19, సెప్టెంబర్ 2024, గురువారం

సమస్య - 4887

20-9-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రాజ్యముఁ బాలించుటెట్లు రాముఁ గొలువకే”

(లేదా...)

“రాజ్యం బేగతి నిర్వహించెదరు శ్రీరామప్రభుం గొల్వకే”

(సుబ్బన్న శతావధాని పూరించిన సమస్య)

28 కామెంట్‌లు:

  1. రాజ్యపు సంపద యంతయు
    భోజ్యముగ దలచెడి నేటి పాలకులెల్లన్
    పూజ్యుడు రాముని రీతిగ
    రాజ్యముఁ బాలించుటెట్లు రాముఁ గొలువకే

    రిప్లయితొలగించండి
  2. కం॥ భోజ్యము భోగము నొసఁగును
    రాజ్యము నందున నెపుడును రాముని కృపయే
    పూజ్యమ శ్రీరామ కరుణ
    రాజ్యముఁ బాలించుటెట్లు రాముఁ గొలువకే!

    శా॥ పూజ్యంబయ్యెను క్షామ మొందఁగను సంపూర్ణమ్ముగా సంపదల్
    రాజ్యంబంతట నంధకారమిటులన్ గ్రమ్మెన్ గదా చూడఁగన్
    రాజ్యక్షేమముఁ గాంచు నెల్లపుడు శ్రీరామాదరమ్మొక్కటే
    రాజ్యంబేగతి నిర్వ హించెదరు శ్రీరామప్రభుం గొల్వకే

    రిప్లయితొలగించండి
  3. కందం
    వ్యాజ్యాన రావణుని న
    త్యాజ్యావేశునణచి యిడ దాశరథియె తా
    నజ్యేష్ఠ విభీషణునకు
    రాజ్యముఁ, బాలించుటెట్లు రాముఁ గొలువకే?


    శారదూలవిక్రీడితము
    భోజ్యమ్మంచును లంకనేలుటయె తా మోహాంధకారుండున
    త్యాజ్యావేశుడు రామమూర్తిసతినే తాబొంద జూడన్ బడెన్
    వ్యాజ్యాంతాన విభీషణున్ ప్రభువుగన్ బాలించునేర్పాటుతో
    రాజ్యం బేగతి నిర్వహించెదరు శ్రీరామప్రభుం గొల్వకే?

    రిప్లయితొలగించండి

  4. ప్రాజ్యంబగు భోగములను
    త్యాజ్యంబొనరించు మంటి దైవాకరి సా
    మ్రాజ్యంబు రామ భిక్షయె
    రాజ్యముఁ బాలించుటెట్లు రాముఁ గొలువకే.


    త్యాజ్యంబిప్పుడు సేయగా వలయునో దైవాకరీ వింటివా
    ప్రాజ్యంబౌ సుఖ భోగలాలస నికన్, వాగ్దానమున్ వీడకన్
    పూజ్యుండౌ రఘు రామ పత్ని వెదకన్ బూనంగ మేలౌకదా
    రాజ్యం బేగతి నిర్వహించెదరు శ్రీరామప్రభుం గొల్వకే.

    రిప్లయితొలగించండి
  5. రాజ్యపు సింహాసనమున
    పూజ్యుని పాదుకలనుంచి ప్రోచెడివాడన్
    ప్రాజ్యము రాముని నెమ్మిక
    రాజ్యముఁ బాలించుటెట్లు రాముఁ గొలువకే

    భోజ్యంబేనని రాజ్యమందుకొనగా పోకారునా శోకమే
    వ్యాజ్యంబెవ్విధి సంస్కరింపబడునో వాక్రుచ్చుమానేస్తమా
    పూజ్యుండౌ రఘురామచంద్రుడిలలో భూజానియైయుండగా
    రాజ్యం బేగతి నిర్వహించెదరు శ్రీరామప్రభుం గొల్వకే

    రిప్లయితొలగించండి
  6. భోజ్యము సతమ్ము శిక్షా
    రాజ్యఖిలము దుష్టుల కని ప్రజలకు సుఖముల్
    భాజ్యము లని తలఁచినచో
    రాజ్యముఁ బాలించు టెట్లు రాముఁ గొలువకే


    ఈ జ్యోతిర్వల యాంశు సాక్షిగ మనస్సేపారఁగా నమ్మినం
    బూజ్యంబౌ నిరతమ్ము ధర్మ మని సంపూర్ణమ్ము స్వార్థం బెదం
    ద్యాజ్యార్హం బని రామ రాజ్యమును సంస్థాపింప నూహించినన్
    రాజ్యం బే గతి నిర్వహించెదరు శ్రీరామప్రభుం గొల్వకే

    రిప్లయితొలగించండి
  7. పూజ్యుఁడు రాముడు భరతుని
    రాజ్యమునేలఁగ బనిచెను రాచనగరుకున్
    యాజ్యమువలె పావనమౌ
    రాజ్యముఁ బాలించుటెట్లు రాముఁ గొలువకే

    రిప్లయితొలగించండి
  8. పూజ్యుండౌ రఘురామమూర్తి వనికిన్ భూజాతతో జేరగన్
    రాజ్యంబేలఁ నయోధ్యకున్ భరతుడా రామాఖ్యునిన్ వేఁడె సా
    మ్రాజ్యంబేలఁగఁ బొమ్ము నీవనుచు శ్రీరాముండు పుత్తెంచె నా
    రాజ్యం బేగతి నిర్వహించెదరు శ్రీరామప్రభుం గొల్వకే

    రిప్లయితొలగించండి
  9. కం:పూజ్యుండౌ నగ్రజు డవి
    భాజ్యుడు నా కెపుడు నతని పాదుకలే నా
    రాజ్యపు గద్దెన నుంచెద
    రాజ్యముఁ బాలించుటెట్లు రాముఁ గొలువకే”

    రిప్లయితొలగించండి
  10. శా:ఆజ్యం బయ్యెను రామభక్తి కద రాజ్యం బిచ్చు యజ్ఞమ్ములో!
    పూజ్యుండౌ రఘురాము మందిరము కై పోరాడి ,సాధించి మీ
    రాజ్యమ్మున్, దడ వేల జేసెదరయా రామున్ బ్రతిష్ఠించుటన్?
    రాజ్యం బేగతి నిర్వహించెదరు శ్రీరామప్రభుం గొల్వకే”
    (రాముడి పేరు చెప్పుకొని రాజ్యాధికారం లోకి వచ్చాము.అధికారం వచ్చాక ఇంకా రామమందిర నిర్మాణానికి తాత్సారం చేస్తారే!త్వరగా కట్టించండి అని కొందరు కార్యకర్తలు ప్రభుత్వం పై వత్తిడి తెచ్చే వారు.)

    రిప్లయితొలగించండి
  11. రాజ్యము నకు నాదర్శము
    భోజ్యము సేయక ప్రజలకు మొదంబొ స గన్
    త్యాజ్య మొన ర్ప క స్వార్థము
    రాజ్యము పాలించు టెట్లు రాము గొలు వ కే?

    రిప్లయితొలగించండి
  12. రాజ్యము రాజుల సంపద
    భోజ్యముగాఁజేసికొంద్రు భువనా ధీశుల్
    పూజ్యుల మన్నన లేకను
    రాజ్యముఁ బాలించుటెట్లు రాముఁ గొలువకే

    రిప్లయితొలగించండి
  13. రాజ్యము సుతుకొసగదలచి
    వ్యాజ్యమొనర్చుచటకైక వనిములకంపెన్
    పూజ్యుండౌ సుతుని విడిచి
    రాజ్యము పాలించుటెట్లు రాము గొలువకే

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.
    (భరతుని స్వగతం)
    భోజ్యముగ నెంచ గలనా?
    పూజ్యుడు రాముండు లేని పుడమిని నేడున్
    రాజ్యము కళా విహీనము
    రాజ్యముఁ బాలించుటెట్లు రాముఁ గొలువకే?

    రిప్లయితొలగించండి