29, జూన్ 2024, శనివారం

సమస్య - 4806

30-6-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అమృత మసురులకుం బంచె నచ్యుతుండు”
(లేదా...)
“అమృతముఁ బంచి విష్ణు వసురావళిఁ బ్రోచెఁ జిరాయువిచ్చియున్”
(కటకం వెంకటరామ శర్మ గారికి ధన్యవాదాలతో...)

22 కామెంట్‌లు:

  1. అభ్యుదయమునుగోరుచు నవనియందు
    పద్యమాయుధమైయుండపరమయోగి
    వేమనార్యుడుపోరాడివెలికిఁదీసి
    నమృతమసురులకుబంచెనచ్యుతుండు

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    కోరినట్టి ఫలమొసంగి కూర్మమౌచు
    మురిసి వేల్పుల పక్షమై మోహినియన,
    నర్హతలనెంచి నటియుంచి యందకుండ
    నమృత మసురులకుం, బంచె నచ్యుతుండు

    [అలవాటు గా వ్రాసుకుని చివరి సమస్యా పాదాన్ని సవరించి చేసుకున్న పూరణ:
    కందం
    సుమనస్కులు దేవతలని
    సమయస్ఫూర్తిని నటించి సమ్మోహినిగన్
    గుమతులనుచుఁ గరమొగ్గక
    యమృతము నసురులకు, బంచె నచ్యుతుఁడకటా!]

    చంపకమాల
    సుమనస వందితుల్ సురలు శుద్ధముగా సుధకర్హులన్ మదిన్
    గమకము లొల్కి మోహినిగఁ గంజమునెల్లరు వేల్పులంద, మో
    హమున నటించుచున్ మురియ నందము మెచ్చగ 'ముంచి' జూపులం
    దమృతముఁ బంచి 'విష్ణు వసురావళిఁ!', బ్రోచెఁ జిరాయువిచ్చియున్!

    రిప్లయితొలగించండి
  3. పాలకడలి మథనమున బడసినట్టి
    యమృత మసురులకుం బంచె నచ్యుతుండు
    కేవలమచట గల రాహుకేతువులను
    జంట.కు , పిదప వారిని జంపె చక్రి

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. తే॥ సురల నమరులఁ జేయంగ సరిసిజాక్షుఁ
      డమృతమును బంచె నసురలకమృత మెపుడు
      పంచెఁ ద్రావిన మనుజుఁడు పలికె నేమొ
      యమృతమసురలకుం బంచె నచ్యుతుండు

      చం॥ అమరులఁ జేయ దేవతల నచ్యుతుఁ డావిధిఁ బంచెఁ దెల్పఁగా
      నమృతము రాహుకేతువుల నాతఁడు త్రుంచుచుఁ ద్రావ వారలే
      యమృతము దృష్టిఁ గ్రమ్మఱచి హాస్యపు పల్కులు గాద పల్కగా
      నమృతముఁ బంచి విష్ణు వసురావళిఁ బ్రోచెఁ జిరాయు విచ్చియున్

      క్రమ్మఱచు మరల్చు నిఘంటువు సహాయమండి

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  5. దానవులకమృతమ్మది దక్కకూడ
    దనుచు మోహినిగాను తా నవతరించి
    నాట్యభంగిమలందు నానందమనెడి
    యమృత మసురులకుం బంచె నచ్యుతుండు.


    కుమతులు దానవుల్ మిగుల క్రూరులు వారలధర్మ వర్తనులీ
    యమృతము గ్రోలినన్ జగమునంతము చేతురటంచు నెంచుచున్
    బ్రమదగ రూపుదాల్చెనిది వాస్తవ మిట్లు వచింప న్యాయమే?
    అమృతముఁ బంచి విష్ణు వసురావళిఁ బ్రోచెఁ ? జిరాయువిచ్చియున్.

    రిప్లయితొలగించండి
  6. దేవదానవు లొక్కటై తేజరిల్లి
    పాల సంద్రముఁ జిల్కిరి బాధలోర్చి
    వేల్పులకు బ్రహ్మరసమీయ విజయమొంది
    యమృత మసురులకుం బంచె నచ్యుతుండు

    [అమృతము = అయాచితవస్తువు]


    అమృతము మానుషాదులకు హస్తగతంబయి నంత వేగమున్
    సమయము మీరకుండ బహు చక్కనియోచన ప్రోదిగా రమా
    రమణుడు మారి మోహినిగ లక్ష్యమునందెను వేల్పుకోటికే
    అమృతముఁ బంచి, విష్ణు వసురావళిఁ బ్రోచెఁ, జిరాయువిచ్చియున్

    రిప్లయితొలగించండి
  7. అమరులు ద్వారపాలకులు నాజయడున్ విజయుండు శాపమొం
    ది మురహరుణ్ణి వీడవెనుదీయుచుఁ గోరిజనించె దైత్యులై
    సమసిరి దక్కె నచ్యుతుని సన్నిధినావిధి వైరి భక్తిఁ బో
    లమృతముఁ పంచి విష్ణువసురావళఁ బ్రోచె జిరాయువిచ్చియున్

    రిప్లయితొలగించండి
  8. నీరజాక్షుఁడు రక్షింప నిర్జరులను
    మోహినీ వేషము వహించి మోహ పఱచి
    మిక్కలి తన రూపమ్మున దక్క కుండ
    నమృత మసురులకుం బంచె నచ్యుతుండు


    అమరులు వేఁడఁ గావఁ బరమాత్ముఁ డుపాయము చేత నింపుగా
    సముచిత ధర్మ రక్షణము సల్పఁగ నెంచి యెడంద మోహినీ
    రమణిగ వేష మూని యసురప్రవరాలి విమోహ మందఁగా
    నమృతముఁ బంచి విష్ణువ సురావళిఁ బ్రోచెఁ జిరాయు విచ్చియున్

    రిప్లయితొలగించండి
  9. సుధను సాధించి రసురులు సురల గుడి
    కాని మోహిని రూపాన కపటు డగుచు
    దైత్యు లను మోస గించెను దాను గాదె
    యమృతమసురుల కుం బంచె నచ్యుతుండు

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:అసురశిక్షణార్థమ్ము బ్రహ్లాదునిన్ వి
    భీషణున్ రాక్షసుల లోన వెలయ జేసె
    పరుల శిక్షింపగా విష్ణుభక్తి యనెడు
    నమృత మసురులకుం బంచె నచ్యుతుండు”

    రిప్లయితొలగించండి
  11. చం:సమముగ దుష్టశిక్షణము, సాధుజనావన దాల్చు, జాతిభే
    దము గమనింప డచ్యుతుడు!దానవు లౌ బలినిన్,విభీషణున్,
    సమతవహించి బ్రోచియును, జన్మము మృత్యువు లేని యట్టి ము
    క్త్యమృతముఁ బంచి విష్ణు వసురావళిఁ బ్రోచెఁ జిరాయువిచ్చియున్”

    రిప్లయితొలగించండి
  12. తే.గీ.||
    మోహినిగ రూపుదాలిచి మోహరముగ
    హరియె కులుకుచు బంచెతా నమరవరుల
    కమృత మసురులకుం బంచె నచ్యుతుండు
    తళుకుబెళుకులు పరువంపు కులుకులపుఁడు

    చంపకమాల:
    అమరులఁగూడి యాసురులు యబ్ధిజముంగొన నిచ్చగించినన్
    సమయమెరింగి కేశవుఁడు చక్కనిచుక్కగ రూపుదాల్చి తా
    నమరుల మేలుఁగోరి యసురాళి విమోహమునందు మున్గఁగా
    నమృతముఁ బంచి విష్ణువ సురావళిఁ బ్రోచెఁ జిరాయువిచ్చియున్

    రిప్లయితొలగించండి
  13. సురల రూపాన పంక్తిని గూరు చున్న
    రాహు కేతుల కయ్యెడ రహిని గొల్ప
    యమృత మసురులకుం బంచె నచ్యుతుండు
    తెలిసి యసురుల ని ,దునిమె దైవమపుడు

    రిప్లయితొలగించండి