31, ఆగస్టు 2023, గురువారం

సమస్య - 4519

1-9-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మోస మొనరించు వారలే పూజ్యజనులు”
(లేదా...)
“మోస మొనర్చువారలనె పూజ్యులుగా నుతియింతు రెల్లరున్”

30, ఆగస్టు 2023, బుధవారం

దత్తపది - 200

31-8-2023 (గురువారం)
కవిమిత్రులారా,
వేంకట - సుబ్బ - సహ - దేవుఁడు
పై పద్యాలతో వధూ వరులను ఆశీర్వదిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
(31-8-2023 రోజున గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారి కుమారుడు చి. శరత్ చంద్ర వివాహం 

చి.సౌ. సాయిసంధ్యతో గుంతకల్లులో జరుగుతున్న సందర్భంగా)


29, ఆగస్టు 2023, మంగళవారం

సమస్య - 4518

30-8-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాగ్దృగలభ్యుండు సేరెఁ బ్రాదయ్యములన్”
(లేదా...)
“వాగ్దృగలభ్యుఁడై యసురపక్షముఁ జేరె మురారి ప్రీతితో”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో బందరు దుర్గాప్రసాద్ గారి సమస్య)

28, ఆగస్టు 2023, సోమవారం

సమస్య - 4517

29-8-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పట్టెఁ జరవాణిఁ బుస్తకపాణి గనుఁడు”
(లేదా...)
“పుస్తకపాణి హస్తమున భూషణమై చరవాణి యొప్పెడిన్”

27, ఆగస్టు 2023, ఆదివారం

సమస్య - 4516

28-8-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మత్స్యము సింహముగఁ జంపె మత్తగజంబున్”
(లేదా...)
“మత్స్యము సింహమై చెలఁగి మత్తగజంబునుఁ గూల్చె నింగిపై”

(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో ఇప్పిలి వేణుగోపాల్ గారి సమస్య)

26, ఆగస్టు 2023, శనివారం

సమస్య - 4515

27-8-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరపతి మేలనుచు సతులు వల్కుట సబబే”
(లేదా...)
“పరపతి మేలుమేలనుచు భామలు వల్కుట భావ్యమే కదా”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో రమణమూర్తి గారి సమస్య)

25, ఆగస్టు 2023, శుక్రవారం

సమస్య - 4514

26-8-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయో”
(లేదా...)
“మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెఁ గనుమా మీనాక్షికిన్ బాపురే”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో చంద్రశేఖర శర్మ గారి సమస్య)

24, ఆగస్టు 2023, గురువారం

సమస్య - 4513

25-8-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాట్నమ్మునుఁ ద్రిప్పి తాన్ స్వరాజ్యము పొందెన్”
(లేదా...)
“రాట్నముఁ ద్రిప్పి భారతి స్వరాజ్యము పొందె నదేమి చిత్రమో”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో కిలపర్తి దాలినాయుడు గారి సమస్య)

23, ఆగస్టు 2023, బుధవారం

సమస్య - 4512

24-8-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్”
(లేదా...)
“ముని పరిరంభ సౌఖ్యమును బొందెను జానకి పర్ణశాలలో”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో సమస్య)

22, ఆగస్టు 2023, మంగళవారం

సమస్య - 4511

23-8-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాకినిఁ గని మెచ్చి చేసెఁ గళ్యాణమ్మున్”
(లేదా...)
“కాకిని మెచ్చి పిల్చి తన కన్యనొసంగియుఁ బెండ్లిఁ జేసెనే”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో బొంతు సూర్యనారాయణ గారి సమస్య)