ఉ:ఏ విధి క్షాత్రధర్మమిది? యింతికి నింతటి యెగ్గు కల్గగా నేవురు భర్త లుండి యిట నీక్షణ జేయుచు మిన్నకుందురే! కావగ నుంటి నే ననుచు గ్రక్కున ప్రక్కన జేర ధర్మమౌ ద్రోవది కొక్క భర్త?యని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్” (ద్రౌపది ప్రక్కన ఒక్క భర్త ఐనా చే4అటం ధర్మం అన్నాడు ద్రోణాచార్యులు. )
పాంచాలీ! పంచభర్తృకా! యని నిందించెడు రారాజుతో
రిప్లయితొలగించండిఅలా అనఁదగదని.....
యుద్ధకందం
దేవత కుంతీమాతగ
పావనియగు యాజ్ఞసేనిఁ బంచుకొన సుతుల్
సేవింప వత్సరమునకు
ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్!
ఉత్పలమాల
దేవతగాఁ దలంచి పృథ ధీమతులౌచును దల్లి యాజ్ఞగన్
పావని యాజ్ఞసేనిఁదగఁ బాండవులేవరు భార్యగాఁ గొనన్
సేవలు ధర్మపత్నిగను సేయఁగనొప్పఁగ వత్సరంబునన్
ద్రోవది కొక్క భర్తయని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ వైరి ద్రుపదుని సుతకి
రిప్లయితొలగించండియేవురు పతులుండియు దననెదురుచు నిలువన్
చేవను జూపుట కొరకై
ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏవిధముగ పాండవులకు
రిప్లయితొలగించండిద్రోవది పరిచర్యలోన దోడ్పడుననుచున్
భావించు నపుడు సాలుకు
ద్రోవది కొక భర్త యనుచు ద్రోనుడు పలికెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం॥ ఏవిధిన్ గనఁగ ద్రుపద సుత
రిప్లయితొలగించండికేవురు పతులు పరమశివుఁ డిచ్చెను వరమున్
బావనికి, కల్ల యిదియే
“ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు పలికెన్”
ఉ॥ పావని చేయగన్ దపము భర్తను గోరుచు భక్తిశ్రద్ధలన్
భావము మీర నీశ్వరుఁడు భక్తికి మెచ్చి యొసంగె నేవురన్
ద్రావిన మూర్ఖుఁడొక్కఁడిటు తప్పుగఁ బల్కెను గ్రమ్మ మైకమే
“ద్రౌవది కొక్క భర్తయని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్”
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిభావిని పృథ యానతితో
రిప్లయితొలగించండిజీవను లంగీకరించి చేగొనిన ప్రియుం
డ్రేవురిలో సహ దేవుడు
ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్.
ఏవురు పాండుపుత్రులొక యింతిని భార్యగ స్వీకరించినన్
బావన మౌ చరిత్రగల వారలు విజ్ఞులు ధర్మమూర్తులా
భావిని యేటికొక్కరికి భార్యగ నుండెడి నిర్ణయమ్ముతో
ద్రోవది కొక్క భర్తయని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఏవురు భర్తలయందున
రిప్లయితొలగించండిదావరి విలువిద్యయందు తనశిష్యుండై
చేవను చూపెడు పార్థుఁడు
ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపావన నియమావళితో
రిప్లయితొలగించండిద్రోవతి సతియయ్యెనుగద దోషరహితయై
కావున ప్రతి వత్సరమున
ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్
ద్రోవది పెండ్లిగూర్చి ద్రుపదుండనుమోదము చూపకుండినన్
దీవెనలిచ్చి వ్యాసుడట తెల్పెను దేవుని నిర్ణయంబుగా
కావున నిర్ణయించిన ప్రకారమునన్ బ్రతి వత్సరంబునన్
ద్రోవది కొక్క భర్తయని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండికందం
రిప్లయితొలగించండిచేవను జూపిన పార్థుడు
ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్
పావని పరమ పతివ్రత
దేవుని వరమున జతపడె దివ్యపురుషులన్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏవు రు పతులను గల్గియు
రిప్లయితొలగించండిచేవను జూపించు వాడు శ్రే ష్ఠు o డిలలో
దేవ పతి సుతుడు క్రీడి యె
ద్రోవది కొక భర్త యనుచు ద్రోణు డు బలి కెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేవురు మెచ్చురీతి యరి వీరభయంకరుడాజి యందునన్
రిప్లయితొలగించండిచేవనుజూపి శస్త్రముల చిత్తొనరించును వైరిసైన్యమున్
యేవురు భర్తలందతఁడు యెక్కటి యోధుడు ఫల్గుణుండు తాఁ
ద్రోవది కొక్క భర్తయని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"రీతి నరి... వైరిసైన్య మా యేవురు.. దతఁడె యెక్కటి.." అనండి.
సవరణలకు ధన్యవాదములు గురువుగారూ 🙏
తొలగించండివేవురు మెచ్చురీతి నరి వీరభయంకరుడాజి యందునన్
తొలగించండిచేవనుజూపి శస్త్రముల చిత్తొనరించును వైరిసైన్యమా
యేవురు భర్తలందతఁడె యెక్కటి యోధుడు ఫల్గుణుండు తాఁ
ద్రోవది కొక్క భర్తయని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్
ద్రోవది భంగపాటుఁగని రోసిరి యోలగమందు సర్వులే
రిప్లయితొలగించండికోవకు చెందినన్ పరువు కూలి యడర్చుచు మూడె ఘోరమౌ
చావులు నన్న భీముని ప్రశంసపు చూపుల దీవనిచ్చి యీ
ద్రోవది కొక్క భర్తయని ద్రోణుడు పల్కె సభాంతరమ్మునన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినమస్కారము, ధన్యవాదాలు.
తొలగించండిపావన మూర్తులు వారలు
రిప్లయితొలగించండిభావింపఁగ శౌర్యవరులు భరణిని సుమ్మీ
సేవింపగ వారి నెపుడు
ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివావిరి వాసవ పంచక
రిప్లయితొలగించండిమే వసుధం బాండు సూను లెన్నఁగ నిజముం
గావునఁ బాంచాలికి నా
ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్
పావన వంశజాతకులు పాండువు లందు నొకండు నింపుగా
వావిరి భర్తగాఁ దనరు పద్ధతి నారదు నాజ్ఞఁ దాల్పఁగా
నీ వసుధాతలమ్మునను నెన్నఁగ నొక్కొక వత్సరమ్మునన్
ద్రోవది కొక్క భర్తయని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపావన వంశియా సతికి పాండవులందున నొక్క సాలుకున్
రిప్లయితొలగించండిద్రోవది కొక్కభర్తయని ద్రోణుఁడు తెల్పె సభాంతరమ్మునన్
ద్రోవది సంతసం బలరి ద్రోణుని గారవ మొప్ప మ్రొక్కిడెన్
నేవురు పాండవుల్ దనరి యిచ్ఛను దెల్పిరి యాక్షణంబునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మ్రొక్కె నా యేవురు పాండవుల్..." అనండి.
కం:ఏవురు పతు లుండి సభను
రిప్లయితొలగించండినీ విధి స్త్రీ కుందు చుండ నీక్షించెదరే?
కావడె, ధైర్య మ్మిడడే
ద్రోవది కొక భర్త?యనుచు ద్రోణుఁడు వలికెన్”
పావనిద్రుపదునిపుత్రిక
రిప్లయితొలగించండిభావనయందునతనపతిప్రాణములైదున్
చేవనునొకటిగదలచెను
ద్రోవదికొకభర్తయనుచుదోరోణుడువలికెన్
ఉ:ఏ విధి క్షాత్రధర్మమిది? యింతికి నింతటి యెగ్గు కల్గగా
రిప్లయితొలగించండినేవురు భర్త లుండి యిట నీక్షణ జేయుచు మిన్నకుందురే!
కావగ నుంటి నే ననుచు గ్రక్కున ప్రక్కన జేర ధర్మమౌ
ద్రోవది కొక్క భర్త?యని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్”
(ద్రౌపది ప్రక్కన ఒక్క భర్త ఐనా చే4అటం ధర్మం అన్నాడు ద్రోణాచార్యులు. )