26, సెప్టెంబర్ 2024, గురువారం

సమస్య - 4894

27-9-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పలలముఁ దిని త్రేన్చి రెల్ల బ్రాహ్మణు లెలమిన్”

(లేదా...)

“గఱ్ఱని త్రేన్చి రా తగరు కండల కూరను మెక్కి బ్రాహ్మణుల్”

(వాతాపి కథలో ఆశావాది ప్రకాశరావు గారి పద్యపాదం)

17 కామెంట్‌లు:

  1. కలతయులేనిదిమనసున
    అలచిఱుతొండడుతనయునినాగతి లండన్
    కలకల నవ్వుచుపంక్తిని
    పలలముఁదినిత్రేన్చిరెల్లబ్రాహ్మణులెలమిన్

    రిప్లయితొలగించండి
  2. కం॥ తలఁపఁగ భోజన నియమము
    వెలియద ప్రాంతమునకొకటి వివిధ తెరగులన్
    బులుపుగ బంగాళమునను
    బలలముఁ దిని త్రేన్చి రెల్ల బ్రాహ్మణు లెలమిన్

    ఉ॥ వెఱ్ఱిగ నూరటన్ గనక వేగఁగఁ గార్యము లెన్నొచేయుచున్
    సఱ్ఱున నాఁకలిన్ గొనఁగఁ జక్కని భోజన మెంచి మెక్కితిన్
    బిఱ్ఱుగ నిద్రనొందఁగను భీతిలు స్వప్నము నందుఁ గాంచితిన్
    గఱ్ఱని త్రేన్చి రా తగదు కండల కూరను మెక్కి బ్రాహ్మణుల్

    రిప్లయితొలగించండి
  3. నెలదారి గుడి కబళమున
    పలుచగ నంజుడు కలసిన పని దెలియకనే
    కులపు నియమమును మీరుచు
    పలలముఁ దిని త్రేన్చి రెల్ల బ్రాహ్మణు లెలమిన్

    రిప్లయితొలగించండి
  4. కల గంటి నని యు బల్కు చు
    చిలువలు పలువలు గ దాను జె ప్పు చు కల్లల్
    కిల కిల నవ్వుచు ని ట్ల నె
    పలలము దిని ద్రే న్చి రెల్ల బ్రాహ్మణు లెల మిన్

    రిప్లయితొలగించండి
  5. గెలుపొందగసైనికులట
    పలలము దిని త్రేన్చిరెల్ల, బ్రాహ్మణు లెలమిన్
    ఫలములనుదినుచుతృప్తిగ
    సలిలము త్రాగిరిగెలిచినసంతోషములో

    రిప్లయితొలగించండి
  6. చుర్రనునెండవేడిమికి సొక్కుచు భోజనశాల కేగిరా
    వెర్రిపురోహితుల్ దినఁగ వెచ్చని బోనము, కొందరచ్చటన్
    గఱ్ఱని త్రేన్చి రా తగరు కండల కూరను మెక్కి, బ్రాహ్మణుల్
    గుర్రుగ గాంచి వారుతిను కూరను వైళమ నిష్క్రమించిరే.

    రిప్లయితొలగించండి
  7. ఎఱ్ఱని యెండలో తినగ నిచ్చిన యంత సిపాయి లాబగా
    గఱ్ఱని త్రేన్చి రా తగరు కండల కూరను మెక్కి, బ్రాహ్మణుల్
    జుఱ్ఱున గ్రోలిరెల్లరును చోద్యముగా గనపానకమ్మటన్
    కుఱ్ఱలు తెచ్చి యివ్వగనె కూరిమి తోడను చెంబులెత్తుచున్

    రిప్లయితొలగించండి
  8. పలువురు మాంసాహారులు
    పలలముఁ దిని త్రేన్చి రెల్ల బ్రాహ్మణు లెలమిన్
    ఫలములు మాత్రముదిని యా
    కలి దీర్చుకొనంగ నెంచి కదలిరి వడిగన్

    రిప్లయితొలగించండి
  9. కుఱ్ఱలతోడ కూడుకొని గోప్యపు రీతిగ
    జేరిరచ్చటన్
    తొఱ్ఱుల మందకై కొనిన తుచ్ఛపు తిండిన నంజుడుండగన్
    గొఱ్ఱెలమంద రీతిగను గుర్వగు తృప్తిన
    దానినంతయున్
    గఱ్ఱని త్రేన్చి రా తగరు కండల కూరను మెక్కి బ్రాహ్మణుల్

    రిప్లయితొలగించండి
  10. పలువురు బ్రాహ్మణ యువకులు
    సెలవులు మనసారకోరి చేరిరి వనమున్
    బొలమున కేతెంచిన తరి
    పలలముఁ దిని త్రేన్చి రెల్ల బ్రాహ్మణు లెలమిన్

    [పలలము = తిలచూర్ణము]

    గుఱ్ఱము పైననెక్కితన కోరిక తీరగఁ సేదదీఱకే
    కుఱ్ఱడు విందుకై నిగుడ గోముగ తోడ్కొని వచ్చియుంటినే
    వెఱ్ఱిగ పల్కగా తగదు పెండిలి నెన్నడు నిర్వహించినన్
    గఱ్ఱని త్రేన్చి రా తగరు కండల కూరను మెక్కి బ్రాహ్మణుల్

    రిప్లయితొలగించండి
  11. వెలవెలఁ బోవ సనాతను
    లిలలోఁ గుల మెన్న కెడఁద నిసుమంతయు నౌ
    దలఁ దాల్ప కనుష్ఠానము
    పలలముఁ దిని త్రేన్చి రెల్ల బ్రాహ్మణు లెలమిన్


    ఎఱ్ఱని పాఱుఁడై యసురుఁ డెంతయొ భక్తిని నిల్వలుండు వే
    గొఱ్ఱెగఁ జేసి సోదరునిఁ గూరను వండి కడింది వంచనన్
    వెఱ్ఱుల కన్న మద్దినము వెట్టినఁ దృప్తిగ నారగించుచున్
    గఱ్ఱని త్రేన్చి రా తగరు కండల కూరను మెక్కి బ్రాహ్మణుల్

    రిప్లయితొలగించండి
  12. కందం
    కలిసిరి వివాహమందునఁ
    బలువురు మిత్రులు, ముదమునఁ బల్కి శుభాకాం
    క్షలు జంటకు, విందున దుం
    పల లముఁ దిని త్రేన్చి రెల్ల బ్రాహ్మణు లెలమిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      మిఱ్ఱుగ నెయ్యినే దినుచు మేదిని మేధకు నాలవాలమై
      బిఱ్ఱుగ నన్యులన్ దగని వెఱ్ఱులటంచుఁ దలంతురన్ మదిన్
      గుఱ్ఱుగ నుండువాడొకడు గూర్చిన మత్సర గాథనందునన్
      గఱ్ఱని త్రేన్చి రా తగరు కండల కూరను మెక్కి బ్రాహ్మణుల్

      తొలగించండి
  13. కం:కలగలపు లేని పప్పును,
    తెలుసుక శాస్త్రమ్ము నాల్గు తీరుల కూరల్,
    గల యాబ్దికమున వానిన్,
    పలలముఁ, దిని త్రేన్చి రెల్ల బ్రాహ్మణు లెలమిన్”
    (పలలము =నువ్వు పొడి.ఆబ్దికం లో కలగలుపు లేకుండా వట్టి పెసర పప్పు వండుతారు.దానిలో నువ్వు పొడి మంచి రుచి గా ఉంటుంది.కూరలలో కొన్ని శాస్త్రవిహితం.కొన్ని విరుద్ధం.నాలుగు రకాల కూరలు ఒక సంప్రదాయం.)

    రిప్లయితొలగించండి
  14. ఉ:బుర్రల తెల్వి యెక్కువయి, పూనుచు లౌకికమున్,సమత్వమున్,
    తెర్రదనమ్ము తో నెవరొ దీనికి మెచ్చెద రంచు జంధ్యముల్
    జర్రున పీకి వైచి, దిగ జార్చగ పెట్టగ మాంస మెవ్వరో
    గఱ్ఱని త్రేన్చి రా తగరు కండల కూరను మెక్కి బ్రాహ్మణుల్”
    (మేము సమానత్వాన్ని పాటిస్తున్నాం,లౌకికవాదానికి వచ్చాం అని చెప్పుకోటానికి ఇతరుల మెప్పు కోసం బ్రాహ్మణులు జంధ్యాలు తీసేసి మాంసం తిన్నారు.)

    రిప్లయితొలగించండి