తే.గీ:గణయతులు లేని వచనపు కవిత యనెడు నాముద మ్మన్న ప్రీతియే అందరకును? "ఆముదాల మురళి కవితాబ్ధి యిచ్చు నా ముద"మ్మన్న ప్రీతియే అందరకును. (వచనకవిత ఆముదం లాగా ఉంటుంది.ఆముదాల మురళి గారి అవధానం ఆ ముదాన్ని ఇస్తుంది అంటే అందరికీ ప్రీతియే.)
ఉ:"ఆముద" మన్న నొక్కటియు,"నా ముద" మన్న మరొక్క యర్థమై ప్రేమగ సత్చమత్కృతుల విందొనరించ వధాన కేళి లో నీ మహితావకాశముల నిచ్చెడు చక్కని శబ్ద మైన యా ఆముద మెంత గొప్ప దగు నందరి మోములు తేజరిల్లగన్ (రెండు అర్థాలకి అవకాశం మిచ్చే "ఆముదము"అనే శబ్దం ఎంత గొప్పది!అది అవధానాన్ని రసమయం చేసింది కదా!)
రెండవ పూరణము. ముదిమి వయసున మనుమలు, ముని మనుమల సన్నిధానాన గడుపుచు సంతసముగ కలసి కొమరులు,కోడళ్లు మెలగుచుండ నుమ్మడి కుటుంబ జీవనముల్లసిల్ల నా ముదంబన్న ప్రీతియే యందఱకును.
రాముడు వంచి కార్ముకము రమ్య మనోహర
రిప్లయితొలగించండికోమలాంగినిన్
భూమిజ జానకీ సతిని భూపతు లెల్లరు జూచుచుండగా
సామజ రక్షకుండు కడు సంతస మొందగ
బెండ్లియాడగా
నాముద మెంత గొప్పదది యందరి మోములు తేజరిల్లగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికైకేయితో దశరథ మహారాజు ఖిన్నకంఠుఁడై...
రిప్లయితొలగించండితేటగీతి
పట్టమందబోయెడు మన చిట్టితండ్రిఁ
గానలకునంపజూతువే కైకనీవు?
రగిలి పోరె ప్రజలు? రాము రాజుగఁ గను
నా ముదంబన్న ప్రీతియే యందఱకును
ఉత్పలమాల
రాముని కానకున్ బనిపి రాజుగ నీ భరతున్ గనంగ కై
కా! మదినెంచితే? జననిగన్ మును జూపిన రాగమెక్కడే?
భూమిని పాలితుల్ రగిలి పోవుటతథ్యము, రాజు రాముఁడౌ
నా ముదమెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఉదరభాగంబురాచినయుబ్బరంబు
రిప్లయితొలగించండితొలగితేటనుపడునుగాదోషమణగి
జిడ్డునైననుఝాడించుచిత్రముగను
ఆముదంబన్నప్రీతియేయందరకును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండితెలుగు పర్యాయ పదముల తెలుపుచుంటి
రంజన మనగ వేడుక రాధనమది
సంతసము బాళి పొదలిక జన్య నంద
యా ముదంబన్న ప్రీతియే , యందఱకును.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినాలుగవ శతా వ ధానాన జాలు వా రె
రిప్లయితొలగించండిచక్క నైనట్టి పూరణ ల్ సరస మతులు
మేలు. మేలని గొప్పగా మెచ్చు కొనగ
నా ముదం బన్న ప్రీతియే యందఱ కును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ.
రిప్లయితొలగించండి*ఆ ముదమెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్*
భామలు రాధికా సహిత వల్లభు జూడగ బారవశ్యమున్
సామము విందుగా మురళి సాధిత నాదము మత్తునివ్వగన్
కామిత హస్తమే యభయ కారణమయ్యెను కృష్ణభక్తిచే.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండి(కైకేయి యలక బూనిన విషయమెరుగని దశరథుడామెయు సంతసించునని యెంచి తన మనసులోని భావనని చెబుతున్నట్లుగా నూహించి....)
రాముడు లోకపూజితుడు రాజిత సద్గుణ సాంద్రుడాతడే
క్షేమమొసంగునంచు మనుజేంద్రుని జేయుట యొప్పటంచు నీ
మోమున తోషణమ్ముగన బోరున వచ్చితి నోయి కైక నీ
యా ముద మెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసిద్ది చేకూర్చు కేశాల వృద్ధి కొరకు
రిప్లయితొలగించండిచర్మ సౌందర్య రక్షణ సాధనమ్ము
కీళ్ళ నొప్పిని హరియించు కీలకమ్ము
ఆముదంబన్న ప్రీతియే యందఱకును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆముదాల మురళి గూర్చి యడుగుచుండ,
రిప్లయితొలగించండినింటి పేరున పిలుచుట హితులకిచట
వాడుక , నుడువుచుంటి నాపద్ధతిగనె
ఆముదంబన్న ప్రీతియే యందఱకును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాముడు విల్లువంచి కడురమ్యముగా గెలుపొందినంతనే
రిప్లయితొలగించండికాముని బోలు రూపసిని గాంచిన జానకి హర్షమందగా
రాముడు బెండ్లియాడె ననురాగము గుండియ నుత్సహించగా
నా ముదమెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిమోమున హాసరేఖ యనుమోదము గూర్చగ శైవచాపమున్
రిప్లయితొలగించండిరాముడు చేగొనన్ విరిగె రంజిల జానకి మానసంబునన్
దామమలంకరించె గుణధాముఁడు రాముని కంఠసీమలో
నా ముదమెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసామము తోడుతన్ బ్రజల సమ్మతిఁ బొందుచు వోట్లు, నేత సం
రిప్లయితొలగించండిక్షేమము గూర్చి మించుచును చెన్నగు పాలనొసంగి, దేశమున్
రాముని రాజ్యమా యనగ ప్రాకటమౌ స్థితిలోన నిల్పగా
నా ముదమెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆముదమొసగు కనులకు నంతులేని
రిప్లయితొలగించండిచలువ, పెంచునుకురులను చానలకును
గొనగమందుగశుభ్రమౌ కుక్షి,,కాన
*“నాముదంబన్న ప్రీతియే నందఱకును”*
మరొక పూరణ
నేమముతోడతావిడకనిత్యమునద్దమరేయియైనని
ష్కామముతోడనిచ్చుచునుశంకరులద్భుతమైనయంశముల్
ప్రేమగగాంచుచున్ కవులు. ప్రీతిగ పూరణ చేసి నంతనే
నా,ముదమెంత గొప్పదగు నందరిమోములు దేజరిల్లగన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండితే.గీ:గణయతులు లేని వచనపు కవిత యనెడు
రిప్లయితొలగించండినాముద మ్మన్న ప్రీతియే అందరకును?
"ఆముదాల మురళి కవితాబ్ధి యిచ్చు
నా ముద"మ్మన్న ప్రీతియే అందరకును.
(వచనకవిత ఆముదం లాగా ఉంటుంది.ఆముదాల మురళి గారి అవధానం ఆ ముదాన్ని ఇస్తుంది అంటే అందరికీ ప్రీతియే.)
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదం గురువు గారు!
తొలగించండిఉ:"ఆముద" మన్న నొక్కటియు,"నా ముద" మన్న మరొక్క యర్థమై
రిప్లయితొలగించండిప్రేమగ సత్చమత్కృతుల విందొనరించ వధాన కేళి లో
నీ మహితావకాశముల నిచ్చెడు చక్కని శబ్ద మైన యా
ఆముద మెంత గొప్ప దగు నందరి మోములు తేజరిల్లగన్
(రెండు అర్థాలకి అవకాశం మిచ్చే "ఆముదము"అనే శబ్దం ఎంత గొప్పది!అది అవధానాన్ని రసమయం చేసింది కదా!)
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదం గురువు గారు!
తొలగించండికలవర మొకింత లేక చక్కఁగ సతమ్ము
రిప్లయితొలగించండిమల విసర్జనమనకుఁ దల్లులకుఁ జంటి
పిల్లల కొసంగ నుదయంపు వేళ లందు
నాముదం బన్నఁ బ్రీతియే యందఱకును
భూమి సురేంద్రు వంశమున భూరి యశస్కరు నింట దీపమై
క్షేమ కరంపు లగ్నమున శీత మయూఖుని భవ్య వర్ణ మం
దేమని చెప్ప నొప్పుఁ గుల మింపుగ వర్ధిలఁ గొడ్కు వుట్టఁగా
నా ముద మెంత గొప్పదగు నందఱి మోములుఁ దేజరిల్లఁగన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిపామరుడైననూచుతలపండితుడెప్పుడువారెవా. యున్నాడు
రిప్లయితొలగించండితామరసాక్షుడైనసభతథ్యముహర్షమునందుతృప్తిగా
కోమలకావ్యకన్యకదికోరికగజ్జెనుకట్టియాడెనే
ఆముదమెంతగొప్పదగునందరిమోములుతేజరిల్లగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. సవరించండి.
వారెవాయనన్
రిప్లయితొలగించండికుముదబాంధవు కౌముదుల్ కువలయమున
రిప్లయితొలగించండిజిలుఁగు జలతారు పరదాల చెలువమీయ
నందనందను దర్శింప నందనమున
నా ముదంబన్న ప్రీతియే యందఱకును
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
ఔషధమ్ముగ పనిచేయు నాముదమ్ము
తలకు పట్టించగా ౘల్లదనము కలుగు
కురులు నిగనిగ లాడుచు పెరుగునింక
త్రాగ పోగొట్టును మలబద్ధకమునంత
నాడు వాడె సుఖ విరేచనమునకు ప్రజ
లాముదంబన్న ప్రీతియే యందఱకును.
రెండవ పూరణము.
ముదిమి వయసున మనుమలు, ముని
మనుమల
సన్నిధానాన గడుపుచు సంతసముగ
కలసి కొమరులు,కోడళ్లు మెలగుచుండ
నుమ్మడి కుటుంబ జీవనముల్లసిల్ల
నా ముదంబన్న ప్రీతియే యందఱకును.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి