29, మే 2024, బుధవారం

దత్తపది - 208

30-5-2024 (గురువారం)
పాము - కప్ప - తేలు - బల్లి
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ స్వేచ్ఛాచందంలో
ఆడుకుంటున్న అమ్మాయిపై పద్యం చెప్పండి.

16 కామెంట్‌లు:

  1. పాపా! ముంగిట యాడుమ
    చేపనుకప్పగకొలనున చేయినిగొనుమా
    ఏపునదేలుచుతడబడి
    కాపునబల్లిదుదనగనుతడబడునదియే

    రిప్లయితొలగించండి
  2. కందం
    పాముచు పాలిండ్ల, జనని
    గోముగ ముద్దాడి కప్ప కొంగును గొనుచున్
    వేమరు తేలుచు సబలగ
    నామెకు బల్లిదము సూపు నాడుచు నొడిలోన్

    రిప్లయితొలగించండి
  3. తే॥ పాముచును బొమ్మనట్టుల ప్రేమమీర
    పట్టుచీరె కప్పడమును జుట్టి నీవె
    వధువనుచు బల్లిమాటలు పలుకుచుఁ దను
    మోదమునఁ దేలుచుం బాప యాడుచుండె

    బల్లిమాటలు ఇచ్చకాలు నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరొక పూరణ
      ఉ॥ పాముచు బొమ్మలన్నిటినిఁ బాప ముదమ్ముగ నాడుచుండెనో
      గోముగఁ బెండ్లి సేతుననిఁ గోరిక మీరఁగఁ గప్పడమ్మునున్
      భామకు చుట్టునో వరుని ప్రక్కన చేర్చునొ బల్లిమాటలన్
      బ్రేమగఁ బల్కునో తనిసి ప్రీతినిఁ దేలుచు సంతసించెనే

      తొలగించండి
  4. పాపాముచ్చట యాటల
    ప్రాపుగ వెంకప్ప వెంటరాగా నీవీ
    మాపున రహిలో తేలుచు
    చూపితివిటు బల్లిదమునుచోద్యము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  5. పాపపాముచుదరిచేరపరవశాన
    మునిగితేలుచునుండెను ముదము తోడ
    నెత్తుకొనికొంగునటకప్ప నిమ్ముగాను
    పాపబల్లిదురాలనిపలికె తల్లి


    రిప్లయితొలగించండి

  6. విడిచిరి కప్పడమ్ములను పెద్దతటాకపు నీట తేలుచున్
    వడివడి యీదులాడుచు పంకము పాముకొనంగ గాంచుచున్
    మడుగున దూకె బల్లిదుడు మాణవకుండ్రను రక్షజేయగా
    జడియక, భేషటంచును ప్రజానిక నుతించి రాతనిన్.

    రిప్లయితొలగించండి
  7. పా[పా ము]చ్చట పడకే
    కాపాలికుడిచ్చెనీకు [కప్ప]డి బొమ్మే
    లోపము గలదని [తేలు]ను
    చేపట్టుము సోన[బల్లి] చెక్కినబొమ్మే

    రిప్లయితొలగించండి
  8. తెరవలను కూడి నీటిపై తేలు చుండ,
    బల్లిదమును జూపుమనగ పంతమొంది
    కొట్టినంత బుగ్గలు పాము కొనగ నేను
    గెలిచితినని మీకప్పటికి విశదమగు

    రిప్లయితొలగించండి
  9. పాప పాముచు నాడంగ బయలు దే ర
    తొలగు మేక ప్ప టంచును వలపు తోడ
    తల్లి ముదమున దేలుచు తన్మ యమున
    బల్లిదంబుగ ద నయ తో పలికె నపుడు

    రిప్లయితొలగించండి
  10. పాము-కప్ప-బల్లి-తేలు
    పాపా!ముద్దుల మూట వీవు కద!కప్పన్ జాలి నా కండ్లనే,
    యీ పాలైనను ద్రావకే వడిగ నీ వే మూలకో బ్రాకి,నే
    కోపమ్మున్ నటియింప నవ్వెదవు, నా కోపమ్మదే తేలు నే
    నాపన్ నీదగు నాగ మెంతటి యుపాయం బల్లినన్ నెగ్గునే!
    (పాము,తేలు,కప్ప అనే పదాలు సరళాదేశం కాకుండా జాగ్రత్త తీసుకొన్నాను. )

    రిప్లయితొలగించండి
  11. పాముచు స్వకచం బల్లియు
    గోముగఁ దేలుచు ముదాబ్ధిఁ గులుకుచు మిగులన్
    రామలను గూడి యాడఁగ
    భామామణి కప్పడతుల పంచ లభించెన్

    రిప్లయితొలగించండి
  12. పాపా ముందిటు రామ్మా
    ఆపికఁ దాళంపుకప్ప నాడుటనిదిగో
    ఈఁబల్లికతో నాడుము
    నేపాటుయు లేకఁ దేలుమెంతో ఎలమిన్

    రిప్లయితొలగించండి