8, జులై 2023, శనివారం

సమస్య - 4471

9-7-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నములోఁ గేశమున్న నది నీదే పో”
(లేదా...)
“అన్నము కేశదుష్టమని యాగ్రహ మెందుల కద్ది నీదె పో”

19 కామెంట్‌లు:

  1. ఉన్నయొక వంట మనిషిది
    నున్నని గుండై నవచ్చె నుగనుమ నుచుజూ
    పన్నతడు గేస్తుననె నిటు
    “అన్నములోఁ గేశమున్న నది నీదే పో”

    రిప్లయితొలగించండి
  2. ఎన్నగవంశాంకురమది
    వెన్నుగబుట్టెచెఱకుతుదివేదననిచ్చెన్
    మిన్నకయుండుముతండ్రీ
    అన్నములోకేశమున్ననదినీదేపో

    రిప్లయితొలగించండి
  3. విన్నపమును వినవె చెలీ
    నున్నగ కేశములులేని నూలిగరసుపై
    నున్నవి రెండే మొలకలు
    అన్నములోఁ గేశమున్న నది నీదే పో

    (నూలిగరసు = బట్టతల)

    రిప్లయితొలగించండి
  4. క్రన్ననకామితార్థములగాంచగవచ్చనిపుత్రుగంటివే
    జన్నముసేయకేయెపుడుజాతరసేసితివీవెసూడగా
    మిన్నకయుండుమీనరుడమీఁదటచేయగనేమియుండులే
    అన్నముకేశదుష్టమనియాగ్రహమెందులకద్దినీదెపో

    రిప్లయితొలగించండి
  5. ఎన్ని తడవలుగ నీతో
    తిన్నగ నొకచోటనిలిచి తినమని జెప్పన్
    నెన్నడు వినలే దుగదా!
    యన్నములోఁ గేశమున్న నది నీదే పో

    రిప్లయితొలగించండి
  6. ఉ.

    *అన్నము కేశదుష్టమని యాగ్రహ మెందుల కద్ది నీదె పో*
    ఖిన్నుడ నైతి వెంట్రుకను కేలున నొందగ స్వాస్థ్య చిత్తమున్
    బున్నెము కాదు పాపముగ పూర్తిగ నెంచుము భక్తి తోడుతన్
    మన్నన లొందు భాగ్యమది మానిని వడ్డన జేయు రీతియే.

    రిప్లయితొలగించండి
  7. నున్నగ దువ్వుచు నుంటివి
    యెన్నడు జాగ్రత పడవది యే ల నొ
    కానీ
    తిన్న గ కన్ఫడు ను గదా
    యన్నము లో కేశ మున్న నది నీదే పో!

    రిప్లయితొలగించండి
  8. అన్నము వండి వార్చినది యంతయు నేనది నిక్కువంబు నా
    కున్నవి రెండు కుంతలములో మదిరేక్షణ నా శిరమ్ముపై
    అన్నము కేశదుష్టమని యాగ్రహ మెందుల కద్ది నీదె పో
    మిన్నక నూరకున్ననది  మేలగు సర్దుకుపొమ్ము నెచ్చెలీ

    రిప్లయితొలగించండి
  9. అన్నము వండితి నేనే
    క్రన్నన వడ్డించి నావు కావున సఖియా
    మిన్నక తినినన్ మేలగు
    నన్నములోఁ గేశమున్న నది నీదే పో

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. అన్నులమిన్న నీవెగనుమన్నము నందులభించె కేశమీ
    యన్నము నేమిజేతునన నాతరుణీమణి కోపగించగన్
    గన్నయతండు జూపి యనె "వెంట్రుక నీదది
    యెంత దీర్ఘమో,
    అన్నము కేశదుష్టమన యాగ్రహ మెందుల కద్ది నీదెపో".

    రిప్లయితొలగించండి
  13. కం॥ తిన్నగ వండినఁ దప్పులు
    మిన్నగ నెన్నగ మగనికి మేలుఁ గలుగునా
    మన్నన వీడి సతి నుడువ
    నన్నములోఁ గేశమున్న నదినీదేపో

    ఉ॥ మన్నన సేసి వండగను మానిని తప్పుల నెంచనేలనో
    అన్నము కేశదుష్టమని యాతుర తోడను దెల్పఁబోకుమా
    మిన్నగఁ దప్పులెంచఁగను మిక్కిలి రోయుచు భార్య దూరఁగా
    నన్నము కేశదుష్టమని యాగ్రహ మెందుల కద్ది నీదెపో

    దయచేసి కేశదుష్ట లేక కేశదృష్ట అనవలయునా తెలుపమని అభ్యర్థన

    రిప్లయితొలగించండి
  14. క్రన్నన లేచి నేపొడుపు కాలమునందు క్రయించి శాకముల్
    మిన్నగు ప్రేమతోడుత శ్రమించి పచించితి వంటలన్నియున్
    పన్నుగ మాటలాడవు, స్వామి! కురుల్ సవరించ వెప్పు డీ
    యన్నము కేశదుష్టమని యాగ్రహ మెందుల కద్ది నీదెపో

    రిప్లయితొలగించండి
  15. కందం
    తిన్నగ తిని రుచికరమని
    సన్నని వెండ్రుక కనపడ సణిగెడు మగడా!
    యెన్నగఁ బొడవుగ లేదన
    నన్నములోఁ గేశమున్న నది నీదే పో!

    ఉత్పలమాల
    తిన్నఁగ రుచ్యమంచు కడు తృప్తిగ మెక్కియు నన్ను మెచ్చుచున్
    సన్నని వెండ్రుకన్ గనుచు చాపెద వేమయ! చేతిఁ దన్నగన్
    యెన్నగ లేదు బారెడది నింగితమెంచుము వంగి భుక్క నీ
    కన్నము కేశదుష్టమని యాగ్రహ మెందుల కద్ది నీదె పో!

    రిప్లయితొలగించండి
  16. తిన్నగ క్షౌరశాల జన తీరిక లేదను కాలయాపనన్
    పన్నగ సంచయంబు వలె బారులు తీరెను నీదు కేశముల్
    నన్నిక తూలనాడకుము నాదగు తప్పిదమేమి లేదులే
    దన్నము కేశదుష్టమని యాగ్రహ మెందుల కద్ది నీదె పో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నములోని కేశమతి యాగ్రహ
      మొందగ జేసె బత్నికిన్
      కిన్నత నొంది భార్య గన కేశము
      చిన్నగ నుండె నప్పుడా
      కిన్నరకంఠి తాను తన కేశపు
      పొడవు జూపి యిట్లనెన్
      అన్నము కేశ దుష్టమని యాగ్రహ
      మెందుల కద్ది నీదెపో.

      తొలగించండి
  17. ఎన్నగ నవి మూడడుగుల
    కన్నను పొడువైన కురులు కాదుటె చూడన్
    నిన్న కనిపించె చిన్నది
    యన్నములోఁ గేశమున్న నది నీదే పో.


    కన్నుల సైగజేయుచును కామవికారపు చేష్ట లందునన్
    నన్నట వంటజేయుతరి నాదరి జేరుచు కౌగిలిం చుచున్
    చెన్నుగ కొప్పులో విరుల జేర్చు ప్రయత్నము వేళ రాలెనే
    సన్నని వెంట్రుకొక్కటిక చాలును నాపయి నిందలేలనో
    యన్నము కేశదుష్టమని యాగ్రహ మెందుల కద్ది నీదె పో.

    రిప్లయితొలగించండి
  18. హెన్నాను తలకు పూయుచు
    చెన్నుగ. స్నానమునుతలకు చేసినయంతన్
    సన్నని కురులే జారగ
    నన్నములోగేశమున్ననదినీదేపో

    రిప్లయితొలగించండి