25, మే 2024, శనివారం

సమస్య - 4774

26-5-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవధానముఁ జేయువార లల్పులె సుమ్మీ”
(లేదా...)
“అవధానంబులఁ జేయువార లనఁగా నల్పుల్ గదా యెంచినన్”

25 కామెంట్‌లు:

  1. కవియన్పృచ్ఛకసార్వభౌములకటాఖడ్గంబులౌప్రశ్నలన్
    సవతుల్గాగనుచావగొట్టుదురయోసాధింపుమేథావులై
    శివుడే వచ్చిన సంయమంబుగనరేఛీత్కారమేదక్కులే
    అవథానంబునుజేషువారలనగానల్పుల్గదాయెంచినన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    అవగుణుఁడగు రావణునిన్
    డవగుణుఁడగు రాజరాజు నంగనల పరా
    భవమొనరచ దెగడుదురన
    నవధానముఁ జేయువార, లల్పులె సుమ్మీ!

    మత్తేభవిక్రీడితము
    అవనీజాతను సీతనున్ గొనిన లంకాధీశుఁడున్, యజ్ఞ సం
    భవయౌ ద్రౌపది వల్వలూడ్చి సభలో బాధింప దుర్యోధనుం
    డవలోకింపగ నిందలాడి గవులై యాక్షేపణన్ దుష్టులం
    చవధానంబులఁ జేయువార లనఁగా, నల్పుల్ గదా యెంచినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. సవరించిన కందం:

      కందం
      అవగుణుఁడగు రావణ దొర
      యవగుణుఁడగు రాజరాజు నంగనల పరా
      భవమొనరచఁ దెగడుదురన
      నవధానముఁ జేయువార, లల్పులె సుమ్మీ!

      తొలగించండి
  3. ప్రవచనమీయగలేరుగ
    చెవులకుసొంపుగవినబడజేయనప్రజలున్
    కవియైమేథకుపదునిడ
    అవథానముజేయువారలల్పులెసుమ్మీ

    రిప్లయితొలగించండి
  4. కవికిన్ గౌరవమబ్బు కావ్యంబులుఁ బ్రఖ్యాతంబులై నిల్చినన్
    అవధానంబులఁజేయు నేర్పరులు కావ్యారాటముం లేకనే
    కవులై కీర్తిని దేలు గానెపుడు సత్కావ్యమ్ము సృష్టించలే
    రవధానంబులఁ జేయువారలనఁగా నల్పులుగదా యెంచినన్

    రిప్లయితొలగించండి

  5. వివరించి చెప్పుచుంటిని
    కవనమ్మును చెప్పునట్టి కవులను గనగా
    నవఘళమైనను ధృతితో
    నవధానముఁ జేయువార లల్పులె సుమ్మీ


    వివరింపన్ గలవాడ మీకిచట ప్రావీణ్యంబుతో మేటిగా
    కవనమ్ముల్ వడిగాను చెప్పి పలు సత్కావ్య మ్ములన్ వ్రాసెడిన్
    కవులన్ గాంచగ పెక్కురున్న నిల బింకమ్మందటన్ నిల్చి తా
    నవధానంబులఁ జేయువార లనఁగా నల్పుల్ గదా యెంచినన్.

    *(ఇచట అల్పులంటే తక్కువ సంఖ్యలో గలరని)*

    రిప్లయితొలగించండి
  6. అవధాన మందు ధారణ
    స్థవనీయంబైనయట్టి సక్రియ సుమ్మీ
    కవులందదిలేకను మరి
    యవథానముజేయువారలల్పులెసుమ్మీ

    రిప్లయితొలగించండి
  7. కం॥ నవకము భాషా పటిమయు
    నవిరళ కృషి యవసరమగు నవధానముకై
    యవ హేళన కూడదిటుల
    “నవధానముఁ జేయు వారలల్పులె సుమ్మీ”

    మ॥ నవకంబున్ గని బాషయందు తన ప్రాణంబున్ బ్రతిష్ఠించుచున్
    గవితా రీతుల నభ్యసించి తగు సంస్కారమ్ము నైపుణ్యమున్
    రవమున్ గాంచి వధానమున్ గనఁగ నేరంబిట్లు వాచించఁగా
    “నవధానంబులఁ జేయువారలనఁగా నల్పుల్ గదా యెంచినన్”

    రిప్లయితొలగించండి
  8. నవ యుపకరణము లందున
    నెవరేమడిగినను గూడ నింగము తోడన్
    వివరించెడి బిసల యెదుట
    నవధానముఁ జేయువార లల్పులె సుమ్మీ

    రిప్లయితొలగించండి
  9. సువిశాలదేశమందున
    నవధానముఁ జేయువార లగణితులగునా
    వివరంబుల సంఖ్యనుగన
    నవధానముఁ జేయువార లల్పులె సుమ్మీ

    సువిశాలంబగు దేశమే మనదిగా సూత్థానులౌ ప్రాజ్ఞులున్
    యవధానుల్ గణనీయులే కనుగొనన్నవ్వారి సంఖ్యెంతయో?
    'అవధానంబులఁ జేయువారి వివరాలాసాంతమున్ జూడగా
    నవధానంబులఁ జేయువార లనఁగా నల్పుల్ గదా యెంచినన్'

    రిప్లయితొలగించండి
  10. జవమున పద్యము లల్లుచు
    ప్రవిమల ప్రజ్ఞా నిధులు గ ప్రభ వించి రి గా
    యవి వే కు లందు రి ట్టు ల
    యవ ధానము జేయు వారల ల్పు లె సుమ్మీ "

    రిప్లయితొలగించండి
  11. కవనపు మధురిమలెఱుగని
    స్తవనీయపు మాతృభాష సౌరెఱుగని ఈ
    నవతరము దృక్పథమ్మున
    అవధానముఁ జేయువార లల్పులె సుమ్మీ

    రిప్లయితొలగించండి
  12. వ్యవధానమేమి గోరక
    యవధాన మొనర్చుటన్న నలఁతి విషయమా
    యవధానమెయొక జన్నం
    బవధానముఁ జేయువార లల్పులె సుమ్మీ?

    రిప్లయితొలగించండి
  13. వ్యవధానంబొక సుంతయేని గొనకన్ వైళమ్ముగా పృచ్ఛకుల్
    స్థవనీయంబగు రీతి నస్త్రములుగా సంధించుచున్ ప్రశ్నలన్
    యవధానిన్ యిరుకాటమందు బడవేయంజూడ వాంఛింతురే
    యవధానంబులఁ జేయువార లనఁగా నల్పుల్ గదా యెంచినన్!

    రిప్లయితొలగించండి
  14. జవమగువాక్శుద్ధిమరియు
    కవనంబునపటిమలేక‌ కవినేననుచున్‌
    అవగాహన లేకుండగ‌
    అవధానముఁ జేయువార‌ లల్పులె‌ సుమ్మీ‌.

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. మ:భవనిర్మూలక మైన జ్ఞాన మిడ, కో బ్రాహ్మీ ననున్ కీర్తి తో
    నవధానమ్ముల యందె యుంచితివి యీ ఆనందమే చాలునే
    రవికిన్!జ్ఞానసరస్వతీ !తుదకు గోరన్ లేకయే ముక్తి యీ
    అవధానంబులఁ జేయువార లనఁగా నల్పుల్ గదా యెంచినన్”
    (అమ్మా!నువ్వు అవధాన సరస్వతివి మాత్రమే కాదు.జ్ఞానసరస్వతివి కూడా!నువ్వు అవధానం మాత్రమే ఇచ్చి ముక్తి జ్ఞానాన్ని ఇవ్వలేదు.రవి నైన నాకు ఆ అవధాన జ్ఞానమే చాలునా? చివరికి కోరుకో దగిన ఆ జ్ఞానాన్ని కోరక అవధానాన్నే కోరుకుంటే అల్పత్వమే కదా!)

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. అవధానమనగ నొకకళ
    యవధానముఁజేయుటనిన యాషామాషా?
    యవహేళనయా యిటులన
    అవధానముఁ జేయువార లల్పులె సుమ్మీ

    రిప్లయితొలగించండి
  19. 1)కం:కవి నని, ముదిమిని పరత
    త్త్వవిచారణ మింత లేక పండిత యశమే
    యవసర మని, యహమునకై
    అవధానముఁ జేయువార లల్పులె సుమ్మీ”
    (శంకరుల భజగోవింద శ్లోకాలలో 80 సం:వృద్ధుడు భగవంతుని తలుచుకోక డుగ్కృణ్ కరణం బట్టీ వేస్తుంటే చేసిన హితబోధ ఇలాంటిదే. )

    రిప్లయితొలగించండి
  20. అవధానంబులఁ జేయువార లనఁగా నల్పుల్ గదా యెంచినన్
    గవనంబొప్పుగఁ వ్రాయువారలిల వాక్యార్ధంబుఁజెప్పంగనౌ?
    నవహేళాయుత వాక్యమై దనరె యార్యా యాలకించంగదే
    యవధానంబది ధారణాయుతము నైయాహ్లాదమొందించుగా

    రిప్లయితొలగించండి
  21. కవనం బల్లుట యందిం
    త వివేకము లేక యున్న ధారణ మనఁగా
    నవగాహన హీన మయిన
    నవధానముఁ జేయు వార లల్పులె సుమ్మీ


    అవిచారంబున నుండు మింపుగను గోపావేశముల్ వీడుమా
    కవనం బల్లెడు వార లెల్లరును నిక్కం బెంచఁ గా లేరు లే
    యవధానుల్ మఱి గాని వా రెదలం నిత్యం బెంతు రిబ్భంగినే
    యవధానంబులఁ జేయు వార లనఁగా నల్పుల్ గదా యెంచినన్

    రిప్లయితొలగించండి

  22. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    అవిరళమగు కవితలతో
    కవనము నందారితేరు కవులను పోల్చన్
    అవలీలగ ధారణతో
    నవధానముఁ జేయువార లల్పులె సుమ్మీ!

    రిప్లయితొలగించండి