కంద పూరణములోఁ జిన్న వ్యాకరణ సంక్లిష్టము కలదు. పూజలకు వరుస క్రమము శివుఁడు, హరి, శివుఁడు, హరి సమస్యా పాదమున నీ విధముగా నున్నది. ఆ క్రమము చెడకుండ నుండుటకై “యీ లీలను మార్చి మార్చి యీ హరుని హరిన్” అని వ్రాయవలసి వచ్చెను. “యీ హరహరులన్” అని సమాస యుక్తముగ వ్రాసిన నందగించును గాని ద్వంద్వసమాసమున “హరి హరులన్” అని యి కారాంత హరి పదమునే ముందు వ్రాయ వలసి యుండును. అప్పుడు పూజా క్రమము మారుచున్నది.
చాలున్ భేదము లేలా?
రిప్లయితొలగించండిలీల లెరుంగుము జగతిని రీతిన్ గనగా
కాలుడు రుద్రుడు గృష్ణుడు
నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలీలామానుషవేషము
రిప్లయితొలగించండికాలాక్రుతిగనగశత్రుఖండనసేయన్
ఏలాభేదములెంచగ
నీలగళుడుహరినీలాంగుండే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కాలాకృతి'
ఏలాభేదములెంచుట
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండిశూలాయుధ చక్రాయుధ
లీలామానుష చరులుగఁ బృధ్వీస్థలిపై
పాలింప నార్తిఁ బాపఁగ
నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే
శార్దూలవిక్రీడితము
శూలమ్మొక్కరు శంఖ చక్రమొకరున్ సొంపారగాఁ దాల్చుచున్
లీలామానుష రూపులై చెలగరే పృధ్వీస్థలిన్ శిష్టులన్
పాలింపంగ దురాత్ములన్ దునుమెడున్ భావంబునన్ జూడఁగన్
నీలగ్రీవుఁ డనంగ విష్ణువె యగున్ నీలాంగుఁ డాశంభుఁడే!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిమేలుగ గ్రోలెను గరళము
రిప్లయితొలగించండినీలగళు డు : హరి శివుండు నీలాంగుడే
యేల వలె నంతరములు
పోలిక లు వలదని యండ్రు పొందుగ నార్యుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహేలన్జూచినస్రుష్టిలోపరమునేహ్రీవీడియాలోచనన్
రిప్లయితొలగించండిలోలోనన్గనిరెండులేవనెడిదీలోకంపుమర్యాదగా
లీలామానుషవేషధారులుగకేళీలోలనిర్మగ్నులీ
నీలగ్రీవుఁడనంగవిష్ణువెయగున్నీలాంగుడాశంభుడే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'సృష్టిలో' టైపాటు.
ధన్యవాదములండిగురువుగారువట్రుసుడిటైపుకుఅవకాశములేక అట్టులవ్రాసితిని క్షమించగలరు
తొలగించండికాలాతీతుడు నిర్వికారుడు
రిప్లయితొలగించండిమహా కాలాత్మ సర్వజ్ఞుడున్
బోలా శంకరుడాది భిక్షువుకదా
భూమండలంబాతడే
కాలానుక్రమరీతిజేయులయ
మున్ గాలాంత కుండాతడే
నీలగ్రీవుడనంగ విష్ణవె యగున్నీ
లాంగుడా శంభువే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచాలా సాధన చేసిరి
రిప్లయితొలగించండియాలయ నాటకము కొరకు హరి,శివ; వరుసన్
మేలుగ చేసిరి నటనము
నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఫాలాక్షుడతడు గట్రా
చూలిమనోహరుడు భవుడు శూలిధరుడు గో
పాలుడు చంద్రా పీడుడు
నీలగళుడు, హరి శివుండు నీలాంగుండే.
(శివుడు= శుభములనొసగువాడు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(హరి అనువానితో నొకడిట్లు చెప్పెను)
రిప్లయితొలగించండిఆలించుము నా మాటను
నీలగళుడు హరి శివుండు, నీలాంగుండే
పాలేటిచూలి పతి యమ
కీలుడు కుందుడభిజిత్తు కేశవు డతడే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబాలుడు హరిహరులొకటను
రిప్లయితొలగించండినాలోచన తన మనమున
నమరినకతనన్
గేలిగననె నీరీతిగ
“నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏలా భేదములెంచుట
రిప్లయితొలగించండిహాలాహలధారి శౌరియననొక్కరెసూ
పాలిత కింకరుఁడగునా
నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశార్దూలము:
రిప్లయితొలగించండికైలాసంబున నల్లనమ్మతన శ్రీకంఠుణ్ణి లాస్యమ్మునన్
సాలోక్యమ్ముగ కౌగిలించ పతియేశ్యామాంగుగాఁ దోచెనే
పాలన్బు ట్టిన నీలవేణి మెడకున్ వాలే జడన్చుట్టగా
“నీలగ్రీవుఁ డనంగ విష్ణువె యగున్ నీలాంగుఁ డాశంభుఁడే”
---కటకం వేంకటరామ శర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏలా భేదము లెంచగా తగున నీవీరీతి? నిక్కంబుగా
రిప్లయితొలగించండినీలగ్రీవుఁ డనంగ విష్ణువె యగున్, నీలాంగుఁ డా శంభుఁడే
లీలామాత్రపు దేహధారులగునా నీలాంగు డుష్ణీషియౌ
నీలగ్రీవుని శౌరిగానెఱుగగా నీరక్ష వారిర్వురున్
(ఉష్ణీషి= శివుఁడు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిశూలమ్మాయుధమైన శూలి యతడే జోటింగుడా లింగడే
నీలగ్రీవుడనంగ, విష్ణువె యగున్ నీలాంగు, డా శంభుడే
కైలాసమ్మున నిల్చియుండగ రమాకాంతుండు తానుండు నా
పాలాంభోనిధి, విశ్వతో ముఖులకున్ వైషమ్య మేముండురా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశా:
రిప్లయితొలగించండిఏలా బిల్చిన వారలిద్దరొకరే యేలంగ నీ లోకమున్
చాలింపండిక వేరు జేసి నుడువన్ సంపత్తు వ్యత్యాసమే
యాలోచింపగ నన్య రూపులగుచో నాడింప మార్బల్క రే
నీలగ్రీవుడనంగ విష్ణువె యగున్ నీలాంగు డాశంభుడే
సంపత్తు=అలంకారము
మార్బల్కు0=అడ్డము చెప్పు
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిఈలోకపు వెలుగెవరన
రిప్లయితొలగించండినీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే
శూలధరుడు చక్రధరుడు
కాలుడు శిఖపింఛమౌళి కరుణామయులే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమేలగు చిత్రము చూపగ
రిప్లయితొలగించండినీలపు వర్ణము నిలుపని నేత్రములగుటన్
చాలని పల్కెనొక బుడత
నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే
పై పూరణ వర్ణాంధత్వము (colour blindness) భావన ప్రాతిపదికగా చేయడమైనది.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండినీలగ్రీవు డనంగ విష్ణువె యగున్
నీలాంగు డా శంభుడే
( శైవవైష్ణవ మతదురభిమానాల నిర్మూలనకై హరిహరనాథస్వామిని సృజించి పదిహేను పర్వాల భారతాన్ని అంకితమిచ్చాడు కవిబ్రహ్మ తిక్కన )
వాలాయంబుగ తిక్కనార్యు డదిగో
వర్ణించె నొక్కండుగా
శ్రీలక్ష్మీవిభు పార్వతీవిభులనే
చెల్వంబు రెట్టింపగా ;
లీలం జేకొనజేసె భారతమునే
లెంకౌచు ; తద్దృష్టిలో
నీలగ్రీవు డనంగ విష్ణువె యగున్ ;
నీలాంగు డా శంభుడే !
( వాలాయము - అనివార్యము ; లెంక - సేవకుడు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఏలా భేదము శౌరి శంకరుల కీర్తింపంగ సద్భక్తితో
రిప్లయితొలగించండిలీలామానుషరూపుడై మనుజులన్ ప్రేమించు శ్రీకృష్ణుడున్
బోళా శంకరుడై ప్రజాళిని దయన్ బోషించు వాడొక్కడే
నీలగ్రీవుఁ డనంగ విష్ణువె యగున్ నీలాంగుఁ డాశంభుఁడే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహాలాహలమానెనెవఁడు
రిప్లయితొలగించండిపాలేటబరుండునెవఁడు పరగనెవండా
ఫాలాక్షుఁడజితుఁడెవఁడో
నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలీలా!యెఱుగుమ యీయది
రిప్లయితొలగించండినీలగళుడుహరి శివుండు నీలాంగుండే
లీలామానుష రూపులు
చాలముగావా రిమహిమ,శక్తిని బొగడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలీలంగౌస్థుభమాలశౌరిమెడలో
రిప్లయితొలగించండినీలద్యుతుల్నింపగా
నీలాభ్రాద్భుతగాత్రయైన తరుణిన్ నీలాంబరిన్ కాళికన్
ఫాలాక్షుండుశరీరమందుసగమై భాసింపగాజేయగన్
నీలగ్రీవుడనంగవిష్ణువెయగున్
నీలాంగుడాశంభుడే!
..రంగావఝ్యల కోటేశ్వరశాస్త్రి.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివాలిన భక్తిని గొలువుమ
రిప్లయితొలగించండియీ లీలను మార్చి మార్చి యీ హరుని హరిన్
వీలుగ ననంతర మిటుల
నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే
వ్రా లిట్లుండఁగ సంశయం బగును భావం బందు నిక్కమ్ముగా
నీ లీలం గన స్పష్టమే యగును నీ కిప్పాదమే వింతగా
నీలాంగుండగు విష్ణువే శివునకున్ నీలంపుఁ గంఠం బహో
నీలగ్రీవుఁ డనంగ,విష్ణువె యగున్ నీలాంగుఁ, డాశంభుఁడే
[పద విభజన: నీలగ్రీవుఁ డనంగ ౼ఆ శంభుఁడే విష్ణువె యగున్ నీలాంగుఁడు]
కంద పూరణములోఁ జిన్న వ్యాకరణ సంక్లిష్టము కలదు.
తొలగించండిపూజలకు వరుస క్రమము శివుఁడు, హరి, శివుఁడు, హరి సమస్యా పాదమున నీ విధముగా నున్నది.
ఆ క్రమము చెడకుండ నుండుటకై “యీ లీలను మార్చి మార్చి యీ హరుని హరిన్” అని వ్రాయవలసి వచ్చెను.
“యీ హరహరులన్” అని సమాస యుక్తముగ వ్రాసిన నందగించును గాని ద్వంద్వసమాసమున “హరి హరులన్” అని యి కారాంత హరి పదమునే ముందు వ్రాయ వలసి యుండును. అప్పుడు పూజా క్రమము మారుచున్నది.
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండినీలగ్రీవుడనంగ విష్ణువెయగున్ నీలాంగుడాశంభుడే
రిప్లయితొలగించండిలీలామానుష రూపులేగద సరిన్ లేలీయమానంబుగా
బాలింపన్ బ్రజనెల్ల సౌఖ్యముముదంబై యింపు సొంపారగా
నీలగ్రీవుడు బ్రహ్మవిష్ణులు గనన్ నీకాశ మూర్తుల్ సుమీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'లేలీయమానంబుగా, నీకాశమూర్తుల్'?
కందం!!
రిప్లయితొలగించండిలీలల్ కానగ వింతలె
మేలగు రీతిని దరిశన మిచ్చెడి వారల్
నీలపు వర్ణులె కనగన్
నీలగళుడు హరి,శివుండు నీలాంగుడే !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూలాధారనివాసి కుండలిని నిర్ముక్తంబు గావింపగా
రిప్లయితొలగించండినాలోకంబగు దివ్య తేజము మదిన్ సానందసంవేద్యమై
లీలామానుష విగ్రహాకృతిని సర్వేశుండభేదంబుగా
నీలగ్రీవుఁ డనంగ విష్ణువె యగున్ నీలాంగుఁ డాశంభుఁడే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండికాలాంతక, లక్ష్మీపతి
వేలుపులిర్వురికి బేధవృత్తి దలపకన్
లీలగ గీసిన చిత్రము
నీలగళుడు హరి శివుండు నీలాంగుండే
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాలాతీతము జేయకన్,నుసురులన్ కాలాంతకుండైన,యా
రిప్లయితొలగించండిభోళా శంకరుడే సదా కరుణతో భూతేశుడై త్రెంచగా
లీలామానుష నీలదేహ హరియే లెఖ్ఖించ పాపంబులే
నీలగ్రీవు డనంగ విష్ణువె యగున్ ,నీలాంగుడా శంభుడే !!
కందం!!
లీలల్ కానగ వింతలె
మేలగు రీతిని దరిశన మిచ్చెడి వారల్
నీలపు వర్ణులె కనగన్
నీలగళుడు హరి,శివుండు నీలాంగుడే !!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి