8, మార్చి 2023, బుధవారం

సమస్య - 4360

9-3-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సారా కొని హితముఁ గనిరి సద్బ్రాహ్మణులే”
(లేదా...)
“సారా త్రాగి తరించిపోయిరి గదా సద్బ్రాహ్మణుల్ భూమిలో”
(ఆముదాల మురళి గారి శతావధానంలో డా।। దేవణ్ణ గారి సమస్య)

19 కామెంట్‌లు:

  1. భారత భాగవతాదుల
    పారాయణమాచరించి పండితులగుచున్,
    తీరిక వేళల, దా మన
    సారా కొని హితముఁ గనిరి సద్బ్రాహ్మణులే.

    రిప్లయితొలగించండి
  2. శా.

    ఆరోపించిన లాభమున్ గలుగదే హత్యాప్రయత్నంబుగన్
    గ్రూరావేశముతో విభూతి గచునిన్ గ్రోలింప మద్యంబునన్
    ప్రారబ్ధమ్ముగ నూరి కల్పగ సితున్ బ్రార్థించ దైత్యోక్తమే
    *సారా త్రాగి తరించిపోయిరి గదా సద్బ్రాహ్మణుల్ భూమిలో.*

    రిప్లయితొలగించండి
  3. సారమునిండినవేదము
    పారమునంటగపఠించిభావంబరయన్
    చేరన్ముక్తినితమమన
    సారాగొనిహితముగనిరిసద్బ్రాహ్మణులే

    రిప్లయితొలగించండి

  4. మారామెందుకు మూర్ఖుడ
    క్షీరాన్నము గైకొనంగ చింతను విడు సీ
    తారామ ప్రసాదము వ
    త్సా! రా, కొని హితముఁ గనిరి సద్బ్రాహ్మణులే.


    సారగ్రీవుని మజ్జనమ్మునకు నే సద్భక్తితో తెచ్చితిన్
    మారామెందుకు గైకొనంగ నిదియే మందాకినీ తోయమౌ
    నారోగ్యంబు నొసంగు సత్యమిదియే యాయుష్షు నే బెంచు వ
    త్సా! రా, త్రాగి తరించిపోయిరి గదా సద్బ్రాహ్మణుల్ భూమిలో.

    రిప్లయితొలగించండి
  5. పారావారముభావగర్భితముసోపానంబుమోక్షంబుకున్
    దారిన్జెప్పునుగానరాదుఘనమౌదాహంబుదీర్పంగనాసారన్సాధనభూరినిష్ఠతమితోబొందంగముక్తిన్మన
    సారాత్రాగితరించిపోయిరిగదాసద్బ్రాహ్మణుల్భూమిలో

    రిప్లయితొలగించండి
  6. వారా గారెలు బూరెలు
    ధారగ ౙారెడి ఘృతమును దధ్యోదనమున్
    గోరుచు పరమాన్నము మన
    సారా కొని హితముఁ గనిరి సద్బ్రాహ్మణులే!


    రెండవపూరణము:

    వారలు వేదాధ్యయనము
    కూరిమితో జేసి నిరత గోష్ఠులు సలుపన్
    ధారామృతసారము మన
    సారా కొని హితము గనిరి సద్బ్రాహ్మణులే!

    రిప్లయితొలగించండి
  7. పారాయణ మొనరించుచు
    కోరికలు విడిచి యు సతము కోవెల యందున్
    జేరి యు భక్తి రస ము మన
    సారా కొని హితము గనిరి స ద్బ్రా హ్మణు లే!

    రిప్లయితొలగించండి
  8. మీరొసగిన దానిని మన
    సారా కొని హితముఁ గనిరి సద్బ్రాహ్మణులే ,
    వారికి మత్తు గలుగ నది
    వేరని దెలుసుకొనగ గడు వేదనబడిరే

    రిప్లయితొలగించండి
  9. కందం
    పౌరోహిత్యము సేసెడు
    వారిగ శాస్త్రము వచింప బాధ్యతగొనుచున్
    సారించి వేదముల మన
    సారా కొని హితముఁ గనిరి సద్బ్రాహ్మణులే

    శార్దూలవిక్రీడితము
    పౌరోహిత్యము వృత్తిగా మహిని సద్భాగ్యమ్ము నిర్దేశమై
    వారల్ శాస్త్రపరంపు ధర్మమనుచున్ బాటించి సన్నిష్టతో
    పారావారసమాన వేదసుధలన్ భక్త్యాత్ములై పొంది స
    త్సారా త్రాగి తరించిపోయిరి గదా సద్బ్రాహ్మణుల్ భూమిలో

    (సారా: సారము)

    రిప్లయితొలగించండి
  10. ఊరూరనుదిరుగాడుచు
    పారమితాపేక్షతోడ పలువుండ్రు సదా
    చారవ్యాప్తి విధిని మన
    సారా కొని హితముఁ గనిరి సద్బ్రాహ్మణులే

    రిప్లయితొలగించండి
  11. కోరంబోవరు వారలైహికములన్ క్రూరాత్ములై గద్దెలన్
    మీరంజాలరు సత్యనిష్ఠ నెపుడున్ మిత్రత్వమున్ వీడకన్
    వారెన్నండును వేదశాస్త్రపఠనావార్థిన్ ప్రవర్తిల్లు నా
    సారా త్రాగి తరించిపోయిరి గదా సద్బ్రాహ్మణుల్ భూమిలో

    రిప్లయితొలగించండి
  12. కోరక నైహిక సుఖములు
    మీరక సత్యపథమెప్డు మిత్రత్వమ్మున్
    వారలు వేదములను మన
    సారా కొని హితముఁ గనిరి సద్బ్రాహ్మణులే

    రిప్లయితొలగించండి


  13. శ్రీరాముని నామామృత
    ధారను గ్రోలంగ నెంచ తహతహతోడన్
    కోరిక తీరునటులమన
    *“సారా కొని హితముఁ గనిరి సద్బ్రాహ్మణులే”*

    మరొక పూరణ
    భారతవీరునితేరుకు
    సారథిగాసాగినట్టిశౌరిచరితమున్
    తీరుగ పఠియించుచు మన
    సారాకొనిహితముగనిరిసద్బ్రాహ్మణులే

    రిప్లయితొలగించండి
  14. ఈరోదస్సున భూసురోత్తములు దామెల్లన్
    సదా శ్రద్ధతో
    నేరోజున్విడకుండ నేర్చిరి కదా యెంతో
    మహా జ్ఞానమున్
    ఆరాదించిరి దైవమున్ శుచితులై ,
    యత్యంత వేదాది ధీ
    సారా త్రాగి తరించి పోయిరి గదా సద్బ్రా
    హ్మణుల్ భూమిలో.'

    రిప్లయితొలగించండి
  15. పారాయణమునకై యుప
    కారి యగునని తలపోసి క్రన్నన నంతన్
    వారక మందిరమునకు వ
    సారా కొని హితముఁ గనిరి సద్బ్రాహ్మణులే

    శ్రీ రామార్చితు నాగభూషణు నటన్ సేవించి యా సత్కృపా
    పారావార మహేశు సాంబ శివునిం బంచామృతం బింపుగా
    వారెల్లర్ గుడి కేఁగి భక్తి విమలస్వాం తాకలం కేద్ధ కా
    సారా! త్రాగి తరించి పోయిరి గదా సద్బ్రాహ్మణుల్ భూమిలో

    రిప్లయితొలగించండి
  16. మనసు + ఆరన్ = మనసారన్ / మనసార
    మనసారా యనునది వ్యావహరిక మని నా భావన. గ్రామ్యము.

    రిప్లయితొలగించండి
  17. శా॥ సారాంశంబిది దైవతత్వముఁగనన్ సద్బ్రాహ్మణుల్ నిత్యమున్
    ధారాళంబుగ వేదపాఠములిటుల్ తర్కించి చర్చించఁగన్
    వీరావేశము తోడ, నిట్లగుపడెన్ విజ్ఞానమందించు యా
    సారా త్రాగి తరించి పోయిరి గదా సద్బ్రాహ్మణుల్ భూమిలో

    కం॥ పారాయణమొనరించుచు
    భారత దేశంబుఁ బ్రగతి పథమున మెఱయన్
    శ్రీరామచంద్రుఁ జరిత మన
    సారా కొని హితముఁ గనిరి సద్బ్రాహ్మణుల్

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.

    శ్రీరాముని యాలయమున
    నోరారగ భజనచేసి నుతియించి జనుల్
    నీరాజనమును తా మన
    సారా కొని హితము గనిరి సద్బ్రాహ్మణులే.

    రిప్లయితొలగించండి