్నపుడు యడాగమం రాదు. "మూలం బెవడే..మూల మ్మెవడే" అనండి.
🙏🏽
తొలగించండిభువిలో, జితేంద్రియుడితడె
రిప్లయితొలగించండిభవభయహరుడె,శివసుతుడె పవనతనయుడే
గోవర్దనగిధరతపుడె
ఎవడే యెవ్వడె యెవాడె యెవ్వడె యవడే
.. .తోకల...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదం చివర అర్థం కాలేదు.
కృతజ్ఞతలు పూజ్య శ్రీ
తొలగించండిగోవర్దనగిరిధర తపసి
అనవచ్చా
వివరంబెంచక నిష్థతో నిరతమున్ ప్రీతిన్ సుపూజ్యంబుగా
రిప్లయితొలగించండిస్తవనీయంబగు నోంకృతిన్ భృకుటిలో చంచత్ విధానోక్తమై
యవలీలన్ గనువాడు-ముక్తి పథ సద్యస్స్పూర్తి శోభిల్లగన్-
ఎవడే యెవ్వడె యెవ్వడే యెవడె తా నెవ్వ.అడె యెవ్వండొకో?
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిఎవరో బ్రాహ్మణపుత్రుడంట మునితో నేతించి దుర్భేద్యమౌ
రిప్లయితొలగించండిశివబాణాసనమున్ సుదుర్వహనవైశిష్ట్యప్రశస్తమ్ముఁ దా
నవలీలన్ కనదార్భటిన్ విరిచె స్వర్గాధీశుడో? శ్రీశుడో?
యెవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో!
కంజర్ల రామాచార్య.
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'క్షత్రియ పుత్రుడంట' అని ఉండాలనుకుంటాను.
ఆహార్యాల వల్ల ఊహించారని భావం
తొలగించండిఅయినా మార్చానండి.
తొలగించండిఎవరో సుందరరూపుడంట మునితో నేతించి దుర్భేద్యమౌ
శివబాణాసనమున్ సదుద్వహనవైశిష్ట్యప్రశస్తమ్ముఁ దా
నవలీలన్ కనదార్భటిన్ విరిచె స్వర్గాధీశుడో? శ్రీశుడో?
యెవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో!
కంజర్ల రామాచార్య.
ఎవఁడే వెన్నను మ్రుచ్చిలించినది తానెవ్వండె గోవర్ధనం
రిప్లయితొలగించండిబవలీలన్ కొనగోటిపై నిలిపినా డాశ్చర్యమొప్పారగన్
యెవడే కాళియుపైన నర్తిలినవా డెవ్వండె దీనావనుం
డెవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి"... మొప్పారగా నెవడే" అనండి.
హిరణ్య కశిపుని ఆంతరంగం:
రిప్లయితొలగించండిదివిజానీకము నందరన్ గెలిచి యుత్సేకంబడంగించితే!
భువనాలన్నియు జూచితే వెదకి సంపూర్ణంబుగా విష్ణుకై,
స్తవనీయుండని బల్కనిందరును విశ్వాసమ్ము సేకూఱదే!
ఎవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశివుడో విష్ణువొ బ్రహ్మయో కవియొ సుశ్రీకార సంరంభియో
రిప్లయితొలగించండిభవుడో కృష్ణుడొ సృష్టికర్తయునొ శ్రీపాండిత్య భూషుండునో
రవియో రాముడొ జన్నిగట్టుయునొ కార్యారంభ దత్తుండునో
ఎవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి"జన్నిగట్టొ మఱి కార్యారంభ..." అనండి.
రవ మాడ్కిన్ గడు దీమసమ్ముఁ జను నిన్ రంజిల్లగా జేసి తా
రిప్లయితొలగించండినవలీలన్ చెలి! ప్రేమలోమునుగగానత్యంత సంసక్తితో
తివిరెన్, గైకొని నీ యనుజ్ఞ వెస నుద్దీపించి నీయిచ్ఛ వా
డెవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో
రిప్లయితొలగించండినవనీత చోరుడాతడు;
భవుడై రక్షించువాడు; పద్మాక్షుండున్;
పవనసుతుడు; భావజుడును;
ఎవఁడే - యెవ్వఁడె - యెవాఁడె - యెవ్వఁడె - యెవఁడే?!
(శ్రీ కృష్ణుడు, శివుడు, విష్ణువు, హనుమంతుడు, మన్మథుడు)
ఎవరే లీలగ నూద నా మురళి నే
డింపారె బృందావనిన్
స్తవనీయంబయి గోపికా హృదయ వి
స్తార ప్రకామ స్థితిన్
నవ రాగోక్తుల లాస్య మాడె నటు వి
న్నారే! యశోదేయుడే?!
ఎవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో!
రిప్లయితొలగించండి(అభిమన్యు వీరమరణవార్త విన్న కిరీటి శోకముతో చెంతనున్నవారితో పలికిన పలుకులు)
పవరమ్మందున శత్రుమూకలను తా పాలార్చ పంచాస్యమై
హవణింపంగను తమ్మిమొగ్గరముఁ సంహారమ్ము కచ్చోట పా
టవికుండొక్కడు హేతువయ్యెనట దుష్టాత్ముండెవాడంటి? వా
డెవఁడే యెవ్వఁడె యెవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండొకో?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినవమోహనుడా రాముడు
రిప్లయితొలగించండిసవినయముగ ముని వెనుకను జనుచుండనటన్
యువతులు గుసగుసలాడిరి
యెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే
కవనము జెప్పెద వినుడీ
రిప్లయితొలగించండిభవితను గుఱిచియు నికగతిఫలముల గూర్చిన్
వివరముగ నని పలుకువా
డెవడే యెవ్వడె యెవాడె యెవ్వడెయెవడే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅవనత వదనులు పర ద
రిప్లయితొలగించండిర్ప వినాశకు లగ్ని నిభులు వన మేఁగఁగఁ బాం
డవ పంచ కౌఘమున నరుఁ
డెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే
భువి రాజిల్లిన శక్ర సన్నిభ మహా పుణ్యాత్ములే సద్యశ
శ్ఛవి మద్గాత్రులు ధర్మ తత్పరు లిలన్ షట్చక్రవర్త్యావలి
ప్రవరల్ సెప్పుమ సారసాక్షి కని చిత్రం బింపుగా నెచ్చెలీ
యెవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో
జవరాండ్రందఱి కోకలన్ గవిసి వశ్యంబొందగావించువా
రిప్లయితొలగించండిడెవడే యెవ్వడె యెవ్వడేయెవడెతానెవ్వాడె యెవ్వండొకో
యవనీనాధుడు కాడొకో దలచస్వర్గాధీశుడోగృష్ణుడో
వివరం బొప్పగ దెల్పుమా కమల! వేవేలంగ బ్రార్ధించెదన్