3, సెప్టెంబర్ 2024, మంగళవారం

దత్తపది - 210

4-9-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

కాక - తాత - పాప - మామ 

ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ

మహాభారతార్థంలో

తేటగీతి కాని చంపకమాల కాని వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. తులువకా, కర్ణుడునుదోషదూషితుండు
    సభయ, తాతరించెగఘనుసైచలేక
    తెగువపాపంబు చూడకతెఱవగనియె
    పందెమామడదూరాన పలుకరింప

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    కాకరేపుచు రారాజు కయ్యమెంచ
    నప్పుతాతకెగసి కృష్ణుడర్జునునకు
    పాప పుణ్యాలఁ దెల్పఁగఁ బలికిగీత
    ధర్మమా మహి నిల్పెను తత్వమెరిఁగి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      నరవర! యెందుకా కలత నర్మిలి సాదిగ నన్నుఁ గోరితే!
      యెరిఁగి త్వదీయ తాతనము నింద్రకుమార! రణంబుఁ జొచ్చితిన్
      దరుగని మోహమా! మఱువ దక్కును రాజ్యము లేక స్వర్గమున్
      వరముగ పొందగా గలవు పాపమునెంచక ముందుకేగుమా!

      తొలగించండి
  3. కృష్ణుడు రాయబార సమయమున సుయోధనుడితో

    తనరెడు కాకకుష్టముల తావిని శోభిలి యర్ధభాగమున్
    మనసిడి తాతనమ్మునను మాన్యులు పాండవులొప్ప నీయవో
    మనుటయుఁ బాపకర్మమగు మన్నన సేయవొ నీతి బాహ్యుఁడై
    యనుచును మామకీనమని యాలము నందునఁ జావు తథ్యమౌ!

    కాకకుష్టము కంకుష్టమను గంధద్రవ్యము
    తాతనము వ్యక్తిత్వము
    మామకీనము నాది
    అన్నీ నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి

  4. (కీచకుడు ద్రౌపదితో పలికిన మాటలు.)

    *తేటగీతి*

    ఎందుకా కలవరమోయి యింతి నీదు
    తాతనము మెచ్చితిని నాదు దరికి జేర
    శంక విడుమా మనోహరి సంగమించ
    కృపను గన పాపమవదని కీచకుడనె.


    (రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణునితో రారాజు మాటలు)

    *చంపకమాల*

    పెనకువ కాక శాంతినిట పెద్దలు కోరిన గోరవచ్చు నా
    యణుకుల తాతనమ్మెరిగినట్టి సుయోధను డిచ్చగించునే
    వినుమిది పాపకార్యమని విగ్రహమున్ దలపోయ నైతి నే
    ననిశము మా మదిన్ ద్విషులె యా పృథ పుత్రులటంచు నెంచెదన్.

    రిప్లయితొలగించండి
  5. పాడవులు తాము గెలిచిన దానిని పంచుకొనమని కుంతి చెప్పగా

    తే||గీ||

    అరుగుదెంచి మీ"కా క" థ నంతను తెలు
    పగనె , మా"తా త"మరు చెప్పు పగిది గనగ
    "పాప"మా నెలతుకకగు పంచ పతులు ,
    దుష్టముగ "మా మ"సువు నామెతోడ జరుప

    రిప్లయితొలగించండి
  6. కవ్వడిని గెల్వ సాధ్యము [కాక]పోవు
    ధర్మజుని [తాత]నమ్మగు తారుమారు
    [పాప]మనకఁ దునుము ముపపాండవులను
    [మా మ]నస్సును గ్రహియించి మసలుకొనుము

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. కాక పుట్టించు రణమును గాంచ లేను
      పాప పంకిల మేలంచు పార్థు డనగ
      బావ తా తత్త్వ బోధ తో బవ ర మందు
      మామక హితులు బంధు లన్ మమత వీవీ డె

      తొలగించండి
  8. త్రిదశ నాయకా కరుణా పరీత హృదయ
    సుర నుతా తరు ణోజ్జ్వల సూర్య సదృశ
    పాప హర మా మనోహర పంకజాక్ష
    నంద నందన కావుమ నన్ను గృష్ణ


    అణఁగని కాకలీ ధ్వని యు తాతత మామక పాప దూర భా
    షణములు ధార్తరాష్ట్ర విను సంగర మెన్నఁడు దోషకారియే
    రణము విసర్జనీయము నిరంతర మెల్లర కెంచి చూడ దా
    రుణ మది మానవాంతకము రోషము నూనక యాలకింపుమా

    రిప్లయితొలగించండి
  9. కాక - తాత - పాప - మామ
    చం:సరస మెరుంగ వీవు కద స్వర్గసుఖమ్మిడి దేవతాతతిన్
    మురిపము బొందజేయు నొక మోహిని దక్కగ పాప మంచు దు
    ర్భరమగు గాసి వెట్టితివి ఫల్గుణ మామక శాప మిద్ది నీ
    పురుషుతనమ్ము భంగ మయి పోవును పేడివి కాక పోదువే!
    (ఊర్వశి అర్జునుణ్ని శపించిన తీరు.సాధ్య మైనంత వరకూ దత్తపదాలు సరళాదేశం కాకుండా ప్రయత్నించాను.)

    రిప్లయితొలగించండి
  10. నీవుకాకనాకునిలలో నెమ్మిచూపు
    వార లెవరుమా మనవిని వడిగ వినుము
    పతియుతాతమ్ములనుకూడ పందెమొడ్డె
    కౌరవాదులపాపముల్ కాల్చవయ్య



    రిప్లయితొలగించండి
  11. మురహర నీవుగాక యదు మూర్తులు వద్దు, రథంబుపైన నీ
    చరణములున్నఁ జాలునిక శౌరి!యశోద సుతా! తరించవే
    యిరకటముల్, దయానిలయ!యీ సమరంబున పాప చిత్తులన్
    పరుగులు బెట్టఁ జేసెద కృపన్ గనుమా మధుసూదనా!హరీ!

    రిప్లయితొలగించండి
  12. కాఁకవెలుఁగును మించిన కాంతియుతుఁడు
    తాతనమ్మున నతడెపో తాతతాత
    పాపములఁ బాపు పరమ పావనుడతండు
    మా మనములకు కృష్ణుఁడు దీమసమిడు

    రిప్లయితొలగించండి