7-7-2023 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“హరిణమ్మునుఁ గాంచి సింహ మడలి పరుగిడెన్”(లేదా...)“హరిణముఁ గాంచి సింహము భయమ్మునఁ బాఱెను ప్రాణభీతితోన్”
కురువృద్ధుడచటనిలచినవైరిశిఖండినితరుమకవేగమతొలగెన్కరిగినధైర్యంబున, నాహరిణమ్మునుఁగాంచిసింహమడలిపరుగిడెన్
నిరతము సేవా గుణమునగర మొప్ప గ జనుల యందు ఘనుడై వెలుగన్సిరి గల నేత బెదరి యాహరి ణ మ్మును గాంచి సింహ మడలి పరు గి డెన్
జరిగిన కౌరవాన్వయపు సంగరమందున యర్జనుండు దానరదము నడ్ప సారధిగ యల్పుశిఖండిని చేసె వానినిన్దురమున గాంచి భీష్ముడునుదొల్గెను యుద్ధము వీడివెంటనేహరిణముగాంచి సింహము భయంబున బారెన ప్రాణభీతిచే .
హరివేచెను వేటాడగహరిణము నాజింక వచ్చె హస్తికి తోడై,కరితోడుగ వచ్చిన యాహరిణమ్మునుఁ గాంచి సింహ మడలి పరుగిడెన్”
తరుణికి గనబడె ప్రాకుచుబరిణెపురుగు దానినిగని పరుగిడె నాస్త్రీజరిగినది విచారించగహరిణమ్మునుఁ గాంచి సింహ మడలి పరుగిడెన్బరిణెపురుగు = బొద్దీఁక.
చం.నురుగును గ్రక్కి కాలయవనుండు ప్రయాణము వెంబడించెడిన్*హరిణముఁ గాంచి సింహము భయమ్మునఁ బాఱెను ప్రాణభీతితోన్*గరముల గృష్ణునిన్ దగులగా ముచికుందునిచేత భస్మమౌచరితము గార్గ్య కల్పనము చచ్చుట చంపుట దైవనిర్ణయాల్.
పరిహాసమున నరుడు గండరగండడ వైన నీ వడలచుంటివి, భీమరమును విడ నందురిటులహరిణమ్మునుఁ గాంచి సింహ మడలి పరుగిడెన్.మరలుమటంచు నుత్తరకుమారుడు భీతిలు చుండ వానితో నరుడు బృహన్నలిట్లు చిరు నవ్వులు రువ్వుచు వెక్కిరించెనే వెరచుచు యుద్ధభూమినిక వీడిన లోకులు చెబ్దు రిట్టులన్ హరిణముఁ గాంచి సింహము భయమ్మునఁ బాఱెను ప్రాణభీతితోన్.
మురిసెను జానకి చిత్తముహరిణమ్మునుఁ గాంచి; సింహ మడలి పరుగిడెన్హరిణమ్మును పట్టుటకైకరమున కార్ముకముతోడ కపిరథుడేగన్పరవడి పర్ణశాలకడ పచ్చిక పైనడయాడుచుండగామురిసెను సీత నెయ్యమున ముచ్చట గొల్పెడి స్వర్ణ శోభతోహరిణముఁ గాంచి; సింహము భయమ్మునఁ బాఱెను ప్రాణభీతితోన్హరిణముఁ బట్టితెచ్చుటకు హత్నువుఁ దాల్చిన రాముడేగగా
హరిణము విపినమునందొకతరుణములో బురద యందు తగులుకొనఁగ నాబురదకు రూపము మారినహరిణమ్మునుఁ గాంచి సింహ మడలి పరుగిడెన్
పరుగిడుచున్న జింకయొక పంకము నిండిన గర్తమందునందొరగిన దేహమెల్లెడల నొప్పుగనంటెను పంక మంతటన్హరిణము రూపుమారఁగ మహామృగమట్టులఁ గానవచ్చెనాహరిణముఁ గాంచి సింహము భయమ్మునఁ బాఱెను ప్రాణభీతితోన్
కందంపరిణతిని సాధు జంతువులరణ్యమున ప్రాణరక్షకై యెదిరింపన్సరిచూప మాధ్యమములన్హరిణమ్మునుఁ గాంచి సింహ మడలి పరుగిడెన్చంపకమాలపరిణతిఁ గ్రూరజంతువుల పాలిట జిక్కక సాధుజంతువుల్మఱలుచు వెన్కకున్ జెలఁగి మాఱ్కొన జూపిన మాధ్యమమ్ములన్బరుగిడె దున్నలున్ దరుమ వ్యాఘ్రము ప్రాణము జిక్కఁబట్టుచున్హరిణముఁ గాంచి సింహము భయమ్మునఁ బాఱెను ప్రాణభీతితోన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కం॥ హరి ముసలిదాయె శక్తియుసరసర వేఁటాడు బిగియు సన్నము కాఁగాగరగర సవ్వడికి జడిసిహరిణమ్మును గాంచి సింహమడలి పరుగిడెన్గురు బోధచం॥ హరిణము వాడి శృంగముల నంతము చేయఁగఁ బోరి నాక్రమున్హరి పరికించి చూచి తన నంతము చేయునటంచు ఖిన్నతన్హరిణముఁ గాంచి సింహము భయమ్మునఁ బాఱెను బ్రాణభీతితోన్మరువకు భీతి భీరువుగ మార్చు బలాఢ్యునిఁ గూడ శిష్యుఁడా!
పరమ దయా స్వరూపిణి శుభంకరి శాఙ్కరినిన్ గ్రహింపకన్ తరుణి నశక్తగా దలచి దానవుడార్భటమొప్ప రేగగామరణము నీకు తథ్యమని మాత మహోగ్రత హూఙ్కరింపగా హరిణముఁ గాంచి సింహము భయమ్మునఁ బాఱెను ప్రాణభీతితోన్
శ్రీ రాముడు హరిణమ్మునుచిరుతల్లే వెంబడించె చెదిరి హరిణి కేసరికి ఎదురయ్యె మాయాహరిణమ్మునుఁగాంచి సింహమడలి పరుగిడెన్
కురువృద్ధుడచటనిలచిన
రిప్లయితొలగించండివైరిశిఖండినితరుమకవేగమతొలగెన్
కరిగినధైర్యంబున, నా
హరిణమ్మునుఁగాంచిసింహమడలిపరుగిడెన్
నిరతము సేవా గుణమున
రిప్లయితొలగించండిగర మొప్ప గ జనుల యందు ఘనుడై వెలుగన్
సిరి గల నేత బెదరి యా
హరి ణ మ్మును గాంచి సింహ మడలి పరు గి డెన్
జరిగిన కౌరవాన్వయపు సంగర
రిప్లయితొలగించండిమందున యర్జనుండు దా
నరదము నడ్ప సారధిగ యల్పు
శిఖండిని చేసె వానినిన్
దురమున గాంచి భీష్ముడును
దొల్గెను యుద్ధము వీడివెంటనే
హరిణముగాంచి సింహము భయం
బున బారెన ప్రాణభీతిచే .
హరివేచెను వేటాడగ
రిప్లయితొలగించండిహరిణము నాజింక వచ్చె హస్తికి తోడై,
కరితోడుగ వచ్చిన యా
హరిణమ్మునుఁ గాంచి సింహ మడలి పరుగిడెన్”
తరుణికి గనబడె ప్రాకుచు
రిప్లయితొలగించండిబరిణెపురుగు దానినిగని పరుగిడె నాస్త్రీ
జరిగినది విచారించగ
హరిణమ్మునుఁ గాంచి సింహ మడలి పరుగిడెన్
బరిణెపురుగు = బొద్దీఁక.
చం.
రిప్లయితొలగించండినురుగును గ్రక్కి కాలయవనుండు ప్రయాణము వెంబడించెడిన్
*హరిణముఁ గాంచి సింహము భయమ్మునఁ బాఱెను ప్రాణభీతితోన్*
గరముల గృష్ణునిన్ దగులగా ముచికుందునిచేత భస్మమౌ
చరితము గార్గ్య కల్పనము చచ్చుట చంపుట దైవనిర్ణయాల్.
రిప్లయితొలగించండిపరిహాసమున నరుడు గం
డరగండడ వైన నీ వడలచుంటివి, భీ
మరమును విడ నందురిటుల
హరిణమ్మునుఁ గాంచి సింహ మడలి పరుగిడెన్.
మరలుమటంచు నుత్తరకుమారుడు భీతిలు చుండ వానితో
నరుడు బృహన్నలిట్లు చిరు నవ్వులు రువ్వుచు వెక్కిరించెనే
వెరచుచు యుద్ధభూమినిక వీడిన లోకులు చెబ్దు రిట్టులన్
హరిణముఁ గాంచి సింహము భయమ్మునఁ బాఱెను ప్రాణభీతితోన్.
మురిసెను జానకి చిత్తము
రిప్లయితొలగించండిహరిణమ్మునుఁ గాంచి; సింహ మడలి పరుగిడెన్
హరిణమ్మును పట్టుటకై
కరమున కార్ముకముతోడ కపిరథుడేగన్
పరవడి పర్ణశాలకడ పచ్చిక పైనడయాడుచుండగా
మురిసెను సీత నెయ్యమున ముచ్చట గొల్పెడి స్వర్ణ శోభతో
హరిణముఁ గాంచి; సింహము భయమ్మునఁ బాఱెను ప్రాణభీతితోన్
హరిణముఁ బట్టితెచ్చుటకు హత్నువుఁ దాల్చిన రాముడేగగా
హరిణము విపినమునందొక
రిప్లయితొలగించండితరుణములో బురద యందు తగులుకొనఁగ నా
బురదకు రూపము మారిన
హరిణమ్మునుఁ గాంచి సింహ మడలి పరుగిడెన్
పరుగిడుచున్న జింకయొక పంకము నిండిన గర్తమందునం
రిప్లయితొలగించండిదొరగిన దేహమెల్లెడల నొప్పుగనంటెను పంక మంతటన్
హరిణము రూపుమారఁగ మహామృగమట్టులఁ గానవచ్చెనా
హరిణముఁ గాంచి సింహము భయమ్మునఁ బాఱెను ప్రాణభీతితోన్
కందం
రిప్లయితొలగించండిపరిణతిని సాధు జంతువు
లరణ్యమున ప్రాణరక్షకై యెదిరింపన్
సరిచూప మాధ్యమములన్
హరిణమ్మునుఁ గాంచి సింహ మడలి పరుగిడెన్
చంపకమాల
పరిణతిఁ గ్రూరజంతువుల పాలిట జిక్కక సాధుజంతువుల్
మఱలుచు వెన్కకున్ జెలఁగి మాఱ్కొన జూపిన మాధ్యమమ్ములన్
బరుగిడె దున్నలున్ దరుమ వ్యాఘ్రము ప్రాణము జిక్కఁబట్టుచున్
హరిణముఁ గాంచి సింహము భయమ్మునఁ బాఱెను ప్రాణభీతితోన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ హరి ముసలిదాయె శక్తియు
రిప్లయితొలగించండిసరసర వేఁటాడు బిగియు సన్నము కాఁగా
గరగర సవ్వడికి జడిసి
హరిణమ్మును గాంచి సింహమడలి పరుగిడెన్
గురు బోధ
చం॥ హరిణము వాడి శృంగముల నంతము చేయఁగఁ బోరి నాక్రమున్
హరి పరికించి చూచి తన నంతము చేయునటంచు ఖిన్నతన్
హరిణముఁ గాంచి సింహము భయమ్మునఁ బాఱెను బ్రాణభీతితోన్
మరువకు భీతి భీరువుగ మార్చు బలాఢ్యునిఁ గూడ శిష్యుఁడా!
పరమ దయా స్వరూపిణి శుభంకరి శాఙ్కరినిన్ గ్రహింపకన్
రిప్లయితొలగించండితరుణి నశక్తగా దలచి దానవుడార్భటమొప్ప రేగగా
మరణము నీకు తథ్యమని మాత మహోగ్రత హూఙ్కరింపగా
హరిణముఁ గాంచి సింహము భయమ్మునఁ బాఱెను ప్రాణభీతితోన్
శ్రీ రాముడు హరిణమ్మును
రిప్లయితొలగించండిచిరుతల్లే వెంబడించె చెదిరి హరిణి కే
సరికి ఎదురయ్యె మాయా
హరిణమ్మునుఁగాంచి సింహమడలి పరుగిడెన్