తే.గీ:ప్రత్తి పండునట్టి నిజామ బాదు లోన ప్రత్తి బోర్డును సాధించి భాజపా కు జెందు నరవిందు పదవిని బొందె! జూడ ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి” (నిజామాబాదు పత్తి పంటకు ప్రసిద్ధి.కాటన్ బోర్డ్ ఒకటి ఏర్పరచే ప్రయత్నం లో ధర్మపురి అరవింద్ అనే బి జె పి యం.పి.ముఖ్యపాత్ర పోషించాడు. పార్టీ కమలం.అతని పేరు కమలం. కనుక పై పోలిక ఒప్పుతుంది. )
మ.కో:ప్రత్తిపాడను జూడ జక్కని పల్లె కేగితి,నాదు మే నత్త యూరని, యత్త బిడ్డకు నంబుజ మ్మని పేరు ,గ మ్మత్తు గా కను విప్పి జూచును, మాటలాడును ప్రేమ తో ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్” (పట్టి పాడు అనే ఊరు ఉంది. ఇతని మేనత్త కూతురి పేరు అంబుజం కనుక పద్మం. ఆమె చక్కగా క ళ్లింత పెద్దవి చేసి ప్రేమగా మాట్లాడుతుంది. )
తెల్ల బంగారమనెదరు తెలుగు నాట ,
రిప్లయితొలగించండిదాని రంగు రంగుల పూలు దర్శనమిడె
ప్రత్తిచేనులో ; వికసించెఁ బద్మమొకటి
చేరువన గల కొండిక చెరువు నందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిరివిగా గడ్డి పూవులు వింతగాను
రిప్లయితొలగించండిపత్తిచేనులో వికసించె; పద్మమొకటి
ప్రక్కకొలనులో వింతగా ప్రజలుచూడ
ముచ్చటగ వికసించెను ముదముజెంద
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిప్రత్తి పూవులు విచ్చఁగ రైతు మురిసి
కూళి వారలతోఁ గోసి గొప్ప రాశి
నట్టనడుమన వేయగ నల్గురనిరి
ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి!
మత్తకోకిల
గుత్తులట్లుగఁ పూలు విచ్చఁగ కూలి వారల బిల్చియున్
మొత్తమున్ దగ కోసి రాశిగ పోసినంతట మధ్యనున్
నెత్తిమీదను నింప వెన్నెల నిండు జాబిలి, పల్కిరే
ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్!
ప్రత్తి సేకరణ కొరకు బయలుదేరి
రిప్లయితొలగించండిక్రొత్త జంటలు చేరిరి ప్రత్తి చేను
భామ మోము గాంచిన కవి వక్కణించె
ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి
క్రొత్తజంటలు ప్రత్తి తీయగ కోరి వచ్చిన చేనులో
మత్తుకన్నుల చిన్నదొక్కటి మందహాసము సేయగా
నత్తరిన్ వచియించె సత్కవి హాయిగా కడు తీయగా
ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండి
రిప్లయితొలగించండిమిసిమి వర్ణమున్ మెరిసిడి మేను గలిగి
చేత గొడవలి ధరియించి చెలమరులతొ
కదలి వచ్చు మర్దలి గాంచి కాంతు డనియె
ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి.
చిత్తగింపుము రామచంద్రుడ చెప్పు చుంటిని సంగతిన్
మత్త కాశిని బంది సేసిన మానుషాదుని రాజ్యమం
దుత్తముండు విభీషణుండట యోగ్యుడాతడె కాంచగన్
ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్.
చిత్తమందున నెగ్గునెంచక సీత రూపము బూనినన్
రిప్లయితొలగించండిమిత్తినింగొని వత్తురాయిటు మీరు లంకకు సోదరా
మత్తు వీడుడటంచు బల్కిన మాన్యుఁ డాతఁడు తమ్ముడే
ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్
నిన్న నగుపించి మురిపించి నీరజాక్షి
రిప్లయితొలగించండివలపు గానము వినిపించె తలపులందు
మరులు కురిపించె మనసెంతొ పరవశించె
ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి
-
రిప్లయితొలగించండిక్రోవి బట్టి పోరు సలిపి క్రుద్దులైన
అన్న లీనాడు ప్రభుత ప్రయత్న మనగ
జనుల మేలుగోరిరదె ప్రసన్నమైన
ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి
காதலிக்க நேர மில்லை :)
రిప్లయితొలగించండిక్రొత్తతావిని చేర్చుకొన్నది కోర్కె కూర్మిని గోముగా
ముత్తెమై మెరిసేను చిన్నది ముద్దులిచ్చెను మత్తుగా
మెత్తమెత్తని మేనియెల్ల రమించి నాట్యము సేయగా
ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగా
తే.గీ:ప్రత్తి పండునట్టి నిజామ బాదు లోన
రిప్లయితొలగించండిప్రత్తి బోర్డును సాధించి భాజపా కు
జెందు నరవిందు పదవిని బొందె! జూడ
ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి”
(నిజామాబాదు పత్తి పంటకు ప్రసిద్ధి.కాటన్ బోర్డ్ ఒకటి ఏర్పరచే ప్రయత్నం లో ధర్మపురి అరవింద్ అనే బి జె పి యం.పి.ముఖ్యపాత్ర పోషించాడు. పార్టీ కమలం.అతని పేరు కమలం. కనుక పై పోలిక ఒప్పుతుంది. )
మ.కో:ప్రత్తిపాడను జూడ జక్కని పల్లె కేగితి,నాదు మే
రిప్లయితొలగించండినత్త యూరని, యత్త బిడ్డకు నంబుజ మ్మని పేరు ,గ
మ్మత్తు గా కను విప్పి జూచును, మాటలాడును ప్రేమ తో
ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్”
(పట్టి పాడు అనే ఊరు ఉంది. ఇతని మేనత్త కూతురి పేరు అంబుజం కనుక పద్మం. ఆమె చక్కగా క ళ్లింత పెద్దవి చేసి ప్రేమగా మాట్లాడుతుంది. )
మత్త॥ ప్రత్తి పంటకు నీరు వెట్టఁగ బావి యుండెను మధ్యలో
రిప్లయితొలగించండినత్తవారికి సంతసమ్మిడ నందుఁ బెంచెను తామరల్
మొత్తమంతయు మెచ్చు రీతినిఁ బూయు వేళకు చూడఁగాఁ
బ్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్
(చేను మధ్యలో ఉన్న బావిలో పద్మము వికసించిందండి, ప్రత్తి కూడ పూచే వేళకు)
సతిని గూ డియు వెడలియు పతి యు నని యె
రిప్లయితొలగించండిపత్తి చేనిలో వికసించె పద్మ మొకటి
మిగుల భాసించె ననుచు మె చ్చు కొనుచు
పొగడె నామెను న య్యె డ ముదిత ను గద
నింగి నుండి దిగిన తార భంగిఁ దోఁపఁ
రిప్లయితొలగించండిదనువు కాంతిఁ గాంచి ద్యుమణి దాఁగి యుండఁ
జెలఁగి పద్మముఖి యొకర్తె చెంత నుండఁ
బ్రత్తి చేనులో వికసించెఁ బద్మ మొకటి
తత్తరమ్మును బొందఁగా నెడఁదం గుబేరుఁ డసూయచే
విత్తనమ్ముల నమ్మ వచ్చెను బెద్ద మొత్తమె యింకనుం
బ్రత్తి నంగడి నమ్మి నంతటఁ బన్నుగన్ నిధి యబ్బెనే
ప్రత్తి చేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్
[పద్మము = కుబేరుని నిధి]