17, జులై 2024, బుధవారం

సమస్య - 4824

18-7-2024 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్”

(లేదా...)

“దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్”

(కోటబొమ్మాళి శతావధాన సమస్య)

20 కామెంట్‌లు:

  1. చేవనుగ్రాహకుండుగనుచేరియుహంసవిశేషశ్రద్ధతో
    దేవునిజూపుమాయనుచుతీరుగప్రశ్ననరేంద్రుడేయగా
    భావితరంబునేగనుచుబాధ్యతజేసెగురుండుబోధనే
    దేవుడులేడటంచుకడుదీక్షనొనర్తురుతీర్థయాత్రలన్

    రిప్లయితొలగించండి
  2. కావగనచ్చునువాడను
    భావననుండెడిప్రజలకుపంచునుప్రేమన్
    చేవనుజూపునుజడులకు
    దేవుడు, లేడనుజనులకుతీర్థాటనమున్

    రిప్లయితొలగించండి

  3. నీవృత మందున పలువురి
    జీవన నరళిని కనుగొను చిత్తము తోడన్
    భావనలో తప్ప నెచట
    దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్.


    నీవృతమందు సంస్కృతులనేకము వాటి నెరుంగ నెంచుచున్
    పావనమైన క్షేత్రముల వాసిగ గాంచుటకై కదా జనుల్
    కోవెల లోనకాదు మన గుండెన కాక మరెక్క డన్ గనన్
    దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్.

    రిప్లయితొలగించండి
  4. కందం
    సేవింప మఠములందున
    దేవుళ్లసమానమంచుఁ దీరఁగ వెదుకన్
    జూవె! ద్రిమూర్తుల మించెడు
    దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్

    ఉత్పలమాల
    సేవలు సేయఁగన్ జనులు సిందులు వైచి మఠమ్ములందునన్
    దైవసమానులన్ బగిది తన్మయమందుచు మ్రొక్క స్వాములన్
    గావక దోచువారలని, కాన త్రిమూర్తులమించి వారిలో
    దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్!

    రిప్లయితొలగించండి
  5. కావుము మమ్ముల నను చును
    పావన మగు భక్తి గల్గి భజి యింతురు నా
    దేవుని నమ్ముచ దె ట్టు ల
    దేవుడు లేడ ను జను ల కె తీ ర్థా టన ముల్?

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. కం॥ రావణుఁ డెప్పుడు రాముని
      భావన విడువక చరించు పగిదిని భువిలో
      దేవుని యునికిని నమ్మక
      దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్

      ఉ॥ రావణుఁ డెల్ల వేళలను రాముని చింతన వీడెనా భువిన్
      భావన యందు రాక్షసులు వాలెము దల్చరె పద్మనాభునే
      యీ విధి నేఁడు కల్లరులు నీశ్వరుఁ డేడని ప్రశ్నవేయుచున్
      దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్

      తొలగించండి
  7. కందం:
    భావనలో నాస్తికులుగ
    దేవుఁడు లేడనుచుఁ బలికి దెప్పరములలో
    నావశ్యకమనిపించును
    దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్

    ఉత్పలమాల:
    భావన యందు నాస్తికులు వాదనఁ జేయుదురెల్ల వేళలన్
    దైవము లేడటంచు గడు ద్రాపులు మీరలటంచు భక్తులన్
    జీవితమందు దెప్పరము జేపడ నంకిలిఁబాపు కోర్కితో
    దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్

    రిప్లయితొలగించండి
  8. దేవళమున కేగుమనిన
    దేవుని నమ్మననుచుండు దేహుల బ్రదిమిన్
    చావు దరి జేరి నంతనె
    దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్

    రిప్లయితొలగించండి
  9. జీవించి చూపి పావన
    జీవన మార్గము మనకిడె శ్రీరాముండే
    కావున రాముని మించిన
    దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్

    పావన మూర్తి దాశరథి భాసిలు భక్తుల గుండెలందునన్
    దేవుడు రాముడే యనుచు తెల్పుచు నుందురు నెల్లవేళలన్
    జీవన మార్గదర్శియగు శ్రీరఘురాముని కన్నమిన్నయౌ
    దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్

    రిప్లయితొలగించండి
  10. కావలెఁ దార్కాణమ్ములు
    దేవుని యునికికి నటంచుఁ దెల్పుఁ డనంగన్
    దేవుని మహిమం దెలుపఁగ
    దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్


    వేవురు భక్తి రక్తులను విన్నపముల్ గడుఁ జేయుచుండి స్వీ
    యావన కార్య కాంక్షు లయి యంచిత రీతిని శుద్ద చిత్తులై
    యే విధిఁ గొల్చినం దమిని నించుక యేఁ గరుణా విహీనుఁడౌ
    దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్

    రిప్లయితొలగించండి
  11. భావము నందున నమ్మిన
    దేవుడు శ్రీరాము దప్ప దేవుండ్లెవరున్
    బ్రోవరని నమ్మి వేరే
    దేవుఁడు లేఁడను, జనులకె తీర్థాటనముల్

    రిప్లయితొలగించండి
  12. కం:దేవుని నమ్మిన వారలు
    దేవుని కై యేగ వలయు తీర్థమ్ముల, కా
    భావన విడ లోకము గన
    దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్?
    (భక్తి లేకండా ఊరికే లోకము చూసి రావటానికి తీర్థయాత్ర లెందుకు?)

    రిప్లయితొలగించండి
  13. ఉ:దేవుని నమ్మ నంచు , పలు తిట్టులు నన్నును తిట్టుచుండు, కా
    నీ వరలక్ష్మి నోములన "నీ ముఖమంచు" ధనమ్ము నిచ్చు , నే
    దేవుని యాత్రకున్ బయలు దేరగ నా పతి నాదు దృప్తి కై
    "దేవుఁడు లేఁ"డటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్”
    (కొందరు భర్తలకి దైవవిశ్వాసం తక్కువే ఐనా,సంప్రదాయం పై గౌరవం లేకున్నా భార్యలు తృప్తి కోసం సహకరిస్తుంటారు.)

    రిప్లయితొలగించండి
  14. దేవుని దూషణ చేయుచు
    *“దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్”*
    కావలసివచ్చెవిధిగా
    జీవితమునదెబ్బతగుల చెప్పగవిబుధుల్


    ోవెలముంగిటన్నిలిచిగొప్పగవాదనచేయుచుందురే
    జీవులుకొందరీజగతిచేయుచుమొండిగవాదనమ్ములన్
    *“దేవుఁడు లేఁడటంచుఁ ,గడు దీక్ష నొనర్తురు తీర్థ యాత్రలన్”*
    భావమునందుభక్తినటభద్రముచేయుచు మ్రొక్కు దీర్చగన్

    రిప్లయితొలగించండి
  15. కోవెల లోన నర్చనల గోరిక లన్నియు తీర సాధ్యమా?
    కేవల మొక్క రాయియని కేశవు హేళనజేసి నిత్యమున్
    సేవలు చేయు భార్యలలి జెంతకు జేర నటించు కూళులే
    దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్!

    రిప్లయితొలగించండి
  16. దేవుఁడు లేడను వారలె
    యవిరళమగు భక్తికలిగి యర్చింతురుగా
    కావలెననినిట్లందురు
    దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్

    రిప్లయితొలగించండి
  17. దేవుని స్థానముందెలిసి దేవుఁడు లేడని బల్కు చుండియున్
    దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్
    దేవునిఁబేరయాత్రలను దీవ్రతరంబు ఁజేయుటన్
    దేవునిపైననమ్మకము దీటుగ నున్నటు భావమేకదా!

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    దేవుని కొలుచుట కన్నను
    దేవళమున శిల్పకళను తిలకించెడు స
    ద్భావనలో మనసు నిలిపి
    దేవుడు లేడను జనులకె తీర్థాటనముల్.

    రిప్లయితొలగించండి