29-10-2021 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్”(లేదా...)“ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో”
చండ తర పరాక్ర మమున భండన మొనరించు వేళ పగతుర బలమే మెండని వెను దిరుగు ట గని ఖండిత శీర్షములు నవ్వె కదన తలమునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కండలగర్వముపోయెనుదండిగరామునిశరములదాడియుశుభమేపండుగగాదేమనకనఖండితశీర్షములునవ్వెకదనతలమునన్
సమస్య :ఖండిత శీర్షగుచ్ఛము ప కాలున నవ్వెను యుద్ధభూమిలో ( బొబ్బిలి పాలకుడైన రంగారాయనిపై యుద్ధా నికి ఫ్రెంచివారి నాహ్వానించిన విజయరామరాజు దురాగతాన్ని అవహేళన చేస్తున్న వీరుల తలలు )మొండిగ రంగరాయనిని ముప్పుల పాలొనరింప జూచితే రండని బుస్సి హైదరుల రాణువ బిల్చిన రామరాజ ! నీ చుండవు ; రేపు నీగతియు చూడగ నిట్లగు నంచు హేళనన్ ఖండిత శీర్షగుచ్ఛము ప కాలున నవ్వెను యుద్ధభూమిలో.( బుస్సి - ఫ్రెంచి దొర ; హైదరు - హైదర్ జంగ్ ;రాణువ - సైన్యము )
అద్భుతమైన పూరణ. అభినందనలు.
భండనమందున పగతురదండిగ పరిమార్చి నట్టి ధండధరుని తోమొండెముల నేలుకొమ్మనిఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్.
మెండుగలోకమందుననుమేలగుధర్మముకాంతిహీనమైపండగపాపకర్మములుభారతయుద్ధముదాపురించెనేకుండనుబోలుజీవితముకూలునునిత్యముసత్యమంచనన్ఖండితశీర్షగుచ్ఛముపకాలుననవ్వెనుయుద్ధభూమిలో
కందంభండన భీముడు రాముడుఖండించెను రావణ దశ కంఠములనిలోమొండెము పై మొలకెత్తినఖండిత శీర్షములు నవ్వె కదన తలమునన్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్
దండిగ రాజ్యకాంక్షగల దండధరుండు రణమ్ముకోసమైదండును ద్వేష్టిపై నడిపి దందడియందున శత్రు సేనలన్ చెండె శవాలకుప్ప జయశీలుని మొండెము లేలమంచు నాఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కందందండుగ కౌరవ సైన్యముపాండవ పక్షమ్ము పైకి వైచఁగ శరముల్చెండగ తప్పించుకొని యఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్ఉత్పలమాలమొండిగ రావణాధముఁడు పోరుకు నెంచగ రాఘవుండు కోదండ పరాక్రముండనఁగఁ తారకరాముడు విక్రమింపఁగన్మెండుగ రాలుచున్ భువికి మీదట మొండెముకంటు మాయతోఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
భండన భూమిలోన నిరు పక్షపుసైన్యము బోరుచుండగాదండిగ సైన్య కంఠములు ధాత్రినిగూలెను, రాజ్య కాంక్షులీగుండెలు లేని రాజులును గూలదురంచును మా విధంబుగాఖండిత శీర్షగుచ్ఛము పకాలుననవ్వెను యుద్ధ భూమిలో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. '...గూలుదు రంచును' టైపాటు.
"కొండలు పిండిజెసెదను కొట్టెద తిట్టెద కౌరవాదులన్నిండుగ నాదు శౌర్యమును నిర్భరతన్ గను మో బృహన్నలా!"వెండి ప్రగల్భముల్ బలుకు వెర్రిని"నుత్తరు"గేలి సేయుచున్ఖండిత శీర్ష గుచ్చము పకాలున నవ్వెను యుధ్ధ భూమిలో.
dhanyavadamulu
గండరగండడై కదన కౌతుకమొప్పగనాజి యందునుద్దండ పరాక్రమంబెసఁగ దారుణ మారణకాండ సల్పుచున్చండగదా ప్రహారముల శౌర్యముఁజూపుచు విక్రమింపగన్ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో
మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారూ 🙏🏻
భండనమందున వైరులచండాడుచునూచకోత సలుపుచు తుదకున్మొండెములు వేరుకాఁగాఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్
గాండీవి తన గెలుపుతోమెండగు తృప్తిని బడయక మృతదేహములేగుండెను పిండగ తలచెన్ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కొండొక దేశము పయి నీదండిని జూపించ నెంచి దగవును సలుపన్పండె నొక వల్లకాడనిఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్
చెండతర రామచంద్రుడుమొండెము పై నుండు తలలు మొత్తము దునుమన్.మండే కన్నుల, రావణుఖండిత శీర్షములు నవ్వె, కదనతలమునన్
ఎదురుగ నిలచిన పది తలలు గల రావణుని రూపము గని రణము నందువెరవక శరమును శిరముపై వదలగతెగి పుడమికి చేరి తిరిగి చేరెమరల నతికె దేహమందు, నివ్వెర పోయి శరములను వదల మరల మరలనతికి కాయమున ఖండిత శీర్షములు నవ్వెకదన తలమునన్ పక పక మనుచు,భీతి చెందుచు నుండ, విభీషణుండురాముని చెవిలో తెలిపెను రావణుని హృదయమున నమృత భాండము దాగి యుండెశరము వదలి పగుల గొట్ట చచ్చు నంచు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఒకటి రెండు సవరణలు వాట్సపు సమూహంలో సూచించాను.
చండ పరాక్రమమ్మునను శౌర్యధనుండగు రామచంద్రు డాభండన మందునన్ జలగి వైరి శిరమ్ములఁ ద్రుంచు చుండగాగండర గండలౌ రిపులు కాంచగ మృత్యువు, దక్కు ముక్తికైఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. '..జెలగి'
గురువర్యులకు నమస్సులు. సవరణకు ధన్యవాదములు.
చండాశోకుండపుడాభండనమున వృద్ధురాలి వ్యథ గని దా ఖిన్నుండై వీడగ హింసన్ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్
"మొండివొ! జానకీసతిని మోహవశమ్మున లంక దెత్తి వుద్ధండత గర్హ్యమై దగు నధర్మపథమ్మున రావణా! సుధాభాండఫలమ్మిదా?" యనుచు ప్రాకటదుఃఖగళప్రభిన్నమైఖండితశీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలోకంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
మొండిగ ప్రతినను పూనగదండన నిచ్చిన పగిదిన దయయే లేకన్మొండెముల మిగల్చగనటఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'పగిదిని' అనండి.
మొండిగ కృష్ణుపైననటు మూర్ఖుని పోలెను కాలుదువ్వగన్పండిన పాపలెఖ్ఖలవి పక్వము జెందగ దూషణమ్ముతోచండప్రచండుడై చెలగి చక్రము వేయగ ముక్తినిచ్చుచున్ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభుమిలో!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'పాప లెక్కలు' దుష్టసమాసం.
భండనభీముడు రాముడుచండశరాఘతి శిరంబు జక్కడచిన వే రొండు జనించుచు రావణు ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్
మండఁగ డెందము నిప్పుల గుండ మన నశోకుఁడు ఘటికుఁడు నెగ్గిన రాగండఁడు కలఁతను జూడఁగ ఖండిత శీర్షములు నవ్వెఁ గదన తలమునన్మెండుగఁ బొందఁగా జయము మీఱిన యాజిని రత్న మౌళి సన్మండిత మూర్ధ పంక్తి నర మాన్య ప రార్చిత మస్త రాజముల్ ఖండిత దుఃఖ సంచయము ఖండిత శత్రు శిరో విరాజి తాఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో [విరాజిత + అఖండిత= విరాజి తాఖండిత]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
ఖండిత మగునే యరి శిరఖండన మిరువురికి మోక్ష కరమది నీతిన్దుండగ మరికి నశమమనిఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్ (ధర్మయుద్ధంలో నిశ్చయ శత్రు మరణం ఇద్దరికీ మోక్షకరమే.దుండగంతో చంపినపుడు చంపినవాడు పాపగతి పొందుతాడాని మరణించిన తలలు నవ్వాయను యర్థంలో వ్రాయడమైనది; మొదటి పాదంలో ఖండితము : నిశ్చయము3వ పాదము: దుండగము +అరికిని +అశమమని)
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ఖండిత మగునె యరి శిరః ఖండన...' అనండి.
ధన్యవాదాలు గురువుగారు.
ఉత్పలమాల:రండి। పరేతభూములివి రాజ్యము నేలగ రండి రాజ! మీభండన కాంక్ష మా సతులబంగరు పుస్తెలు మంటగల్పెనేపండుగ జేయుడింక బలవంతులు మీరని విస్తుఁబోవుచున్“ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో”--కటకం వేంకటరామ శర్మ.
చండ తర పరాక్ర మమున
రిప్లయితొలగించండిభండన మొనరించు వేళ పగతుర బలమే
మెండని వెను దిరుగు ట గని
ఖండిత శీర్షములు నవ్వె కదన తలమునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికండలగర్వముపోయెను
రిప్లయితొలగించండిదండిగరామునిశరములదాడియుశుభమే
పండుగగాదేమనకన
ఖండితశీర్షములునవ్వెకదనతలమునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిఖండిత శీర్షగుచ్ఛము ప
కాలున నవ్వెను యుద్ధభూమిలో
( బొబ్బిలి పాలకుడైన రంగారాయనిపై యుద్ధా
నికి ఫ్రెంచివారి నాహ్వానించిన విజయరామరాజు దురాగతాన్ని అవహేళన చేస్తున్న వీరుల తలలు )
మొండిగ రంగరాయనిని
ముప్పుల పాలొనరింప జూచితే
రండని బుస్సి హైదరుల
రాణువ బిల్చిన రామరాజ ! నీ
చుండవు ; రేపు నీగతియు
చూడగ నిట్లగు నంచు హేళనన్
ఖండిత శీర్షగుచ్ఛము ప
కాలున నవ్వెను యుద్ధభూమిలో.
( బుస్సి - ఫ్రెంచి దొర ; హైదరు - హైదర్ జంగ్ ;రాణువ - సైన్యము )
అద్భుతమైన పూరణ. అభినందనలు.
తొలగించండిభండనమందున పగతుర
రిప్లయితొలగించండిదండిగ పరిమార్చి నట్టి ధండధరుని తో
మొండెముల నేలుకొమ్మని
ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమెండుగలోకమందుననుమేలగుధర్మముకాంతిహీనమై
రిప్లయితొలగించండిపండగపాపకర్మములుభారతయుద్ధముదాపురించెనే
కుండనుబోలుజీవితముకూలునునిత్యముసత్యమంచనన్
ఖండితశీర్షగుచ్ఛముపకాలుననవ్వెనుయుద్ధభూమిలో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిభండన భీముడు రాముడు
ఖండించెను రావణ దశ కంఠములనిలో
మొండెము పై మొలకెత్తిన
ఖండిత శీర్షములు నవ్వె కదన తలమునన్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిదండిగ రాజ్యకాంక్షగల దండధరుండు రణమ్ముకోసమై
దండును ద్వేష్టిపై నడిపి దందడియందున శత్రు సేనలన్
చెండె శవాలకుప్ప జయశీలుని మొండెము లేలమంచు నా
ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిదండుగ కౌరవ సైన్యము
పాండవ పక్షమ్ము పైకి వైచఁగ శరముల్
చెండగ తప్పించుకొని య
ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్
ఉత్పలమాల
మొండిగ రావణాధముఁడు పోరుకు నెంచగ రాఘవుండు కో
దండ పరాక్రముండనఁగఁ తారకరాముడు విక్రమింపఁగన్
మెండుగ రాలుచున్ భువికి మీదట మొండెముకంటు మాయతో
ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిభండన భూమిలోన నిరు పక్షపు
రిప్లయితొలగించండిసైన్యము బోరుచుండగా
దండిగ సైన్య కంఠములు ధాత్రిని
గూలెను, రాజ్య కాంక్షులీ
గుండెలు లేని రాజులును గూలదు
రంచును మా విధంబుగా
ఖండిత శీర్షగుచ్ఛము పకాలున
నవ్వెను యుద్ధ భూమిలో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'...గూలుదు రంచును' టైపాటు.
"కొండలు పిండిజెసెదను కొట్టెద తిట్టెద కౌరవాదులన్
రిప్లయితొలగించండినిండుగ నాదు శౌర్యమును నిర్భరతన్ గను మో బృహన్నలా!"
వెండి ప్రగల్భముల్ బలుకు వెర్రిని"నుత్తరు"గేలి సేయుచున్
ఖండిత శీర్ష గుచ్చము పకాలున నవ్వెను యుధ్ధ భూమిలో.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిdhanyavadamulu
తొలగించండిగండరగండడై కదన కౌతుకమొప్పగనాజి యందును
రిప్లయితొలగించండిద్దండ పరాక్రమంబెసఁగ దారుణ మారణకాండ సల్పుచున్
చండగదా ప్రహారముల శౌర్యముఁజూపుచు విక్రమింపగన్
ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో
మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురువుగారూ 🙏🏻
తొలగించండిభండనమందున వైరుల
రిప్లయితొలగించండిచండాడుచునూచకోత సలుపుచు తుదకున్
మొండెములు వేరుకాఁగా
ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగాండీవి తన గెలుపుతో
రిప్లయితొలగించండిమెండగు తృప్తిని బడయక మృతదేహములే
గుండెను పిండగ తలచెన్
ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికొండొక దేశము పయి నీ
రిప్లయితొలగించండిదండిని జూపించ నెంచి దగవును సలుపన్
పండె నొక వల్లకాడని
ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచెండతర రామచంద్రుడు
రిప్లయితొలగించండిమొండెము పై నుండు తలలు మొత్తము దునుమన్.
మండే కన్నుల, రావణు
ఖండిత శీర్షములు నవ్వె, కదనతలమునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఎదురుగ నిలచిన పది తలలు గల రా
తొలగించండివణుని రూపము గని రణము నందు
వెరవక శరమును శిరముపై వదలగ
తెగి పుడమికి చేరి తిరిగి చేరె
మరల నతికె దేహమందు, నివ్వెర పోయి
శరములను వదల మరల మరల
నతికి కాయమున ఖండిత శీర్షములు నవ్వె
కదన తలమునన్ పక పక మనుచు,
భీతి చెందుచు నుండ, విభీషణుండు
రాముని చెవిలో తెలిపెను రావణుని హృ
దయమున నమృత భాండము దాగి యుండె
శరము వదలి పగుల గొట్ట చచ్చు నంచు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఒకటి రెండు సవరణలు వాట్సపు సమూహంలో సూచించాను.
చండ పరాక్రమమ్మునను శౌర్యధనుండగు రామచంద్రు డా
రిప్లయితొలగించండిభండన మందునన్ జలగి వైరి శిరమ్ములఁ ద్రుంచు చుండగా
గండర గండలౌ రిపులు కాంచగ మృత్యువు, దక్కు ముక్తికై
ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'..జెలగి'
గురువర్యులకు నమస్సులు. సవరణకు ధన్యవాదములు.
తొలగించండిచండాశోకుండపుడా
రిప్లయితొలగించండిభండనమున వృద్ధురాలి వ్యథ గని దా ఖి
న్నుండై వీడగ హింసన్
ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మొండివొ! జానకీసతిని మోహవశమ్మున లంక దెత్తి వు
రిప్లయితొలగించండిద్ధండత గర్హ్యమై దగు నధర్మపథమ్మున రావణా! సుధా
భాండఫలమ్మిదా?" యనుచు ప్రాకటదుఃఖగళప్రభిన్నమై
ఖండితశీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో
కంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమొండిగ ప్రతినను పూనగ
రిప్లయితొలగించండిదండన నిచ్చిన పగిదిన దయయే లేకన్
మొండెముల మిగల్చగనట
ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పగిదిని' అనండి.
మొండిగ కృష్ణుపైననటు మూర్ఖుని పోలెను కాలుదువ్వగన్
రిప్లయితొలగించండిపండిన పాపలెఖ్ఖలవి పక్వము జెందగ దూషణమ్ముతో
చండప్రచండుడై చెలగి చక్రము వేయగ ముక్తినిచ్చుచున్
ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభుమిలో!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పాప లెక్కలు' దుష్టసమాసం.
భండనభీముడు రాముడు
రిప్లయితొలగించండిచండశరాఘతి శిరంబు జక్కడచిన వే
రొండు జనించుచు రావణు
ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమండఁగ డెందము నిప్పుల
రిప్లయితొలగించండిగుండ మన నశోకుఁడు ఘటికుఁడు నెగ్గిన రా
గండఁడు కలఁతను జూడఁగ
ఖండిత శీర్షములు నవ్వెఁ గదన తలమునన్
మెండుగఁ బొందఁగా జయము మీఱిన యాజిని రత్న మౌళి స
న్మండిత మూర్ధ పంక్తి నర మాన్య ప రార్చిత మస్త రాజముల్
ఖండిత దుఃఖ సంచయము ఖండిత శత్రు శిరో విరాజి తా
ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో
[విరాజిత + అఖండిత= విరాజి తాఖండిత]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఖండిత మగునే యరి శిర
రిప్లయితొలగించండిఖండన మిరువురికి మోక్ష కరమది నీతిన్
దుండగ మరికి నశమమని
ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్
(ధర్మయుద్ధంలో నిశ్చయ శత్రు మరణం ఇద్దరికీ మోక్షకరమే.
దుండగంతో చంపినపుడు చంపినవాడు పాపగతి పొందుతాడాని మరణించిన తలలు నవ్వాయను యర్థంలో వ్రాయడమైనది;
మొదటి పాదంలో ఖండితము : నిశ్చయము
3వ పాదము: దుండగము +అరికిని +అశమమని)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఖండిత మగునె యరి శిరః ఖండన...' అనండి.
ధన్యవాదాలు గురువుగారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండిరండి। పరేతభూములివి రాజ్యము నేలగ రండి రాజ! మీ
భండన కాంక్ష మా సతుల
బంగరు పుస్తెలు మంటగల్పెనే
పండుగ జేయుడింక బలవంతులు మీరని విస్తుఁబోవుచున్
“ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో”
--కటకం వేంకటరామ శర్మ.