9, మార్చి 2023, గురువారం

సమస్య - 4361

10-3-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వప్నము మెలఁకువ సుషుప్తి సమకాలమగున్”
(లేదా...)
“స్వప్నమునున్ సుషుప్తియును జాగ్రదవస్థలు నేకకాలమౌ”
(ఆముదాల మురళి గారి శతావధానంలో తిప్పన్న గారి సమస్య)

29 కామెంట్‌లు:

  1. స్వప్నము నవలోకించగ
    స్వప్నము నందే మెలకువ సాధ్యంబాయెన్
    స్వప్నా యేమని చెప్పుదు
    స్వప్నము మెలఁకువ సుషుప్తి సమకాలమగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్వప్నమనంగనొక్క దశ సంభవమౌగద గాఢనిద్రలో
      స్వప్నము భావనే యగును చక్కని నిద్రకు తారకాణమౌ
      స్వప్నము నందునన్ గలుగు సర్వవిశేషము లెంచిచూచినన్
      స్వప్నమునున్ సుషుప్తియును జాగ్రదవస్థలు నేకకాలమౌ

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'తారకాణము' ?

      తొలగించండి
    3. 'తార్కాణము' నకు మరో రూపముగా ప్రయోగించితిని

      తొలగించండి
  2. కందం
    క్షిప్నువగుచు చింతలనఁగ
    తృప్నువుగను శ్వాసమీద దృష్టినిలుపుచున్
    స్వప్నా! ధ్యాననిమగ్నత
    స్వప్నము మెలఁకువ సుషుప్తి సమకాలమగున్

    ఉత్పలమాల
    క్షిప్నువుతాననన్ వదలి చింతలనన్నిటిఁ గల్గినంతలోఁ
    దృప్నువు శ్వాసమీదఁ దన దృష్టిని నిల్పుచు ధ్యాననిష్టమై
    స్వప్న! తరించు స్థాయిఁగని పాటిగ చేరఁగ బ్రహ్మరంధ్రమున్
    స్వప్నమునున్ సుషుప్తియును జాగ్రదవస్థలు నేకకాలమౌ!

    రిప్లయితొలగించండి

  3. స్వప్నా కంటినొకటి సు
    స్వప్నము పరమాత్మ దివ్య సాన్నిధ్యమనే
    స్వప్నమటనుండి నాకిక
    స్వప్నము మెలఁకువ సుషుప్తి సమకాలమగున్.


    స్వప్నమనంగ మాయయది స్వాపము నందున గాంచు దృశ్యమే
    స్వప్వమనంగ లక్ష్యమగు సాధన తోడను చేరు గమ్యమే
    స్వప్న, యెఱుంగనట్టి యొక బర్బరుడే వచియించె నిట్టులన్
    స్వప్నమునున్ సుషుప్తియును జాగ్రదవస్థలు నేకకాలమౌ.

    రిప్లయితొలగించండి
  4. స్వప్నా! కన్నులఁ దెరచిన
    స్వప్నము గాంచిననునీవె సందడి చేయన్
    స్వప్నము మెలఁకువలొకటై
    స్వప్నము మెలఁకువ సుషుప్తి సమకాలమగున్

    రిప్లయితొలగించండి
  5. స్వప్న మగు నిద్ర యందున
    స్వప్నము గలిగిన మెలకువ సాధ్యంబగు నా?
    స్వప్నా! యెక్కడ యెట్టు ల
    స్వప్నము మెలకువ సుషుప్తి సమకాల మగున్?

    రిప్లయితొలగించండి
  6. స్వప్నమునందునన్ మఱియు జాగ్రదవస్థల యందు బాయకన్
    స్వప్న సురూపమే మెదిలి సందడి సేయగ డెందమందునన్
    స్వప్నమునున్ సుషుప్తియును జాగ్రదవస్థలు నేకకాలమౌ!
    స్వప్ననువీడి యొక్క నిముసమ్మును నే మనజాలనీ భువిన్

    రిప్లయితొలగించండి
  7. మరొక పూరణ...

    స్వాప్నికులుందురు సతతము
    స్వాప్నిక విశ్వంభరమున సంపద్వరులై
    స్వప్నముభగ్నము కాగా
    స్వప్నము మెలఁకువ సుషుప్తి సమకాలమగున్

    స్వాప్నికులైనచో జనులు శ్రామికులైతపియించకుందురే
    స్వప్నము సాధ్యమయ్యెనని సంభ్రమ మొప్పగ చిందులాడరే
    స్వప్నములోనదాగిన త్ర్యవస్థలు పెన్గొను వేళలోఁ గనన్
    స్వప్నమునున్ సుషుప్తియును జాగ్రదవస్థలు నేకకాలమౌ

    రిప్లయితొలగించండి

  8. స్వప్నా ! చెప్పెడిది వినుము
    స్వప్నము మెలఁకువ సుషుప్తి సమకాలమగున్
    స్వప్నమయము కాదిదియును
    హిప్నాటిజమను గ్రహించ నిది
    వీలగునే

    రిప్లయితొలగించండి
  9. కందం
    స్వప్నమున సుందరిని గని
    స్వప్నానంతరము కల్ల భావన నిలువన్
    స్వాప్నికుడు దలచె నపుడు
    స్వప్నము, మెలకువ, సుషుప్తి సమకాలమగున్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  10. స్వప్నమగునుగాజన్మయు
    స్వప్నంబీకాలమెపుడుసరిగనుజూడన్
    స్వప్నముసుషుప్తిక్షణికము
    స్వప్నముమెలకువసుష్షుప్తిసమకాలమగున్

    రిప్లయితొలగించండి
  11. స్వప్నా! వింటివె యీయది
    స్వప్నమునన్ జూడఁగలుగు జగమం తయునున్
    స్వప్నమ యొక యను భూతియె
    స్వప్నము మెలఁకువ సుషుప్తి సమకాలమగున్

    రిప్లయితొలగించండి
  12. స్వప్నకు నలిన దళాక్షికి
    స్వప్న సహోదరికిని మృగశాబ నయనకున్
    స్వప్న సహోదరున కహో
    స్వప్నము మెలఁకువ సుషుప్తి సమ కాల మగున్

    అప్నుల మేటి నిద్ర యగు నన్న ధరా తల మందు నుండునే
    క్షిప్నువు ధ్యాన ముద్ర విలసిల్లిన తాపస కోటి కెంచ న
    స్వప్నము నీ త్ర్యవస్ధలును సత్క్రమ రీతిని నెంచి చూడఁగా
    స్వప్నమునున్ సుషుప్తియును జాగ్రదవస్థలు నేక కాలమౌ

    [అప్నువు =సుఖ మొసంగునది; క్షిప్నువు = కాదను వాఁడు]

    రిప్లయితొలగించండి
  13. కం॥ స్వప్నము విరియును నిద్రను
    స్వప్న విహారము జనులకు, సైనికులైనన్
    స్వప్నముననాద మరువరు
    స్వప్నము మెలకువ సుషుప్తి సమకాలమగున్

    ఉ॥ స్వప్నము నిద్రలోఁ గలుగు సౌఖ్యము సుందరమైననందు దు
    స్స్వప్నము నిద్రలోఁ గలుగు సంకటేమే యగు మానవాళికిన్
    స్వప్నము లోను జాగ్రతగ సైనికులుందురు దేశరక్షకై
    స్వప్నమునున్ సుషుప్తియును జాగ్రదవస్థలు నేకకాలమౌ

    రిప్లయితొలగించండి
  14. స్వప్నము నాబడున్గలయ స్వప్నము నందున గానిపించు గా
    స్వప్నమునున్ సుషుప్తియును జాగ్రదవస్థలు నేకకాలమౌ
    స్వప్నము నందు గానఁబడు సర్వ చరాచర ప్రాణికోటియున్
    స్వప్నము పోయి జాగృతిని సర్వము శూన్యము గాఁగనంబడున్

    రిప్లయితొలగించండి
  15. రెండవ పాదము “స్స్వప్నము నిద్రలోఁ గలుగు సంకటమే యగు మానవాళికిన్” ఇలా మార్చానండి పొరపాటున ట బదులు టే వ్రాసినందున. మన్నించాలి

    రిప్లయితొలగించండి