11, జులై 2024, గురువారం

సమస్య - 4818

12-7-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“యజ్ఞమ్ములు దేశమునకు హానిం గూర్చున్”

(లేదా...)

“యజ్ఞములెల్ల దేశమున హానినిఁ గూర్చుటకోసమే కదా”

(కోటబొమ్మాళి శతావధాన సమస్య)

19 కామెంట్‌లు:

  1. కందం
    ఆజ్ఞాపించిరి దొరలని
    విజ్ఞత విడి యయినవార్కి విచ్చలవిడిగన్
    ప్రజ్ఞగనక పనులిడ జల
    యజ్ఞమ్ములు దేశమునకు హానిం గూర్చున్!

    ఉత్పలమాల
    ఆజ్ఞలొసంగఁ బాలకులు నాశ్రయమొందిన వారి శ్రేయమై
    విజ్ఞతవీడి స్వార్థమున విత్తమునొందగ లాంఛనమ్ముగన్
    ప్రజ్ఞలనెంచకుండగ జలాశయనిర్మితులప్పగించఁ దత్
    యజ్ఞములెల్ల దేశమున హానినిఁ గూర్చుటకోసమే కదా!

    రిప్లయితొలగించండి
  2. సుజ్ఞానముకలిగించును
    *“యజ్ఞమ్ములు, దేశమునకు హానిం గూర్చున్”*
    విజ్ఞత లేకయు సతతము
    నజ్ఞానముతోడపనులుననయముచేయన్

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞానులందు రివ్విధి
    యజ్ఞమ్ములు దేశమునకు హనింగూర్చున్
    సుజ్ఞాన ముని గణంబులు
    ప్రజ్ఞానులు దేశమునకు భద్రమటంచున్

    రిప్లయితొలగించండి
  4. జిజ్ఞాసువులౌ నేతలు
    యజ్ఞంబొనరింప చూచి యబ్బుర పడుమా
    విజ్ఞత పరివర్జించిన
    యజ్ఞమ్ములు దేశమునకు హానిం గూర్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞములెన్నిచేసినను యత్నము దేవుని తృప్తికోసమే
      ప్రాజ్ఞులుసల్పినారు గద ద్వాదశ యజ్ఞములన్ గతంబునన్
      విజ్ఞతలేని నాయకులు వ్రేల్చిన సొమ్మును లెక్కవెట్టగా
      యజ్ఞములెల్ల దేశమున హానినిఁ గూర్చుటకోసమే కదా

      తొలగించండి
  5. కం॥ విజ్ఞత నొందక మూర్ఖుఁడు
    ప్రజ్ఞయె కాంచక వితధముఁ బలుకఁగఁ జనునే!
    తజ్ఞుఁడుఁ బలుకునె యిటులన్
    యజ్ఞమ్ములు దేశమునకు హానిం గూర్చున్

    ఉ॥ విజ్ఞత లేక మూర్ఖుఁడటు వెఱ్ఱినిఁ బల్కఁగఁ జెల్లునే ధరన్
    బ్రజ్ఞను బొందఁ జాలకను బాలసుఁ డొక్కఁడుఁ బల్కఁ జోద్యమే!
    తజ్ఞుఁడు బుద్ధిమంతుఁడును దప్పుగఁ బల్కునె కాంచ నిట్టులన్
    యజ్ఞములెల్ల దేశమున హానినిఁ గూర్చుటకోసమే కదా

    రిప్లయితొలగించండి
  6. అజ్ఞాను లిట్లుపల్క రె
    యజ్ఞ మ్ములు దేశ మునకు హానిని గూర్చున్
    విజ్ఞత తో యో చించి న
    ప్రజ్ఞా నిధులైన మునులు పాటించిరి గా

    రిప్లయితొలగించండి
  7. యజ్ఞ విధానములందున
    ప్రాజ్ఞుడయి పరమముయొక్క పరితోషముకై
    యజ్ఞానముతో బలినిడు
    యజ్ఞమ్ములు దేశమునకు హానిం గూర్చున్

    రిప్లయితొలగించండి
  8. విజ్ఞుండగు యాజ్ఞికుఁడు ర
    సజ్ఞతగల సోమయాజి సలుపకయున్నన్
    యజ్ఞ మసంపూర్ణం బా
    యజ్ఞమ్ములు దేశమునకు హానిం గూర్చున్

    రిప్లయితొలగించండి

  9. ఆజ్ఞాపించెడి దొరలు కృ
    తజ్ఞత లేని వఠరుండ్రు ధనమును బొందన్
    విజ్ఞత విడి చేసెడి ధన
    యజ్ఞమ్ములు దేశమునకు హానిం గూర్చున్.


    తజ్ఞుడ వీవటంచు నిల ధర్మమెఱంగిన వాడవంచు నా
    విజ్ఞులు తెల్పగా విని పవిత్రము గోరగ నేగుదెంచి తిన్
    విజ్ఞతలేని మాటలవివేకుని వోలె వచింతివిట్టులన్
    యజ్ఞములెల్ల దేశమున హానినిఁ గూర్చుటకోసమే కదా
    యజ్ఞము గూర్చు మేలును విహస్తులు వాసిగ చెప్పి రెప్పుడో.

    రిప్లయితొలగించండి
  10. విజ్ఞతఁ జూపి యేలికలు పేదల యున్నతిగోరి వారికై
    ప్రాజ్ఞతతో ప్రణాళికలు ప్రాగహరమ్ముగ సంతరించుచున్
    యజ్ఞమువోలె దీక్షఁగొని యాచరణమ్మునఁ జూపకున్ననా
    యజ్ఞములెల్ల దేశమున హానినిఁ గూర్చుటకోసమే కదా

    రిప్లయితొలగించండి
  11. దక్షయజ్ఞవాటి వద్ద సతీదేవి:

    ప్రాజ్ఞులు మీరు జేరి రిట, ప్రాకటవైదికధర్మవాక్యమున్
    విజ్ఞత సుంత నేర్పక గభీరత మౌనముఁబూనిరేల? రా
    జాజ్ఞయె పాత్రమై చననె యార్షము కన్న? నిరీశ్వరమ్ములౌ
    యజ్ఞములెల్ల దేశమున హానినిఁ గూర్చుటకోసమే కదా!

    రిప్లయితొలగించండి
  12. అజ్ఞాను లిష్ట పడుదురు
    విజ్ఞులు మెచ్చ రెపు డిబ్భువిని సత్యము ధ
    ర్మజ్ఞా హింసాత్మకములు
    యజ్ఞమ్ములు దేశమునకు హానిం గూర్చున్


    ప్రాజ్ఞులు వేదపారగులు భద్రము నెంచి నిరంతరమ్ము క్షే
    త్రజ్ఞు నెఱింగి నట్టి వసు ధామరు లెల్ల రొనర్తు రిద్ధరన్
    విజ్ఞులు మెచ్చ రెవ్విధిని విప్ర వరేణ్యులు వల్క నిట్టులన్
    యజ్ఞము లెల్ల దేశమున హానినిఁ గూర్చుట కోసమే కదా

    రిప్లయితొలగించండి
  13. కం:విజ్ఞత గల శ్రోత్రియులై
    యజ్ఞవిథుల నెల్ల యెరుగు నట్టి ఘటికులే
    యజ్ఞముల కర్హు,లజ్ఞుల
    యజ్ఞమ్ములు దేశమునకు హానిం గూర్చున్”

    రిప్లయితొలగించండి
  14. ఉ:విజ్ఞత లేని నాయకులు వీడియు నీతిని,సొమ్ము గోరు దై
    వజ్ఞుల సూచనన్ బడసి, వారికి రాజ్యము నిల్చు కోర్కెతో ,
    నజ్ఞత తో ప్రజల్ తమకు నందల మీయగ జేయునట్టి యా
    యజ్ఞములెల్ల దేశమున హానినిఁ గూర్చుటకోసమే కదా”
    (ఇక్కడ దైవజ్ఞులు అంటే జ్యోతిష్యులు.వారి సలహాతో పదవి నిలుపుకోవటం కోసం నీతి లేని నాయకులు చేసే యజ్ఞాలు దేశానికి హాని చెయ్యటం కోసమే అని.)

    రిప్లయితొలగించండి
  15. ఉ:యజ్ఞము మెచ్చనట్టి యొక యాధునికుండు వచించె నిట్టులన్
    "యజ్ఞము హేతుబద్ధ మగునా?ఉపయోగము నిచ్చు నేతినిన్
    విజ్ఞత లేక నగ్గి బడవేయుట,కట్టెల గాల్చి వేయుటల్
    యజ్ఞములెల్ల దేశమున హానినిఁ గూర్చుటకోసమే కదా

    రిప్లయితొలగించండి
  16. విఙ్ఙులు సేతురు జగమున
    యఙ్ఞమ్ములు వృద్ధికొఱకు హైందవ రీతిన్
    యఙ్ఞానుల పని కతమున
    యజ్ఞమ్ములు దేశమునకు హానిం గూర్చున్”

    రిప్లయితొలగించండి
  17. యజ్ఞములెల్ల దేశమున హానినిఁ గూర్చుటకోసమే కదా
    విఙ్ఞత లేనివారిటులు పేలవ మౌనటు మాటలాడ,మా
    ప్రఙ్ఞను జుపి వారలకు మాటలు లేకను జేతుమీసుమా
    యఙ్ఞముఁజేయుకారణము హైందవ తేజము దేశ వృద్ధికే

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    విజ్ఞులు నుడివిరి మేలని
    యజ్ఞమ్ములు; దేశమునకు హానింగూర్చున్
    విజ్ఞాన లేమితో శా
    స్త్రజ్ఞులు చేయు పనులందు తకరారగుచున్.

    రిప్లయితొలగించండి