కవిమిత్రులారా!
ఈరోజు పూరింప వలసిన సమస్య ఇది...
"సాహితీ సంస్థ లేప్రయోజనము కొఱకు"
(లేదా...)
"క్షతి లేనట్టి ప్రయోజనం బిడు నొకో సాహిత్య సంస్థల్ భువిన్"
తేటగీతిసేమమంద మానవజాతి క్షితిని మిగులనరయ సంగీతసాహిత్యమవసరమ్ముఊచకోతల నెంచెడు నుగ్రవాదసాహితీ సంస్థ లేప్రయోజనము కొఱకు? మత్తేభవిక్రీడితముబ్రతుకుల్ పండుచు మేలు మేలనమనన్ రంజింప జేయున్ గదాజతగూడంగ సమాజసేమమునకై సంగీత సాహిత్యముల్,మితిమీరన్భువి నుగ్రవాదములు నేర్పింపంగ దుర్మార్గముల్క్షతి లేనట్టి ప్రయోజనం బిడు నొకో సాహిత్య సంస్థల్ భువిన్?
మూఢ విశ్వాసమందున మునిగి యున్నజాతి చైతన్యమును గోరి సంతతమిలసమసమాజ నిర్మాణము సలుప గోరుసాహితీ సంస్థలే ప్రయోజనము కొరకు.
నవతనింపుచుకవితకునైజమిడుచుసరససద్భావసౌందర్యసారమమరతీర్చిదిద్దగవలయుగాతీరుదెలిపిసాహితీసంస్థలేప్రయోజనముకొఱకు
మంచి భావాలు జనులలో బెంచ సతముకవులు కలములు ఝలిపించి కవిత లల్లి సాహితీ సంస్థ లే ప్రయోజనము కొఱకుపాటు. పడ వలె మహి లోన బట్టు ప ట్టి
ధృతితో మూర్ఖుల దుష్కృతమ్ములను ఛేదింపన్ వలెన్ గావ్యముల్ హితమున్ గూర్చి సమాజ సేమమున సాహిత్యమ్మదే మూలమౌ అతివాదమ్మని రక్కపాతమును మ్రోయంజేయగా నట్టివౌక్షతి లేనట్టి ప్రయోజనం బిడు నొకో సాహిత్య సంస్థల్ భువిన్
సకల జనుల సౌఖ్యముగూర్చ సంతతమ్ముపాటుపడు సాహితీ సంస్థ వలన మేలు!ఉగ్రవాదము ప్రోదిగా నుండునట్టిసాహితీ సంస్థ లేప్రయోజనము కొఱకు
అహరహము మన సాహిత్య మనగ నరులునొందుచు దనకు దానుగ నొజ్జ యగుచుపండితమము పెంచుకొనెడి వానికిట్టిసాహితీ సంస్థ లేప్రయోజనము కొఱకు
మ.హితవే లేదు ! తెనాలి రామ సినిమా హీనంబు ప్రాచీనమున్యతులం గాదని కేళి మెచ్చుదురు మాయామోహితుల్ యౌవతన్పితరుల్ శిక్షక బోధనామృతముచే బేయంబుగా నాంధ్రమున్ *క్షతి లేనట్టి ప్రయోజనం బిడు నొకో సాహిత్య సంస్థల్ భువిన్.*
జనహితము గూర్చుటేగద సాహితీప్రయోజనము సమాజమునందు యోగ్యమైనరచనలఁ సమాదరింపక క్రాలుచున్నసాహితీ సంస్థ లేప్రయోజనము కొఱకు?
తాములాభపడగమది తలచుచెపుడు ఘనముగా ప్రకటించుచుకాసులుగొనిపసయులేనట్టిరచనల ప్రస్తుతించు*"సాహితీ సంస్థ లేప్రయోజనము కొఱకు"*
అతులంబౌ జనపాళి యభ్యుదయమే యగ్రీయమౌ ధ్యేయమైక్షితిపై సంస్థలు సాహితీ వనమునన్ సేద్యంబు గావింపఁగన్బ్రతుకుల్ చక్కగచేయు యత్నములు సాఫల్యంబగున్ అన్యథాక్షతి లేనట్టి ప్రయోజనం బిడు నొకో సాహిత్య సంస్థల్ భువిన్
కలవు కల్యాణ మంటపములు వధూ వ రుల కొఱకు నింపుగఁ గవి వరులు నుతింప విరివి విలసిల్లు చున్నవి పృథ్వి లోన సాహితీ సంస్థలే ప్రయోజనము కొఱకుమతి మంతుల్ నిరసించు శబ్దములు సంపాతమ్ములై యుండ సన్నుతి సేయం గన నేతిబీర పగిదిన్ శూన్యమ్ము సాహిత్యమే తతులన్ సంతత మూరకే బిరుదులన్ దానం బిడం గాంచఁగా క్షతి లేనట్టి ప్రయోజనం బిడు నొకో సాహిత్య సంస్థల్ భువిన్
తే॥ వేమన సుమతీ యాదులు విహితముఁ గనిజనుల కుపయుక్తమగు నీతి శతకములనునుడువి రటులఁ గాక విషము నూరి పోయుసాహితీ సంస్థ లేప్రయోజనము కొఱకుమ॥ మితి లేకన్ జెడు వ్రాయు వార లిటులన్ మేధావి వర్గమ్మటంచతిగా సంఘ హితంబులన్ మరచి ద్వేషాగ్నుల్ మతోన్మాదమున్మతి లేనట్టుగఁ బెంచుచుండు కుజనుల్ మాన్యాగ్రతన్ బొందఁగన్క్షతి లేనట్టి ప్రయోజనం బిడు నొకో సాహిత్య సంస్థల్ భువిన్
తేటగీతి
రిప్లయితొలగించండిసేమమంద మానవజాతి క్షితిని మిగుల
నరయ సంగీతసాహిత్యమవసరమ్ము
ఊచకోతల నెంచెడు నుగ్రవాద
సాహితీ సంస్థ లేప్రయోజనము కొఱకు?
మత్తేభవిక్రీడితము
బ్రతుకుల్ పండుచు మేలు మేలనమనన్ రంజింప జేయున్ గదా
జతగూడంగ సమాజసేమమునకై సంగీత సాహిత్యముల్,
మితిమీరన్భువి నుగ్రవాదములు నేర్పింపంగ దుర్మార్గముల్
క్షతి లేనట్టి ప్రయోజనం బిడు నొకో సాహిత్య సంస్థల్ భువిన్?
రిప్లయితొలగించండిమూఢ విశ్వాసమందున మునిగి యున్న
జాతి చైతన్యమును గోరి సంతతమిల
సమసమాజ నిర్మాణము సలుప గోరు
సాహితీ సంస్థలే ప్రయోజనము కొరకు.
నవతనింపుచుకవితకునైజమిడుచు
రిప్లయితొలగించండిసరససద్భావసౌందర్యసారమమర
తీర్చిదిద్దగవలయుగాతీరుదెలిపి
సాహితీసంస్థలేప్రయోజనముకొఱకు
మంచి భావాలు జనులలో బెంచ సతము
రిప్లయితొలగించండికవులు కలములు ఝలిపించి కవిత లల్లి
సాహితీ సంస్థ లే ప్రయోజనము కొఱకు
పాటు. పడ వలె మహి లోన బట్టు ప ట్టి
రిప్లయితొలగించండిధృతితో మూర్ఖుల దుష్కృతమ్ములను ఛేదింపన్ వలెన్ గావ్యముల్
హితమున్ గూర్చి సమాజ సేమమున సాహిత్యమ్మదే మూలమౌ
అతివాదమ్మని రక్కపాతమును మ్రోయంజేయగా నట్టివౌ
క్షతి లేనట్టి ప్రయోజనం బిడు నొకో సాహిత్య సంస్థల్ భువిన్
సకల జనుల సౌఖ్యముగూర్చ సంతతమ్ము
రిప్లయితొలగించండిపాటుపడు సాహితీ సంస్థ వలన మేలు!
ఉగ్రవాదము ప్రోదిగా నుండునట్టి
సాహితీ సంస్థ లేప్రయోజనము కొఱకు
అహరహము మన సాహిత్య మనగ నరులు
రిప్లయితొలగించండినొందుచు దనకు దానుగ నొజ్జ యగుచు
పండితమము పెంచుకొనెడి వానికిట్టి
సాహితీ సంస్థ లేప్రయోజనము కొఱకు
మ.
రిప్లయితొలగించండిహితవే లేదు ! తెనాలి రామ సినిమా హీనంబు ప్రాచీనమున్
యతులం గాదని కేళి మెచ్చుదురు మాయామోహితుల్ యౌవతన్
పితరుల్ శిక్షక బోధనామృతముచే బేయంబుగా నాంధ్రమున్
*క్షతి లేనట్టి ప్రయోజనం బిడు నొకో సాహిత్య సంస్థల్ భువిన్.*
జనహితము గూర్చుటేగద సాహితీప్ర
రిప్లయితొలగించండియోజనము సమాజమునందు యోగ్యమైన
రచనలఁ సమాదరింపక క్రాలుచున్న
సాహితీ సంస్థ లేప్రయోజనము కొఱకు?
తాములాభపడగమది తలచుచెపుడు
రిప్లయితొలగించండిఘనముగా ప్రకటించుచుకాసులుగొని
పసయులేనట్టిరచనల ప్రస్తుతించు
*"సాహితీ సంస్థ లేప్రయోజనము కొఱకు"*
అతులంబౌ జనపాళి యభ్యుదయమే యగ్రీయమౌ ధ్యేయమై
రిప్లయితొలగించండిక్షితిపై సంస్థలు సాహితీ వనమునన్ సేద్యంబు గావింపఁగన్
బ్రతుకుల్ చక్కగచేయు యత్నములు సాఫల్యంబగున్ అన్యథా
క్షతి లేనట్టి ప్రయోజనం బిడు నొకో సాహిత్య సంస్థల్ భువిన్
కలవు కల్యాణ మంటపములు వధూ వ
రిప్లయితొలగించండిరుల కొఱకు నింపుగఁ గవి వరులు నుతింప
విరివి విలసిల్లు చున్నవి పృథ్వి లోన
సాహితీ సంస్థలే ప్రయోజనము కొఱకు
మతి మంతుల్ నిరసించు శబ్దములు సంపాతమ్ములై యుండ స
న్నుతి సేయం గన నేతిబీర పగిదిన్ శూన్యమ్ము సాహిత్యమే
తతులన్ సంతత మూరకే బిరుదులన్ దానం బిడం గాంచఁగా
క్షతి లేనట్టి ప్రయోజనం బిడు నొకో సాహిత్య సంస్థల్ భువిన్
తే॥ వేమన సుమతీ యాదులు విహితముఁ గని
రిప్లయితొలగించండిజనుల కుపయుక్తమగు నీతి శతకములను
నుడువి రటులఁ గాక విషము నూరి పోయు
సాహితీ సంస్థ లేప్రయోజనము కొఱకు
మ॥ మితి లేకన్ జెడు వ్రాయు వార లిటులన్ మేధావి వర్గమ్మటం
చతిగా సంఘ హితంబులన్ మరచి ద్వేషాగ్నుల్ మతోన్మాదమున్
మతి లేనట్టుగఁ బెంచుచుండు కుజనుల్ మాన్యాగ్రతన్ బొందఁగన్
క్షతి లేనట్టి ప్రయోజనం బిడు నొకో సాహిత్య సంస్థల్ భువిన్