18, జులై 2024, గురువారం

సమస్య - 4825

19-7-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఆలుమగల మధ్య గొడవ లాహ్లాదములే”

(లేదా...)

“ఆలుం బెన్మిటి మధ్య పోరు గనఁగా నాహ్లాదమిచ్చున్ గదా”

(కోటబొమ్మాళి శతావధాన సమస్య)

22 కామెంట్‌లు:

  1. కందం
    కేళిన్ దాకెను సతి పా
    దాలన్ రాయలనటంచు తగవే రేగన్
    మేలగు కావ్యము పుట్టెనె!
    యాలుమగల మధ్య గొడవలాహ్లాదములే!

    శార్దూలవిక్రీడితము
    కేళిన్ దిర్మల దేవి పాదములు దాకెన్ గృష్ణరాన్మూర్తినన్
    గోలన్ రాయలు కిన్కనొందు కతనన్ గూర్చంగ కావ్యమ్మునే
    లీలానాటక సూత్రధారి సతి యుద్రేకమ్ము దీర్చంగ న
    య్యాలుం బెన్మిటి మధ్య పోరు గనఁగా నాహ్లాదమిచ్చున్ గదా!

    రిప్లయితొలగించండి
  2. లాలనజేసెగకృష్ణుడు
    మూలనజేరినసఖిగనిమురిపెముతోడన్
    పాలనజేసెనుకలతయు
    ఆలుమగలమధ్యగొడవలాహ్లాదములే

    రిప్లయితొలగించండి
  3. కూలన్జేసెనునాదుప్రేమనటనాకౌటిల్యుడీనాథుడున్
    ఆలన్మందలగాచువాడుగనగాహాయంచుదూషించుచున్
    మూలన్జేరినసత్యభామనయమున్ముద్దంచుకృష్ణుండనెన్
    ఆలున్బెన్మిటిమధ్యపోరుగనగానాహ్లాదమిచ్చున్గదా

    రిప్లయితొలగించండి
  4. చాలుని క నలుక యనుచును
    కేలను పాదాలను బట్టె కృష్ణుండు గదా
    బేలగ మారెను సత్య యె
    యాలు మగల మధ్య గొడవ లాహ్లా దములే

    రిప్లయితొలగించండి
  5. ఆలిందమునకు రమ్మన
    చాలిక నీ చిలిపి పనులు స్వజనులు కలరే
    వైళము కాదను తరుణం
    ఆలుమగల మధ్య గొడవ లాహ్లాదములే.


    పూలన్ దెచ్చితి మోజుమీర గనుమా పూబోణి రారమ్మనన్
    చాలింకన్ సరసమ్ములంచు సతియే శాలీన మందున్ పతిన్
    దాలెక్కింపని పాళమందు పతియే తాపంబుతో కంద నా
    యాలుం బెన్మిటి మధ్య పోరు గనఁగా నాహ్లాదమిచ్చున్ గదా.

    రిప్లయితొలగించండి
  6. మ్రోల గల యింటి బిడ్డల
    కోలాహలమును భరించకుండుట చేతన్
    సాలన బహు సంతతిపై
    యాలుమగల మధ్య గొడవ లాహ్లాదములే

    రిప్లయితొలగించండి
  7. అలిగినట్టి సత్యను మిగు లాదరమున
    ననునయించెను శ్రీ కృష్ణు డామె వినక
    తన్నిననుగాని కినుక జెందడపుడతడు
    ఆలు మగలమధ్య గొడవ లాహ్లాదములె

    రిప్లయితొలగించండి
  8. కం॥ హేలగఁ బ్రణయ కలహములు
    లీలగ జరుగఁగ సతిపతు లిరువురి నడుమన్
    మేలిమి బంధము బిగియగ
    నాలుమగల మధ్య గొడవ లాహ్లాదములే

    శా॥ హేలామానముగాను గయ్యములిలన్ హృద్యంబుగా నత్తరిన్
    మేలౌ బంధము వృద్దిఁ జెందు నటులన్ మెల్లంగ హద్దుల్ గనిన్
    లీలాగారము నందె వాదనఁ గనన్ బ్రేమంబుతోఁ జేయఁగా
    నాలుం బెన్మిటి మధ్య పోరు గనఁగా నాహ్లాదమిచ్చున్ గదా

    రిప్లయితొలగించండి
  9. బాలుండెవ్వని పుత్త్రుడో తెలుపగాఁ బ్రార్థింపగా భర్త, సీ!
    చాలున్ జాలిక నిందలంచు సతియున్ సాక్ష్యమ్ములన్ జూపగాన్,
    బ్రేలన్, వార్తగఁ జూపువారలకు టీ.వీ. వీక్షకుల్ హెచ్చగా
    నాలుం బెన్మిటి మధ్య పోరు గనఁగా నాహ్లాదమిచ్చున్ గదా

    రిప్లయితొలగించండి
  10. కాలాతీతంబైనది
    బేలా!బేట్టేలనీకు ప్రేయాంశునిపై
    వేలాకోలపు చెణుకులు
    ఆలుమగల మధ్య గొడవ లాహ్లాదములే

    వేలాకోలము సల్పనేల ననుచున్ వేధింపకే నన్నిలా
    బేలా!నీవిక బెట్టు మాని చనుమా ప్రేమైక లోకానికే
    కాలాతీతము చేయనేల రయమున్ కౌగిళ్ళ బంధింపవా!
    ఆలుం బెన్మిటి మధ్య పోరు గనఁగా నాహ్లాదమిచ్చున్ గదా

    రిప్లయితొలగించండి
  11. కాలానుగుణము గనఁబడు
    నీ లాగున వాదము లవి యే విధి నాగం
    జాలవు బతిమాలిన నీ
    యాలుమగల మధ్య గొడవ లాహ్లాదములే


    చాలుం జాలును బోకుమీ యడరి నీ సంక్షేమ మాశించితే
    నాలాపమ్ముల జోలికిం దమిని మిథ్యాక్రోశ సంయుక్త దృ
    గ్జాలవ్యాప్త పరస్ప రాతిశయ శృంగారైక వాదమ్ము లం
    దాలుం బెన్మిటి మధ్య పోరు గనఁగా నాహ్లాద మిచ్చున్ గదా

    రిప్లయితొలగించండి
  12. మేలములాడెడు పతిపై
    నాలి యలుకఁ బూనుట పరిహాసమ్మునకే
    కేళిగ సంసారమునం
    దాలుమగల మధ్య గొడవ లాహ్లాదములే

    రిప్లయితొలగించండి
  13. పాలున్ నీరము గూడియుండునటులన్ పత్నీపతుల్ బ్రేమతో
    కాలంబంతయు సఖ్యతన్ గడిపి సౌఖ్యంబందునాపోవుచున్
    కేళిన్ గాపురమందు నిద్దరొకటై కేరించ నాయింటిలో
    ఆలుం బెన్మిటి మధ్య పోరు గనఁగా నాహ్లాదమిచ్చున్ గదా

    రిప్లయితొలగించండి
  14. కం:చీలి సమస్యల తో తమ
    బాలలు తగవాడు చుండ బాప వలెను,సి
    గ్గే లేక వారి యెదుటనె
    ఆలుమగల మధ్య గొడవ లాహ్లాదములే?

    రిప్లయితొలగించండి
  15. శా:బాలుండొక్కడు వృద్ధి జెంద నెదకున్ బ్రాప్తించ మోదమ్ము లా
    బాలున్ నా కొడుకంచు దండ్రి యనెడిన్,వాదాడి యా తల్లియున్
    మేల మ్మాడును నా సుపుత్రు డని ,యా మిన్నంటు మోదమ్ము తో
    నాలుం బెన్మిటి మధ్య పోరు గనఁగా నాహ్లాదమిచ్చున్ గదా”

    రిప్లయితొలగించండి
  16. కం:ఆలును కూర యనున్ సతి,
    ఆలును వేపుమను భర్త, యందరు వినగా
    నాలును కొనిన దినమ్మున
    నాలుమగల మధ్య గొడవ లాహ్లాదము లే!


    రిప్లయితొలగించండి
  17. చేలము లాగుచు రమ్మను
    నాలిని కడుప్రేమతోడ నక్కున చేర్చన్
    వాలుచు కసురుం గొనగా
    ఆలుమగల మధ్య గొడవ లాహ్లాదములే

    రిప్లయితొలగించండి
  18. చేలన్ లాగుచు భార్య రమ్మన కడున్ ఛీత్కార మొందంగ నా
    నాలిం గోపముజెంది యేగగ మదిన్ హర్షాతి రేకంబుతో
    బాలా!యేమిది యంచు కౌగిలి కి వేబంధించెఁబ్రేమంబుతో
    నాలుం బెన్మిటి మధ్య పోరు గనఁగా నాహ్లాదమిచ్చున్ గదా”

    రిప్లయితొలగించండి
  19. కాలమ్మంతయు వెళ్ళబుచ్చిపతి తా కార్యాలయమ్మందునన్
    హేలన్ జేరగ కొంపలోన, మరుడున్ హించించ తాపమ్ముతో
    చేలమ్ముల్ ధరియించి కాంచు సతియుం జిఱ్ఱొందగా, రాత్రికా
    యాలుంబెన్మిటి మధ్య పోరు గనఁగా నాహ్లాదమిచ్చున్ గదా

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ఆలుమగల కలహమ్ముల
    గోలలు క్షణకాలముండు; కూర్మి మెలగుచున్
    లీలగ నొకటగుదు రపుడె
    ఆలుమగల మధ్య గొడవ లాహ్లాదములే.

    రిప్లయితొలగించండి

  21. హేలగ గవ్వల నాడుచు గేలినిచేయంగసతినికినుకవహించన్
    చేలముపట్టుకులాగగ
    నాలుమగల మధ్య గొడవలాహ్లాదములే

    కేలుంకేలును బట్టి పోవుదమురా కేరింతలాడంగ నో
    బాలాయంచు ను ప్రేమగా నడుగగన్ బాగున్న దీమాటయం
    కేలున్ వీడుము చాలుచాలికను నీ కేరింత లాపుమ్మటం
    చాలున్ పెన్మిటిమధ్యపోరుగనగా నాహ్లా దమిచ్చున్గదా

    రిప్లయితొలగించండి