26, జూన్ 2024, బుధవారం

సమస్య - 4803

27-6-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వెన్నెలం గ్రుమ్మరించె వేవెలుఁగులదొర”
(లేదా...)
“వెన్నెలఁ గ్రుమ్మరించెఁ గడుఁ బ్రేమను సూర్యుఁడు గ్రీష్మమందునన్”
(ఆరవల్లి శ్రీదేవి గారికి ధన్యవాదాలతో...)

23 కామెంట్‌లు:

  1. తేటగీతి
    కళ్లు తెరువగ లేనంతఁ గ్రమ్మె వెలుగు
    బయట పనిఁజేయఁగా నిష్టపడక మనము
    చలువటద్దాలు ధరియింప, చల్లనైన
    వెన్నెలం గ్రుమ్మరించె వేవెలుఁగులదొర!

    ఉత్పలమాల
    కన్నులు విప్పి చూచుటకుఁ గాదన శక్యమునెండకాలమై
    తిన్నగ బైటకేగుటకు తిప్పలు దప్పక కావు కార్యముల్
    మొన్ననె కళ్లజోడొకటి మోమునదాల్చగ చల్వటద్దమై
    వెన్నెలఁ గ్రుమ్మరించెఁ గడుఁ బ్రేమను సూర్యుఁడు గ్రీష్మమందునన్!

    రిప్లయితొలగించండి
  2. సన్నిధి చేరిన తల్లిని
    మన్నన జేసెనుకొడుకుగమైకొనిప్రేమన్
    ఎన్నినశపథముకర్ణుడు
    వెన్నెలంగ్రుమ్మరించెవేవెలుగులదొర

    రిప్లయితొలగించండి

  3. భీష్ముని రణ కౌశలమున భీతి జెంది
    ధర్మజుండాతనిన్ గెల్చు దారినడుగ
    చేయను శిఖండి థేరుపై చెలగననియు
    వెన్నెలం గ్రుమ్మరించె వేవెలుఁగులదొర!

    రిప్లయితొలగించండి
  4. పౌర్ణమీదినముననెల పక్షధరుడు
    వెన్నెలంగ్రుమ్మరించె వేవెలుగుల దొర
    పంచు కాంతినిజగతికి. పగటి వేళ
    లాచరించగ కార్యము లనువు గాను

    రిప్లయితొలగించండి

  5. చలువ మిన్న స్వయం ప్రకాశకుడు కాద
    టంచు భానుండు తనకాంతి నతని ద్వార
    రాత్రి వేళలందున కడు రమ్యమైన
    వెన్నెలం గ్రుమ్మరించె వేవెలుఁగులదొర.


    సన్నిహితుండ్రు వారనుచు శాంతిని గూర్చగ
    రాయబారిగా
    కన్నడు వచ్చి యాసభను కాంచగ లేడని యంబికేయుకున్
    కన్నులనిచ్చినట్టితరి కౌతుక మందున పల్కెనిట్టులన్
    వెన్నెలఁ గ్రుమ్మరించెఁ గడుఁ బ్రేమను సూర్యుఁడు గ్రీష్మమందునన్.

    రిప్లయితొలగించండి
  6. వెన్నెల రేయి కాదు నడి వేసవి కాలఁపు యుద్దినమ్మునన్
    మిన్నునఁ గ్రమ్మె సాంద్రమగు మేఘచయమ్ములు వింతగొల్పుచున్
    మిన్నగ వాన రాదొడఁగె, మేఘము మాటున దీప్తి క్రుంగిలన్
    వెన్నెలఁ గ్రుమ్మరించెఁ గడుఁ బ్రేమను సూర్యుఁడు గ్రీష్మమందునన్

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. తే॥ శశధరుఁడు శరత్కాలపు క్షాణియందు
      జలధర రహిత నభమున వెలసి చనుచు
      వెన్నెలం గ్రుమ్మరించె, వేవెలుగులదొర
      పశ్చిమమ్మునఁ గ్రుంగఁగఁ బ్రభలఁ జిమ్మి

      ఉ॥ కన్నుల విందుఁ జేయుచును గాంతుఁడు పౌర్ణిమ రాత్రులన్ గనన్
      మిన్నగ నంతరిక్షమున మేటి ప్రకాశము నొంది చల్లగా
      వెన్నెలఁ గ్రుమ్మరించెఁ గడుఁ బ్రేమను, సూర్యుఁడు గ్రీష్మమందునన్
      దన్నుగ తాపమొందుచును ధాత్రిని వేడిమిఁ బెంచునుగ్రుఁడై

      సముద్రము మధ్యన పున్నమి రాత్రులు మరీ అద్భుతమండి

      తొలగించండి
    2. మరొక పూరణ అండి

      ఉ॥ మొన్నను బెంగుళూరునను మోడము గ్రమ్మఁగ సంధ్యవేళలోఁ
      దిన్నగఁ చల్లగాలులును దీరుగ వీచను మెల్లమెల్లఁగన్
      మన్నన సేయ వర్షమును మబ్బుల చాటున తొంగిచూచుచున్
      వెన్నెలఁ గ్రుమ్మరించెఁ గడుఁ బ్రేమను సూర్యుఁడు గ్రీష్మమందునన్

      (సామాన్యంగా ఏప్రిల్ మాసము 10-15 పిదప ప్రతి రెండో దినము ఇలా జరగాలండి. వాతావరణ మార్పులవలన ఇప్పుడు లయ తప్పిందండి)

      నేను వ్రాసిన వాటిలో తప్పులు కనపడిన తెలిపినచో తిద్దుకుంటానండి. ధన్యవాదములు
      రామబ్రహ్మం బెంగుళూరు

      తొలగించండి
  8. చందమామ పున్నమి రేయి జగతిపైన
    వెన్నెలం గ్రుమ్మరించె ; వేవెలుఁగులదొర
    వేసవి దినముల నతిగ వేడిమినిడి
    అన్నెముగ జనుల సుఖమునపహరిఃచె

    రిప్లయితొలగించండి
  9. మండు వేసవి దినమునందంబరమున
    మెండుగా క్రమ్మె నింగిలో మేఘచయము
    మబ్బుమాటున దీప్తులు మసకబారి
    వెన్నెలం గ్రుమ్మరించె వేవెలుఁగులదొర

    రిప్లయితొలగించండి
  10. పగటిఱేడు తన వెలుగు పంచి నపుడు
    వేవెలుంగుల దొరజోడు వెలుగునిచ్చు
    కాంతి మూలము కాదొకో కలువగొంగ
    వెన్నెలం గ్రుమ్మరించె వేవెలుఁగులదొర

    వెన్నెలఱేడు వెల్గుగద వేవెలుగే తన కాంతి నీయగా
    కన్నులముందు వెన్నెలన కాంతుని చేరిన సూర్యరశ్మియే
    వెన్నెల రాత్రులే మనకు వేసవి నందున హాయి గూర్చుగా
    వెన్నెలఁ గ్రుమ్మరించెఁ గడుఁ బ్రేమను సూర్యుఁడు గ్రీష్మమందునన్

    రిప్లయితొలగించండి
  11. చిన్నెలుచూడుమీధరనచీకటి ప్రాకునుయర్ధభాగమున్
    మిన్నునచంద్రుడాదిశనమిత్రునితేజముకారణమ్ముగా
    తెన్నులు చంద్రకాంతికిల తెచ్చును తీరుగ సూర్యుడేసదా:
    వెన్నెలఁ గ్రుమ్మరించెఁ గడుఁ బ్రేమను సూర్యుఁడు గ్రీష్మమందునన్

    రిప్లయితొలగించండి
  12. పశ్చిమ మ్మున మునిగెను భాస్కరుండు
    నభము నందున జాబిలి ప్రభ వ మంది
    వెన్నెల లం గ్రు మ్మ రించె :: వే వెలుగు దొర
    వేరు ఖండ ము నందున వెలుగు చుండె

    రిప్లయితొలగించండి
  13. ఇంద్రు రాకకుఁ గారణ మెఱుకపఱచి
    యప్రమత్తుని నొనరింప క్షిప్రముగను
    భానుజునిఁ గర్ణునిఁ గదిసి పలుకు లందు
    వెన్నెలం గ్రుమ్మరించె వే వెలుఁగుల దొర


    క్రన్నన నెంచి శోధనముఁ గాంత పఠింపగ మంత్ర రాజముం
    జెన్నుగ మారి సౌమ్యునిగ శీతల భానుఁడు నయ్యె నర్కుఁడే
    విన్నఁ దదుక్త మంత్రమును బ్రీతి నొసంగెను గుంతి దేవికిన్
    వెన్నెలఁ గ్రుమ్మరించెఁ గడుఁ బ్రేమను సూర్యుఁడు గ్రీష్మ మందునన్

    రిప్లయితొలగించండి
  14. తే.గీ:మబ్బు లేకున్న చీకటి మనకు నెచట?
    విశ్వమును నెప్పు డొక కాంతి విడువ కుండు
    వెన్నెలం గ్రుమ్మరించె వేవెలుఁగులదొర
    నిష్క్రమించగ వచ్చి వెన్నెలల దొరయు

    రిప్లయితొలగించండి
  15. 2)ఉ:మున్నెపు డిట్టి యెండలను భూమిని జూడనె లే దటంచు,నా
    పన్నత నొంది తంచు కడు బాధను బొంద శశాంకు డెంతయున్
    వెన్నెలఁ గ్రుమ్మరించెఁ గడుఁ బ్రేమను సూర్యుఁడు గ్రీష్మమందునన్
    సన్నగ పశ్చిమమ్మునకు జారిన యంత క్రమక్రమమ్ముగన్

    రిప్లయితొలగించండి
  16. (3)ఉ:ఎన్నగ శాస్త్రసత్య మిదియే కద చంద్రుడు చల్ల నయ్యయై
    యున్నను ,వెన్నెలల్ గురియుచున్నను నాత డుపగ్రహమ్మె,ఆ
    యున్నది సూర్యకాంతి యెదియో పరివర్తన జెందు జూడగా
    వెన్నెలఁ గ్రుమ్మరించెఁ గడుఁ బ్రేమను సూర్యుఁడు గ్రీష్మమందునన్”
    (చంద్రుడిది స్వయం ప్రకాశం కాదు కనుక వెన్నెల కూడా సూర్యునిదే.)

    రిప్లయితొలగించండి
  17. ఎన్నడు వీడకుండునది యింపులగత్తె సదా యభీష్టమై
    మిన్నగు నింటివానికిని మిన్నులవేల్పుకునైన నొక్కసా
    రన్నువులేగిరీ యిలకునంతట నుష్ణమడంచి నేలపై
    వెన్నెలఁ గ్రుమ్మరించెగద ప్రేమను సూర్యుడు గ్రీష్మమందునన్

    రిప్లయితొలగించండి
  18. ప్రవరుని యంద చందములు భామ
    వరూధిని గాంచి కోరె నా
    ప్రవరుని , యెంత వేడినను పారుడు
    లొంగక పోయెనంతటా
    వ్యవధిని గాంచు వాడొకడు వచ్చెను
    మాయపు వేషధారియౌ
    ప్రవరుడు వీడకుండనల భామిని
    కోర్కెల దీర్చె బ్రీతితో



    రిప్లయితొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    శశధరుండు స్వయంప్రకాశకుడు కాదు
    భాస్కరుడు తన కాంతిని ప్రస్తరించి
    చందురుని ద్వార రాతిరి సమయమందు
    వెన్నెలం గ్రుమ్మరించె వేవెలుగుల దొర.

    రిప్లయితొలగించండి