25-10-2021 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కరిముఖుండు వాలమున లంకను దహించె”(లేదా...)“కరివదనుండు వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్”
గురువుతానుగనరుదెంచికూర్చెబోధసీతజీవాత్మగాచెనుసేగిఁదీరరావణుండుగలోనున్నలావునణచికరిముఖుండువాలమునలంకనుదహించెకరి-కోఁతి
తేటగీతిసీత విరహాన రామయ్య చింతనుండవెదుకి సాధించి దీవిని సుదతిఁ గాంచివైరి దౌష్ట్యమ్ము నెదిరించి పౌరుషమునకరిముఖుండు వాలమున లంకను దహించెచంపకమాలవిరహము నందు జిక్కి రఘువీరుడు రాముడు సీత రోయఁగన్మరుతుని పుత్రునంప నసమాన బలంబున వార్ధి దూకియున్సరసిజ నేత్రఁగాంచి వనశాఖల ద్రుంచఁగ వైరి దౌష్ట్యమైకరివదనుండు వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్
తేటగీతి రెండవపాదం లో మొదట వెదకి అని చదువుకొన ప్రార్థన
విఘ్న ములు తొలగించె డు వేలుపు గద కరి ముఖుండు : వాలమున లంక ను దహించె హనుమ చెల రేగి విక్రముండా తడ గుచు విశ్వ రూపము జూపించి భీతి గొలిపె
పరుగునవాయునందనుడుభానునివేగమునందిచెచ్చెరన్అరిగనిజీవుగాచుటకునాదరమోప్పగచేయిచాచుచున్సరిగనుసాధనంబుననుసాధ్యముఁజేయగరాముకార్యమున్కరివదనుండువాలమునఁగాల్ెనులంకనుశౌర్యమోప్పగన్
రామపత్నిని వెదుకుచు లంకచేరిబంధకుని చేత బంధింపబడెను హనుమనీచ రాక్షసులుతనకు నిప్పుబెట్టకరిముఖుండు వాలమున లంకను దహించె
బదులిడుమనుచు ప్రశ్నించె పండితు డొకడిట్లు విఘ్నముల హరించెడీశ్వరసుతుడెవడు? దనుజరాజ్యము గపి యేమిచేసె కరిముఖుండు వాలమున లంకను దహించె
హరహయుడంచు పిల్చు మలయమ్మ సుపుత్రుడు విఘ్నహారిగావిరివిగ పూజలందుకొను వేలుపెవండని యడ్గుచుంటినే శరనిధి దాటి పావని నిశాటుని రాజ్యము జేసె నేమనన్ కరివదనుండు, వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్
హితవు జెప్పెడు దూతను నీసడించిఆగ్రహించిన రావణు డాజ్ఞనీయనిగ్రహించగ దోకకు నిప్పుపెట్టకరిముఖుండు వాలమున లంకను దహించెగురిగొని తల్లిదండ్రులకు గూర్చ ప్రదక్షిణ నాయకుండయెన్కరివదనుండు; వాలమున గాల్చెను లంకను శౌర్యమొప్పగన్ చురుకగు వాయునందనుడ శోకవనంబున రాక్షసాంగనల్ తరుణిని భూమిజాతనట దారుణరీతిని హింసబెట్టగన్
క్రమాలంకార పూరణవిఘ్నముల బాపు వారెవరు వెదకి చూడ?దున్న లీగల దేనితో తోలుకొనును?రామ దూతయు బలిమిని నేమి జేసె?కరి ముఖుండు-వాలమున-లంకను దహించె.
శివ గణముల కధిపతియై సేవలందుముందు, మాతా పితల చుట్టు మూడు మార్లుతిరిగె; వెదకి హనుమ సీత తెరువు గాంచి,కరిముఖుండు, వాలమున లంకను దహించె.
సమస్య :కరివదనుండు వాలమున గాల్చెను లంకను శౌర్యమొప్పగన్ ( శ్రీరామకార్యం కోసం వెళ్లుతున్న హనుమకు ఆశీస్సులందించిన విఘ్నేశ్వరుడు )పరమశివాంశ సంభవుడు పావని ప్రజ్వలితోర్ధ్వబాహుడై సరగున నేగుచుండ తన చల్లని దీవెన లిచ్చె ప్రేమతో గరివదనుండు ; వాలమున గాల్చెను లంకను శౌర్యమొప్పగన్ చరచర రేగుచున్న శిఖి చాడ్పున మారుతి చండదేహుడై .( శిఖి - అగ్నిదేవుడు )
తల్లిదండ్రుల చుట్టు ప్రదక్షి న నిడెకరిముఖుండు ; వాలమున లంకను దహించెదాని కనలము ముట్టించు దరుణ మందు , చూచి రమ్మన గాల్చెడి చొప్పు ననగ
మరి సరిజేసె యుద్ధమున మాయల మూషికు గర్వమంతయున్కరివదనుండు; వాలమునఁ గాల్చెను లంకను, శౌర్యమొప్పఁగన్పురమున యిల్లలోనబడి పూర్తిగ ధగ్దము జేసి వస్తువుల్,విరిచెను చెట్ల కొమ్మలను వీరుడు మారుతి హెచ్చరించుచున్
పరువులు బెట్టి వీధులను పండుగ పూటను ముత్తుకూరునన్ తిరుగుచు మందుగ్రోలుచును త్రిప్పలు వెట్టుచు భామలెల్లరిన్మురియుచు నాటకమ్మునను ముచ్చట మీరగ శాస్త్రివర్యుడౌ కరివదనుండు వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్
జలధిలంఘించి చేరెను స్వర్ణలంకఁగాంచె జానకీ మాతను కన్నులారరక్కసులుపట్టి బంధించి రభసజేయకరిముఖుండు వాలమున లంకను దహించె
శరధినిదాటి వానరుఁడు సాధ్వి మహీజనుగాంచి దెల్పె దాశరధికిఁదాను బంటునని సాంత్వన వాక్యములన్ వచించి శ్రీకరమగు సీత క్షేమమును గాంచినపిమ్మట నుత్సహించుచున్కరివదనుండు వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్
శరణము గోరినట్టి వన సామజమున్కరుణించి బ్రోచె నాకరివరదుండు,వాలమున గాల్చెను లంకను శౌర్యమొప్పగన్పరమ దురాత్మురావణుని పట్టణమున్ దనయుక్తి శక్తిచేనిరతము రామ నామ జప నిర్మలభక్తుడు వాయు పుత్రుడున్
దురితమనస్కులై చెలగు ధూర్త నిశాటులు, రేని యానతోకరువలిపట్టి వాలమునుఁ గాల్చగ వస్త్రముఁ జుట్టి, కిన్కతోతిరుగుచుఁ బట్టణమ్మునను, దివ్యమునుండి కనంగఁ బ్రీతితోకరివదనుండు, వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్
ఇందు వదన సీతను గాంచి డెంద మంద నింపు రావణు శక్తి గణింప నెంచి సుందరుం డగు మారుత నందనుండు కరిముఖుండు వాలమున లంకను దహించె [కరి ముఖుఁడు = కోఁతి ముఖము వాఁడు]సురుచిర రామభక్తుఁడు వచో నిపుణుండు మనోజవుండు నా వర ఖర దానవజ్వలిత వాల విరాజితుఁ డాంజనేయుఁడే హరి కట శంక రాంశునకు నయ్యను జాభున కీయ దీవనల్ కరివదనుండు, వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్
తేటగీతిఅత్తరి శతయోజన సాగరాన్ని దాటిసీతని గని సంతసపడి క్షేమమడిగిరాక్షసాధములను జంపి రద్ది సల్పికరిముఖుండు వాలమున లంకను దహించెప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తరిషము దాటి రామసతి తల్లియయోనిజ జాడ గోరి సత్వరమున లంకజేరి యట వారిజనేత్రిని గాంచి మానమందరునకు జిక్కిరక్కసుల దండట తోకకు నిప్పు వెట్టగన్ కరివదనుండు వాలమున గాల్చెను లంకను శౌర్యమొప్పగన్.కరి = గజము, కోతి.
వేల్పులందరి కంటెను బెద్దవేల్పుకరిముఖుండు,వాలమున లంకను దహించెనాంజనేయుడు,రాక్షసు లగ్ని జొనుపసంగరంబునకును నాంది సత్కవివర!
చంపకమాల:పరసతి మోహి రావణుడు పాపము హెచ్చి తనంతతానుగా గరళము కూఁడునందు కలగల్పిన రీతిన సీత మాత నే పురమున తెచ్చిపెట్టె , కపి మూకలు నల్దెస రాముడంప గా “కరివదనుండు వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్”---కటకం వేంకటరామ శర్మ.
సీత మాత " తొలగించి "రాము పత్ని " అనుట సబబేమో
తేటగీతి:ఆత్మ లింగము రాకుండ నడ్డగించె *కరిముఖుండు, వాలమున లంకను దహించె*భవుని యంశను పుట్టిన వాయు సుతుడు కొడుకు తండ్రియు భక్తుని కొంపగూల్చె। ---కటకం వేంకటరామ శర్మ.
మురిపెము గొల్పు బొజ్జయును మోదము గూర్చెడి మోముతో గనున్ కరివదనుండు,వాలమున గాల్చెను లంకను శౌర్యమొప్పగన్ గిరగిర దిర్గుచున్ వడిని గేళిగలంకను జుట్టి కీరమున్ జరజర శబ్దముల్ గలుగ సర్వము భస్మము నౌవిధంబునన్
గురువుతానుగనరుదెంచికూర్చెబోధ
రిప్లయితొలగించండిసీతజీవాత్మగాచెనుసేగిఁదీర
రావణుండుగలోనున్నలావునణచి
కరిముఖుండువాలమునలంకనుదహించె
కరి-కోఁతి
తేటగీతి
రిప్లయితొలగించండిసీత విరహాన రామయ్య చింతనుండ
వెదుకి సాధించి దీవిని సుదతిఁ గాంచి
వైరి దౌష్ట్యమ్ము నెదిరించి పౌరుషమున
కరిముఖుండు వాలమున లంకను దహించె
చంపకమాల
విరహము నందు జిక్కి రఘువీరుడు రాముడు సీత రోయఁగన్
మరుతుని పుత్రునంప నసమాన బలంబున వార్ధి దూకియున్
సరసిజ నేత్రఁగాంచి వనశాఖల ద్రుంచఁగ వైరి దౌష్ట్యమై
కరివదనుండు వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్
తేటగీతి రెండవపాదం లో మొదట వెదకి అని చదువుకొన ప్రార్థన
రిప్లయితొలగించండివిఘ్న ములు తొలగించె డు వేలుపు గద
రిప్లయితొలగించండికరి ముఖుండు : వాలమున లంక ను దహించె
హనుమ చెల రేగి విక్రముండా తడ గుచు
విశ్వ రూపము జూపించి భీతి గొలిపె
పరుగునవాయునందనుడుభానునివేగమునందిచెచ్చెరన్
రిప్లయితొలగించండిఅరిగనిజీవుగాచుటకునాదరమోప్పగచేయిచాచుచున్
సరిగనుసాధనంబుననుసాధ్యముఁజేయగరాముకార్యమున్
కరివదనుండువాలమునఁగాల్ెనులంకనుశౌర్యమోప్పగన్
రామపత్నిని వెదుకుచు లంకచేరి
రిప్లయితొలగించండిబంధకుని చేత బంధింపబడెను హనుమ
నీచ రాక్షసులుతనకు నిప్పుబెట్ట
కరిముఖుండు వాలమున లంకను దహించె
బదులిడుమనుచు ప్రశ్నించె పండితు డొక
రిప్లయితొలగించండిడిట్లు విఘ్నముల హరించెడీశ్వరసుతు
డెవడు? దనుజరాజ్యము గపి యేమిచేసె
కరిముఖుండు వాలమున లంకను దహించె
రిప్లయితొలగించండిహరహయుడంచు పిల్చు మలయమ్మ సుపుత్రుడు విఘ్నహారిగా
విరివిగ పూజలందుకొను వేలుపెవండని యడ్గుచుంటినే
శరనిధి దాటి పావని నిశాటుని రాజ్యము జేసె నేమనన్
కరివదనుండు, వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్
హితవు జెప్పెడు దూతను నీసడించి
రిప్లయితొలగించండిఆగ్రహించిన రావణు డాజ్ఞనీయ
నిగ్రహించగ దోకకు నిప్పుపెట్ట
కరిముఖుండు వాలమున లంకను దహించె
గురిగొని తల్లిదండ్రులకు గూర్చ ప్రదక్షిణ నాయకుండయెన్
కరివదనుండు; వాలమున గాల్చెను లంకను శౌర్యమొప్పగన్
చురుకగు వాయునందనుడ శోకవనంబున రాక్షసాంగనల్
తరుణిని భూమిజాతనట దారుణరీతిని హింసబెట్టగన్
క్రమాలంకార పూరణ
రిప్లయితొలగించండివిఘ్నముల బాపు వారెవరు వెదకి చూడ?
దున్న లీగల దేనితో తోలుకొనును?
రామ దూతయు బలిమిని నేమి జేసె?
కరి ముఖుండు-వాలమున-లంకను దహించె.
శివ గణముల కధిపతియై సేవలందు
రిప్లయితొలగించండిముందు, మాతా పితల చుట్టు మూడు మార్లు
తిరిగె; వెదకి హనుమ సీత తెరువు గాంచి,
కరిముఖుండు, వాలమున లంకను దహించె.
సమస్య :
రిప్లయితొలగించండికరివదనుండు వాలమున
గాల్చెను లంకను శౌర్యమొప్పగన్
( శ్రీరామకార్యం కోసం వెళ్లుతున్న హనుమకు ఆశీస్సులందించిన విఘ్నేశ్వరుడు )
పరమశివాంశ సంభవుడు
పావని ప్రజ్వలితోర్ధ్వబాహుడై
సరగున నేగుచుండ తన
చల్లని దీవెన లిచ్చె ప్రేమతో
గరివదనుండు ; వాలమున
గాల్చెను లంకను శౌర్యమొప్పగన్
చరచర రేగుచున్న శిఖి
చాడ్పున మారుతి చండదేహుడై .
( శిఖి - అగ్నిదేవుడు )
తల్లిదండ్రుల చుట్టు ప్రదక్షి న నిడె
రిప్లయితొలగించండికరిముఖుండు ; వాలమున లంకను దహించె
దాని కనలము ముట్టించు దరుణ మందు ,
చూచి రమ్మన గాల్చెడి చొప్పు ననగ
మరి సరిజేసె యుద్ధమున మాయల మూషికు గర్వమంతయున్
రిప్లయితొలగించండికరివదనుండు; వాలమునఁ గాల్చెను లంకను, శౌర్యమొప్పఁగన్
పురమున యిల్లలోనబడి పూర్తిగ ధగ్దము జేసి వస్తువుల్,
విరిచెను చెట్ల కొమ్మలను వీరుడు మారుతి హెచ్చరించుచున్
పరువులు బెట్టి వీధులను పండుగ పూటను ముత్తుకూరునన్
రిప్లయితొలగించండితిరుగుచు మందుగ్రోలుచును త్రిప్పలు వెట్టుచు భామలెల్లరిన్
మురియుచు నాటకమ్మునను ముచ్చట మీరగ శాస్త్రివర్యుడౌ
కరివదనుండు వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్
జలధిలంఘించి చేరెను స్వర్ణలంకఁ
రిప్లయితొలగించండిగాంచె జానకీ మాతను కన్నులార
రక్కసులుపట్టి బంధించి రభసజేయ
కరిముఖుండు వాలమున లంకను దహించె
శరధినిదాటి వానరుఁడు సాధ్వి మహీజనుగాంచి దెల్పె దా
రిప్లయితొలగించండిశరధికిఁదాను బంటునని సాంత్వన వాక్యములన్ వచించి శ్రీ
కరమగు సీత క్షేమమును గాంచినపిమ్మట నుత్సహించుచున్
కరివదనుండు వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్
శరణము గోరినట్టి వన సామజమున్
రిప్లయితొలగించండికరుణించి బ్రోచె నా
కరివరదుండు,వాలమున గాల్చెను
లంకను శౌర్యమొప్పగన్
పరమ దురాత్మురావణుని పట్టణ
మున్ దనయుక్తి శక్తిచే
నిరతము రామ నామ జప నిర్మల
భక్తుడు వాయు పుత్రుడున్
దురితమనస్కులై చెలగు ధూర్త నిశాటులు, రేని యానతో
రిప్లయితొలగించండికరువలిపట్టి వాలమునుఁ గాల్చగ వస్త్రముఁ జుట్టి, కిన్కతో
తిరుగుచుఁ బట్టణమ్మునను, దివ్యమునుండి కనంగఁ బ్రీతితో
కరివదనుండు, వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్
ఇందు వదన సీతను గాంచి డెంద మంద
రిప్లయితొలగించండినింపు రావణు శక్తి గణింప నెంచి
సుందరుం డగు మారుత నందనుండు
కరిముఖుండు వాలమున లంకను దహించె
[కరి ముఖుఁడు = కోఁతి ముఖము వాఁడు]
సురుచిర రామభక్తుఁడు వచో నిపుణుండు మనోజవుండు నా
వర ఖర దానవజ్వలిత వాల విరాజితుఁ డాంజనేయుఁడే
హరి కట శంక రాంశునకు నయ్యను జాభున కీయ దీవనల్
కరివదనుండు, వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్
తేటగీతి
రిప్లయితొలగించండిఅత్తరి శతయోజన సాగరాన్ని దాటి
సీతని గని సంతసపడి క్షేమమడిగి
రాక్షసాధములను జంపి రద్ది సల్పి
కరిముఖుండు వాలమున లంకను దహించె
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితరిషము దాటి రామసతి తల్లియయోనిజ జాడ గోరి స
రిప్లయితొలగించండిత్వరమున లంకజేరి యట వారిజనేత్రిని గాంచి మానమం
దరునకు జిక్కిరక్కసుల దండట తోకకు నిప్పు వెట్టగన్
కరివదనుండు వాలమున గాల్చెను లంకను శౌర్యమొప్పగన్.
కరి = గజము, కోతి.
వేల్పులందరి కంటెను బెద్దవేల్పు
రిప్లయితొలగించండికరిముఖుండు,వాలమున లంకను దహించె
నాంజనేయుడు,రాక్షసు లగ్ని జొనుప
సంగరంబునకును నాంది సత్కవివర!
చంపకమాల:
రిప్లయితొలగించండిపరసతి మోహి రావణుడు పాపము హెచ్చి తనంతతానుగా
గరళము కూఁడునందు కలగల్పిన రీతిన సీత మాత నే
పురమున తెచ్చిపెట్టె , కపి మూకలు నల్దెస రాముడంప గా
“కరివదనుండు వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్”
---కటకం వేంకటరామ శర్మ.
సీత మాత " తొలగించి "రాము పత్ని " అనుట సబబేమో
తొలగించండితేటగీతి:
రిప్లయితొలగించండిఆత్మ లింగము రాకుండ నడ్డగించె
*కరిముఖుండు, వాలమున లంకను దహించె*
భవుని యంశను పుట్టిన వాయు సుతుడు
కొడుకు తండ్రియు భక్తుని కొంపగూల్చె।
---కటకం వేంకటరామ శర్మ.
మురిపెము గొల్పు బొజ్జయును మోదము గూర్చెడి మోముతో గనున్
రిప్లయితొలగించండికరివదనుండు,వాలమున గాల్చెను లంకను శౌర్యమొప్పగన్
గిరగిర దిర్గుచున్ వడిని గేళిగలంకను జుట్టి కీరమున్
జరజర శబ్దముల్ గలుగ సర్వము భస్మము నౌవిధంబునన్