15, ఆగస్టు 2021, ఆదివారం

సమస్య - 3813

16-8-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇంతినిం గౌఁగిలించె మునీంద్రుఁ డకట”
(లేదా...)
“ఇంతినిఁ గౌఁగిలించెను జితేంద్రియుఁడైన మునీంద్రుఁ డక్కటా”

46 కామెంట్‌లు:

  1. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఇంద్రుడంపిన మేనక యిలను జేరి
    మౌని గాధిజుడు తపమె మాను నటుల
    మోహ భావము పెంచియు ముసిమి జూప
    ఇంతిని కౌగలించెను మునీంద్రు డకట!

    రిప్లయితొలగించండి
  2. మోక్ష సాధన గోరిన ముని వరుండు
    ఘోర తపమాచరించెను గుట్టుగాను
    వంచనలు జేయు నింద్రుడు పంపినట్టి
    ఇంతినిం గౌఁగిలించె మునీంద్రుఁ డకట!!

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    సుతులు నిర్జీవులై నంత సతులు నొప్ప
    సత్యవతియె సద్యోగర్భసంజనుతుని
    వ్యాసునెంచ నిల్పఁగ కురువంశ తరువు
    నింతినిం గౌగిలించె మునీంద్రుఁడకట

    ఉత్పలమాల
    సంతును బాసి సత్యవతి సైచక బాధను వంశవృద్ధికై
    యంతకు పూర్వమున్ గనిన వ్యాసుని పుత్రవధూ సమాగమ
    మ్మంతట కోరఁగన్ వధువు లందగ జేరఁగ నొక్కరొక్కరై
    యింతినిఁ గౌఁగిలించెను జితేంద్రియుఁడైన మునీంద్రుఁ డక్కటా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరొక ప్రయత్నము:

      ఉత్పలమాల
      ఇంతలు కన్నులుండ నునుపెక్కిన చెక్కిట విందుజేయమన్
      గాంతను వీడుదే ప్రవర! కమ్మని కౌగిట మోక్షమందఁగన్
      సుంతయు నొప్పవే? గతము చూడవె? మేనక నింద్రుడంపఁగా
      నింతినిఁ గౌఁగిలించెను జితేంద్రియుఁడైన మునీంద్రుఁ డక్కటా!

      తొలగించండి
    2. మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  4. మేఘ వాహనుడంపగా మేనక చిగు
    రాకువిలుకాని గైకొని యవని జేర
    మన్మథుని శరఘాతమె మరులుగొలుప
    ఇంతినిం గౌఁగిలించె మునీంద్రుఁ డకట.

    రిప్లయితొలగించండి

  5. పంతము బూని తాపసుల భంగమొనర్చు వాడు శ్రీ
    మంతుడు పంపె మేనకను మారుని తోడుగ మౌని చెంతకున్
    గంతుని పూలబాణములు కౌశికు దీక్షను భంగ పర్చ నా
    యింతినిఁ గౌఁగిలించెన జితేంద్రియు డైనమునీంద్రు డక్కటా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "భంగమొనర్చగ బూనువాడు శ్రీ..." అందామా?

      తొలగించండి
  6. ఎంతయొ నిష్టతో తపము నింపుగ చేయుచు నుండ కానలో
    పంతముతోడ వాసవుడు వంచగఁ బంపగ నప్సరాంగనన్
    స్వాంతము పట్టుతప్పి మరు బాణము తాకిన వేళలోన నా
    యింతినిఁ గౌఁగిలించెను జితేంద్రియుఁడైన మునీంద్రుఁ డక్కటా!

    రిప్లయితొలగించండి
  7. గాధి నందను తపమును గాంచి బెదరి
    పంపె నింద్రుడు మేనకన్ భగ్న పఱుప
    నామె తనదైన శైలిలో నాడి పాడ
    నింతినిo గౌగ లించె ము నీo ద్రు డ క ట !

    రిప్లయితొలగించండి
  8. కంతుని పుష్పబాణముల కాగుచు నాత్రుత దేవరాట్టు
    సీ
    మంతి నహల్యజేరగను మౌనివరేణ్యుని వేషమూని దా
    నింతిని గౌగలించెను; జితేంద్రియుడైన మునీంద్రు డక్కటా
    చింతిలి రాయిగమ్మనుచు శిక్షవిధించెను దారకాయెడన్

    రిప్లయితొలగించండి
  9. ఆత్మనిగ్రహమర్ధించుయానమందు
    గాంధిసాధనయందునకార్యమరసి
    వనితనోకపరిదరిఁజేరెభావగరిమ
    ఇంతినిఁగౌగిలించెమునీంద్రుడకట

    రిప్లయితొలగించండి
  10. సుంతయుమర్మమేకరణిచూపకనాడుచుయోగరూపుడై
    చెంతనుఁజేరిక్రుష్ణుడునుచేడియకన్నులుమూసియాడుచున్
    వింతగజీవుబంధములువేదనతీర్చగనుద్యమించుచున్
    ఇంతినిఁగౌగిలించెనుజితేంద్రియుడైనమునీంద్రుడక్కటా

    రిప్లయితొలగించండి
  11. సమస్య :

    ఇంతిని గౌగిలించెను జి
    తేంద్రియుడైన మునీంద్రు డక్కటా

    ( మేనకావిశ్వామిత్రము )

    ఉత్పలమాల
    ------------

    " అంతయు మానవుండు తన
    దైన తపంబున గాఢదీక్షతో
    సొంతము జేసికోగలడు ;
    జూతు వశిష్టుని గొప్పయేమియో !
    సంతును గాధిరాజు “ కని
    చయ్యన మేనక గాంచి భ్రాంతుడై
    ఇంతిని గౌగిలించెను జి
    తేంద్రియుడైన మునీంద్రు డక్కటా !

    ( సంతు - సంతానము )

    రిప్లయితొలగించండి
  12. చెంతకు జేరి మేనక విచిత్ర
    ముగా నృత్యంబు జేయగా
    స్వాంతమునందు మోహమతి
    సంభవమైనది గాధిపుత్రుకున్
    వింత వికార మానసిక వేదన
    కాతడు తాళలేక నా
    యింతిని కౌగిలించెను జితేంద్రు
    డైన మునీంద్రు డక్కటా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "విచిత్రముగా నటనంబు జేయగా/విచిత్రముగా నొనరింప నృత్యమున్" అనండి.

      తొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పంతముతోడ తీవ్రపు తపమ్మొనరించెడి గాధిపట్టిదౌ
    అంతరపూజ భగ్నమున కంచును మేనక నింద్రు డంపగా
    అంతట నామెయున్ తమిని నంటగ జేయుచు రెచ్చగొట్టగా
    ఇంతిని గౌగలించెను జితేంద్రియుడైన మునీంద్రు డక్కటా!

    రిప్లయితొలగించండి
  14. కొంటె తనమున ఒకడు కాంత రూపమున మునిని చేరిన సందర్భముగా ఈ ప్రయత్నము:

    ఉ:

    పంతము బట్టి దౌష్ట్యమున పాపపు చేష్టలు గుర్తెరుంగనై
    వింతగు రీతినెంచి దగు వేశము మార్చి యనుంగు కన్యగన్
    సొంతము మీకె యన్నటుల చూపులు గల్పగ కాంత దాసుడై
    యింతిని గౌగిలించెను జితేంద్రియుడైన మునీంద్రు డక్కటా!

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  15. కుంతికి బుట్టినట్టి ఘన కోవిదు డాత్మ సఖిన్ దలంచుటన్
    గంతుడు బాఢ వెట్ట కలకంఠిని జేర రచించి వ్యూహమున్
    వింతయె? మారువేషమున వెళ్ళె మహేంద్రసుతుండు దోచె బో
    యింతినిఁ గౌఁగిలించెను జితేంద్రియుఁడైన మునీంద్రుఁ డక్కటా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "బాధ వెట్ట" టైపాటు. 'వెళ్ళె' వ్యావహారికం. "మారు వేషమున నేగె" అనండి.

      తొలగించండి
  16. ఇంద్రలోకమునుండి దేవేంద్రుడంప
    చనియె తపసి విశ్వామిత్రు ఘనతపమును
    భంగ పరుచగ మేనక పొంగులెత్తి
    ఇంతినిం గౌఁగిలించె మునీంద్రుఁ డకట

    రిప్లయితొలగించండి
  17. ఘోర తపమాచరించియు కోరికలను
    వీడకున్నచో ఫలమేమి వెర్రి మౌని!
    తపము విఫలముగాఁగ తా దల్మి పంప
    నింతినిం గౌఁగిలించె మునీంద్రుఁ డకట

    రిప్లయితొలగించండి
  18. ఎంతటి ఘోరమైన తపమెవ్విధి సల్పిన లాభమేమి యా
    వంత చలించెనేని మది యా తపమంత నిరర్థకంబగున్
    చెంతకు నింద్రుడంపగను చేరిన యప్సరఁజూచి భ్రష్టుడై
    యింతినిఁ గౌఁగిలించెను జితేంద్రియుఁడైన మునీంద్రుఁ డక్కటా

    రిప్లయితొలగించండి
  19. చింతలుదీరజేసెతప
    మెంతయొ,కల్గెనుయోగసిద్దులే
    అంతటతొల్గనేవిషయ
    వాంచలుచిత్రపుకామమోహముల్
    పొంతనకుద్రె,జీవులను
    పోల్చితపించునుదైవమంచు, యా
    ఇంతినిగౌగిలించెను
    జితేంద్రియుడైనమునీంద్రుడక్కటా
    ...తోకల...

    రిప్లయితొలగించండి
  20. వింత యౌను వీక్షింపఁగఁ గంతు లీల
    వాని నోడింపఁ దర మౌనె మౌని కైన
    గాధి తనయుండు దుర్భర కామ తప్తుఁ
    డింతినిం గౌఁగిలించె మునీంద్రుఁ డకట


    దాంతుఁడు భూసురేంద్రుఁడు నితాంత తపో మహి మాన్వితుండునున్
    సంతస మంది సేవలకు సంయమి చంద్రుఁడు డెంద మందు ని
    శ్చింతను సత్యరుంధతి వసిష్ఠుఁడు దార సతీ మతల్లి నా
    యింతినిఁ గౌఁగిలించెను జితేంద్రియుఁడైన మునీంద్రుఁ డక్కటా

    రిప్లయితొలగించండి
  21. గాదిసూనుని దపమును గంగపాలు
    జేయ,యింద్రుడు పంపగా జేరిమునిని
    నాట్యమాడగ గామాన మోహితుడయి
    యింతినింగౌగలించె మునీంద్రుడకట

    రిప్లయితొలగించండి
  22. అంతయు మాయగానయెను నందఱు జూచుచునుండగాసభన్
    నింతిని గౌగిలించెను జితేంద్రియుడైన మునీంద్రుడక్కటా
    వింతగ దోచెనాఘటన వేములవాడను జూచితే రమా!
    కంతుని బాణముల్ మునికి గట్టిగనాటెనొ యేమొ యిట్లయెన్

    రిప్లయితొలగించండి
  23. పంతము బూని కౌశికుడు బ్రహ్మ కటాక్షము గోరి దానవి
    శ్రాంతముగా తపంబటుల సాధన జేయుచునుండ నింద్రుడా
    కాంతను బంప నామె గని కామవికారము రేగనత్తరిన్
    యింతినిఁ గౌఁగిలించెను జితేంద్రియుఁడైన మునీంద్రుఁ డక్కటా

    రిప్లయితొలగించండి