9, జులై 2023, ఆదివారం

సమస్య - 4472

10-7-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గొడుగు గలదు కాని తడిపె వాన”
(లేదా...)
“గొడుగున్ జేత ధరించియున్ దడిసితిన్ ఘోరంపు వర్షమ్మునన్”

23 కామెంట్‌లు:

  1. జీతభత్యమంద క్షేమంబులేదుగా
    ధరలుపెరిగెనంతదడనుబుట్ట
    బతుకుబండలాయెబానిసనేనుగా
    గొడుగుగలదుగానితడిపెవాన

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    చేత గొంటి గొడుగు చిరువానకాపఁగ
    గాలివాన రేగి క్రమ్ము కొనగ
    నిల్వక తలపైన నిలకడన్నదిలేని
    గొడుగు గలదు కాని తడిపె వాన!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభవిక్రీడితము
      పడెడున్ వర్షము సిన్నదంచుఁదలవన్ బట్టంగ నే ఛత్రమున్
      బిడుగల్ గ్రక్కుచు గాలివాన చెలఁగన్ వృక్షమ్ములున్ గూలఁగా
      నడుగుల్ సాగుట కష్టమై శిరముపైనన్ నిల్వదన్ వంకరన్
      గొడుగున్ జేత ధరించియున్ దడిసితిన్ ఘోరంపు వర్షమ్మునన్

      తొలగించండి
  3. ముదుసలి తడబడుచు ముసురు లోన నడచె
    గాలి ఉధృత మయ్యె కష్ట మొచ్చె
    తెరువ బోవ గొడుగు తెరుచుకొనకపోయె
    గొడుగు కలదు కాని తడిపె వాన.

    రిప్లయితొలగించండి
  4. దుర్యోధనునిదీనావస్థ
    మడుగున్జొచ్చితిప్రాణభీతినయొనామానంబుకాపాడుకై
    కడకున్లోభమునింతఁజేసెననునాగౌరంబుమాసెన్గదా
    పుడమిన్రాజుగభోగమంతగనినేపోరాదుయుద్ధంబులో
    గొడుగున్జేతధరించియున్దడిసితిన్ఘోరంపువర్షంబులో

    రిప్లయితొలగించండి
  5. కురియు చుండె వాన కుంభ వృష్టి గనేడు
    విధుల నిర్వ హింప వెడలిన దరి
    పాత దైన దాని చేత బూ న గ జిల్లు
    గొడుగు గలదు. గాని తడిపె వాన

    రిప్లయితొలగించండి
  6. కారు మబ్బులలమె గగనాన దిగ్గున
    కురిసెనపుడు వాన కుంభవృష్టి
    వీచెను పెనుగాలి విపరీత భంగిని
    గొడుగు గలదు కాని తడిపె వాన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సడిలేకన్ మొదలైన గాలి వడిగా సారూప్యమే లేనిదై
      పిడుగుల్ మ్రోయుచునుండ వాన కురిసెన్ విభ్రాంతితోచూడగా
      గొడుగున్ విప్పగలేక యుంటినకటా! కొంపోయినన్ వెంబడిన్
      గొడుగున్ జేత ధరించియున్ దడిసితిన్ ఘోరంపు వర్షమ్మునన్

      తొలగించండి
  7. నిన్నటి దివసమున నెలవుకు బోవగ
    వడిగ గాలి నడన వెడలు చుండ
    తురుతుగ పడె వాన తుంపర నాపయి
    గొడుగు గలదు కాని తడిపె వాన

    రిప్లయితొలగించండి

  8. నాడు పతియొసంగె నాపైన ప్రేమతో
    జన్మదినము నాడు ఛత్రమొకటి
    పాతదయ్యెనేడు వస్త్రమ్మె చిరిగిన
    గొడుగు గలదు కాని తడిపె వాన.


    విడువన్ జాలను పాతదైననదియే ప్రేయాంశుడే ప్రేమతో
    గుడిలో కానుకగా నొసంగెనని సంకోచింపకన్ వాడెదన్
    జడివానొక్కటి భూరిగా కురియ బెజ్జమ్ముల్ నెఱి
    న్ గల్గెడిన్
    గొడుగున్ జేత ధరించియున్ దడిసితిన్ ఘోరంపు వర్షమ్మునన్.

    రిప్లయితొలగించండి
  9. మ.

    సుడిగాలుల్ కడలొత్తగా చినుకులన్ జూడంగ భద్రమ్ముగా
    నడయాడంగ గనిష్ఠ ఛత్రమును మానమ్మున్ విధేయుండనై
    వడిగా తొయ్యలి నింటికంపుటయె భావ్యంబంచు సాయంత్రమున్
    *గొడుగున్ జేత ధరించియున్ దడిసితిన్ ఘోరంపు వర్షమ్మునన్.*

    రిప్లయితొలగించండి
  10. అస్త్రవిద్య యందు నర్జునునకు సాటి
    కర్ణుఁడావహమున కాకవెలుగు
    శాప కారణమున సకలము మఱచెను
    గొడుగు గలదు కాని తడిపె వాన

    రిప్లయితొలగించండి
  11. సుడిలో చిక్కిన నావనైతి నకటా చోద్యంబుగా నాజిలో
    కడు ఘోరంబుగ నస్త్రచాలనమునున్ గావింప లేకుంటి క
    వ్వడినిన్ దీమసమొప్ప చాపములతో పాలార్చ లేనైతినే
    గొడుగున్ జేత ధరించియున్ దడిసితిన్ ఘోరంపు వర్షమ్మునన్

    రిప్లయితొలగించండి
  12. ఆ॥ గాలి పెరుఁగ గాను ఘనమైన వానలో
    ఛత్రఛాయ కూడ చాలదాయె
    నిల్లు చేరు లోపు జల్లు తడిపివైచె
    గొడుగు గలదు కాని తడిపె వాన

    రిప్లయితొలగించండి
  13. పాల కొఱకు నేగి వడివడి గావచ్చు
    చుండ పెద్ద వాన జోరు గాను
    గురియు చుండ చెట్టు కొమ్మచా టున నుంటి
    గొడుగు గలదు కాని తడిపె వాన

    రిప్లయితొలగించండి
  14. మడుగై నిండెను నీటితోడ గననా మార్గంబునందయ్యయో
    వడిగా దాటు ప్రయత్నమందు బెడిసెన్ వ్యత్యస్తమై పాదమే
    పడితిన్ లోతగు గోతిలో నడుసుతో వస్త్రంబులవ్యస్తమై
    గొడుగున్ జేత ధరించియున్ దడిసితిన్ ఘోరంపు వర్షమ్మునన్

    రిప్లయితొలగించండి
  15. అడుగు లోన నడుగు నతి నెమ్మదిగ వైచి
    యడుసు లోన జారి పడితి కడకు
    నడుము విరిగెనకట నగుబాటు పాలైతి
    గొడుగు గలదు కాని తడిపె వాన

    రిప్లయితొలగించండి
  16. గుడికిన్ వెళ్ళితి దైవ పూజకొరకై
    కోదండ రామున్గనన్
    పడుచుండప్పుడు వర్షమెక్కువగ నే
    గొంపోయితిన్ గొడ్గునున్
    విడకుండంబడు గుంభవృష్టి వలనన్
    బెంచెంగడున్ భీతి నే
    గొడుగున్ జేత ధరించి తడసితిన్
    ఘోరంపు వర్షంబునన్.

    రిప్లయితొలగించండి
  17. బడికింబోవుచు మార్గ మధ్యమున నావాసంబు గానంగనై
    గొడుగున్ జేత ధరించియున్ దడిసితిన్ ఘోరంపు వర్షమ్మునన్
    బడికిం బోవక వచ్చితింటికి మనోభారంబుఁ బెంపొందగా
    విడిగా నుండుచు రామ పాదమును నేవేమార్లు పూజించెదన్

    రిప్లయితొలగించండి
  18. మ॥ జడిగాఁ బట్టిన వాన చూడఁగ నిటుల్ చాలా ఘనమ్మాయెరా
    ఘడియల్ మారినఁ గుమ్మరించుచును సాఁగంగాను భీతిల్లుచున్
    వడిగా నింటికి చేర వేగిర పడన్ బ్రారబ్ధమేమో సఖా
    గొడుగున్ జేత ధరించియున్ దడసితిన్ ఘోరంపు వర్షమ్మునన్

    రిప్లయితొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    వెడల ౙల్లు కురియ గొడుగుతో బయటకు
    భీకరమగు గాలి వీచి నంత
    నటు నిటు నటు ౙల్లు నన్నివైపుల కొట్ట
    గొడుగు గలదు గాని తడిపె వాన.

    రిప్లయితొలగించండి
  20. సరుకుల కని నేను సతితోడ వెళ్ళగా
    కుండపోతగానుకురిసెవాన
    కారుడిక్కిలోనఘనమైన అతి పెద్ద
    *“గొడుగు గలదు కాని తడిపె వాన”*

    రిప్లయితొలగించండి