24-7-2023 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఆదివారము పనిదిన మయ్యె నయ్యొ”(లేదా...)“పనిదినమయ్యె నయ్యొ రవివారము కాదని చెప్ప నొప్పునే”
దూరమని తలపోయక చేర వచ్చినీదు పెండ్లికి శుభలేఖ నిచ్చి నావురాక యుందునా సెలవైన, కాకపోయెనాదివారము, పనిదిన మయ్యె నయ్యొ
వెనుకటి కాలమందు మనబృందపు సభ్యుడు పిల్చె పెండ్లికైతను మనువాడునాడు తలదాల్చిన కార్యము లడ్డువచ్చినన్కినుకవహించునేమొ తనకిప్పుడు చెప్పక మానివైచినన్పనిదినమయ్యె నయ్యొ, రవివారము కాదని చెప్ప నొప్పునే
అత్యవసర సేవల కొరకనుచు చేయవలసి వచ్చు కొందరకు తప్పని సరియగుసెలవు దినముల పని వార మాదియైన,ఆదివారము పనిదినమయ్యెనయ్యొ!
వానలు కురియుచుండినవనుచు విడుపునొసగి చాల పనుల శేషముండినదని,దాని నిప్పుడు సరిజేయ దలచి నంతనాదివారము పనిదిన మయ్యె నయ్యొ
వంటశాలయెపిలచెగాపండుగనుచుకాంతసంతసమునకాఫికలుపమనియెబంధువొచ్చెను నింటి రాబందువోలెఆదివారముపనిదినమయ్యెనయ్యొ
ఆరు రోజులు విధులే ఔర నేనుజేయ నొక్కటి వచ్చెను జిలుగు వెలుగుఆదివారము, వచ్చెను ఆత్మబంధుఆదివారము పని దినమయ్యె నయ్యొ
సెలవు లభియించు మగనికి చిత్ర ముగనునాకు సెలవన్న దే లేదు న్యాయ మేన?నాది వారము పని దిన మయ్యె న య్యొ నని వగచు చుంటి ని గద నతి వ నగు చు
అనవరతము పనులతో నలసి పోతినేడు సెలవంచు జరిపితి వేడుకలనుకాలమాగదు గాదుటే గడచి నంతనాదివారము , పనిదిన మయ్యె నయ్యొఅనుజుని పెండ్లి రమ్మనుచు నాదరమందున బిల్వనేమి యాదినమది సోమవారము తేరగ నివ్వగ లేడుదాస్థితుండనుమతి యంచు చెప్పగ నహంబది యడ్డుగ వచ్చె నాకిటన్ బనిదినమయ్యె నయ్యొ , రవివారము కాదని చెప్ప నొప్పునే.
ఒక సతీమణి భర్తతో... తేటగీతిసెలవు దినమునఁ బనులను చేతునంచుగడువు పెట్టగ సైచితి గతియెలేకపుస్తకావిష్కరణమని పోవ మీరలాదివారము పనిదిన మయ్యె నయ్యొ!గొణగకుమంచు నన్ను పనికూర్చెదనంచని యాదివారమున్బెనిమిటి! మీరలున్ గడువుఁ బెట్టుచు నన్నిటు నిద్రఁ బుచ్చుచున్మునిగిరి పద్య ఖండికల పూర్తిని జేయఁగ బట్టుఁబట్టుచున్పనిదినమయ్యె నయ్యొ రవివారము కాదని చెప్ప నొప్పునే?
చం.*పనిదినమయ్యె నయ్యొ రవివారము కాదని చెప్ప నొప్పునే*వనితయు మద్య మాంసములు భాస్కర వారము నాడు త్యక్తముల్కనుగొన నాంగ్ల జాతి జన గండుల చేత విరామమయ్యెనేయినకుల చంద్ర వంశముల యిచ్ఛలు భక్తియు నంతరించెడిన్.
ప్రభుత కొలువున నుండవు పగలు రేయియెంత చేసిన చాకిరి కంతు గనముభార్యతో కలిసి గడుప వలయునన్ననాదివారము పనిదినమయ్యె నయ్యొ
ఒక చిరుద్యోగి ఆత్మఘోష:అనవరతమ్ము దేవరకు నర్పణమాయెను జీవితమ్ము నాపనికొకయంతు గాననొక భారముమోయు ఖరమ్ము కైవడిన్పనుల నిమగ్నమై తుదకు భార్యకు సైతము దూరమైతినేపనిదినమయ్యె నయ్యొ రవివారము కాదని చెప్ప నొప్పునే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తే॥ తైల శోధనను వలదు తడవు సేయనర్ధరాత్రి పిలిచినంత యరుగ వలయునాది వారమనెడి వంక యమలు కాకఆదివారము పనిదిన మయ్యె నయ్యొచం॥ అనుమతి లేదు సెలవుల నాశగ కోరఁగఁ దైల శోధనన్బనులను వీడి పోవుటయు పాడియె గాదరియంగ నచ్చటన్గనఁగను వార మేదియును గాదగు నైనను గార్య ముండునేపనిదినమయ్యె నయ్యొ రవివారము కాదని చెప్ప నొప్పునే(మా స్వానుభవమేనండి)
తేటగీతిచెలియ!యిట్టె గడచిపోయె సెలవు దినము*ఆదివారము;పనిదినమయ్యెనయ్యొ*సోమవారము లేలెమ్ము సుప్తి నుండివేగ పోవలె గాదె యుద్యోగమునకు.
వాన లెక్కువ కురియుట వలన సెలవు లీయు కారణ మునుజూపి యింక నుండి యాదివారము పనిదిన మయ్యె, నయ్యొ యనకండి చేయుడు హర్ష మొంది
వినుముర రాజ శేఖరుఁడ !వీనుల కిష్టము కానిమాట యే పనిఁగొని చెప్పు చుంటినిఁక వారము వారము తప్పకుండ గాఁ బనిదినమయ్యె నయ్యొ రవివారము కాదని చెప్ప నొప్పునే ననయము మాన కుండగను హర్షము తోడను బోవు మాయిఁకన్
అనిశము జర్గు సంగతిది యందరెరింగిన నగ్న సత్యమేవినవలె జెప్పినట్టుల వివేకముతోడ ప్రభుత్వకార్యముల్విని యనివార్యమైననవి వెంటనె సేయక తప్పదేరికిన్పనిది నమయ్యె నయ్యొ రవివారముకాదని చెప్ప నొప్పునే
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. వచ్చుచుంటిరి యధికార వర్గము తనిఖీకి, సెలవు లేదెవ్వరికింక యనుచునాజ్ఞ నివ్వగ కార్యాలయాధికారి రెండవ శనివారమును మరి మరు రోజునాది వారము పనిదిన మయ్యె నయ్యొ.
దూరమని తలపోయక చేర వచ్చి
రిప్లయితొలగించండినీదు పెండ్లికి శుభలేఖ నిచ్చి నావు
రాక యుందునా సెలవైన, కాకపోయె
నాదివారము, పనిదిన మయ్యె నయ్యొ
వెనుకటి కాలమందు మనబృందపు సభ్యుడు పిల్చె పెండ్లికై
తొలగించండితను మనువాడునాడు తలదాల్చిన కార్యము లడ్డువచ్చినన్
కినుకవహించునేమొ తనకిప్పుడు చెప్పక మానివైచినన్
పనిదినమయ్యె నయ్యొ, రవివారము కాదని చెప్ప నొప్పునే
అత్యవసర సేవల కొరకనుచు చేయ
రిప్లయితొలగించండివలసి వచ్చు కొందరకు తప్పని సరియగు
సెలవు దినముల పని వార మాదియైన,
ఆదివారము పనిదినమయ్యెనయ్యొ!
వానలు కురియుచుండినవనుచు విడుపు
రిప్లయితొలగించండినొసగి చాల పనుల శేషముండినదని,
దాని నిప్పుడు సరిజేయ దలచి నంత
నాదివారము పనిదిన మయ్యె నయ్యొ
వంటశాలయెపిలచెగాపండుగనుచు
రిప్లయితొలగించండికాంతసంతసమునకాఫికలుపమనియెబంధువొచ్చెను నింటి రాబందువోలె
ఆదివారముపనిదినమయ్యెనయ్యొ
ఆరు రోజులు విధులే ఔర నేను
రిప్లయితొలగించండిజేయ నొక్కటి వచ్చెను జిలుగు వెలుగు
ఆదివారము, వచ్చెను ఆత్మబంధు
ఆదివారము పని దినమయ్యె నయ్యొ
సెలవు లభియించు మగనికి చిత్ర ముగను
రిప్లయితొలగించండినాకు సెలవన్న దే లేదు న్యాయ మేన?
నాది వారము పని దిన మయ్యె న య్యొ నని వగచు చుంటి ని గద నతి వ నగు చు
రిప్లయితొలగించండిఅనవరతము పనులతో నలసి పోతి
నేడు సెలవంచు జరిపితి వేడుకలను
కాలమాగదు గాదుటే గడచి నంత
నాదివారము , పనిదిన మయ్యె నయ్యొ
అనుజుని పెండ్లి రమ్మనుచు నాదరమందున బిల్వనేమి యా
దినమది సోమవారము తేరగ నివ్వగ లేడుదాస్థితుం
డనుమతి యంచు చెప్పగ నహంబది యడ్డుగ వచ్చె నాకిటన్
బనిదినమయ్యె నయ్యొ , రవివారము కాదని చెప్ప నొప్పునే.
ఒక సతీమణి భర్తతో...
రిప్లయితొలగించండితేటగీతి
సెలవు దినమునఁ బనులను చేతునంచు
గడువు పెట్టగ సైచితి గతియెలేక
పుస్తకావిష్కరణమని పోవ మీర
లాదివారము పనిదిన మయ్యె నయ్యొ!
గొణగకుమంచు నన్ను పనికూర్చెదనంచని యాదివారమున్
బెనిమిటి! మీరలున్ గడువుఁ బెట్టుచు నన్నిటు నిద్రఁ బుచ్చుచున్
మునిగిరి పద్య ఖండికల పూర్తిని జేయఁగ బట్టుఁబట్టుచున్
పనిదినమయ్యె నయ్యొ రవివారము కాదని చెప్ప నొప్పునే?
చం.
రిప్లయితొలగించండి*పనిదినమయ్యె నయ్యొ రవివారము కాదని చెప్ప నొప్పునే*
వనితయు మద్య మాంసములు భాస్కర వారము నాడు త్యక్తముల్
కనుగొన నాంగ్ల జాతి జన గండుల చేత విరామమయ్యెనే
యినకుల చంద్ర వంశముల యిచ్ఛలు భక్తియు నంతరించెడిన్.
ప్రభుత కొలువున నుండవు పగలు రేయి
రిప్లయితొలగించండియెంత చేసిన చాకిరి కంతు గనము
భార్యతో కలిసి గడుప వలయునన్న
నాదివారము పనిదినమయ్యె నయ్యొ
ఒక చిరుద్యోగి ఆత్మఘోష:
రిప్లయితొలగించండిఅనవరతమ్ము దేవరకు నర్పణమాయెను జీవితమ్ము నా
పనికొకయంతు గాననొక భారముమోయు ఖరమ్ము కైవడిన్
పనుల నిమగ్నమై తుదకు భార్యకు సైతము దూరమైతినే
పనిదినమయ్యె నయ్యొ రవివారము కాదని చెప్ప నొప్పునే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే॥ తైల శోధనను వలదు తడవు సేయ
రిప్లయితొలగించండినర్ధరాత్రి పిలిచినంత యరుగ వలయు
నాది వారమనెడి వంక యమలు కాక
ఆదివారము పనిదిన మయ్యె నయ్యొ
చం॥ అనుమతి లేదు సెలవుల నాశగ కోరఁగఁ దైల శోధనన్
బనులను వీడి పోవుటయు పాడియె గాదరియంగ నచ్చటన్
గనఁగను వార మేదియును గాదగు నైనను గార్య ముండునే
పనిదినమయ్యె నయ్యొ రవివారము కాదని చెప్ప నొప్పునే
(మా స్వానుభవమేనండి)
తేటగీతి
రిప్లయితొలగించండిచెలియ!యిట్టె గడచిపోయె సెలవు దినము
*ఆదివారము;పనిదినమయ్యెనయ్యొ*
సోమవారము లేలెమ్ము సుప్తి నుండి
వేగ పోవలె గాదె యుద్యోగమునకు.
వాన లెక్కువ కురియుట వలన సెలవు
రిప్లయితొలగించండిలీయు కారణ మునుజూపి యింక నుండి
యాదివారము పనిదిన మయ్యె, నయ్యొ యనకండి చేయుడు హర్ష మొంది
వినుముర రాజ శేఖరుఁడ !వీనుల కిష్టము కానిమాట యే
రిప్లయితొలగించండిపనిఁగొని చెప్పు చుంటినిఁక వారము వారము తప్పకుండ గాఁ
బనిదినమయ్యె నయ్యొ రవివారము కాదని చెప్ప నొప్పునే
ననయము మాన కుండగను హర్షము తోడను బోవు మాయిఁకన్
అనిశము జర్గు సంగతిది యందరె
రిప్లయితొలగించండిరింగిన నగ్న సత్యమే
వినవలె జెప్పినట్టుల వివేకము
తోడ ప్రభుత్వకార్యముల్
విని యనివార్యమైననవి వెంటనె
సేయక తప్పదేరికిన్
పనిది నమయ్యె నయ్యొ రవివారము
కాదని చెప్ప నొప్పునే
తొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
వచ్చుచుంటిరి యధికార వర్గము తని
ఖీకి, సెలవు లేదెవ్వరికింక యనుచు
నాజ్ఞ నివ్వగ కార్యాలయాధికారి
రెండవ శనివారమును మరి మరు రోజు
నాది వారము పనిదిన మయ్యె నయ్యొ.