1, జూన్ 2024, శనివారం

సమస్య - 4780

2-6-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కృష్ణుఁడె బెండ్లాడెను గద కృష్ణనుఁ బ్రేమన్”
(లేదా...)
“కృష్ణుఁడె పెండ్లియాడెఁ గద కృష్ణనుఁ బాండవపక్షపాతియై”
(అక్కెర కరుణాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

20 కామెంట్‌లు:

  1. కందం
    కృష్ణ యనఁగ ద్రౌపదియగు
    జిష్ణునకున్ జోడగుననఁ, జేప కల మరన్
    దృష్ణన్ గొట్టి యభయమిడ
    కృష్ణుఁడె, బెండ్లాడెను గద కృష్ణనుఁ బ్రేమన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      కృష్ణయనంగ ద్రౌపదియుఁ గృష్ణుడనంగనరుండు పార్థుడన్
      జిష్ణునకీడుజోడనుచు శ్రీకరుఁడా మధుసూధనుండనన్
      దృష్ణగ నా స్వయంవరము దిట్టగ గెల్చియు, శౌరి నిల్వఁగన్
      కృష్ణుఁడె పెండ్లియాడెఁ గద కృష్ణనుఁ, బాండవపక్షపాతియై

      తొలగించండి
  2. కృష్ణసఖుడు విలు విద్యా
    నిష్ణాతుడతండు భీముని సహోదరుడౌ
    జిష్ణుడు కుంతి కనిష్ఠుడు
    కృష్ణుఁడె బెండ్లాడెను గద కృష్ణనుఁ బ్రేమన్.

    రిప్లయితొలగించండి
  3. విష్ణువులక్ష్మినిరుక్మిణి
    కృష్ణుడుపెండ్లాడెనుగద, కృష్ణనుప్రేమన్
    జిష్ణువుపార్థుడుతానుస
    హిష్ణువునయ్యెనునలుగురుహేయనజనులున్

    రిప్లయితొలగించండి
  4. విష్ణువుతానెగాగసిరివేషముదాల్చినరుక్మిణీసతిన్
    కృష్ణుడుపెండ్లియాడెగద, కృష్ణనుపాండవపక్షపాతియై
    విష్ణునిమాయతోసభనువేదననందినరక్ష్ణజేసెతా
    జిష్ణువునయ్యెగాజగతిచిత్రముజూపుచులోకబంధువై

    రిప్లయితొలగించండి
  5. కం॥ తృష్ణను రుక్మిణి యడుగఁగఁ
    గృష్ణుఁడె బెండ్లాడెను గద, కృష్ణనుఁ బ్రేమన్
    జిష్ణుఁడు వలచి మురిసిన స
    హిష్ణుండుగఁ దల్లి మాట హితమనిఁ దాల్చెన్

    ఉ॥ కృష్ణుని ప్రేమ తాపమున కేళిగఁ గోరఁగ సత్యభామయే
    కృష్ణుఁడె పెండ్లియాడెఁ గద, కృష్ణనుఁ బాండవ పక్షపాతియై
    కృష్ణుఁడు ప్రోచుచుండెఁ గద కీడునుఁ ద్రుంచుచుఁ గూర్మిఁ గాంచి రో
    చిష్ణు సదా కృపన్ జనుచు శీఘ్రము సోదరి యన్న భావనన్

    జిష్ణుడు అర్జునుడు రోచిష్ణు ప్రకాశించువాడు సహిష్ణుడు సహనశీలి (నిఘంటువు సహాయమండి)

    రిప్లయితొలగించండి
  6. తృష్ణ గొని విదర్భజనే
    కృష్ణుఁడె బెండ్లాడెను గద ; కృష్ణనుఁ బ్రేమన్
    జిష్ణుడు పెండ్లా డెనుగద
    వృష్ణిని నుండి తగు తోడు వెలసిన వేళన్

    రిప్లయితొలగించండి
  7. వృష్ణి సుతుండు వక్త్రజుని వేషమునన్ జని సవ్యసాచి యా
    జిష్ణువు శ్వేతవాహనుడు చెన్నగు రూపము గల్గినట్టియా
    కృష్ణసఖుండతండనగ క్రీడియె గూల్చుచు మత్వ్య యంత్రమున్
    కృష్ణుఁడె పెండ్లియాడెఁ గద కృష్ణనుఁ, బాండవపక్షపాతియై.

    రిప్లయితొలగించండి
  8. కృష్ణుడు నందుని సుతుడే
    కృష్ణుడనగ సవ్యసాచి కృష్ణుని సఖుడే
    కృష్ణ సఖుడు కపిరథుడౌ
    కృష్ణుఁడె బెండ్లాడెను గద కృష్ణనుఁ బ్రేమన్

    కృష్ణుడు దేవకీసుతుడు క్షేత్రజుడేగద నందునింటిలో
    కృష్ణుని కాప్తుడై తనరు కృష్ణుని మిత్రుడు సవ్యసాచియౌ
    కృష్ణుఁడె పెండ్లియాడెఁ గద కృష్ణనుఁ; బాండవపక్షపాతియై
    కృష్ణుడు నిల్చినాడు జయకేతనమందగ పాండవాళికిన్

    రిప్లయితొలగించండి
  9. కం:విష్ణుని యవతారమ్మౌ
    కృష్ణుని యాశీస్సు లొందె క్రీడి ,సుగుణ రో
    చిష్ణుండై,ముద మొందగ
    కృష్ణుఁడె, బెండ్లాడెను గద కృష్ణనుఁ బ్రేమన్”
    (కృష్ణుడు సంతోషించే టట్లు కృష్ణను అనగా ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు.)

    రిప్లయితొలగించండి
  10. ఉ:విష్ణువు నల్లనయ్యగ భువిన్ బ్రభవించెను,గోపికాళికిన్
    గృష్ణుడె యీ ప్రపంచ మన తృష్ణను దీర్చెను, నీల మెచ్చగన్
    కృష్ణుఁడె పెండ్లియాడెఁ గద కృష్ణనుఁ, బాండవపక్షపాతియై
    కృష్ణను గాచె దుష్టనృపకృత్యములన్నిటి వమ్ము జేయుచున్.
    (నల్లని విష్ణువు నల్లనయ్య ఐన కృష్ణుడు గా అవతరించాడు.గోపికలకి ఆయనే ప్రపంచం. నీల అనే ఆమెని వివాహ మాడాడు.ఆమె కూడా కృష్ణ యే.సభలో కృష్ణ ఐన ద్రౌపదిని రక్షించాడు.)

    రిప్లయితొలగించండి
  11. కృష్ణుని కోరఁగ రుక్మిణి
    కృష్ణుఁడె బెండ్లాడెను గద, కృష్ణనుఁ బ్రేమన్
    తృష్ణను యడుగగ కుంతియె
    జిష్ణుఁడు సోదరులగూడి చేకొనె సతిగన్

    రిప్లయితొలగించండి
  12. కృష్ణడు రుక్మిణి ని సతి గ
    కృష్ణుడు బెండ్లడెను గద :: కృష్ణను బ్రేమన్
    కృష్ణుని మిత్రుడు క్రీడి యె
    నిష్ణా తుండ గుచు గెలిచి నిలిచెను సభ లోన్

    రిప్లయితొలగించండి
  13. విష్ణుని రుక్మిణీ సతియె వేడఁగ ద్వాపరమందు భర్తగా
    కృష్ణుఁడె పెండ్లియాడెఁ గద, కృష్ణనుఁ బాండవ పక్షపాతియై
    కృష్ణుఁడు రక్షజేయ గమకించి యొసంగె ననేక చేలముల్
    జిష్ణుని తోడుగా నిలచి సిద్ధియొసంగెను యుద్ధమందునన్

    రిప్లయితొలగించండి
  14. జిష్ణు సహిష్ణు పరమ రో
    చిష్ణున్ వర్ధిష్నుఁ గృష్ణుఁ జిత్తం బందున్
    విష్ణుని సద్భక్తి నిలిపి
    కృష్ణుఁడె బెండ్లాడెను గద కృష్ణనుఁ బ్రేమన్


    జిష్ణుఁ డనంగ వర్ధిలుచుఁ జేవ జయింపఁగ మత్స్య యంత్రముం
    గృష్ణుఁడు సమ్మతింపఁ బరికించి యెడందను యాజ్ఞసేనినిం
    గృష్ణుఁ డొసంగ దీవనలు కృత్స్నము సోదర సంయుతమ్ముగాఁ
    గృష్ణుఁడె పెండ్లియాడెఁ గద కృష్ణనుఁ బాండవ పక్షపాతియై

    రిప్లయితొలగించండి
  15. తృష్ణగ వేచిన నీలను
    *“కృష్ణుఁడె బెండ్లాడెను గద కృష్ణనుఁ బ్రేమన్”
    జిష్ణుడె వివాహమాడెను
    కృష్ణుని దయతోడ తాను గెలిచెను పోరున్

    రిప్లయితొలగించండి
  16. కృష్ణుండనగను బార్ధుఁడు
    కృష్ణయె ద్రౌపదియగుటను గృష్ణుఁడె పతియౌ
    కృష్ణయువలపును జెందగ
    కృష్ణుఁడె బెండ్లాడెను గద కృష్ణనుఁ బ్రేమన్

    రిప్లయితొలగించండి
  17. కృష్ణుఁడె పార్ధుఁడౌట,సతి కృష్ణయు సంతస మొంద మిక్కిలిన్
    కృష్ణుఁడె పెండ్లియాడెఁ గద కృష్ణనుఁ బాండవపక్షపాతియై
    కృష్ణను నామకంబునను గృష్ణలు నొక్కటి యైరి పేర్మితో
    గృష్ణుని నామమెప్పుడును గేళిని సైతము నుచ్చరించనౌ

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    కృష్ణుని కోరగ రుక్మిణి
    కృష్ణుడె బెండ్లాడె గద; కృష్ణను బ్రేమన్
    కృష్ణుడె కాపాడె సభను
    కృష్ణా! యని పిలిచినంత కృపచూపి వడిన్.

    రిప్లయితొలగించండి