19, జులై 2023, బుధవారం

సమస్య - 4480

20-7-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మద్యముఁ గొని వ్రాయనగును మంజుల కవితల్”
(లేదా...)
“మద్యముఁ గ్రోలినంత రసమంజుల పద్యము వ్రాయగా నగున్”
(బస్వోజు సుధాకరాచారి గారికి ధన్యవాదాలతో)

18 కామెంట్‌లు:

  1. విద్యలెరగి తపన గలిగి
    హృద్యముగ కవితల వ్రాయ హృది స్థబ్ధమ్మై
    మిథ్యా ప్రయత్నమైనన్
    మద్యము గొని వ్రాయనగును మంజుల కవితల్.

    రిప్లయితొలగించండి
  2. చోద్యము కాదిది కవితా
    నాద్యంతము శ్రీహరికథలాలించివడిన్
    హృద్యంబగుభక్త్యనియెడి
    *మద్యముఁ గొని వ్రాయనగును మంజుల కవితల్”*

    రిప్లయితొలగించండి
  3. తద్యముగ నుండ వలెనని
    పద్యంబున రస గుళికలు పాటవ పటిమల్
    హృద్యమగు పద్య రసమను
    మద్యముకొని వ్రాయనగును మంజుల కవితల్

    రిప్లయితొలగించండి
  4. హృద్యంబౌ వస్తువుతో
    పద్యము సృష్టించ వలెను పండిత వర్యా
    సాధ్యము కాకున్నయెడల
    మద్యముఁ గొని వ్రాయనగును మంజుల కవితల్

    కొను = లక్ష్యపెట్టు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మద్యముఁ గ్రోలినంత పెనుమత్తుకు లోనగు గండముండినన్
      సాధ్యమసాధ్యమంచు పలు సాకులు చెప్పక నుద్యమించుమా
      మద్యము పద్యవస్తువయి మానసమందున తిష్ఠవేయగా
      మద్యముఁ గ్రోలినంత రసమంజుల పద్యము వ్రాయగా నగున్

      తొలగించండి
  5. పద్యము లిఖించ కుండుము
    మద్యముఁ గొని ; వ్రాయనగును మంజుల కవితల్
    చోద్యముల మదిని నిడుకొని ,
    సద్యమె జనులుగ్గడించ శక్యము గదరా

    రిప్లయితొలగించండి
  6. ఆద్యుల ఘనతను దెలి సియు
    పద్యము వ్రాయంగ నెంచి పంతము దోడన్
    విద్యార్జన తో రసమయ
    మద్యము గొని వ్రాయ దగును మంజుల కవితల్

    రిప్లయితొలగించండి
  7. ఉ.

    హృద్యము గాదె నాస్తికుల హేలిత కావ్యములున్ ప్రబంధముల్
    చోద్యము వారి వ్యాఖ్యలును శోధన బోధన వైపరీత్యమే
    గద్యపు ప్రాభవంబు సరిగా నెలకొల్పి వితండవాదులై
    *మద్యముఁ గ్రోలినంత రసమంజుల పద్యము వ్రాయగా నగున్.*

    రిప్లయితొలగించండి
  8. పద్యము ఛందబద్ధముగ వ్రాయగ బూనియు వ్రాయలే కవై
    రుధ్యపు భావనల్గలుగ రోయుచు నుండక
    తన్నుదానె, తా
    నుద్యమ దీక్షతోడను మనోధృతి తోడను వ్రాయ బూనినన్
    మద్యము(గ్రోలినంత రసమంజుల పద్యము వ్రాయగా నగున్.

    రిప్లయితొలగించండి

  9. విద్యాదేవి కరుణతో
    సాధ్యంబౌ హృద్యమైన సాహిత్యంబే
    మద్యార్థుడు మూర్ఖు డగుచు
    మద్యముఁ గొని వ్రాయనగును మంజుల కవితల్?


    విద్యల తల్లి చల్లనగు వీక్షణ లేనిదె వ్రాయలేడిలన్
    పద్యము పండితోత్తముడు వాస్తవమియ్యదటం చు చెప్పిరే
    యాద్యులు, మత్తునిచ్చి మరియాదను మంటల పాలు జేసెడిన్
    మద్యముఁ గ్రోలినంత రసమంజుల పద్యము వ్రాయగా నగున్?

    (మరొకటి)

    ఆద్యులు పద్మలాంచన దయార్జిత లబ్దఫలంబు తోడ నీ
    పద్యము వ్రాయు పాటవము పండిత శ్రేణికి యబ్బు నందురే
    హృద్యకవిత్వమియ్యదియె హీనగుణాత్ములు పానశూరు లా
    మద్యముఁ గ్రోలినంత రసమంజుల పద్యము వ్రాయగా నగున్?

    రిప్లయితొలగించండి
  10. విద్యలు నేర్చుచున్ జతకు వేడుక కూర్చెడు గ్రంథరాజముల్
    నధ్యయనమ్ముచేయుచునునార్యులబోధలువించువేడ్కతో
    నాద్యుల మాటలన్వినుచు నాదరమొప్పగ భక్తిసారమన్
    *“మద్యముఁ గ్రోలినంత రసమంజుల పద్యము వ్రాయగా నగున్”*



    రిప్లయితొలగించండి
  11. హృద్యమ్మగు పద్యమ్ముల
    సేద్యంపు కృషీవలుండు చిత్తమలరగన్
    సద్యశమను మత్తుగొలుపు
    మద్యముఁ గొని వ్రాయనగునుమంజులకవితల్

    రిప్లయితొలగించండి
  12. హృద్యముగా కవిత్వమను కృష్టిని సల్పు కవీంద్రుకిమ్మహిన్
    సేద్యఫలమ్ము కావ్యమది చేకురజేయ యశమ్ము వానికా
    సద్యశమే గదా పరవశమ్మను మైకమునిచ్చు మద్యమా
    మద్యముఁ గ్రోలినంత రసమంజుల పద్యము వ్రాయగా నగున్

    రిప్లయితొలగించండి
  13. కం॥ విద్యను గఠిన శ్రమనరసి
    పద్యములను వ్రాయఁ దగిన పాటవ మలరన్
    హృద్యముగ తనరు నెటులను
    మద్యముఁ గొని వ్రాయనగును మంజుల కవితల్

    ఉ॥ హృద్యము లైన పద్యములు హేలగ వ్రాయు టసంభవమ్మగున్
    విద్య కఠోర సాధనను విజ్ఞత నొందఁగ నబ్బుఁ దెల్పఁగన్
    సేద్యము వోలె పాటవముఁ జిక్కని సామున దక్కు సాహితీ
    మద్యముఁ గ్రోలినంత రసమంజుల పద్యము వ్రాయఁగానగున్

    రిప్లయితొలగించండి
  14. కందం
    వేద్యంపు సత్యమనగన్
    హృద్యపు ననుభూతి రేపి యింపొన రింపన్
    విద్యాంబ కృపయె, తలఁపక
    మద్యముఁ, గొని వ్రాయనగును మంజుల కవితల్


    ఉత్పలమాల
    వేద్యమునైన సత్యమిది వేరొకరెవ్వరు కాదటందురే?
    వద్యమనంగఁ జెప్పెదను బంచ నదే మధురానుభూతులన్
    విద్యల తల్లి సత్కృపయె! ప్రేరణమొంది తలంపనొప్పకే
    మద్యముఁ, గ్రోలినంత రసమంజుల పద్యము వ్రాయగా నగున్

    రిప్లయితొలగించండి
  15. విద్యనువిశ్వాత్ముంగని
    సద్యోజాతంబునైనసమరసబుద్ధిన్
    హృదయము రసభావాత్మక
    పద్యముఁగొని్రాయదగునుంజులకవితల్

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    విద్యల తల్లిని గొలుచుచు
    హృద్యమగు రచనల నెన్నొ నింపుగ జేయన్
    సద్యశము నొంద ఛందో
    మద్యము గొని వ్రాయనగును మంజుల
    కవితల్.

    రిప్లయితొలగించండి