17, ఆగస్టు 2021, మంగళవారం

సమస్య - 3815

18-8-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జారుల కృత్యములఁ గని సుజనులు మురిసిరే”
(లేదా...)
“జారుల నిత్యకృత్యములు సజ్జనమోదముఁ గూర్చకుండునే”

74 కామెంట్‌లు:

  1. పేరులు గోత్రము‌ లడుగుచు

    కోరిన కోర్కెలు ముదముగ గుడిలో గల బృం

    దారకులకు తెలిపెడి పూ

    జారుల కృత్యములగని సుజనులు మురిసిరే

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు:

      పోరామి తోడ నిరతము
      పౌరుల కెల్లను సుఖములు ప్రాప్తించు నటుల్
      శౌరిని పూజించెడి పూ
      జారుల కృత్యములగని సుజనులు మురిసిరే!

      తొలగించండి
  3. కందం
    శౌరిని వలచితి ననుచున్
    దా రుక్మిణి విప్రు నంప దళనేత్రుండున్
    దేరునఁ గొన ప్రేమకు పూ
    జారుల కృత్యములఁ గని సుజనులు మురిసిరే!

    ఉత్పలమాల
    నీరజనాభునిన్వలచి నెమ్మిని విప్రుని రాయబారమున్
    సారస నేత్ర రుక్మిణియె స్వాంతము దెల్పఁగ బంపినంతటన్
    దేరున వచ్చి గైకొనుచుఁ దృప్తిని బంచఁగ జంట, ప్రేమ పూ
    జారుల నిత్యకృత్యములు సజ్జనమోదముఁ గూర్చకుండునే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      శ్రీరమణీయమూర్తి హరి చిన్మయరూపుని నిత్యసేవలన్
      భూరిగ దివ్య పుష్పములు మోదము గూర్చఁగ మాడవీధులన్
      దీరిచి వేదమంత్రములు దిర్మల నందు ప్రతిధ్వనింప పూ
      జారుల నిత్యకృత్యములు సజ్జనమోదముఁ గూర్చకుండునే!

      తొలగించండి
    2. మీ మూడు పూరణలు మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. జీ తెలుగు ఛానల్ లోని 'ప్రేమయెంతమధురం' సీరియల్ నేపథ్యంగా...

      ఉత్పలమాల
      దోరవయస్సు భామ సిరిఁ దూగెడు మధ్యవయస్సు బాసుతో
      గూరిమి జూపుచున్ దనర గూర్పగ సీరియలందు వారిఁ దె
      ల్లారులు 'ప్రేమయెంత మధురమ్మ' ని పించఁగ జూప ప్రేమపూ
      జారుల నిత్యకృత్యములు సజ్జనమోదముఁ గూర్చకుండునే!

      తొలగించండి
  4. సమస్య :

    జారుల నిత్యకృత్యములు
    సజ్జనమోదము గూర్చకుండునే

    (స్వామికి అర్చకస్వాముల సేవ )

    వారిని దెచ్చి దేవునకు
    భక్త్యభిషేకము సేయుచుందురే !
    మారని ప్రేమతోడ సుమ
    మాలిక లెన్నియొ వేయుచుందురే !
    జారని దీక్ష పొంగ విన
    జక్కని స్తోత్రము సల్పుచుండు పూ
    జారుల నిత్యకృత్యములు
    సజ్జనమోదము గూర్చకుండునే ?

    రిప్లయితొలగించండి
  5. చోరులకందనినిధినే
    కూరిమిఁగూర్చుచుజనులకుగుడిలోదివ్వెల్
    పారముజూచెడియాపూ
    జారులక్రుత్యములుగనిసుజనులుమురిసిరే

    రిప్లయితొలగించండి
  6. తోరపు భక్తి ప్రపత్తిగ
    తారక రామునికి బూజ ధార్మిక పరులై
    చారు మనోహరముగ బూ
    జారుల కృత్యము ల గని సు జనులు మురిసిరే !

    రిప్లయితొలగించండి
  7. పేరును గడించి దాతలు
    సారెకు సత్కార్య కర్త సౌరును గలుగన్
    చేరగ దీవెనలిడు పూ
    "జారుల కృత్యములఁ గని సుజనులు మురిసిరే!"

    రిప్లయితొలగించండి
  8. కోరిన కోర్కు లెల్లపుడు గొండల
    సామియె తీర్చునంచు నిం
    పారగ బోవు భక్త జన బాధలు
    దీర్చగ నర్చనాదులున్
    బేరిమి చేయుచుందురట వేకువ
    నుండియె తప్పకుండ , పూ
    జారుల నిత్యకృత్యములు సజ్జ
    న మోదము గూర్చకుండునే



    రిప్లయితొలగించండి
  9. మారుతి మూర్తిని జూడగ
    బారులు బారులుగ వచ్చు భక్త జనంబున్
    గౌరవమిడి పంపెడు పూ
    జారుల కృత్యములఁ గని సుజనులు మురిసిరే

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పౌరులకెల్ల సౌఖ్యములు పంచుచు రక్షణ నీయ గోరుచున్
    తీరగు భక్తినిన్ సతము దేవళమందలి శ్రీనివాసునున్
    యోరిమి గూడు చిత్తమున యుత్తమ సేవల నందజేయు పూ
    జారుల నిత్యకృత్యములు సజ్జనమోదముఁ గూర్చకుండునే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శ్రీనివాసునిన్+ఓరిమి' అన్నపుడు యడాగమం రాదు. "శ్రీనివాసు తా మోరిమి... చిత్తమున నుత్తమ..." అనండి.

      తొలగించండి

  11. సూరుని కంటెను ముందుగ
    పారుడు మేల్కొనుచు సంధ్య వార్చుకుని నిరా
    కారుని సేవించెడు పూ
    జారుల కృత్యములగని సుజనులు మురిసిరే.


    కోరిననర్చన జేయుచు
    హారతి, యాశీర్వచనములందించుచు శ్రీ
    వారి ప్రసాదము నిడు పూ
    జారుల కృత్యములగని సుజనులు మురిసిరే.

    రిప్లయితొలగించండి
  12. తీరుగ పూనికన్ విడక దేవుని పూజలు సల్పుచుండుఁ నే
    తీరున భక్తులందరికి దివ్యముగా తిథు లెల్ల జూచుచున్
    పేరును వంశ గోత్రముల పెంపును గోరుచు నుండునట్టి,.. పూ
    జారుల నిత్యకృత్యములు సజ్జనమోదముఁ గూర్చకుండునే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...సల్పుచుందు రే తీరున..." అనండి.

      తొలగించండి

  13. పారుడు సంధ్య వార్చుకుని భానున కర్ఘ్యమొసంగి కోవెలన్
    జేరి పరాత్పరున్ గొలిచి చేరిన భక్త జనాలకున్ నిరా
    కారుకు మధ్య సేతకముగానిలుచుండెడి వాదెయైన పూ
    జారుల నిత్యకృత్యములు సజ్జన మోదము గూర్చకుండునే?

    రిప్లయితొలగించండి
  14. ఉ:

    బారులు దీరి దేవళము భక్తులు నిండగ యుత్సవంబునన్
    తీరగు పూజ యర్చనలు తెప్పలు దేలుచు భక్తి కీర్తనల్
    జోరుగ సాగుటెంచి కడు శుభ్రత కోవిడు దూరముంచ, పూ
    జారుల నిత్య కృత్యములు సజ్జన మోదము గూర్చ కుండునే

    తెప్పలు దేలుచు=ఓలలాడించు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  15. సారములేనిజన్మలనుసాధనఁజేయుచుశాంతిఁగోరుచున్
    ఆరనిత్రుష్ణతోడనడయాడుచుభావననాత్మయందులో
    నారసిదివ్యదేవళముమాధవుగోల్చెడిమౌనిగానపూ
    జారులనిత్యక్రుత్యములుసజ్జనమోదముగూర్చకుండునే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "శాంతి గోరి తా మారని తృష్ణతోడ... భావన నంతరాత్మలో... మౌనులైన పూజారుల..." అనండి.

      తొలగించండి
    2. సారములేనిజన్మలనుసాధనఁజేయుచుశాంతిఁగోరితా
      మారనిత్రుష్ణతోడనటభావనచాలగనంతరాత్మలో
      లోనారసిదివ్షదేవళముమాధవుగోల్చెడిమౌనులైనపూ
      జారులనిత్యక్రుత్యములుసజ్జనమోదముగూర్చకుండునే

      తొలగించండి
  16. మారణహోమము జేసెడు
    దారుణ రోగమునుమాన్ప తత్పరభక్తిన్
    మారారిని గొల్చెడు పూ
    జారుల కృత్యములగని సుజనులు మురిసిరే

    ఓరిమితోడ శ్రీహరికి నొప్పుగ జేసి యలంకృతుల్ మదిన్
    కూరిమిమీరగా జనులు కోరువిధంబున పూజసల్పుచున్
    తీరగ వారికోర్కెలట దీవెనలిచ్చుచు మేలుగోరు పూ
    జారుల నిత్యకృత్యములు సజ్జనమోదము గూర్చకుండునే

    రిప్లయితొలగించండి
  17. కె.వి.యస్. లక్ష్మి:

    బారులు దీరిన ప్రజలకు
    హారతి తీర్థము లొసగుచు నాశీస్సులతో
    పౌరుల దీవించెడి పూ
    జారుల కృత్యముల గని సుజనులు మురిసిరే!

    రిప్లయితొలగించండి
  18. ఆరని దీపపు వెలుగుల
    తీరగు మూర్తుల కొలువున తేజోమయులై
    ఆరాధనసల్పెడి పూ
    జారుల కృత్యములఁ గని సుజనులు మురిసిరే

    రిప్లయితొలగించండి
  19. కోరిన భక్తుల కోర్కెలఁ,
    వారథివలె నిలచి తాను భగవంతుడితోఁ
    గూరిమితో దెలిపెడి... పూ
    జారుల కృత్యములఁ గని సుజనులు మురిసిరే.

    రిప్లయితొలగించండి
  20. రేరాజుఁ గూడఁ గలువలు
    శీరునికై పద్మములును చెలువము మీరన్
    కోరిన కలువరు శశి కం
    జారుల కృత్యములఁ గని సుజనులు మురిసిరే

    రిప్లయితొలగించండి
  21. నేరపు జాడలు కనుగొను
    జారుల కృత్యములఁ గని, సుజనులు మురిసిరే
    పేరుగల నవల యందున
    భారత వేగులగువారి పాత్రలు మెరయన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ప్రసాద రాజు గారు మంచి భావన.
      కాని మీరనుకున్న చారుల యర్థ మిక్కడ కుదరదు.
      కనుగొను నట్టి యను నర్థములోఁ గనుగొను లోని "ను" ద్రుతము కాదు కనుక చారులు జారులుగ మారదు.కనుగొను చారు లని వ్రాయ వలెను.
      కనుక ఇక్కడ జారు లనియే యర్థమును గ్రహింప వలసి యుండును.
      కనుగొనఁ జారుల కృత్యములఁ గని – యిట్లు వ్రాసిన మీ భావము రాఁగలదు.

      తొలగించండి
    3. పెద్దల వద్ద ఈ విషయము తెలిసి కొనుటకే ఇట్లు వ్రాసితిని.ఈ సందర్భంలో వేరొక విధంగా వ్రాయడానికి అవకాశం వుంది కాని నేనెలా వ్రాసి వుంటే ఈ తప్పు నా వద్ద మిగిలి వుండేది. మీరు శ్రద్ధతో నాతప్పును తెలిపినందుకు మీకు ధన్యవాదాలు.నిజంగా ఈ వ్యాకణాంశము నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సద్గురువులు మాత్రమే ఇలాంటి విషయాలు సూక్ష్మంగా బోధించగలరు.తప్పులు దిద్దుకుంటూ తెలుసుకొంటూ నేర్చుకుంటున్నాను.ధన్యవాదాలు!

      తొలగించండి
  22. వారుణి దేశసంస్కృతిని పన్నుచు నేటి విధంబులెంతగా
    మారిన కూడ వారసలు మారక నుండిరి , పాతకాల యా
    చారము వీడకుండ నతి చక్కగ నేసిన పంచె కట్టు పూ
    జారుల నిత్యకృత్యములు సజ్జనమోదముఁ గూర్చకుండునే

    రిప్లయితొలగించండి
  23. వారిజనయనుండౌహరి
    కారుణ్యములేకదునిమెకఠినము గానున్
    ఆరక్కసులను, ఆబే
    జారుల కృత్యములఁ గని సుజనులు మురిసిరే

    రిప్లయితొలగించండి
  24. ధీరులు సాహసవంతులు
    పౌరులు పీడితజన పరిపాలకదక్షుల్
    కారుణ్యశీలభరిత గు
    జారుల కృత్యములఁ గని సుజనులు మురిసి(య)రే
    (గుజారులు : సంపన్నులు)

    రిప్లయితొలగించండి
  25. కోరికయున్న నంబుజము కూరిమి భానుని చేరలేదు తా
    చేరదు యుత్పలమ్ము శశి చెంతకు నెంత యపేక్ష బూనినన్
    దూరమటంచు దామెరిఁగి దోబుచులాడు నిశాకరుండు కం
    జారుల నిత్యకృత్యములు సజ్జనమోదముఁ గూర్చకుండునే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వైవిధ్యమైన పూరణ. బాగుంది. అభినందనలు.
      'చేరదు+ఉత్పలమ్ము' అన్నపుడు యడాగమం రాదు. "చేరదె యుత్పలమ్ము" అనవచ్చు.

      తొలగించండి
  26. కోరినఁగోర్కెలన్నిటినిగోత్రముతోడుతవిన్నవించుచున్
    కారణజన్ములై నిలచికర్తలపాలిటఁగార్యదర్శులై
    ప్రేరణదైవకార్యములవేగముఁబెంచగదీక్షబూనుబూ
    జారుల నిత్యకృత్యములు సజ్జనమోదముఁ గూర్చకుండునే

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  27. ధారణఁ జేసి మంత్రములఁ దద్దయు ప్రీతిని నుచ్చరించుచున్
    ప్రేరణమిచ్చి భక్తులకు వేదపు సారముఁ బంచి పెట్టుచున్
    కారణ జన్ములై ప్రజకుఁ గాంతి నొసంగెడి సౌమ్యులైన పూ
    జారుల నిత్యకృత్యములు సజ్జన మోదముఁ గూర్చకుండునే

    రిప్లయితొలగించండి
  28. పేరును గోత్రము లడుగుచు
    వారియు నిక బాలతోడ పశుపతి నెపుడున్
    బేరిమి నభిషించెడుపూ
    జారులకృత్యములగని సుజనులు మురిసిరే

    రిప్లయితొలగించండి
  29. వేరగు ధ్యాస లేక దమ పెద్దల బాట దలంచి పేర్మిగా
    నేరిచి వేద శాస్త్రముల నెమ్మి పరాత్పరు పాద సేవయే
    తీరగు దారిగా నెరిగి దివ్య పదార్చన మగ్నులైన పూ
    జారుల నిత్యకృత్యములు సజ్జనమోదముఁ గూర్చకుండునే

    రిప్లయితొలగించండి
  30. తీరని కోరికల్ హరికి దెల్పుచుబ్రార్ధన జేయనేగగా
    నోరిమితోడ నర్చకుడ యొప్పగు నాదర ణంబుతోడ మా
    పేరును గోత్రమున్ నడిగి బేరిమి తోడను బూజజేయుపూ
    జారుల నిత్యకృత్యములుసజ్జన మోదముగూర్చకుండునే

    రిప్లయితొలగించండి
  31. కారణము లెన్ని చెప్పిన
    దారుణ కృత్యమ్ము లంచుఁ దద్దయు వారిన్
    ఘోరముగఁ జీత్కరించిరి
    జారుల కృత్యములఁ గని సుజనులు మురిసిరే?


    తార త రావధారణ విదారిత భీత మనో వికార ధై
    ర్యోరు పరాక్ర మావృత మహోన్నత నైపుణ యుక్త సంత తో
    దార విహార సార జన తారక కారణ కార్య దీక్షతోఁ
    జారుల నిత్య కృత్యములు సజ్జన మోదముఁ గూర్చకుండునే

    [దీక్షతోన్ + చారుల = దీక్షతోఁ జారుల]

    "మోదముఁ గూర్వకుండునే" యని యన వలయు నేమో యని నా యనుమానమండి.
    కూర్చునకు ముత్తు పరమైనది కదా.
    నేర్చు - నేర్వక; ఓర్చు - ఓర్వక.

    రిప్లయితొలగించండి
  32. జీ తెలుగు ఛానల్ లోని 'ప్రేమయెంతమధురం' సీరియల్ నేపథ్యంగా...

    ఉత్పలమాల
    దోరవయస్సు భామ సిరిఁ దూగెడు మధ్యవయస్సు బాసుతో
    గూరిమి జూపుచున్ దనర గూర్పగ సీరియలందు వారిఁ దె
    ల్లారులు 'ప్రేమయెంత మధురమ్మ' ని పించఁగ జూప ప్రేమపూ
    జారుల నిత్యకృత్యములు సజ్జనమోదముఁ గూర్చకుండునే!

    రిప్లయితొలగించండి
  33. జోరుగ నేర్చిరోతబల
    చూడగతక్కిటదిక్కిటట్టటా
    తీరుగనాదమేశృతి
    సుదీర్గలయంబుగవాద్యకారులై
    పేరునుకల్గిదసద్గురులు
    పేర్మిగనేర్పరె వారలేను భా
    జా, రుల నిత్యకృత్యములు
    సజ్జనమోదముగూర్చకుండునే
    ...తోకల...

    రిప్లయితొలగించండి