29, ఆగస్టు 2021, ఆదివారం

సమస్య - 3826

30-8-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చావొసఁగు సమస్త సౌఖ్యములను”
(లేదా...)
“చావొసఁగున్ విశేష సుఖ సంచయమన్నది వాస్తవమ్మగున్”

53 కామెంట్‌లు:


  1. వృద్ధ నైతికాదె విడువక రోగముల్
    తాగడించుచుండె తాళలేను
    రోజుకొక యవస్త లూటిసేయ నికను
    చావొసగు సమస్త సౌఖ్యములను.

    రిప్లయితొలగించండి
  2. కావగలేకబిడ్డలనుకావలివారికినప్పఁజెప్పిరే
    పోవగలేకదూరముగభోరుననేడ్చిరియాఫ్గనుల్గనన్

    తావునులేదుగాతలనుదాచుటకైననుదీనులేగదా
    చావోసగున్విశేషసుఖసంచయమన్నదివాస్తవమ్మగున్
    తావునులేదుగాతలనుదాచుటకైనను

    రిప్లయితొలగించండి
  3. భార మయ్యె బ్రతుకు బాధించ రోగాలు
    మందు లెన్ని యైన మాన్ప వయ్యె
    విసిగి పోయి రోగి వేదన తో బల్కె
    "చావొసగు సమస్త సౌఖ్య ములను "

    రిప్లయితొలగించండి

  4. గోవును భోగభాగ్యముల గోరుటదేలర? మోక్షగామివై
    కావుమటంచువేడు కరకంఠుని నిత్యము చిత్తశుద్ధితో
    తావిషమందు వానికృప దక్కిన, శాశ్వత మయ్యదే గనన్
    చావొసగున్ విశేష సుఖసంచయమన్నది వాస్తవమ్మగున్.

    రిప్లయితొలగించండి
  5. వీరసైనికుండుభీరువుగాకను
    కలనయందుతానుకామిగాక
    భక్తితోడదేశమాతనురక్షింప
    చావోసగుసమస్తసౌఖ్యములను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. వీరసైనికుండుభీరువుగాకను
      కలనయందుతానుకామిగాక

      భక్తితోడదేశభాగ్యమురక్షింప
      చావోసగుసమస్తసౌఖ్యములను

      తొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దేహ మంటి యున్న తెవులదేమియొ గాని
    బాధ పెట్టు చుండె పదను దేఱి
    సుఖమె లేదు శాంతి సున్నయయ్యెను నిక
    చావొసగు సమస్త సౌఖ్యములను.

    రిప్లయితొలగించండి
  7. శ్రీకృష్ణ ఉవాచ

    బావరొ! వీడు శంకలను పావనకార్యము యుద్ధమే
    యగున్
    నీవిధి నిర్వహంచుటయె నిక్కపు ధర్మము సన్యసించుచో
    వేవురు వెక్కిరించెదరు భీరుడ వంచును రట్టు
    కన్న నా
    చావొసొగున్ విశేష సుఖసంచయ మన్నది వాస్తవమ్మగున్

    రిప్లయితొలగించండి
  8. ఈ వసు ధాస్థలిం గనగ నెవ్వరి
    కెన్నియు మేడ లుండినన్
    జీవతమంత సేవకుల సేవల
    తోడను గడ్పినన్ సదా
    జీవుడ!భోగ భాగ్యములు జెల్లవు
    కాలము మూడినంతనే
    చావొసగున్, విశేష సుఖ సంచయ
    మన్నది వాస్తవంబగున్

    రిప్లయితొలగించండి
  9. కె.వి.యస్. లక్ష్మి:

    ఈతి బాధ లవియ యిహమున సహజము
    తనువు గూడ వ్యాధి తాప మొంది
    దేహ శాంతి లేక తీపుతో వ్యధనొంద
    చావొసగు సమస్త సౌఖ్యములను.

    రిప్లయితొలగించండి
  10. ఆటవెలది
    తలల గిల్లి వైచి దశకంఠు వదియించి
    యయ్యఁ జేర్తు ననెడు హనుమ నాపి
    సీత పలికె, "నాకు, శ్రీరాము చే వాని
    చావొసఁగు సమస్త సౌఖ్యములను"

    ఉత్పలమాల
    రావణుఁడాది దుష్టుల శిరమ్ముల గిల్లియు రాముఁ జేర్తునన్
    బావని గాంచి సీతయనె పంతము తోడను రామమూర్తి చే
    నావహమందునన్ బడియు నంతిమ వేళల రాలు వానిదౌ
    చావొసఁగున్ విశేష సుఖ సంచయమన్నది వాస్తవమ్మగున్

    రిప్లయితొలగించండి
  11. జీవితమున గలుగు చిక్కులనోపక
    చావొసఁగు సమస్త సౌఖ్యములను
    గాన నదియె నొప్పుగ దలచకుండగ
    నజుని వేడ , బాధలన్ని దొలగు

    రిప్లయితొలగించండి
  12. జన్మ దినము మొదలు జన్మించు నగచాట్లు
    సకల జీవితమ్ము వికలమొంద
    అడుగడుగున వెతల ననుభవించ తుదకు
    చావొసఁగు సమస్త సౌఖ్యములను

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. ఉ:

    కావర మెక్కువౌను మరి కాలు కదల్చక తిష్ట వేయగన్
    మావటి వాడు యేనుగును మచ్చిక జేయు విధాన మెంచనై
    చేవను బొందగా వలయు చింతలు బాపగ, కాకపోవుచో
    చావొసగున్ విశేష సుఖ సంచయ మన్నది వాస్తవమ్మగున్

    కావరము=కొవ్వు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఆవహిలెన్ విచిత్రముగ ఆమము నొక్కటి దేహమందునన్
    తావకొనంగనుండి సతతమ్మును మందుకు లొంగకున్ చవిన్
    జావయిపోయి దేహమది సాంతము పాకము దప్పగా నికన్
    చావొసగున్ విశేష సుఖసంచయమన్నది వాస్తవమ్మగున్.

    రిప్లయితొలగించండి
  16. సకల దేవతలకు సాటి గో మాతయే
    కొట్టిచంపకయ్య గోవునెపుడు
    తల్లి పాలు లేక తపియించు బిడ్డ క
    చ్చావొసఁగు సమస్త సౌఖ్యములను.

    అచ్చావు- తెల్ల ఆవు, ధేనువు

    రిప్లయితొలగించండి
  17. జీవితమందు దూకొనెడి చిక్కుల
    నోపక నెంచె నిట్టులన్
    “చావొసఁగున్ విశేష సుఖ సంచయమన్నది వాస్తవమ్మగున్”
    గావున దాని యాచరణ కచ్చిత మంచు దలంచకుండగా
    దైవము నాశ్రయించగనె దప్పక బాధలు వీగిపోవుగా

    రిప్లయితొలగించండి
  18. కఠిన దుర్నయుడులె కబ్జాల రత్తయ్య
    కొల్ల గొట్టె జనుల కోట్ల యాస్తి,
    కోవిడున, ప్రజలకు ఘోరమయినవాని
    చావొసఁగు, సమస్త సౌఖ్యములను

    రిప్లయితొలగించండి
  19. ఎంతకాల మిటుల వింత రోగమ్ముతో
    మంచమందు తనువు నుంచ వలెను
    మరణమొకటెనాకు శరణము దైవమా
    చావొసఁగు సమస్త సౌఖ్యములను

    రిప్లయితొలగించండి
  20. గోవును మాతగా దలచి కూర్మి భజించిరి పూర్వకాలమున్
    లావని యంత్రముల్ గరము లాభమటంచును వాడుచుండగా
    నీవిధి కల్మషమ్ములిల హెచ్చెను, మైల నడంచనెంచ న
    చ్చావొసఁగున్ విశేష సుఖ సంచయమన్నది వాస్తవమ్మగున్

    రిప్లయితొలగించండి
  21. రావుల రాజ్యమందున చిరాకులు బుట్టె ప్రజాళి కెల్లెడన్
    కావగ కష్టమంచు నిక కాసుల కమ్మగ భూములంతయున్
    చేవ యొకింత లేక పలు చేసిన యప్పుల దాళలేకికన్
    జావొసఁగున్ విశేష సుఖ సంచయమన్నది వాస్తవమ్మగున్

    రిప్లయితొలగించండి
  22. బ్రతికియుండ కలుగు బాధలు విరివిగ
    పుత్రమిత్రభార్య పోరు వలన
    నేది దేని నొసగు నిజ్జగ మునయన
    చావొసగు సమస్త సౌఖ్యములను

    రిప్లయితొలగించండి
  23. చావొసగున్ విశేష సుఖసంచయమన్నది వాస్తవమ్మగున్
    మీవచనంబులన్ వినగ మీరని సంతస మయ్యెనెంతయో
    జీవము గల్గీయున్నయెడ జీవితమంతయు దుఃఖమొందుచున్
    పావని! యుండనోపుగద బాములనోర్చుచు నిజ్జగంబునన్

    రిప్లయితొలగించండి
  24. నావనువన్ని కల్లలవి నాశమొనర్చు వివేకమంచు దా
    మావటి యౌచు చిత్తమను మత్తగజంబునణంగజేయుచున్
    జీవమశాశ్వతంబిహము చిన్మయు మాయనెరుంగువారికిన్
    చావొసఁగున్ విశేష సుఖ సంచయమన్నది వాస్తవమ్మగున్

    రిప్లయితొలగించండి
  25. అల పదాఱు వేల లలనలు చెఱ లోన
    రగులు చుండ నంత రాజ కన్య
    లిట్లు తలఁచి రెదల నీ నరకాసురు
    చావొసఁగు సమస్త సౌఖ్యములను


    కావఁగ లేరు తృప్తి నెదఁ గాంచక వర్తిలు వాని నేరు సం
    భావన సేసి చూడఁగను మానవ కోటికి ఘోర దుఃఖముల్
    రావిల మీఁదు మిక్కిలి దురాశను జంపిన నుత్సహించి యా
    చావొసఁగున్ విశేష సుఖ సంచయ మన్నది వాస్తవమ్మగున్

    రిప్లయితొలగించండి
  26. జీవితమంత తియ్యనగు చేదగు యూహల పాలపుంతయే
    నావియె నావియే యనుచు నమ్మిన వన్నియు రాలు తారలై
    తోవమ రొక్కటేది? మరి తోడుగ వచ్చెడి వేవి? జీవికిన్
    చావొసఁగున్ విశేష సుఖ సంచయమన్నది వాస్తవమ్మగున్.

    రిప్లయితొలగించండి
  27. బ్రతికియున్న కలుగు బాధలవెన్నియో
    చావొసగు సమస్త సౌఖ్యములన
    టంచునెంచి ననది యజ్ఞతయౌనను
    విబుధులాడుమాట వినగవలయు

    మరొక పూరణ

    కావలివారలున్న నట గ్రన్నన బుట్టెను గాంచుమానిశిన్
    కావగ నెంచి శిష్టులను,కంటకులైచరియించుచుండగా
    జీవ మలన్ గొనంగహరి శీఘ్రమె వచ్చెను గాచుకొమ్మునీ
    చావొసగున్ విశేష సుఖ సంచయమన్నది వాస్తవమ్మగున్

    రిప్లయితొలగించండి