6-10-2021 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పితరుల నిందించినపుడె విభవము దక్కున్”(లేదా...)“పితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్”
పతనముగానివిధంబునసతతముసౌమ్యతమనుగడసాగుటకోఱకైసుతులునునమవసదినమునపితరులనిందించినపుడెవిభవముదక్కున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇతరుల మాటలు విడువుముసతతమునీక్షుద్రపూజ సల్పినజాలున్అతులిత శక్తులు వశపడుపితరుల నిందించినపుడె విభవము దక్కున్
క్రొవ్విడి వెంకట రాజారావు: వితముగ తమ కృషి తోడను ప్రతీతి నొందుచు వఱలు ననాథల్ మతి తప్పి పోనిడిన తమ పితరుల నిందించి నపుడె విభవము దక్కున్.
క్రొవ్విడి వెంకట రాజారావు: వితముగ తమ కృషి తోడను ప్రతీతి నొందుచు ఘనముగ వఱలు ననాథల్ మతిదప్పి పోనిడిన తమ పితరుల నిందించి నపుడె విభవము దక్కున్.
సమస్య :పితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్ ( తల్లి ఒక కోనలో తండ్రి ఒక కోనలో పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమ లేని కానలో )జతనము సేయరే యెపుడు చక్కని సంతును సాకుచుంటకై ;సతతము పేకలాటకును చల్లగ సాగును కన్నతండ్రియే !హితమది లేక కాంతలకు హెచ్చును గూర్చగ నేగు తల్లినిన్ బితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్ .( జతనము - ప్రయత్నము )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
సుతులును
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సుతులునువృద్ధినొందుటకుచూడనిజీవనకాలమందునన్అతులమునైనదీవనలనన్నిటపెద్దలుకాయుచుందురేసతతముతద్దినంబుననుసన్నిధిగోరు’తిలోదకంబులన్పితరులనిందజేసిననెబిడ్డలకున్సిరిదక్కునిచ్చలున్
మతిజెడినట్టి పలుకులివియతగులకే చెల్లుగదర, యల్పుడ వనుచున్ కృతిమతులందురు నిన్నేపితరుల నిందించినపుడె విభవము దక్కున్?
పతనమగుదు రెవరైననుపితరుల నిందించినపుడె ; విభవము దక్కున్సతతము స్మరించు కొనుచునెబ్రతుకు సలుపుచుండ వారి పథము విడువకన్
కందంహితములు మాకొనరింపఁగమితముగ వారుండి మమ్ము మింటను నిల్పన్వెతలఁబడు పిచ్చివారనిపితరుల నిందించినపుడె విభవము దక్కున్!చంపకమాలమితముగ వారలుండి మముమింటను నిల్పుట తప్ప, ప్రీతిగావెతలను మున్గుచున్ దమరి వేదన దాచుటె తప్ప, మాకనన్హితముల గూర్చి వారికని యేమియునెంచని పిచ్చివారిగన్బితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
సుతులిల బ్రీతిగ మరువక నతులిత భక్తిగ నొసఁగఁగ నమవస తిథిలో కృతువుగ దర్పణ ముల నే పితరుల నిందించి నపుడె విభవము దక్కున్?
మతిజెడి మాటలాడిన సమాజము మెచ్చదు మొండికట్టెవంచుతలతురెల్ల మానుమిక శుష్కప్రియంబులు వంశనాశమౌపితరుల నిందసేసిననె, బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్ పితరుల కార్యమన్న కడు ప్రీతిని జూపుచు నాచరించినన్.
గతుకుచు పరాయి సొమ్మునుపితరుడు యేసయ్యయనుచు వెఱ్ఱిగనమ్మన్గతమును మరచుచు స్వజనపుపితరుల నిందించి నపుడె విభవము దక్కున్ మతమన క్రైస్తవమ్మెయని మార్పిడిసేయుచు బీదబిక్కినున్ఇతరుల నమ్మకమ్ములను హీనమటంచును ద్వేషభావనల్ సతతము వ్యాప్తిసేయుచును శాస్త్రవిధాన విరుద్ధమౌనటుల్పితరుల నిందసేసిననె బిడ్డలకున్ సిరిదక్కు నిచ్చలున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్ప్రతిహత మౌనుగాక! యిటు వల్కుట బాడియె? పండితోత్తమా!మత మది యేదియైన దమ మానసమందున మర్వ వచ్చునే?హితమును గోరు పూర్వజుల నేట దలంచుట నుత్తమంబగున్.
ప్రతి యవకాశముం గొనుచు పాటవ మేర్పడ మాటలాడుచున్చితికిన బీదలన్ గొనుచు చిల్లర డబ్బులు హుజ్రబాదునన్బ్రతుకగ భారమైన మన పౌరుల వంచన జేయనెంచ చూపితరుల నిందసేసిననెబిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్
చం: గతుకులు బడ్డ జీవనము గంపెడు నాశలు వింత పోకడల్బ్రతుకుట చేతగాక బిగి పంతము బట్టుచు వాదు లాడగన్కుతకుత లాడు మానసము కోపము నెచ్చగ నెట్లు పూన్చనౌపితరుల నింద వేసిననె, బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్వై. చంద్రశేఖర్
పతితల పొందుకై గణిక వాటికలన్ దిరుగాడు వారలాయతిగలు ద్యూతకృత్తులు సురాపులు దుర్మతులైన వారలై ప్రతిదినమున్ గళత్రమును రాయడిపెట్టుచు నాస్తులమ్మెడిన్ బితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్
క్రొవ్విడి వెంకట రాజారావు: బ్రతుకున నెంతయో శ్రమను పన్ని సమంచితమైన నేర్పుతో ద్యుతి నెనయించు కార్యములు దొంతగు రీతి నొనర్చి వృద్ధినిన్ యతులితమౌచు సాగెడి ననాథలు వారి నిటుంచి కుల్కునౌ పితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్.
చంపకమాల:మతిసరి లేని సంతు, మరి మందులు మూర్ఖులు పుత్రులౌదు రే“పితరుల నింద సేసిననె/ బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్”వెతలను బొందరెన్నడును వేల్పులు దీవెన లిత్తురెంతయో సతతము భక్తిగల్గి మనసా వచసా తలిదండ్రిఁ గొల్చినన్ -కటకం వేంకటరామ శర్మ.
పితరులె తొల్తవేల్పులని పేర్కొనె వేదపురాణశాస్త్రముల్హితవరు లట్లు వారి సము లేర్పడ నుందురె? లోకమందునన్గతులను దప్పి యుండినను కాదన వచ్చునె వారి సేవలన్సుతుడు కుపుత్రుడైన నిల చూతుము, లేదు కుమాత, యేల నోపితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్?కంజర్ల రామాచార్య.
సుతులను పట్టించుకొనకసతతము సంపదలకొఱకు సతమతమగుచున్మతితప్పి చరించెడునాపితరుల నిందించినపుడె విభవము దక్కున్
కందంసతతము మాతా పితరులప్రతిపత్తిగ జూడ కలుగు పరమపదంబున్నుతిగ యనదగదు పలుకున్పితరుల నిందించి నపుడె విభవము దక్కున్.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్
సతిని నిరాదరించుచును సంపద నిత్యము ఖర్చుపెట్టుచున్సతతము సాని కొంపలను సాగుచు దుర్భర కామవాంచతోసుతులను కష్టపెట్టి కడు శుంఠలుగాచరియించు నట్టి యాపితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్
మితమగు మాటలు బలుకుచుపితరుల నిందించినపుడె విభవము దక్కున్హితులై యివ్వరు యాస్తుల్ పతకములని భార్యయన్న ప్రాజ్ఞుడు వినునా!
నుతియించిన నొసఁగును గొన్ని తరులు ఫలపుష్పముల ననేకముల నిలన్ నుతియించుటఁ గొన్నిటి నాపి తరుల నిందించి నపుడె విభవము దక్కున్ధృతి మతి నూని దొంగలకు దిట్ట తనమ్మున బుద్ధి సెప్పుచున్ సతతము మానవత్వమును జక్కఁగ నేర్పుచు మార్ప నెంచుచుం ముతుకల నింక నుత్తములఁ బుణ్య జనాలినిఁ గాక రేపు మాపితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్ [రేపు మాపు + ఇతరుల = రేపు మా పితరుల]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
బ్రతికిన మూడునాళులిట భక్తిని గొల్చుచు దల్లిదండ్రులన్హితమగు వారిమాటలను నెన్నడుదాటక ధర్మమార్గమున్సతతము సంచరించగను చక్కని సంతును బొందవచ్చు నేపితరుల నిందసేసిననె బిడ్డలకున్ సిరిదక్కు నిచ్చలున్ ?
షారుక్ ఖాన్ వంటి ఎందరో పితరులు తాగి యాక్సిడెంట్లు చేసేవారు, అతి వేగంగా వెళ్ళి చచ్చేవారు, చంపేవారు, మాదక ద్రవ్యాలకు బానిసలు.....😥😥అతి చనవిచ్చి పిల్లలను నాంక్షల బెట్టక కాంక్షలన్నిటిన్మితమను మాటనెంచకనె మిన్నగ దీర్చగ దల్లిదండ్రులేమతిచెడి నల్లమందుగొని మత్తునజోగుచు జిందులేయగా గతియవ జైలుగోడలవె కావగ కోర్టులవెంట దిర్గెడిన్పితరుల నిందసేసిననె బిడ్డలకున్ సిరిదక్కు నిచ్చలున్ !
పతనము మొదలిడె గదరాపితరుల నిందించి నపుడె,విభవము దక్కున్ సతతము భక్తియు రక్తియుయుతముగ నేవాడు జేయు నోనతనికిసూ
పతనమగు యశము మాతా పితరుల నిందించినపుడె, విభవము దక్కున్హితముగ వారల పూజింప తరించున్ జీవితంబు పరితోషముగన్.
పతనము సంభవించి పెనుబాధలనొందును నిశ్చయంబుగాపితరులనింద సేసిననె,బిడ్డలకున్ సిరిదక్కు నిచ్చలున్ సతతము దుర్గమాతనిల సాదర భక్తిని బూజజేయునోనతనికి,బంధువర్గమున నందఱి పిల్లలు పెద్దవారికిన్
సతతము త్రాగి మైకమున సంతునుభార్యను దిట్టి కొట్టుచున్సుతులకు యోగ్య మార్గమునుజూపక నేర్పక బుద్ధి విద్యలన్మతి చెడి వేశ్యలోలురయి మంచితనంబును వీడి నట్టి యాపితురుల నిందజేసిననె బిడ్డలకున్సిరి దక్కు నిచ్చలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదం చివర తప్పక గురువుండాలి. "హింసను వదులన్" అనండి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదం చివర తప్పక గురువుండాలి.
పతనమొనర్చు బంధముల పాతకమబ్బు నిరాదరించుచున్పితరుల నింద సేసిననె; బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్పితరుల సేవ సద్విధిగ ప్రీతినొనర్చెడి వారికిన్ సదాహితమొనగూడు సద్గతియునీశ్వర దివ్య కటాక్షలబ్ధియున్
పతనముగానివిధంబున
రిప్లయితొలగించండిసతతముసౌమ్యతమనుగడసాగుటకోఱకై
సుతులునునమవసదినమున
పితరులనిందించినపుడెవిభవముదక్కున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇతరుల మాటలు విడువుము
రిప్లయితొలగించండిసతతమునీక్షుద్రపూజ సల్పినజాలున్
అతులిత శక్తులు వశపడు
పితరుల నిందించినపుడె విభవము దక్కున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివితముగ తమ కృషి తోడను
ప్రతీతి నొందుచు వఱలు ననాథల్
మతి తప్పి పోనిడిన తమ
పితరుల నిందించి నపుడె విభవము దక్కున్.
క్రొవ్విడి వెంకట రాజారావు:
తొలగించండివితముగ తమ కృషి తోడను
ప్రతీతి నొందుచు ఘనముగ వఱలు ననాథల్
మతిదప్పి పోనిడిన తమ
పితరుల నిందించి నపుడె విభవము దక్కున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిపితరుల నింద సేసిననె
బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్
( తల్లి ఒక కోనలో తండ్రి ఒక కోనలో
పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమ లేని కానలో )
జతనము సేయరే యెపుడు
చక్కని సంతును సాకుచుంటకై ;
సతతము పేకలాటకును
చల్లగ సాగును కన్నతండ్రియే !
హితమది లేక కాంతలకు
హెచ్చును గూర్చగ నేగు తల్లినిన్
బితరుల నింద సేసిననె
బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్ .
( జతనము - ప్రయత్నము )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసుతులును
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసుతులునువృద్ధినొందుటకుచూడనిజీవనకాలమందునన్
రిప్లయితొలగించండిఅతులమునైనదీవనలనన్నిటపెద్దలుకాయుచుందురే
సతతముతద్దినంబుననుసన్నిధిగోరు’తిలోదకంబులన్
పితరులనిందజేసిననెబిడ్డలకున్సిరిదక్కునిచ్చలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమతిజెడినట్టి పలుకులివి
యతగులకే చెల్లుగదర, యల్పుడ వనుచున్
కృతిమతులందురు నిన్నే
పితరుల నిందించినపుడె విభవము దక్కున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపతనమగుదు రెవరైనను
రిప్లయితొలగించండిపితరుల నిందించినపుడె ; విభవము దక్కున్
సతతము స్మరించు కొనుచునె
బ్రతుకు సలుపుచుండ వారి పథము విడువకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిహితములు మాకొనరింపఁగ
మితముగ వారుండి మమ్ము మింటను నిల్పన్
వెతలఁబడు పిచ్చివారని
పితరుల నిందించినపుడె విభవము దక్కున్!
చంపకమాల
మితముగ వారలుండి మముమింటను నిల్పుట తప్ప, ప్రీతిగా
వెతలను మున్గుచున్ దమరి వేదన దాచుటె తప్ప, మాకనన్
హితముల గూర్చి వారికని యేమియునెంచని పిచ్చివారిగన్
బితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిసుతులిల బ్రీతిగ మరువక
రిప్లయితొలగించండినతులిత భక్తిగ నొసఁగఁగ నమవస తిథిలో
కృతువుగ దర్పణ ముల నే
పితరుల నిందించి నపుడె విభవము దక్కున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమతిజెడి మాటలాడిన సమాజము మెచ్చదు మొండికట్టెవం
చుతలతురెల్ల మానుమిక శుష్కప్రియంబులు వంశనాశమౌ
పితరుల నిందసేసిననె, బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్
పితరుల కార్యమన్న కడు ప్రీతిని జూపుచు నాచరించినన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగతుకుచు పరాయి సొమ్మును
రిప్లయితొలగించండిపితరుడు యేసయ్యయనుచు వెఱ్ఱిగనమ్మన్
గతమును మరచుచు స్వజనపు
పితరుల నిందించి నపుడె విభవము దక్కున్
మతమన క్రైస్తవమ్మెయని మార్పిడిసేయుచు బీదబిక్కినున్
ఇతరుల నమ్మకమ్ములను హీనమటంచును ద్వేషభావనల్
సతతము వ్యాప్తిసేయుచును శాస్త్రవిధాన విరుద్ధమౌనటుల్
పితరుల నిందసేసిననె బిడ్డలకున్ సిరిదక్కు నిచ్చలున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిపితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్
రిప్లయితొలగించండిప్రతిహత మౌనుగాక! యిటు వల్కుట బాడియె? పండితోత్తమా!
మత మది యేదియైన దమ మానసమందున మర్వ వచ్చునే?
హితమును గోరు పూర్వజుల నేట దలంచుట నుత్తమంబగున్.
ప్రతి యవకాశముం గొనుచు పాటవ మేర్పడ మాటలాడుచున్
తొలగించండిచితికిన బీదలన్ గొనుచు చిల్లర డబ్బులు హుజ్రబాదునన్
బ్రతుకగ భారమైన మన పౌరుల వంచన జేయనెంచ చూ
పితరుల నిందసేసిననెబిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిచం:
రిప్లయితొలగించండిగతుకులు బడ్డ జీవనము గంపెడు నాశలు వింత పోకడల్
బ్రతుకుట చేతగాక బిగి పంతము బట్టుచు వాదు లాడగన్
కుతకుత లాడు మానసము కోపము నెచ్చగ నెట్లు పూన్చనౌ
పితరుల నింద వేసిననె, బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపతితల పొందుకై గణిక వాటికలన్ దిరుగాడు వారలా
యతిగలు ద్యూతకృత్తులు సురాపులు దుర్మతులైన వారలై
ప్రతిదినమున్ గళత్రమును రాయడిపెట్టుచు నాస్తులమ్మెడిన్
బితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిబ్రతుకున నెంతయో శ్రమను పన్ని సమంచితమైన నేర్పుతో
ద్యుతి నెనయించు కార్యములు దొంతగు రీతి నొనర్చి వృద్ధినిన్
యతులితమౌచు సాగెడి ననాథలు వారి నిటుంచి కుల్కునౌ
పితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచంపకమాల:
రిప్లయితొలగించండిమతిసరి లేని సంతు, మరి మందులు మూర్ఖులు పుత్రులౌదు రే
“పితరుల నింద సేసిననె/ బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్”
వెతలను బొందరెన్నడును వేల్పులు దీవెన లిత్తురెంతయో
సతతము భక్తిగల్గి మనసా వచసా తలిదండ్రిఁ గొల్చినన్
-కటకం వేంకటరామ శర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపితరులె తొల్తవేల్పులని పేర్కొనె వేదపురాణశాస్త్రముల్
రిప్లయితొలగించండిహితవరు లట్లు వారి సము లేర్పడ నుందురె? లోకమందునన్
గతులను దప్పి యుండినను కాదన వచ్చునె వారి సేవలన్
సుతుడు కుపుత్రుడైన నిల చూతుము, లేదు కుమాత, యేల నో
పితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్?
కంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసుతులను పట్టించుకొనక
రిప్లయితొలగించండిసతతము సంపదలకొఱకు సతమతమగుచున్
మతితప్పి చరించెడునా
పితరుల నిందించినపుడె విభవము దక్కున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిసతతము మాతా పితరుల
ప్రతిపత్తిగ జూడ కలుగు పరమపదంబున్
నుతిగ యనదగదు పలుకున్
పితరుల నిందించి నపుడె విభవము దక్కున్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసతిని నిరాదరించుచును సంపద నిత్యము ఖర్చుపెట్టుచున్
రిప్లయితొలగించండిసతతము సాని కొంపలను సాగుచు దుర్భర కామవాంచతో
సుతులను కష్టపెట్టి కడు శుంఠలుగాచరియించు నట్టి యా
పితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమితమగు మాటలు బలుకుచు
రిప్లయితొలగించండిపితరుల నిందించినపుడె విభవము దక్కున్
హితులై యివ్వరు యాస్తుల్
పతకములని భార్యయన్న ప్రాజ్ఞుడు వినునా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినుతియించిన నొసఁగును గొ
రిప్లయితొలగించండిన్ని తరులు ఫలపుష్పముల ననేకముల నిలన్
నుతియించుటఁ గొన్నిటి నా
పి తరుల నిందించి నపుడె విభవము దక్కున్
ధృతి మతి నూని దొంగలకు దిట్ట తనమ్మున బుద్ధి సెప్పుచున్
సతతము మానవత్వమును జక్కఁగ నేర్పుచు మార్ప నెంచుచుం
ముతుకల నింక నుత్తములఁ బుణ్య జనాలినిఁ గాక రేపు మా
పితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్
[రేపు మాపు + ఇతరుల = రేపు మా పితరుల]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిబ్రతికిన మూడునాళులిట భక్తిని గొల్చుచు దల్లిదండ్రులన్
రిప్లయితొలగించండిహితమగు వారిమాటలను నెన్నడుదాటక ధర్మమార్గమున్
సతతము సంచరించగను చక్కని సంతును బొందవచ్చు నే
పితరుల నిందసేసిననె బిడ్డలకున్ సిరిదక్కు నిచ్చలున్ ?
షారుక్ ఖాన్ వంటి ఎందరో పితరులు
తొలగించండితాగి యాక్సిడెంట్లు చేసేవారు, అతి వేగంగా వెళ్ళి చచ్చేవారు, చంపేవారు, మాదక ద్రవ్యాలకు బానిసలు.....😥😥
అతి చనవిచ్చి పిల్లలను నాంక్షల బెట్టక కాంక్షలన్నిటిన్
మితమను మాటనెంచకనె మిన్నగ దీర్చగ దల్లిదండ్రులే
మతిచెడి నల్లమందుగొని మత్తునజోగుచు జిందులేయగా
గతియవ జైలుగోడలవె కావగ కోర్టులవెంట దిర్గెడిన్
పితరుల నిందసేసిననె బిడ్డలకున్ సిరిదక్కు నిచ్చలున్ !
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిపతనము మొదలిడె గదరా
రిప్లయితొలగించండిపితరుల నిందించి నపుడె,విభవము దక్కున్
సతతము భక్తియు రక్తియు
యుతముగ నేవాడు జేయు నోనతనికిసూ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపతనమగు యశము మాతా
రిప్లయితొలగించండిపితరుల నిందించినపుడె, విభవము దక్కున్
హితముగ వారల పూజిం
ప తరించున్ జీవితంబు పరితోషముగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపతనము సంభవించి పెనుబాధలనొందును నిశ్చయంబుగా
రిప్లయితొలగించండిపితరులనింద సేసిననె,బిడ్డలకున్ సిరిదక్కు నిచ్చలున్
సతతము దుర్గమాతనిల సాదర భక్తిని బూజజేయునో
నతనికి,బంధువర్గమున నందఱి పిల్లలు పెద్దవారికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసతతము త్రాగి మైకమున సంతును
రిప్లయితొలగించండిభార్యను దిట్టి కొట్టుచున్
సుతులకు యోగ్య మార్గమును
జూపక నేర్పక బుద్ధి విద్యలన్
మతి చెడి వేశ్యలోలురయి మంచి
తనంబును వీడి నట్టి యా
పితురుల నిందజేసిననె బిడ్డలకున్
సిరి దక్కు నిచ్చలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిరెండవ పాదం చివర తప్పక గురువుండాలి. "హింసను వదులన్" అనండి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిరెండవ పాదం చివర తప్పక గురువుండాలి.
పతనమొనర్చు బంధముల పాతకమబ్బు నిరాదరించుచున్
రిప్లయితొలగించండిపితరుల నింద సేసిననె; బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్
పితరుల సేవ సద్విధిగ ప్రీతినొనర్చెడి వారికిన్ సదా
హితమొనగూడు సద్గతియునీశ్వర దివ్య కటాక్షలబ్ధియున్