శా:సౌఖ్య మ్మొందెడు నట్లు గన్ పడు సదా సంసారి సొమ్ముండినన్, ప్రాఖ్యన్ బొందుచు నాలి లేని యతి నిత్యానందు డై కన్ బడున్ సఖ్యంబున్ బొనరించి యిర్వురను "సంసారమ్మొ,సన్యాసమో సౌఖ్యస్థావరమే"దనన్ ? నరకమే సంసారికిన్ యోగికిన్” (సంసారి యింత డబ్బున్న వాడైతే సుఖం గా ఉన్నట్టు కనిపిస్తాడు.సన్యాసి కూడా నిత్యం ఆనందం గా ఉన్నట్టే కనిపిస్తాడు. ఆ ఇద్దరితో స్నేహం చేసి "సంసారం సుఖమా?సన్యాసం సుఖమా"అని అడిగితే ఆ ప్రశ్నే ఇద్దరికీ నరకం గా కనిపిస్తుంది.)
గ్రీష్మతాపంబుశృతి మించెరేయిబవలు
రిప్లయితొలగించండినిలువలేమనిప్రజలెల్లనీటికొలను
వెదుకనేజాడగనరాదువింతగాదె
సౌఖ్యముల్దక్కుగదయమసదనమందు
తేటగీతి
రిప్లయితొలగించండిసఖ్యముగొన వరూధిని సరసఁ జేర
ప్రవర! విరహాగ్ని కీలల వదలనెంచి
వీడ స్వర్గమ్ము నిలపైన, వివిధగతుల
సౌఖ్యముల్ దక్కుఁ గద యమసదనమందు?
శార్దూలవిక్రీడితము
సఖ్యమ్మెంచి వరూధినీ లలన నీ సాంగత్యమున్ గోర వై
ముఖ్యమ్మున్ ప్రవరా! గృహస్థుడగుచున్ ముమ్మూర్తులా యోగిగన్
ప్రఖ్యాతిన్ మది నెంచి జూపుదె? యదే పాపమ్మగున్ మీదటన్
సౌఖ్యస్థావరమేదనన్ నరకమే సంసారికిన్ యోగికిన్!
వ్యాఖ్యానంబులగేలిజేయుదురిలన్వైనంబులేకన్జనుల్
రిప్లయితొలగించండిఆఖ్యానంబదినిల్చునేగృహములోనాయాసముల్లేకనే
విఖ్యాతిన్గనకల్లయైమిగులుగావిన్నాణమున్జూపుచో
సౌఖ్యస్థావరమేదనన్నరకమేసంసారికిన్యోగికిన్
రిప్లయితొలగించండిసత్యమదియె సంసారము సాగరమను
మాట, శాంతి లేదుకదరా మహిని జూడ
బ్రతుకదియె పెను భారమై వెతలు నిండ
సౌఖ్యముల్ దక్కుఁ గద యమసదనమందు.
సౌఖ్యార్థుండ్రిట యోర్మినే కలిగి సంసారమ్ము సాగించినన్
సఖ్యంబించుక చూపనట్టి సతితో సంగ్రామమే నిత్యమున్
బ్రఖ్యాతంబగు మోక్షసాధనమదే బాధించు దేహమ్మునే
సౌఖ్యస్థావరమేదనన్ నరకమే సంసారికిన్ యోగికిన్.
నాక నరకముల్ దక్కును నమ్మకముగ
రిప్లయితొలగించండిమానవుల కర్మలనుబట్టి, మంచి జేయ
సౌఖ్యముల్దక్కుగద, యమసదనమందు
పాపములుసేయ కష్టాల పాలబడును.
పుణ్య కార్యములు సలుపు పూనికలను
రిప్లయితొలగించండినాశ మొనరించ కుండిన , నాకమందు
సౌఖ్యముల్ దక్కుఁ గద ; యమసదనమందు
సంకటములు దక్కు ఖలము సలుపుచుండ
తే॥ భువిని యధిక బాధలొదవి భుక్తిఁ గనక
రిప్లయితొలగించండిస్వస్థతఁ బడయక విసుగుఁ బడుచు విసురు
గాను బలుకుదు రిటులను దీనముగను
“సౌఖ్యముల్ దక్కుఁ గద యమసదనమందు”
శా॥ వ్యాఖ్యానించఁగ నిత్య సత్యమును సంభావించి స్పష్టంబుగన్
సౌఖ్యమ్మైనను గష్టమైనను గనన్ సంసారికిన్ యోగికిన్
ముఖ్యస్థావరమేదనన్ ధరణియే మూర్ఖమ్మిటుల్ పల్కగన్
“సౌఖ్యస్థావరమేదనన్ నరకమే సంసారికిన్ యోగికిన్”
భార్య భర్తలు మమత తో వరలు నపుడు
రిప్లయితొలగించండిసమసి పోవును బాధలు సంతసమున
గృహ మె స్వర్గ సీమ గ మారి ఖేద ముడిగి
సౌఖ్య ముల్ దక్కు గద యమ సదన మందు
యమసదనమిట చెఱసాల యనుచు తలచి
రిప్లయితొలగించండిపట్టి బంధింప చెఱసాల ప్రాప్తమగును
ముఖ్య నేతలన్ బంధించి మూసిపెట్ట
సౌఖ్యముల్ దక్కుఁ గద యమసదనమందు
సౌఖ్యంబేకద స్వర్గమందు ననుచున్ సంసారికిన్ జెప్ప వై
ముఖ్యుండై కనిపించు గాదె తనలో మోహంబు లోపించినన్
వ్యాఖ్యానమ్మును చేయలేని స్థితిలో ప్రశ్నింపగాఁ జూచుచున్
సౌఖ్యస్థావరమేదనన్ నరకమే సంసారికిన్ యోగికిన్
కలుషమగు నీరు కలుషమ్ము గాలి కూడ
రిప్లయితొలగించండిమురుగుకాల్వల మశకముల్ ముసురుకొనఁగ
నరకమునుమించి యగచాట్లు, నగరికన్న
సౌఖ్యముల్ దక్కుఁ గద యమసదనమందు
ముఖ్యం బెయ్యదియన్న స్వార్థమె పురంబుల్ నేడరణ్యంబులే
రిప్లయితొలగించండిసఖ్యంబన్నది మృగ్యమీ జనులలో సంతోషమే శూన్యమౌ
ప్రఖ్యాతమ్మగు పట్నజీవనమునన్ ప్రాప్తించు కష్టమ్ములే
సౌఖ్యస్థావరమేదనన్ నరకమే సంసారికిన్ యోగికిన్
సారరహితమౌ సంసారభార హతులు
రిప్లయితొలగించండిహీన క్షణమున దలతురజ్ఞానమునను
ప్రాణములు వీడ కష్టమ్ము బాయు నంచు
సౌఖ్యముల్ దక్కుఁ గద యమసదనమందు
తే.గీ:సకలభయదుడౌ యమరాజు స్వాగత మిడి
రిప్లయితొలగించండిబాల నచికేతు నకును తత్త్వమ్ము దెలిపె
సాధకులకు,బాలురకు, నిష్కల్మషులకు
సౌఖ్యముల్ దక్కుఁ గద యమసదనమందు”
శా:సౌఖ్య మ్మొందెడు నట్లు గన్ పడు సదా సంసారి సొమ్ముండినన్,
రిప్లయితొలగించండిప్రాఖ్యన్ బొందుచు నాలి లేని యతి నిత్యానందు డై కన్ బడున్
సఖ్యంబున్ బొనరించి యిర్వురను "సంసారమ్మొ,సన్యాసమో
సౌఖ్యస్థావరమే"దనన్ ? నరకమే సంసారికిన్ యోగికిన్”
(సంసారి యింత డబ్బున్న వాడైతే సుఖం గా ఉన్నట్టు కనిపిస్తాడు.సన్యాసి కూడా నిత్యం ఆనందం గా ఉన్నట్టే కనిపిస్తాడు. ఆ ఇద్దరితో స్నేహం చేసి "సంసారం సుఖమా?సన్యాసం సుఖమా"అని అడిగితే ఆ ప్రశ్నే ఇద్దరికీ నరకం గా కనిపిస్తుంది.)
కన్నవారిని సతతముగౌరవించి
రిప్లయితొలగించండిచదువు నేర్పిన గురువులు సత్కరించ
సౌఖ్యముల్ దక్కుగద!యమ సదనమందు
కాని పనులను చేసిన కలుగు శిక్ష
పుణ్య కర్మలు సేసెడు పూరుషునకు
రిప్లయితొలగించండిసౌఖ్యముల్ దక్కుఁ గద, యమసదనమందు
పాపు లందరిలెక్కలు పరిగణించి
తగిన శిక్షను నిత్తురు ధర్ము భటులు
అత్త వారి వేశ్మం బని యాస పడకు
రిప్లయితొలగించండిమర్థ మట నిష్ప్రయోజన మగును జుమ్ము
సంకటములు దుర్భరములు సంక్షయ మయి
సౌఖ్యముల్ దక్కుఁ గద యమ సదన మందు
ఆఖ్యాతమ్ములఁ దెల్ల మెల్లరి కసంఖ్యాకమ్ములం జూడఁగా
సఖ్యం బెంచుట చెల్ల నేర దన నిస్సందేహ వాక్యమ్ములే
విఖ్యాతాఘ నికాయ వర్తనులకున్ విశ్వమ్ములో దుర్భ రా
సౌఖ్యస్థావర మే దనన్ నరకమే సంసారికిన్ యోగికిన్
సౌఖ్యస్థావరమేదనన్ నరకమే సంసారికిన్ యోగికిన్
రిప్లయితొలగించండిసౌఖ్యంబబ్బును జీవికిచ్చట సుమీసంసార బంధంబునన్
ముఖ్యంగాశివ పూజనంబును గడున్ మోదంబు నుప్పొంగగా
విఖ్యాతంబగు మోక్షమబ్బును గదావేయేల నిక్కచ్చిగా
సౌఖ్యంబన్ననిదే యనంగ ఋజువీ సంసారమున్ లేదు ప్రా
రిప్లయితొలగించండిముఖ్యంబైనది దక్క సంతసమునౌ పూనించు నన్యంబుకై
వ్యాఖ్యానంబులునిట్లునుండె గద వ్యాపారాశకిన్ దూరమౌ
సౌఖ్యస్థావరమేదనన్ నరకమౌ సంసారికిన్ యోగికిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
తల్లిదండ్రుల పూజ సతమొనరించి
పరుల కుపకారమున్ జేయు వారికెపుడు
సౌఖ్యముల్ దక్కుఁ గద; యమ సదనమందు
కర్మ ననుసరించి పడును కఠిన శిక్ష.