1-5-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సజ్జనుని సమస్య లేఁచు సతతమ్ము భువిన్”
(లేదా...)
“సచ్చీలున్ సతతమ్ము దైవము సమస్యల్ మోపి బాధించెడిన్”
(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో ఆరవల్లి శ్రీదేవి గారి సమస్య)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కం॥ ఇజ్జగమున దుర్జనులటుబొజ్జలఁ బెంచఁగ దురితపు మోదముఁ బడయన్నుజ్జగు సద్వర్తనమిలసజ్జనుని సమస్య లేఁచు సతతమ్ము భువిన్శా॥ తుచ్ఛంబౌ భవలాలసాదులకె సంతోషించునో తల్చునో యిఛ్చామోహము తీర సంపదలనే యీ సూక్ష్మమున్ గన్గొనన్ సచ్ఛీలున్ సతతమ్ము దైవము సమస్యల్ మోపి బాధించెడున్స్వచ్ఛంబంచును గాంచ నాతఁడటు నిర్వాణమ్ముతోఁ బ్రోచెడున్
మరొక పూరణశా॥ ఇచ్ఛావాహిని కేది యంతమిల నీవే తెల్పు సర్వేశ్వరాతుచ్ఛంబందురు శక్తి హీనులటు సద్యోజాత నిశ్చేష్టతన్బ్రచ్ఛన్నంబగు యుద్ధమౌ బ్రదుకునన్ వాచింతురే మూర్ఖులైసచ్ఛీలున్ సతతమ్ము దైవము సమస్యల్ మోపి బాధించెడున్కార్యసాధకుల పలుకండి
బొజ్జ పెరుగగ నొదవె యాసజ్జనుని సమస్య ; లేఁచు సతతమ్ము భువిన్లజ్జవడకుండగ బయటవెజ్జు తెలిపినట్టి సాము పెచ్చుగ జేయన్
లజ్జవిడి దుర్మతులచేసజ్జను లగు పాండు సుతుల జడ్డును పెట్టన్ ముజ్జగముల నేల గలుగు సజ్జనుని సమస్య లేఁచు సతతమ్ము భువిన్.స్వచ్ఛంబైన చరిత్ర గల్గిన హరిశ్చంద్రాది భూపాలురున్ సచ్ఛీలుండ్రును ధర్మమూర్తులనుచున్ శ్లాఘించె డిన్ బాండవుల్ స్వేచ్ఛన్ వీడుచు పడ్డబాధలనిలన్ వీక్షించినన్ దోచెనే సచ్ఛీలున్ సతతమ్ము దైవము సమస్యల్ మోపి బాధించెడిన్.
రజ్జననొనర్చు కవికేగజ్జెలు గలగల మనంగ కదలెడు సకియౌబుజ్జమ్మిడెనీ ప్రచ్చనసజ్జనుని సమస్య లేఁచు సతతమ్ము భువిన్ఇచ్చాపూరణ సల్పలేని బుధుడే యీనాడసామాన్యుడై వచ్చెంజూడగ నేటిమందిరమునన్ వాగ్బాణముల్ తోడుగాకుచ్చెళ్ళన్ సవరించి జాణయొసగెన్ గొండొక్క ప్రశ్నాంశమేసచ్చీలున్ సతతమ్ము దైవము సమస్యల్ మోపి బాధించెడిన్
కందంఇజ్జగమున భగవంతుడుసజ్జనుని పరీక్ష చేయ సమకూర్చంగన్బజ్జోమని లాలించకసజ్జనుని సమస్య లేఁచు సతతమ్ము భువిన్శార్దూలవిక్రీడితముసచ్ఛీలున్ దెగ చుట్టుముట్ట నిడుముల్ సంధించి ధర్మమ్ములన్సచ్ఛీలమ్మును వీడఁబోవడనెడున్ సందేశమందింప నాసచ్ఛీలంపు చరిత్ర లోకులెరుగన్ సాక్ష్యమ్ముగన్ నిల్పగన్సచ్చీలున్ సతతమ్ము దైవము సమస్యల్ మోపి బాధించెడిన్!
శా:ఉచ్ఛమ్మౌ నొక యాలయమ్మిడితి నే నోర్పొంది శ్రీరామశోభేచ్ఛన్ భక్తిగ నిన్ని భూషణములన్ హృద్యమ్ము గా జేయ దాస్వేచ్ఛన్ గుల్కుచు నుండె రాముడు ననున్ వేయించె నీ ఖైదునన్సచ్ఛీలున్ సతతమ్ము దైవము సమస్యల్ మోపి బాధించెడిన్.(రామ దాసు గారి ఆవేదన)
కం:మజ్జనకు బాస నిలిపెద,మ జ్జననియె కైక యనిన మాన్యుడు రాముండిజ్జగతి బాధ లొందడె ?సజ్జనుని సమస్య లేఁచు సతతమ్ము భువిన్”
ఇజ్జగ మున దీ న జనుల సజ్జను డై సేవ సలుప సన్ను ద్దు o డై లజ్జను వీడి శ్ర మించె డు సజ్జ నుని సమ స్య లే చు సతత మ్ము భువి న్
ఒజ్జలు సెప్పిన నీతులు ముజ్జగములఁ జెల్లు నిత్యము ననఁగ వినవే యిజ్జగతిఁ గుజనుఁ గూడిన సజ్జనుని సమస్య లేఁచు సతతమ్ము భువిన్ సచ్ఛీలుం డగు ధర్మరాజునకు వాసం బయ్యె గోత్రమ్ము సత్యచ్ఛాయా గత రాజశేఖరునకుం ద్రాసం బొసంగెం గటా విచ్ఛిన్నాత్మ కుటుంబ యుక్తముగ నీ పృథ్విన్ రమా నాథుఁడే సచ్ఛీలున్ సతతమ్ము దైవము సమస్యల్ మోపి బాధించెడిన్
మజ్జారే యిజ్జగమునసజ్జనులకునేల యిట్లు సమకూడు వెతల్కజ్జాకోరుల వల్లనుసజ్జనుని సమస్య లేఁచు సతతమ్ము భువిన్
సచ్ఛీలుండు సమాశ్రయించి యెలమిన్ సన్మార్గమున్ నిష్ఠతోసచ్ఛీలంబును సత్యపాలనములన్ సంవిత్తుగా గైకొనెన్స్వచ్ఛందంబుగ సర్వమున్ విడచెఁదా సత్యమ్ము కాపాడగన్సచ్ఛీలున్ సతతమ్ము దైవము సమస్యల్ మోపి బాధించెడిన్
తుచ్ఛత్వంబునుఁ బొందకుందురట సంతోషమ్ముతో భక్తులేస్వచ్ఛంబైన మనస్సు స్వంతమయినన్ శ్రద్ధాళువై కాచుగాసచ్ఛీలున్ సతతమ్ము దైవము; సమస్యల్ మోపి బాధించెడిన్తుచ్ఛుండై తిరుగాడువాని నెపుడున్ దోషాగ్నిపాల్జేయుచున్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ఇజ్జగ మందున గాంచగసజ్జనులున్ బలుకుచుంద్రు సత్యమె సతమున్ముజ్జిడ్డు జగడమందునసజ్జనుని సమస్య లేచు సతతమ్ము భువిన్.
బల్లూరి ఉమాదేవి ముజ్జగములలోన గనిననొజ్జయె మనదైవమగుచు నొప్పుగ నేర్పన్నుజ్జయిని వధానములో*“సజ్జనుని సమస్య లేఁచు సతతమ్ము భువిన్”*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ ఇజ్జగమున దుర్జనులటు
రిప్లయితొలగించండిబొజ్జలఁ బెంచఁగ దురితపు మోదముఁ బడయన్
నుజ్జగు సద్వర్తనమిల
సజ్జనుని సమస్య లేఁచు సతతమ్ము భువిన్
శా॥ తుచ్ఛంబౌ భవలాలసాదులకె సంతోషించునో తల్చునో
యిఛ్చామోహము తీర సంపదలనే యీ సూక్ష్మమున్ గన్గొనన్
సచ్ఛీలున్ సతతమ్ము దైవము సమస్యల్ మోపి బాధించెడున్
స్వచ్ఛంబంచును గాంచ నాతఁడటు నిర్వాణమ్ముతోఁ బ్రోచెడున్
మరొక పూరణ
తొలగించండిశా॥ ఇచ్ఛావాహిని కేది యంతమిల నీవే తెల్పు సర్వేశ్వరా
తుచ్ఛంబందురు శక్తి హీనులటు సద్యోజాత నిశ్చేష్టతన్
బ్రచ్ఛన్నంబగు యుద్ధమౌ బ్రదుకునన్ వాచింతురే మూర్ఖులై
సచ్ఛీలున్ సతతమ్ము దైవము సమస్యల్ మోపి బాధించెడున్
కార్యసాధకుల పలుకండి
బొజ్జ పెరుగగ నొదవె యా
రిప్లయితొలగించండిసజ్జనుని సమస్య ; లేఁచు సతతమ్ము భువిన్
లజ్జవడకుండగ బయట
వెజ్జు తెలిపినట్టి సాము పెచ్చుగ జేయన్
రిప్లయితొలగించండిలజ్జవిడి దుర్మతులచే
సజ్జను లగు పాండు సుతుల జడ్డును పెట్టన్
ముజ్జగముల నేల గలుగు
సజ్జనుని సమస్య లేఁచు సతతమ్ము భువిన్.
స్వచ్ఛంబైన చరిత్ర గల్గిన హరిశ్చంద్రాది భూపాలురున్
సచ్ఛీలుండ్రును ధర్మమూర్తులనుచున్ శ్లాఘించె డిన్ బాండవుల్
స్వేచ్ఛన్ వీడుచు పడ్డబాధలనిలన్ వీక్షించినన్ దోచెనే
సచ్ఛీలున్ సతతమ్ము దైవము సమస్యల్ మోపి బాధించెడిన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరజ్జననొనర్చు కవికే
తొలగించండిగజ్జెలు గలగల మనంగ కదలెడు సకియౌ
బుజ్జమ్మిడెనీ ప్రచ్చన
సజ్జనుని సమస్య లేఁచు సతతమ్ము భువిన్
ఇచ్చాపూరణ సల్పలేని బుధుడే యీనాడసామాన్యుడై
వచ్చెంజూడగ నేటిమందిరమునన్ వాగ్బాణముల్ తోడుగా
కుచ్చెళ్ళన్ సవరించి జాణయొసగెన్ గొండొక్క ప్రశ్నాంశమే
సచ్చీలున్ సతతమ్ము దైవము సమస్యల్ మోపి బాధించెడిన్
కందం
రిప్లయితొలగించండిఇజ్జగమున భగవంతుడు
సజ్జనుని పరీక్ష చేయ సమకూర్చంగన్
బజ్జోమని లాలించక
సజ్జనుని సమస్య లేఁచు సతతమ్ము భువిన్
శార్దూలవిక్రీడితము
సచ్ఛీలున్ దెగ చుట్టుముట్ట నిడుముల్ సంధించి ధర్మమ్ములన్
సచ్ఛీలమ్మును వీడఁబోవడనెడున్ సందేశమందింప నా
సచ్ఛీలంపు చరిత్ర లోకులెరుగన్ సాక్ష్యమ్ముగన్ నిల్పగన్
సచ్చీలున్ సతతమ్ము దైవము సమస్యల్ మోపి బాధించెడిన్!
శా:ఉచ్ఛమ్మౌ నొక యాలయమ్మిడితి నే నోర్పొంది శ్రీరామశో
రిప్లయితొలగించండిభేచ్ఛన్ భక్తిగ నిన్ని భూషణములన్ హృద్యమ్ము గా జేయ దా
స్వేచ్ఛన్ గుల్కుచు నుండె రాముడు ననున్ వేయించె నీ ఖైదునన్
సచ్ఛీలున్ సతతమ్ము దైవము సమస్యల్ మోపి బాధించెడిన్.
(రామ దాసు గారి ఆవేదన)
కం:మజ్జనకు బాస నిలిపెద,
రిప్లయితొలగించండిమ జ్జననియె కైక యనిన మాన్యుడు రాముం
డిజ్జగతి బాధ లొందడె ?
సజ్జనుని సమస్య లేఁచు సతతమ్ము భువిన్”
ఇజ్జగ మున దీ న జనుల
రిప్లయితొలగించండిసజ్జను డై సేవ సలుప సన్ను ద్దు o డై
లజ్జను వీడి శ్ర మించె డు
సజ్జ నుని సమ స్య లే చు సతత మ్ము భువి న్
ఒజ్జలు సెప్పిన నీతులు
రిప్లయితొలగించండిముజ్జగములఁ జెల్లు నిత్యము ననఁగ వినవే
యిజ్జగతిఁ గుజనుఁ గూడిన
సజ్జనుని సమస్య లేఁచు సతతమ్ము భువిన్
సచ్ఛీలుం డగు ధర్మరాజునకు వాసం బయ్యె గోత్రమ్ము స
త్యచ్ఛాయా గత రాజశేఖరునకుం ద్రాసం బొసంగెం గటా
విచ్ఛిన్నాత్మ కుటుంబ యుక్తముగ నీ పృథ్విన్ రమా నాథుఁడే
సచ్ఛీలున్ సతతమ్ము దైవము సమస్యల్ మోపి బాధించెడిన్
మజ్జారే యిజ్జగమున
రిప్లయితొలగించండిసజ్జనులకునేల యిట్లు సమకూడు వెతల్
కజ్జాకోరుల వల్లను
సజ్జనుని సమస్య లేఁచు సతతమ్ము భువిన్
సచ్ఛీలుండు సమాశ్రయించి యెలమిన్ సన్మార్గమున్ నిష్ఠతో
రిప్లయితొలగించండిసచ్ఛీలంబును సత్యపాలనములన్ సంవిత్తుగా గైకొనెన్
స్వచ్ఛందంబుగ సర్వమున్ విడచెఁదా సత్యమ్ము కాపాడగన్
సచ్ఛీలున్ సతతమ్ము దైవము సమస్యల్ మోపి బాధించెడిన్
తుచ్ఛత్వంబునుఁ బొందకుందురట సంతోషమ్ముతో భక్తులే
రిప్లయితొలగించండిస్వచ్ఛంబైన మనస్సు స్వంతమయినన్ శ్రద్ధాళువై కాచుగా
సచ్ఛీలున్ సతతమ్ము దైవము; సమస్యల్ మోపి బాధించెడిన్
తుచ్ఛుండై తిరుగాడువాని నెపుడున్ దోషాగ్నిపాల్జేయుచున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఇజ్జగ మందున గాంచగ
సజ్జనులున్ బలుకుచుంద్రు సత్యమె
సతమున్
ముజ్జిడ్డు జగడమందున
సజ్జనుని సమస్య లేచు సతతమ్ము భువిన్.
బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండిముజ్జగములలోన గనిన
నొజ్జయె మనదైవమగుచు నొప్పుగ నేర్పన్
నుజ్జయిని వధానములో
*“సజ్జనుని సమస్య లేఁచు సతతమ్ము భువిన్”*