27, మార్చి 2023, సోమవారం

సమస్య పూరణ

 కవి మిత్రులారా!

ఈరోజు పూరింప వలసిన సమస్య ఇది...

సతి మరణము పతి కొసంగె సంతోషమ్మున్ 

లేదా

సతి మరణించగా పతికి సంతసమెంతయొ కల్గె బిట్టుగన్ 

15 కామెంట్‌లు:

  1. అతివగబాధలనందిన
    సుతిమెత్తనిసుదతియామెచూచెనురోగం
    బతలాకుతలముబ్రతుకని
    సతిమరణముపతికొసంగెసంతోషమ్మున్

    రిప్లయితొలగించండి
  2. పతులకు కడు బాధ నొసగు
    సతి మరణము ; పతి కొసంగె సంతోషమ్మున్ 
    సతతము దన బాగోగుల
    ను తెలుసు కొనెడి సతియే యనువుగ దొరకగన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    గతిఁ దప్పగ నారోగ్యము
    వెతదప్పింపంగ లేని వెజ్జుల గని, తా
    సుతిమెత్తఁ దాక, వీడుచు
    సతి మరణము, పతికొసంగె సంతోషమ్మున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కందం
      వెతలన్ ద్రోయగ కన్యల
      జతపడి యా నరకు గూల్చు సమరము నందున్
      గుతుకన్ ఖండించి యొసగి
      సతి.,మరణము, పతికొసంగె సంతోషమ్మున్

      చంపకమాల
      వెతలను ద్రోయఁ గన్యలను వేదన బాపగ భామ సత్యతో
      శ్రితజన వత్సలుండు సనె జిద్దున నా నరకున్ వధించెడున్
      గతనను, వీరనారిగను, గాంతుడు మూర్చిల, వైరిఁ గొట్టగన్
      సతి, మరణించగా పతికి సంతసమెంతయొ కల్గె జూడగన్

      తొలగించండి
  4. సతతము మోసగించుచును సక్రమ
    మార్గము వీడియున్ సదా
    పతి కనుగప్పి నిత్యమును బాతకి
    పాల్పెడె నీచ వృత్తి కా
    యతివకు రోగమంటుకొనె నాకరికిన్
    గడు బాధతోడ నా
    సతి మరణించగా పతికి సంతసమెంతయొ కల్గె బిట్టునన్




    గల్గె బిట్టుగన్.

    రిప్లయితొలగించండి
  5. మతిచెడి సుతుహింసించెడి
    సతిమరణము,పతికొసంగె సంతోషమ్మున్
    సుతనయులైననుహాయిగ
    బ్రతుకు దురనుయాశ మదికిరహికూర్చంగన్

    రిప్లయితొలగించండి
  6. జతయై యన్యోన్యం బై
    గతి తప్పని మార్గమందు గమనము దోడన్
    సతతము మెల్గగ నెట్టుల
    సతి మరణము పతి కొసంగు సంతోమ్మున్?

    రిప్లయితొలగించండి
  7. మతిచెడి మంచము పాలయి
    గతము మరచి వెతనుచెంది కస్తిపడు తఱిన్
    బ్రతుకే శాపము కాగా
    సతి మరణము పతి కొసంగె సంతోషమ్మున్

    రిప్లయితొలగించండి

  8. కుతిలమున క్రుంగి పోవుచు
    మతిజెడి చరియించె, మిగుల మాచలములతో
    చతికిల బడ మృత్యువునే
    సతి మరణము పతి కొసంగె, సంతోషమ్మున్?


    హితమది కాదు నీకనుచు నెందరొ పూర్వమె చెప్పిరైరి దు
    ర్మతులగు వారితో చెలిమి మానుమటంచును చెప్పనేమిరా
    మతిజెడి మాటలాడెడవు మందుడ, యెక్కడ కాంచినావురా
    సతి మరణించగా పతికి సంతసమెంతయొ కల్గె బిట్టుగన్?

    రిప్లయితొలగించండి
  9. సతియొక దుర్దినంబున నశాంతి యెసంగ నుపద్రవంబునన్
    బ్రతుకొక శాపమై వెతలపాలయె మంచము నాశ్రయించి జీ
    వితమును నిష్క్రియన్ గడిపి బిస్తనుఁ గాంచుచు నెట్టకేలకున్
    సతి మరణించగా పతికి సంతసమెంతయొ కల్గె బిట్టుగన్

    రిప్లయితొలగించండి
  10. హితవును చెప్పినన్ వినక హీనపు బుద్ధిని చూపుచున్ ధరన్
    సతతముమత్తులోమునిగిశత్రువువోలెనుపల్కభావ్యమే
    పతనముకాకతప్పదికపాపపుకూపమునందు చెప్పుమే
    *సతిమరణించగాపతికిసంతసమెంతయొకల్గెబిట్టుగన్*

    రిప్లయితొలగించండి
  11. గత భవ పుణ్య ఫలమ్మున
    వితత ధనవ్యయమున జన వేద్యుఁడు వైద్యుం
    డతి కుశలతఁ దప్పింపఁగ
    సతి మరణము పతి కొసంగె సంతోషమ్మున్

    శత దశ కుంజ రాభ బల సన్నుత వీర్యుఁడు మల్ల యుద్ధ తీ
    వ్రతఁ బరి ఘాభ దీర్ఘ తమ బాహువులన్ వలలుండు కొట్టఁగా
    నత వదనుండు కీచకుఁడు నర్తన శాలను, జూచు చుండఁగా
    సతి, మరణింపఁగాఁ బతికి సంతస మెంతయొ కల్గె బిట్టుగన్

    రిప్లయితొలగించండి
  12. కం॥ సతి యారోగ్యమనుదినము
    మితి లేక క్షయమగు చుండ మిక్కిలి బాధన్
    బతి బ్రదుకు చుండ నిరతము
    సతి మరణము పతి కొసంగె సంతోషమ్నున్

    చం॥ సతి ముదమొందు రీతిఁ బతి చక్కఁగఁ జూచుచు నుండ స్వస్థతల్
    సతికటు తగ్గి యౌషధికి శాంతముఁ గాకను జబ్బు తీవ్రమై
    సతతము బాధతో బ్రదుకు సాఁగుచు నుండఁగ ధుర్భరమ్ముగన్
    సతి మరణించగా పతికి సంతసమెంతయొ కల్గె బిట్టుగన్

    రిప్లయితొలగించండి
  13. కందములో చిన్న పొరపాటండి చివర సంతోషమ్మున్ సంతోషమ్నన్ అయ్యింది.

    రిప్లయితొలగించండి