1-5-2023 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“శత్రువైన నిన్ను సంస్తుతింతు”(లేదా...)“స్తుతియింపం దగు శాత్రవుండ వయినన్ శూరుండ నిన్నిత్తఱిన్”(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
సుతుడా కవ్వడి ప్రాణరక్షకొరకై సూత్రాముడే విప్రుడై క్షితికేతెంచుచు జేయిజాపి యడుగన్ జీరాను దానమ్ముగాధృతితో నిచ్చితి వంచు యాదవుడు రాధేయుండతోనిట్లనెన్ స్తుతియింపం దగు శాత్రవుండ వయినన్ శూరుండ నిన్నిత్తఱిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధర్మయుద్ధమందుదయతోడమసలుచునీతిగనుచునంతనేర్పుతోడబుద్ధిబలమునంతపోరునజూపగాశత్రువైననిన్నుసంస్తుతింతు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
యుద్ధరంగమున నసువులు వాసిన కర్ణునితో శ్రీకృష్ణ పరమాత్మ:ఆటవెలదిదాన వీర శూర మానిత రాధేయ! నమ్మినట్టి వారి సొమ్మువౌచుఁదీరి వారి ఋణము దీర్చుకొంటివి, క్రీడిశత్రువైన నిన్ను సంస్తుతింతు!మత్తేభవిక్రీడితముగతిదప్పెన్ గద నంగరాజ్యమొదవన్ గర్ణా! మహా దాతవైమతినందీవు నధర్మమున్ దలఁపవే? మారంగ సూచింపఁగాప్రతిపక్షమ్మని వైరిగాఁ దలఁచితో? ప్రాణార్పణన్ స్వామికై,స్తుతియింపం దగు శాత్రవుండ వయినన్ శూరుండ నిన్నిత్తఱిన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
అతులంబైనదిదానవేంద్రగననీయారాటమిప్పట్టునన్సతతంబీవునుదానమందుగణుతిన్సాధింపసోద్యంబేగాస్తుతియింపందగుశాత్రవుండవైనన్శూరుండనిన్నిత్తఱిన్మతితోమూడునునేలగానడుగులన్నాకీయనేనోడితిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."సాధింప జోద్యంబెగా" అనండి.
అలాగేనండి
కవచ కుండ లముల కర్ణుo డొ సంగెనాయింద్రు డడిగి నంత ని చ్చ తోడమాధవుండు గలిసి మరులు తో నిట్ల నెశత్రు వైన నిన్ను సంస్తు తింతు
స్వార్థ చిత్తుడగుచు స్వర్గాధి పతినీదుదశన కుండలముల దానమడుగ మారుమాటలేక ధారపోసితివంచుశత్రువైన నిన్ను సంస్తుతింతు.
పాండు సుతుల లోన పరిగణించగ నీవెపెద్దవాడ వయితివి యవిరతముధర్మము నెఱనమ్మి ధరణి యందు నజాతశత్రువైన నిన్ను సంస్తుతింతు
పద్మములున్న సరస్సువైపు ఏనుగులు వస్తుండగా రాత్రి అవడంతో గజములు దారి మరలినందుకు పద్మములు చందమామకు ధన్యవాదాలు చెబుతూ.....మ.మతులందప్పిన కుంజరౌఘములు పద్మశ్రేణి పై ద్రుంకగాగతిమారెన్ గజరాజకోటి నిశి తా క్రమ్మంగ చీకట్లచేప్రతిపక్షంబగు పద్మకోటి శశితో ప్రాణంబు రక్షింపగా“స్తుతియింపం దగు శాత్రవుండ వయినన్ శూరుండ నిన్నిత్తఱిన్”
వైవిధ్యమైన చక్కని పూరణ. అభినందనలు.
ధన్యోస్మి గురుదేవా...🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు."యోధాగ్రణివి నీవు" అనండి.
సూచించిన సవరణతో....అలసియున్ననన్ను గెలుచుట సాధ్యమౌవిరతి నొసగినావు సురుచిరముగయుద్ధ నీతినెఱుగు యోధాగ్రణివినీవుశత్రువైన నిన్ను సంస్తుతింతు
వితతంబౌ శరసంచయమ్ము నిను సంవేధించినన్ శౌర్యమున్ధృతియుం జూపుచు తమ్మి మొగ్గరమునన్తేజంబు వర్థిల్లగానతులంబౌవిధి పోరుసల్పి తుదకీ వంతంబునుం బొందితేస్తుతియింపం దగు శాత్రవుండ వయినన్ శూరుండ నిన్నిత్తఱిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అతిగా వర్షము వచ్చి పంటల గడు న్నత్యంత ఘోరంబుగాక్షితికిం జేర్చగ, బ్రక్కవాడ! గని నాఖేదంబు కష్టంబు నాహితమా సించియు డబ్బులన్నిడిననున్ హిండీర కాపాడు నిన్స్తుతియింపందగు శాత్రవుండవయినన్ శూరుండ నిన్నత్తరిన్
యుద్ధరంగమందు నుద్ధతి చూపుచుచెలఁగినావు వైరి చలమునొందబాలకుండవైన బలమున గండవుశత్రువైన నిన్ను సంస్తుతింతు
అన్ని యుగములందు అవతార పురుషుడైఅవతరించినావు అవని యందుఅహము తోడతిరుగు అసురాధముల కెల్ల*“శత్రువైన నిన్ను సంస్తుతింతు”*మరొక పూరణరాఘవుండు పంప లంఘించి శరధిని చేరి లంకనచట సీతను గని ధ్వంస పరచి వనిని దశశిరునకచటశత్రువైననిన్నుసంస్తుతింతు
ఆ॥ ఘోర రణముఁ జేసి వీరుఁడు కర్ణుఁడు పోరి నేల కొరుగ గౌరవించి నతని ప్రతిభఁ బలికె నర్జునుండిట్టులన్శత్రువైన నిన్ను సంస్తుతింతుమ॥ అతి భీతాహవ యుద్ధమందున ఘనుండాయర్జునుండే యనెన్హతుడైనన్ ఘన మిత్రతా గరిమతో నారాధ్యుఁడే కర్ణుఁడున్రతనమ్మే గద వీరతన్ గనఁగ నారాధేయుఁడాదిత్యుఁడేస్తుతియింపం దగు శాత్రవుండ వయినన్ శూరుండ నిన్నిత్తరిన్
క్రొవ్విడి వెంకట రాజారావు: రాము నాజ్ఞ గొనుచు రాజనీతిని నేర్వ వచ్చి నేర్చినాను వరుసగనని లంకప్రభువు తోడ లక్ష్మణుండును బల్కె శత్రువైన నిన్ను సంస్తుతింతు. వ్రతతిన్ గల్గిన రాజనీతి దొరగా రాముండు గుర్తించి నన్ హితముల్ నేర్వగ పంపె నీ కెలనుకున్ హేలొంది లంకేశుడా ప్రతిభుండీవని లక్ష్మణుండనుచు నీ వైదుష్యమీ పృథ్విలో స్తుతియింపందగు శాత్రవుండవయినన్ శూరుండ నిన్నిత్తఱిన్.
పిన్నక నాగేశ్వరరావు.రాజనీతి నేర్వ రావణా!నీ కడరాము డంపె ననుచు లక్ష్మణుండుమృత్యు ముఖమున గల మేధావితో పల్కె శత్రువైన నిన్ను సంస్తుతింతు.
సుతుడా కవ్వడి ప్రాణరక్షకొరకై సూత్రాముడే విప్రుడై
రిప్లయితొలగించండిక్షితికేతెంచుచు జేయిజాపి యడుగన్ జీరాను దానమ్ముగా
ధృతితో నిచ్చితి వంచు యాదవుడు రాధేయుండతోనిట్లనెన్
స్తుతియింపం దగు శాత్రవుండ వయినన్ శూరుండ నిన్నిత్తఱిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధర్మయుద్ధమందుదయతోడమసలుచు
రిప్లయితొలగించండినీతిగనుచునంతనేర్పుతోడ
బుద్ధిబలమునంతపోరునజూపగా
శత్రువైననిన్నుసంస్తుతింతు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండియుద్ధరంగమున నసువులు వాసిన కర్ణునితో శ్రీకృష్ణ పరమాత్మ:
రిప్లయితొలగించండిఆటవెలది
దాన వీర శూర మానిత రాధేయ!
నమ్మినట్టి వారి సొమ్మువౌచుఁ
దీరి వారి ఋణము దీర్చుకొంటివి, క్రీడి
శత్రువైన నిన్ను సంస్తుతింతు!
మత్తేభవిక్రీడితము
గతిదప్పెన్ గద నంగరాజ్యమొదవన్ గర్ణా! మహా దాతవై
మతినందీవు నధర్మమున్ దలఁపవే? మారంగ సూచింపఁగా
ప్రతిపక్షమ్మని వైరిగాఁ దలఁచితో? ప్రాణార్పణన్ స్వామికై,
స్తుతియింపం దగు శాత్రవుండ వయినన్ శూరుండ నిన్నిత్తఱిన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిఅతులంబైనదిదానవేంద్రగననీయారాటమిప్పట్టునన్
రిప్లయితొలగించండిసతతంబీవునుదానమందుగణుతిన్సాధింపసోద్యంబేగా
స్తుతియింపందగుశాత్రవుండవైనన్శూరుండనిన్నిత్తఱిన్
మతితోమూడునునేలగానడుగులన్నాకీయనేనోడితిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"సాధింప జోద్యంబెగా" అనండి.
అలాగేనండి
తొలగించండికవచ కుండ లముల కర్ణుo డొ సంగెనా
రిప్లయితొలగించండియింద్రు డడిగి నంత ని చ్చ తోడ
మాధవుండు గలిసి మరులు తో నిట్ల నె
శత్రు వైన నిన్ను సంస్తు తింతు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిస్వార్థ చిత్తుడగుచు స్వర్గాధి పతినీదు
రిప్లయితొలగించండిదశన కుండలముల దానమడుగ
మారుమాటలేక ధారపోసితివంచు
శత్రువైన నిన్ను సంస్తుతింతు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాండు సుతుల లోన పరిగణించగ నీవె
రిప్లయితొలగించండిపెద్దవాడ వయితివి యవిరతము
ధర్మము నెఱనమ్మి ధరణి యందు నజాత
శత్రువైన నిన్ను సంస్తుతింతు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపద్మములున్న సరస్సువైపు ఏనుగులు వస్తుండగా రాత్రి అవడంతో గజములు దారి మరలినందుకు పద్మములు చందమామకు ధన్యవాదాలు చెబుతూ.....
రిప్లయితొలగించండిమ.
మతులందప్పిన కుంజరౌఘములు పద్మశ్రేణి పై ద్రుంకగా
గతిమారెన్ గజరాజకోటి నిశి తా క్రమ్మంగ చీకట్లచే
ప్రతిపక్షంబగు పద్మకోటి శశితో ప్రాణంబు రక్షింపగా
“స్తుతియింపం దగు శాత్రవుండ వయినన్ శూరుండ నిన్నిత్తఱిన్”
వైవిధ్యమైన చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యోస్మి గురుదేవా...🙏🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"యోధాగ్రణివి నీవు" అనండి.
సూచించిన సవరణతో....
తొలగించండిఅలసియున్ననన్ను గెలుచుట సాధ్యమౌ
విరతి నొసగినావు సురుచిరముగ
యుద్ధ నీతినెఱుగు యోధాగ్రణివినీవు
శత్రువైన నిన్ను సంస్తుతింతు
వితతంబౌ శరసంచయమ్ము నిను సంవేధించినన్ శౌర్యమున్
రిప్లయితొలగించండిధృతియుం జూపుచు తమ్మి మొగ్గరమునన్తేజంబు వర్థిల్లగా
నతులంబౌవిధి పోరుసల్పి తుదకీ వంతంబునుం బొందితే
స్తుతియింపం దగు శాత్రవుండ వయినన్ శూరుండ నిన్నిత్తఱిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅతిగా వర్షము వచ్చి పంటల గడు
రిప్లయితొలగించండిన్నత్యంత ఘోరంబుగా
క్షితికిం జేర్చగ, బ్రక్కవాడ! గని నా
ఖేదంబు కష్టంబు నా
హితమా సించియు డబ్బులన్నిడి
ననున్ హిండీర కాపాడు నిన్
స్తుతియింపందగు శాత్రవుండవ
యినన్ శూరుండ నిన్నత్తరిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండియుద్ధరంగమందు నుద్ధతి చూపుచు
రిప్లయితొలగించండిచెలఁగినావు వైరి చలమునొంద
బాలకుండవైన బలమున గండవు
శత్రువైన నిన్ను సంస్తుతింతు
అన్ని యుగములందు అవతార పురుషుడై
రిప్లయితొలగించండిఅవతరించినావు అవని యందు
అహము తోడతిరుగు అసురాధముల కెల్ల
*“శత్రువైన నిన్ను సంస్తుతింతు”*
మరొక పూరణ
రాఘవుండు పంప లంఘించి శరధిని
చేరి లంకనచట సీతను గని
ధ్వంస పరచి వనిని దశశిరునకచట
శత్రువైననిన్నుసంస్తుతింతు
ఆ॥ ఘోర రణముఁ జేసి వీరుఁడు కర్ణుఁడు
రిప్లయితొలగించండిపోరి నేల కొరుగ గౌరవించి
నతని ప్రతిభఁ బలికె నర్జునుండిట్టులన్
శత్రువైన నిన్ను సంస్తుతింతు
మ॥ అతి భీతాహవ యుద్ధమందున ఘనుండాయర్జునుండే యనెన్
హతుడైనన్ ఘన మిత్రతా గరిమతో నారాధ్యుఁడే కర్ణుఁడున్
రతనమ్మే గద వీరతన్ గనఁగ నారాధేయుఁడాదిత్యుఁడే
స్తుతియింపం దగు శాత్రవుండ వయినన్ శూరుండ నిన్నిత్తరిన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిరాము నాజ్ఞ గొనుచు రాజనీతిని నేర్వ
వచ్చి నేర్చినాను వరుసగనని
లంకప్రభువు తోడ లక్ష్మణుండును బల్కె
శత్రువైన నిన్ను సంస్తుతింతు.
వ్రతతిన్ గల్గిన రాజనీతి దొరగా రాముండు గుర్తించి నన్
హితముల్ నేర్వగ పంపె నీ కెలనుకున్ హేలొంది లంకేశుడా
ప్రతిభుండీవని లక్ష్మణుండనుచు నీ వైదుష్యమీ పృథ్విలో
స్తుతియింపందగు శాత్రవుండవయినన్ శూరుండ నిన్నిత్తఱిన్.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
రాజనీతి నేర్వ రావణా!నీ కడ
రాము డంపె ననుచు లక్ష్మణుండు
మృత్యు ముఖమున గల మేధావితో పల్కె
శత్రువైన నిన్ను సంస్తుతింతు.